ఇరాక్ లో ప్రస్తుత పరిస్థితి
ఢిల్లీ/హైదరాబాద్: ఇరాక్లో ఉన్న 600 మంది భారతీయుల యోగక్షేమాలను తెలుసుకోవడానికి భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇరాక్లో అంతర్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. చమురు సంపద పుష్కలంగా ఉన్న ఇరాక్‌లోని మోసుల్ నగరంలోని ఒక కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 40 మంది భారతీయులు జాడ తెలియడం లేదు. వారిని ఎఎస్ఐఎస్ తిరుగుబాటుదారులు తీసుకువెళ్లి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎస్ఐఎస్‌కు, కుర్ద్‌లకు మధ్య జరుగుతున్న యుద్ధానికి మోసుల్ ప్రధాన కేంద్రం అయింది. ఇక్కడ నుంచి ప్రజలను ఖాళీ చేయించే సమయంలో చాలా మంది కార్మికులతో అధికారులకు సంబంధాలు తెగిపోయాయి. కుర్ద్‌ల ప్రాబల్యం ఉండే ఈ ప్రాంతాన్ని ఐఎస్ఐఎస్ ఆక్రమించింది. ఆ తరువాత భారత కార్మికుల జాడతెలియలేదు. అయితే భారత విదేశీ వ్యవహారాల శాఖ వద్ద ఎటువంటి సమాచారంలేదు. మోసూల్‌లో అభద్రత మధ్య 40 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి యోగక్షేమాలు తమకు తెలియదని విదేశాంగ శాఖ చెబుతోంది. భారత రాయబారి సురేష్‌రెడ్డి హుటాహుటిన ఇరాక్‌కు బయలుదేరారు.
ఢిల్లీలో విదేశీవ్యవహారాల మంత్రి శాఖ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:
+91 11 2301 2113
+91 11 2301 7905
+91 11 2301 4104
Email: controlroom@mea.gov.in
బాగ్దాద్‌లోని భారత దౌత్య కార్యాలయం :
+964 770 444 4899
+964 770 484 3247
తెలంగాణ వాసుల వివరాలు సేకరణ: డిప్యూటీ సిఎం అలీ
హైదరాబాద్: ఇరాక్లో ఉన్న తెలంగాణ వాసుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఇప్పటివరకు 600 మంది తెలంగాణ వాసులు ఇరాక్‌లో ఉన్నట్టు గుర్తించినట్లు తెలిపారు. ఇరాక్‌లో ఉన్నవారి కోసం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అలీ చెప్పారు.
తెలంగాణవారిని క్షేమంగా తీసుకువస్తాం: కెటిఆర్
కరీంనగర్: ఇరాక్‌లో ఉన్న తెలంగాణవారిని క్షేమంగా తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతిగ్రామానికి శాశ్వత మంచినీటిని అందించడానికి కృషిచేస్తామని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్లను పంచాయతీరాజ్ కేంద్రంగా మార్చాలని అధికారులకు సూచించామని కెటిఆర్ చెప్పారు.