
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా మిలిటరీ క్యాంపు మీద ఇటీవల రాకెట్ల దాడి జరిగింది. ఈ రాకెట్లను అక్కడి యాంటీ మిసైల్ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు అమెరికా మిలిటరీ అధికారులు తెలిపారు.
మొత్తం మూడు కత్యూష రాకెట్లతో జరిగిన దాడిలో భవనాలు, వాహనాలు ధ్వంసంకాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. ఇరాక్‌లో ఇప్పటికీ 2500 మంది దాకా అమెరికా సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై ఇరాన్ సహాయంతో కొన్ని మిలిటెంట్ గ్రూపులు తరచూ దాడులు చేస్తుంటాయి.
ఇదీ చదవండి: నెతన్యాహూతో మాట్లాడిన ప్రధాని మోదీ