టెహ్రాన్:తమపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇవాళ(శనివారం) తెల్లవారుజామున పెద్దఎత్తున దాడులు చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలే టార్గెట్‌గా క్షిపణుల దాడి జరిపింది. దీంతో ఒక్కసారిగా పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రయోగించిన మిసైల్స్ కారణంగా విమాన సర్వీసులు నిలిపివేశారు.
ఫ్లైట్ రాడార్ 24, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం.. మూడు దేశాలు( ఇరాన్, ఇరాక్, సిరియా) మీదుగా ఏ విమానమూ ప్రయాణించడం లేదు.ఈ మూడు దేశాల మధ్య విమనాలు ప్రయాణించే గగనతలం మూసివేశారు. అయితే.. దాడులు ముగిసిన అనంతరం గగనతలంలో విమాన సర్వీసుల ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా కొన్ని గంటల పాటు జోర్డాన్, ఇజ్రాయెల్ గగనతలం మూసివేయబడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
The airspace of #Iran, #Iraq, #Jordan, #Syria and #Israel is closed as Israeli war planes attack various locations in Iran for the last few hours. pic.twitter.com/5MEcNGaiNk
— Hamdan News (@HamdanWahe57839) October 26, 2024
అక్టోబర్ 1న హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇరాన్.. ఇజ్రాయెల్‌పై 200కుపైగా రాకెట్లు, క్షిపణుల ప్రయోగించింది. ఇరాన్ వైమానిక దాడులకు ప్రతీకంగా ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసింది. ఇజ్రాయల్ చేసిన దాడులపై ఇరాన్ స్పందించింది. ‘‘శనివారం తెల్లవారుజాము నుంచి ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇలామ్, ఖుజెస్తాన్, టెహ్రాన్‌లోని సైనిక స్థావరాలను ఐడీఎఫ్ లక్ష్యంగా దాడులు జరిపింది. అయితే ఈ దాడులు పరిమిత నష్టాన్ని మాత్రమే కలిగించాయి" అని ఓ ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment