Rockets
-
హమాస్ దాడికి ఏడాది.. ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం
ఇజ్రాయెల్, గాజాలోని హమాస్ బలగాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. అయితే.. అక్టోబర్ 7వ తేదీకి హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసి ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో హమాస్ దాడి మొదటి వార్షికోత్సవానికి ఒకరోజు ముందు ఇవాళ (ఆదివారం) మరోసారి.. ఉత్తర గాజా నుంచి పలు రాకెట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయని ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.‘‘అనేక రాకెట్లు ఉత్తర గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించినట్లు గుర్తించాం. అందులో ఒక రాకెట్‌ను ఇజ్రాయెల్ సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసింది. మిగిలినవి రాకెట్లు జనావాసాలు లేని బహిరంగ ప్రదేశాల్లో పడిపోయాయి’’ అని సైన్యం తెలిపింది. ఇక.. హమాస్ బలగాలు.. ఇజ్రాయెల్‌పై చేసిన దాడికి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో తమ సైన్యం మరింత అప్రమత్తంగా ఉందని ఇజ్రాయెల్ పేర్కొంది.🚨Sirens sounding along Israel’s coast🚨 pic.twitter.com/ebdBsj0vNT— Israel Defense Forces (@IDF) October 6, 2024 గతేడాది అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై దాడి.. ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా గాజాకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఇక.. అప్పటి నుంచి తమ పౌరులను విడిచిపెట్టే వరకు హమాస్‌పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. హమాస్ టార్గెట్ ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో 41, 900 మంది పాలస్తీనా పౌరులు మృత్యువాతపడ్డారు. -
అమెరికా మిలిటరీ బేస్‌పై రాకెట్ల దాడి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా మిలిటరీ క్యాంపు మీద ఇటీవల రాకెట్ల దాడి జరిగింది. ఈ రాకెట్లను అక్కడి యాంటీ మిసైల్ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు అమెరికా మిలిటరీ అధికారులు తెలిపారు. మొత్తం మూడు కత్యూష రాకెట్లతో జరిగిన దాడిలో భవనాలు, వాహనాలు ధ్వంసంకాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. ఇరాక్‌లో ఇప్పటికీ 2500 మంది దాకా అమెరికా సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై ఇరాన్ సహాయంతో కొన్ని మిలిటెంట్ గ్రూపులు తరచూ దాడులు చేస్తుంటాయి. ఇదీ చదవండి: నెతన్యాహూతో మాట్లాడిన ప్రధాని మోదీ -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల దాడి
జెరూసలెం: లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లకు ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌పైకి హెజ్బొల్లా తాజాగా 140 రాకెట్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్ హద్దుమీరిందని, ప్రతి దాడి ఉంటుందని హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాకెట్ దాడులు జరగడం గమనార్హం. ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు మిలటరీ క్యాంపులపై ఈ దాడులు జరిపినట్లు హెజ్బొల్లా తెలిపింది.దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతిగా రాకెట్లతో దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది. లెబనాన్ సరిహద్దుల నుంచి రాకెట్లు దూసుకొచ్చిన విషయాన్ని ఇజ్రాయెల్ మిలటరీ ధ్రువీకరించింది. అయితే ఈ దాడుల్లో నష్టం వివరాలు తెలియాల్సిఉంది. కాగా, ఇప్పటివరకు పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులపై దృష్టి పెట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుంది. ఇటీవలే లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్ దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థలున్నాయని హెజ్బొల్లా ఆరోపిస్తోంది. పేజర్లు,వాకీటాకీల పేలుళ్లతో పాటు లెబనాన్‌పై ఇజ్రాయెల్ రాకెట్ దాడులు కూడా చేసింది. ఇదీ చదవండి.. లెబనాన్ ఉక్కిరిబిక్కిరి.. రాకెట్లతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ -
Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. దాడుల్లో కనీసం 100 మందికి పైగా మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడ్డట్టు చెబుతున్నారు. సరిహద్దుల ప్రాంతాల్లో పౌరులతో పాటు సైనికులను కూడా మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. వారిని, చేజిక్కించుకున్న ఇజ్రాయెల్ సైనిక వాహనాలను గాజా వీధుల్లో ఊరేగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఊహించని దాడితో బిత్తరపోయిన ఇజ్రాయెల్ తేరుకుని హుటాహుటిన సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇరువర్గాల ఎక్కడికక్కడ మధ్య భీకర పోరు సాగుతోంది. కాల్పులు, మోరా్టర్లు, రాకెట్ల మోతతో దేశం దద్దరిల్లుతోంది. తాము ముట్టడిలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ‘‘ఇది దాడి కాదు, మాపై పూర్తిస్థాయి యుద్ధమే’’అని పేర్కొన్నారు. దీనికి పాలస్తీనా అతి భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ‘‘ముందుగా చొరబాటుదారులను ఏరేస్తాం. అనంతరం భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుని తీరతాం’’అని ప్రకటించారు. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. గత కొన్నేళ్లలో ఆ దేశంపై జరిగిన అతి తీవ్ర దాడి ఇదే. మరోవైపు ఇజ్రాయెల్ ప్రతి దాడిలో గాజాలో ఇప్పటికే 200 మందికి పైగా మరణించినట్టు, 2000 మంది దాకా గాయపడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది. 14 చోట్లనుంచి చొరబాటు...! ఇజ్రాయెల్‌లోకి కనీసం 7 నుంచి 14 ప్రాంతాల గుండా మిలిటెంట్లు చొచ్చుకొచి్చనట్టు చెబుతున్నారు. తొలుత వివాదాస్పద గాజా స్ట్రిప్ నుంచి తెల్లవారుజామున రాకెట్ల వర్షం కురిపించారు. 20 నిమిషాల్లోనే 5 వేలకు పైగా రాకెట్లు ప్రయోగించారు. దాంతో జెరూసలేం, టెల్ అవీవ్‌తో పాటు దేశమంతటా వాయుదాడి సైరన్లు మోగాయి. ఆ వెంటనే మిలిటెంట్లు దేశంలోకి చొచ్చుకొచ్చారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. దక్షిణాన గాజా–ఇజ్రాయెల్ సరిహద్దుల్లో కంచెలను పేల్చేసి మోటార్‌సైకిళ్లు, వాహనాల్లో, పారా గ్లైడర్ల ద్వారా కూడా దూసుకొచ్చి దాడులకు దిగారు. ప్రతిగా సైన్యం కూడా గాజాపైకి వేలాది రాకెట్లు ప్రయోగించింది. అల్ హక్సా మసీదుపై ఇజ్రాయెల్ అకృత్యాలకు, గాజాపై ఏళ్ల తరబడి అణచివేతకు ప్రతీకారంగా ఈ దాడికి దిగినట్టు హమాస్ మిలిటరీ వింగ్ నేత మొహమ్మద్ దెయిఫ్ పేర్కొన్నాడు. దీన్ని ‘ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్’గా అభివరి్ణంచాడు. తూర్పు జెరూసలేం నుంచి ఉత్తర ఇజ్రాయెల్ దాకా ఉన్న పాలస్తీనియన్లంతా యుద్ధంలో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. ఈ దాడి నెతన్యాహూ నాయకత్వ సామర్థ్యంపై పలు సందేహాలు లేవనెత్తింది. న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, భారీ ఆందోళనలకు ఆయన కారకుడవడం తెలిసిందే. దాడి నేపథ్యంలో సైనిక ఉన్నతాధికారులతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా అండ: మోదీ ఇజ్రాయెల్‌పై దాడి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి అండగా ఉంటామని ప్రకటించారు. బాధిత పౌరులు, కుటుంబాల క్షేమం కోసం ప్రారి్థస్తున్నానంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాడిని అమెరికా, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించగా. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని పలు ఇతర దేశాలు కోరాయి. అక్కడి భారతీయులకు అడ్వైజరీ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారతీయు లు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. అ నవసరంగా ఇళ్ల నుంచి బయటికి రావద్దని పేర్కొంది. ఈ మేరకు అక్కడి భారత ఎంబసీ ఇంగ్లిష్తో పా టు హిందీ, మరాఠా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయె ల్లో 18 వేల మంది దాకా భారతీయులున్నారు. -
శతమానం భారతి: అంతరిక్షం- లక్ష్యం 2047
స్వాతంత్య్రానంతరం మొదట 1963లో సౌండింగ్ రాకెట్ ప్రయోగాలతో మొదలుపెట్టి క్రమంగా భూకక్ష్యలోకి ఉపగ్రహాలను, గ్రహాల్లోకి పరిశోధక నౌకలను పంపే స్థాయికి భారతదేశం చేరుకుంది. రానున్న ఏళ్లలో కక్ష్యలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని సైతం నెలకొల్పబోతోంది. సుదూర గ్రహాలకు అంతరిక్ష యాత్రలు జరిపే స్థితికి ఎదగడమే కాదు, సైనిక ప్రయోజనాలకూ రోదసీని వేదికగా చేసుకోవడానికి అగ్రదేశాలతో పోటీ పడుతోంది. అంతరిక్ష ప్రయోగాలతో ముందుకెళుతున్న ఇస్రోకు దేశవ్యాప్తంగా పలు శాస్త్రసాంకేతిక సంస్థలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇస్రో తొలి ఉపగ్రహం ఆర్యభట్టను 1975లో ఒక సోవియట్ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రయోగించారు. 2008, 2009 సంవత్సరాల్లో ప్రయోగించిన చంద్రయాన్ 1, 2 ప్రాజెక్టులు భారత్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ఇక 2017 ఫిబ్రవరిలో ఒకే విడతలో 104 ఉపగ్రహాలను విజయవంతంగా రోదసిలోకి ప్రయోగించి ఇస్రో రికార్డు సృష్టించింది. 1960ల నుంచి అంతరిక్షంలో సైనిక, పౌర అవసరాలు రెండింటినీ ఇస్రోయే తీరుస్తూ వస్తోంది. 1964లో ఒక అమెరికన్ ఉపగ్రహం టోక్యో ఒలింపిక్స్‌ను ప్రసారం చేయడం చూసి, అంతరిక్ష కమ్యూనికేషన్ ఉపగ్రహాలతో ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గ్రహించారు. ఆయనే భారత అంతరిక్ష కార్యక్రమానికి ఆద్యుడు. జాతీయ అవసరాలకు అంతరిక్షాన్ని ఉపయోగించుకోవడానికి 1969లో సారాభాయ్ నాయకత్వంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రారంభమైంది. నేడు ప్రపంచంలోని ఆరు అతిపెద్ద అంతరిక్ష సంస్థల్లో ఇస్రో ఒకటి. -
ఉక్రెయిన్‌కు మరింత మద్దతు.. ‘రష్యా పని పట్టడానికి అత్యాధునిక ఆయుధాలిస్తాం’
కీవ్: రష్యా పోరులో ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. అత్యాధునిక మధ్యశ్రేణి ఎం270 లాంచర్ రాకెట్ సిస్టమ్స్ అందజేస్తామని ఇంగ్లండ్ గురువారం ప్రకటించింది. 80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే రాకెట్లను ఇవ్వనున్నట్లు తెలిపింది. రష్యా వైమానిక దాడులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్‌కు అయుధాలు ఇస్తామని అమెరికా, జర్మనీ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ ఆయుధాలు అందేలోపే డోన్బాస్ను రష్యా పూర్తిగా ఆక్రమించుకొనేలా కనిపిస్తోందని సైనిక నిపుణులటున్నారు. అమెరికా ఆయుధాలు, సైనిక శిక్షకులు రావడానికి మరో మూడు వారాల సమయం పడుతుంది. ఉక్రెయిన్‌కు మరింత ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తామని స్వీడన్ కూడా ప్రకటించింది. యాంటీ–షిప్ క్షిపణులు, రైఫిళ్లు, యాంటీ–ట్యాంకు ఆయుధాలు సరఫరా చేస్తామంది. అమెరికా రాయబారిగా బ్రింక్ ఉక్రెయిన్‌లో అమెరికా కొత్త రాయబారిగా బ్రిడ్జెట్ బ్రింక్ నియమితులయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యూహాత్మక వైఫల్యంగా నిరూపిస్తానని ఆమె ఇటీవలే చెప్పారు. మమ్మల్ని రెచ్చగొడుతున్నారు: రష్యా పశ్చిమ దేశాలను మరిన్ని ఆయుధాలు కోరుతూ ఉక్రెయిన్ తమను నేరుగా రెచ్చగొడుతోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ దుయ్యబట్టరాఉ. ఈ ఆయుధాలతో యుద్ధం మరింత ఉధృతమవుతుందే తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. డోన్బాస్లో రష్యా దాడులు ఉధృతం డోన్బాస్లో రష్యా దళాలు దూసుకెళ్తున్నాయి. సెవెరోడొట్స్క్లో 80 శాతానికి పైగా భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. లుహాన్స్క్పైనా పట్టు రష్యా బిగుస్తోంది. జాపొరిజాజియాలోని కోమిషువాఖా పట్టణాన్ని పుతిన్ సేనలు చుట్టుముట్టాయి. పశ్చిమ లెవివ్‌లో రష్యా క్షిపణి దాడుల్లో రైల్వే లైన్లు ధ్వంసమయ్యాయి. దీనివల్ల పశ్చిమ దేశాల నుంచి ఆయుధాల చేరవేతకు ఆటంకం కలుగనుంది. రష్యన్గా భావించి ఉక్రెయిన్ వాసి హత్య రష్యా పౌరుడిగా పొరపాటుపడి ఉక్రెయిన్ పౌరుడిని ఉక్రెయిన్ వాసి కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన అమెరికాలో జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లోని బ్రూక్లీన్ కరావోకే బార్లో ఒలెగ్ సులైమా(31) అనే వ్యక్తి మరో ఉక్రెయిన్ వలసదారుడిని ముఖం, మెడపై కత్తితో పొడిచి చంపేశాడు. బాధితుడు రష్యా భాషలో మాట్లాడడడంతో సులైమా పొరపాటుపడ్డాడని పోలీసులు చెప్పారు. 2 లక్షల చిన్నారులను అపహరించిన రష్యా: జెలెన్స్కీ తమ దేశం నుంచి లక్షలాది పౌరులను ప్రత్యర్థి దేశం రష్యా అపహరించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. వీరిలో 2 లక్షల మంది చిన్నారులున్నారని చెప్పారు. ఉక్రెయిన్ పౌరులు మాతృభూమిని మర్చిపోయేలా చేయాలన్నదే ఎత్తుగడ అన్నారు. తప్పు చేసిన వారిని తప్పనిసరిగా శిక్షించి తీరుతామన్నారు. రష్యాకు తమ సత్తా ఏమిటో యుద్ధ రంగంలోనే చూపిస్తామని జెలెన్స్కీ ప్రతినబూనారు. ఉక్రెయిన్ను ఎవరూ ఆక్రమించలేరని, తమ ప్రజలు ఎవరికీ లొంగిపోరని, తమ చిన్నారులను ఆక్రమణదారుల సొంత ఆస్తిగా మారనివ్వబోమని తేల్చిచెప్పారు. రష్యా దాడుల్లో తమ దేశంలో ఇప్పటిదాకా అధికారికంగానే 243 మంది బాలలు మృత్యువాతపడ్డారని, 446 మంది గాయపడ్డారని, 139 మంది అదృశ్యమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా దాడుల్లో చనిపోయిన 11 మంది చిన్నపిల్లల పేర్లను జెలెన్స్కీ ప్రస్తావించారు. -
రష్యా దూకుడు: నేల మీదే కాదు, నింగిలో కూడా.. తగ్గేదేలే!
ఉక్రెయిన్ రష్యా యుద్ధం భూమ్మీదే కాదు.. అంతరిక్షంలోనూ ప్రభావం చూపిస్తోంది. తమపై ఆంక్షలు విధించిన దేశాలపై ప్రతీకారానికి దిగిన రష్యా.. వన్‌వెబ్ శాటిలైట్ ప్రాజెక్ట్‌ను అర్థాంతరంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. అసలేంటీ ప్రాజెక్ట్..? రష్యా చర్యతో ఎవరికి నష్టం..?. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వన్‌వెబ్ సంస్థను కష్టాల్లోకి నెట్టింది. ఇంటర్నెట్ ప్రసార ఉపగ్రహాల ప్రయోగాన్ని రష్యా నిలిపివేసింది. రష్యా నిర్మించిన సోయజ్ రాకెట్ ద్వారా శుక్రవారం 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాల్సి ఉంది. కజకిస్థాన్‌లో రష్యాకు చెందిన బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ ప్రయోగం జరగాలి. అయితే తమ దేశంపై బ్రిటన్ విధించిన ఆంక్షలకు ప్రతిగా.. వన్బెబ్ ఉపగ్రహాల ప్రయోగానికి నిరాకరిస్తామని రష్యా స్పేస్ ఏజెన్సీ డైరెక్టర్ దిమిత్రి రోగోజిన్ ప్రకటించారు. ఉపగ్రహాల నుంచి నేరుగా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉద్దేశించినదే వన్‌వెబ్ ప్రాజెక్ట్. ఇందుకోసం తొలి దశలో 150 కిలోల బరువున్న 648 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇప్పటికే 428 ఉపగ్రహాలు కక్ష్యను చేరుకొన్నాయి. రెండో దశలో దాదాపు 1900కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని ఒక కంపెనీ తయారు చేస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ స్పేస్ కంపెనీ రష్యా సోయజ్ రాకెట్ల సాయంతో వీటిని అంతరిక్షంలోకి చేరుస్తోంది. ఆంక్షల నేపథ్యంలో ఇప్పుడీ ప్రాజెక్ట్‌కు రష్యా అడ్డుపుల్ల వేసింది. లండన్ కేంద్రంగా పనిచేసే వన్‌వెబ్ కంపెనీలో.. భారత్‌కు చెందిన భారతీ ఎంటర్ప్రైజెస్ 42.2శాతం వాటా కొనుగోలు చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సహకారం ఉపసంహరించుకొంటామని ఇప్పటికే రష్యా బెదిరింపులకు దిగింది. ఐఎస్ఎస్ నిర్వహణలో రష్యా తమ సహకారాన్ని ఉపసంహరించుకుంటే.. యూఎస్, ఇతర దేశాలు దానిని నియంత్రించలేవని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. తాజాగా ఉపగ్రహ ప్రయోగాలకూ మోకాలడ్డుతోంది. అంతేకాదు వన్‌వెబ్ రాకెట్‌పై నుంచి అమెరికా, బ్రిటన్, జపాన్ జాతీయ జెండాలను రష్యా తొలగించింది. భారత జాతీయ జెండాను మాత్రమే రాకెట్‌పై ఉంచింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంతరిక్షంపైనా ప్రభావం చూపిస్తోందని టెక్నాలజీ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఉప గ్రహాలకు ఉప ద్రవం
మనం వాడుతున్న సాంకేతికతకు... జీపీఎస్, మొబైల్ ఫోన్ల నుంచి అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థల వరకు అంతరిక్షంలో భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న మన ఉపగ్రహాలే కీలకం. మరి ఉన్నట్టుండి వాటికేమైనా అయితే? వామ్మో ఇంకేమైనా ఉందా? ఇప్పటికిప్పుడు ఏదో ఉపద్రవం వచ్చిపడబోతోందని కాదుకానీ... భూకక్ష్యలో రద్దీ ఎక్కువమవుతోంది. ఎవరి అవసరాని కొద్దీ వారు ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. ఎలన్‌మస్క్ అయితే స్టార్‌లింక్ ద్వారా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు శ్రీకారం చుట్టేశారు. లెక్కకు మిక్కిలి బుల్లి శాటిలైట్లను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేస్తున్నారు. వీటన్నింటినీ మోసుకెళ్తున్న రాకెట్ల శకలాలు కొన్ని భూమి మీదపడగా... మిగతా కొన్ని విడిభాగాలు అలా భూకక్ష్యలో తేలియాడుతున్నాయి. అలాగే కాలం చెల్లిన శాటిలైట్లు... వాటినుంచి వేరుపడుతున్న విడిభాగాలు కూడా. ఇవే ఇప్పుడు ముప్పుగా పరిణమిస్తున్నాయి. రష్యా తాము 1982లో ప్రయోగించిన ‘కాస్మోస్–1408’ ఉపగ్రహం నిరర్ధకంగా మారిందని ఈనెల 15వ తేదీన ఓ మిస్సైల్ ద్వారా దాన్ని పేల్చివేసింది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి (ఐఎస్ఎస్) 80 కిలోమీటర్ల పైభాగంలో ఇది జరగడం గమనార్హం. భూమి లేదా విమానం నుంచి మిస్సైల్‌ను ప్రయోగించి భూకక్ష్యలోని వెళ్లాక దాని గమనాన్ని నియంత్రించి లక్ష్యాన్ని ఢీకొట్టేలా చేస్తారు. రష్యా శాటిలైట్ పేలిపోవడంతో 1,500 పైచిలుకు శకలాలు అంతరిక్షంలోకి విరజిమ్మబడ్డాయి. ఎఎస్ఎస్లోని ఏడుగురు వ్యోమగాములను రెండు గంటలపాటు సురక్షితంగా క్యాప్యూల్స్లోకి వెళ్లి తలదాచుకోమని నాసా హెచ్చరించాల్సి వచ్చింది. రష్యా చర్యను తీవ్రంగా ఖండించింది కూడా. గతంలో అమెరికా, చైనా, భారత్‌లు కూడా ఇలాగే భూకక్ష్యలోని తమ పాత ఉపగ్రహాలను పేల్చేశాయి. ఎంత చెత్త ఉంది... భూమి దిగువ కక్ష్యలో దాదాపు 9,600 టన్నుల చెత్త (విడిభాగాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, నట్లు, బోల్టులు తదితరాలు) పేరుకుపోయిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) అంచనా. సాఫ్ట్ బాల్ సైజులో ఉన్న భాగాలు 23 వేలు ఉంటాయని నాసా లెక్క. సెంటీమీటరు పరిమాణంలో ఉండేవి ఐదు లక్షల పైచిలుకే ఉంటాయి. ఇవి గంటకు ఏకంగా 25,265 కిలోమీటర్ల వేగంగా దూసుకెళ్తుంటాయి. ఈ శకలాలు ఒకరోజులో భూమి చుట్టూ 15 నుంచి 16 సార్లు పరిభ్రమిస్తాయి. ఈ వేగంతో వెళుతున్నపుడు ఎంత చిన్నశకలమైనా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొడితే కలిగే నష్టాన్ని ఊహించగలమా? విస్పోటం లాంటిది సంభవించే అవకాశం ఉంటుంది. శాటిలైట్లను తాకితే అవి తునాతునకలైపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. సాధారణంగా భూమికి వెయ్యి కిలోమీటర్ల ఎత్తుల్లో కక్ష్యలో సమాచార, పరిశోధక ఉపగ్రహాలు పరిభ్రమిస్తుంటాయి. వీటికి ఈ మానవ జనిత చెత్త, శకలాల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. మునుముందు శాటిలైట్ ప్రయోగాలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి కాబట్టి... చెత్త పేరుకుపోయే... ముప్పు మరింత పెరుగుతుంది. భూకక్ష్యను దాటివెళ్లే అంతరిక్ష ప్రయాణాలకు వీటివల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. భూమి కక్ష్యలో 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే చెత్త క్రమేపీ కొన్నేళ్లలో కిందికి దిగజారుతూ భూమిపైకి పడిపోతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చెబుతోంది. కాకపోతే వెయ్యి కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమించే శకలాలే 100 ఏళ్లు.. ఇంకా అంతకుపైనే తిరుగుతూ ఉంటాయట. వీటితోనే ముప్పు. పైగా భవిష్యత్తులో ఇలాంటి శకలాల నుంచి ముప్పు తప్పించుకునే సాంకేతికతలను శాటిలైట్లకు జోడించాలంటే మొత్తం ప్రాజెక్టు వ్యయం 5 నుంచి 10 శాతం పెరుగుతుందని అంచనా. మొత్తానికి భూమిపైనే కాదు అంతరిక్షంలోనూ మానవ జనిత చెత్తతో మనకు చిక్కొచ్చిపడుతోంది! – నేషనల్ డెస్క్, సాక్షి -
డెయిరీ ముసుగులో వ్యభిచారం.. ఇంట్లోనే దందా
భోపాల్: మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్ రాకెట్ దందా బయటపడింది. గ్వాలియర్‌లోని మురార్ ప్రాంతంలోని జాడేరు డామ్ సమీపంలో ఉన్న ప్రీతమ్ మనోహర్ అనే వ్యక్తి ఇంట్లో.. వ్యభిచారం జరుగుందనే సమాచారంతో పోలీసులు నిన్నరాత్రి (గురువారం) దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలతో పాటు 10 మంది పురుషులను పోలీసులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ప్రీతమ్ మనోహర్ ఇంట్లో పాల వ్యాపారం ముసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు చాలా మంది వారి ఇంటికి వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. రెండెళ్లుగా ఈ రాకెట్ నడుస్తోందని తెలిపారు. ఇంటి యజమాని భార్య.. విటుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విటులను, మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తరలించామని మురార్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ శైలేంద్ర భార్గవ్ తెలిపారు. చదవండి: ముగ్గురు స్నేహితురాళ్ల ఆత్మహత్య? -
ఆఫ్ఘాన్ అధ్యక్ష భవనంపై రాకెట్ల దాడి
కాబూల్: బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని దేశ అధ్యక్షుడు ప్రసంగం చేసే సమయానికి ముందే అధ్యక్ష భవనంపై రాకెట్ల దాడి జరిగింది. ఈ ఘటన పండుగ వేళ కలకలం రేపింది. ఆఫ్ఘాన్ అధ్యక్ష భవనం లక్ష్యంగా మంగళవారం రాకెట్ల దాడి జరిగింది. దేశ రాజధాని కాబూల్‌లో ఉన్న అధ్యక్ష భవనం సమీపంలోకి మూడు రాకెట్లు వచ్చిపడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ చర్యను ఆఫ్ఘాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. బక్రీద్ సందర్భంగా అధ్యక్ష భవనంలో ఉదయం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అధ్యక్షుడు అశ్రఫ్ గని ప్రసంగం మొదలుపెట్టాలి. ప్రార్థనలు కొనసాగుతున్న సమయంలో అధ్యక్ష భవనానికి సమీపంలో రాకెట్ల దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా కలకలం ఏర్పడింది. అయితే రాకెట్లు భవనం సమీపంలో పడినా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆఫ్ఘాన్ మంత్రి మిర్వాస్ స్టాన్క్జాయ్ ప్రకటించారు. ఈ దాడి ఎవరు జరిపారో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఆ దేశంలో తాలిబన్ల దాడులు తీవ్రంగా ఉన్నాయి. పండుగ వేళ కలకలం రేపేలా వారి చర్యలు ఉన్నాయని భావిస్తున్నారు. అమెరికా, నాటో దళాలు పూర్తిగా విరమించుకున్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఏకంగా అధ్యక్ష భవనం లక్ష్యంగా దాడి చేయడం ఆందోళన కలిగించే విషయమే. అయితే ఈ దాడిని అధ్యక్షుడు అశ్రఫ్ గని తీవ్రంగా ఖండించారు. తాలిబన్ల తీరుపై అశ్రఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Israel- Palestine: మధ్య ప్రాచ్యం.. మరింత ఉద్రిక్తం
గాజా సిటీ: దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్– పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. పాలస్తీనా ఉగ్రసంస్థ హమాస్, ఇతర ఉగ్ర సంస్థల అధీనంలోని గాజా సిటీ నుంచి పాలస్తీనా మీదకు, పాలస్తీనా నుంచి గాజా సిటీ వైపునకు లెక్కకు మించిన రాకెట్లు దూసుకొస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజా స్ట్రిప్‌లోని రెండు అపార్ట్మెంట్లు కుప్పకూలాయి. సెంట్రల్ గాజాలోని అత్యంత ఎత్తయిన భవంతుల్లో చాలా వాటిని ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. దీంతో గాజాలో సోమవారం నుంచి ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48కి పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో 14 మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. గాజాలో ఓ కారుపై క్షిపణి పడటంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. మొత్తంగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 86 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా దాదాపు 300 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా రాకెట్ల వర్షం కురిస్తామని హమాస్ కమాండర్లు ప్రకటించిన వీడియో దృశ్యాలను ఇజ్రాయెల్ టీవీ చానళ్లు ప్రత్యక్షప్రసారంచేశాయి. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ మెట్రో ప్రాంతంపై ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. హమాస్ ఉగ్రవాదులు యుద్ధ ట్యాంక్ విధ్వంసక క్షిపణిని సరిహద్దులో ప్రయోగించగా ఒక ఇజ్రాయెల్ దేశస్తుడు మరణించాడు. ఇద్దరు మహిళలు గాయపడ్డారు. మరణించిన వారు పౌరులా? సైనికులా? అనేది తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు జరిపిన వేర్వేరు దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్ దేశస్తులు, ఒక సైనికుడు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి మరణించారు. ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఉగ్రవాదులు మా దేశం మీదకు ఏకంగా 1,050 రాకెట్లతో దాడులు చేశారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. వీటిలో 200 రాకెట్లు గురితప్పి వాళ్ల అధీనంలోని గాజా సిటీలోనే పడిపోయాయని సైన్యం పేర్కొంది. గాజా నుంచి తమ వైపు దూసుకొచ్చిన డ్రోన్‌ను నేలకూల్చామని సైన్యం తెలిపింది. సరిహద్దున ఉన్న ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని సైన్యం పేర్కొంది. భద్రత అనేదే లేదిక్కడ ‘ మేం చూస్తుండగానే మా అపార్ట్మెంట్ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ప్రాణం పోయినంత పనైంది. ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రాణాలు అరచేతలో పెట్టుకుని వెంటనే అపార్ట్మెంట్ మెట్లు దిగి అపార్ట్మెంట్ వాసులమంతా బయటికొచ్చాం. ఏడుపులు, భయాందోళనలతో పరిస్థితి దారుణంగా ఉంది. గాజాలో ఎక్కడా భద్రత అనేదే లేదు’ అని సమాహ్ హబౌ అనే మహిళ ఏడుస్తూ చెప్పారు. ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సమావేశాలు నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయించింది. ఉగ్రసంస్థ గాజా సిటీ కమాండర్ హతం ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్‌కు చెందిన గాజా సిటీ కమాండర్ బసీమ్ ఇసా సహా ఇంకొందరు ఉగ్రవాదులు మరణించారు. గాజాలో గత ఏడేళ్లలో సిటీ కమాండర్ స్థాయి ఉగ్రవాది మరణించడం ఇదే తొలిసారి. కాగా, పరస్పర రాకెట్ల దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడారు. ‘ మా వైపు తీవ్రమైన నష్టం జరిగితే ఊహించని స్థాయిలో దీటైన సమాధామిస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. I watched this video 6 times with tears flooded in my eyes. They’re destroying the main towers in the most vital area in #Gaza city. Now a lot of people left without homes, offices, even without the good memories they had there. pic.twitter.com/WBIZn19Q5H — Abier-Almasri (@abier_i) May 12, 2021 -
అనాథ శవాలతో దందా..ఇక్కడ శవాలు లభించును!
హైదరాబాద్: అనాథ శవాల చీకటి వ్యాపారంలో మరెన్నో కోణాలు బయటపడుతున్నాయి. చట్టాలు, నిబంధనల్లోని లొసుగులను వాడుకుంటున్న కొందరు ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా నమోదు చేయాల్సిన బాడీలను.. అన్క్లెయిమ్డ్గా చూపి కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఈ వ్యవహారానికి జీవో 231ను అడ్డం పెట్టుకుంటున్నారు. ఈ మెడికల్ మాఫియా కేవలం రాష్ట్రంలోనే కాదు, దేశ నలుమూలలకూ అనాథ శవాల వ్యాపారాన్ని విస్తరించింది. అన్క్లెయిమ్డ్, అనుమానాస్పద స్థితిలో మరణించిన వారి బాడీలు, జీవో 231, సీఆర్పీసీ 174ల గురించి తెలుసుకుంటే.. ఈ వ్యవహారంలో మర్మం అర్థమవుతుంది. అన్నింటినీ అన్క్లెయిమ్డ్గా చూపుతూ..! ఉమ్మడి రాష్ట్రంలో అనాథ శవాలను ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ ఇచ్చినదే 231 జీవో. అవసరాన్ని బట్టి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్‌ను మాత్రమే ఇవ్వాలి. ఇందుకు రూ.15,000 ఫీజు, రవాణా చార్జీలు వసూలు చేయాలి. ఇక్కడే కొందరు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల వైద్య సిబ్బంది తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. ఏది అన్క్లెయిమ్డ్, ఏది అనుమానాస్పద స్థితిలో మరణించిన వారి మృతదేహం అన్నది పక్కన పెట్టి.. అన్నింటినీ అక్రమంగా అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్ ఖాతాలో వేసేస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించకుండా గుట్టుచప్పుడు కాకుండా లక్షల రూపాయలకు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్ముకుంటున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దొరికిన శవాల విషయంలో 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేస్తున్న పోలీసులు.. తర్వాత వాటికి పోస్టుమార్టం, అంత్యక్రియలు వంటివాటిని పర్యవేక్షించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిని ఆసరాగా తీసుకుంటున్న వైద్య సిబ్బంది అక్రమంగా మెడికల్ కాలేజీలకు అమ్ముకుంటున్నారు. దేశవ్యాప్తంగా శవాల సరఫరా: 231 జీవోను అడ్డం పెట్టుకుని చేస్తున్న శవాల దందా.. రాష్ట్ర హద్దులు దాటి దేశవ్యాప్తంగా విస్తరించింది. ఒక్క ఉస్మానియా ఆస్పత్రి నుంచే పెద్ద సంఖ్యలో అన్క్లెయిమ్డ్ డెడ్‌బాడీలను ఢిల్లీ, పుదుచ్చేరి, బెంగళూరు, కొప్పాల్, హుబ్లీ, మణిపూర్, ఏపీ, తమిళనాడులోని పలు మెడికల్ కాలేజీలకు విక్రయించారు. వాటి ద్వారా కోటి రూపాయలకుపైగా ఆస్పత్రికి ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కొన్నేళ్ల కింద మణిపాల్‌లోని ఓ మెడికల్ కాలేజీ ఏకంగా 15 శవాలను ఆర్డర్ చేయడం, ఇక్కడి నుంచి పంపడం గమనార్హం. తరలిపోయే వాటిలో అనుమానాస్పద శవాలు కూడా..! రాష్ట్రం నుంచి శవాలు సరిహద్దు దాటాలంటే సరైన అనుమతులు ఉండాలి. ఈ విషయంలో కొందరు పోలీసులు కూడా వైద్య సిబ్బందితో చేతులు కలిపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉస్మానియా మార్చురీ నుంచి వివిధ ప్రైవేటు మెడికల్ కాలేజీలకు పెద్ద సంఖ్యలో అన్క్లెయిమ్డ్ డెడ్‌బాడీలను అమ్మినట్టు రికార్డులు ఉన్నాయి. మరి ఆ డెడ్‌బాడీలన్నీ వివిధ ఆస్పత్రుల్లో చేరి చనిపోయినవారి శవాలా, లేక 174 సీఆర్పీసీ వర్తించే అనుమానాస్పద మృతుల శవాలా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. వందలాది మంది అనాథల్లా ఎలా చనిపోయారు? ఆ డెడ్ బాడీల కోసం ఎవరూ క్లెయిమ్ చేసుకోలే దా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మెడికల్ కా లేజీలకు తరలిన వాటిలో అనుమానాస్పద మృతు ల శరీరాలు కూడా ఉంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు మెడికల్ కాలేజీలకు తరలిన డెడ్‌బాడీలు ఎవరివి? వారి ఫొటోలు ఏ పత్రికలో ప్రచురితమయ్యాయి? ఏ వెబ్సైట్లో వారి వివరాలు ఉన్నాయి. వారి వేలిముద్రలు, శాంపిల్స్‌ను ఎవరు, ఎక్కడ భద్రపరిచారు. తర్వాత కాలంలో వారి బంధువులు ఎవరైనా వచ్చారా? అన్న ప్రశ్నలకు సమాధానం వైద్య సిబ్బందికే తెలియాలి. అన్ క్లెయిమ్డ్ వేరు.. అనుమానాస్పదం వేరు ఎవరైనా అనారోగ్య కారణాలతో.. స్వయంగానో, ఇతరుల సాయంతోనో ఆస్పత్రిలో చేరుతుంటారు. అలాంటివారిలో కొందరు చికిత్స పొందుతుండగానే మరణిస్తారు. ఆ శవాలను తీసుకెళ్లడానికి ఎవరూరారు. మరికొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులే శవాన్ని ఆస్పత్రిలో వదిలేసి వెళ్తుంటారు. ఇలాంటి శవాలను అన్క్లెయిమ్డ్ డెడ్‌బాడీలు (అనాథ శవాలు) అంటారు. వీటికి పోస్టుమార్టం నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఈ బాడీలను మెడికల్ కాలేజీలకు ఇచ్చేందుకు వీలుంటుంది. రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా చనిపోయి, వారి వివరాలేమీ తెలియకుంటే అనుమానాస్పద డెడ్బాడీలుగా పేర్కొంటారు. దీనికి సంబంధించి సీఆర్పీసీ 174 సెక్షన్, పోలీసు మ్యాన్యువల్ 490 ప్రకారం.. తప్పకుండా కేసు నమోదు చేయాలి. శవానికి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అంత్యక్రియలు నిర్వహించాలి. పోలీస్ మాన్యువల్ 311 ప్రకారం.. అనుమానాస్పద స్థితిలో మరణించిన వ్యక్తుల శవాలను గ్రామ పంచాయతీ లేదా పురపాలక సిబ్బంది సాయంతో అంత్యక్రియలు నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు లేదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అప్పగించకూడదు. హైకోర్టును ఆశ్రయిస్తాం అనాథ శవాల విషయంగా జరుగుతున్న అక్రమాలపై త్వరలో హైకోర్టును ఆశ్రయిస్తాం. మృతదేహాల అంత్యక్రియలకు సంబంధించి ఎలాంటి పబ్లిక్ డొమైన్ లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు, దందాలు సాగుతున్నాయి. అనాథ శవాలను తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపే సమయంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు తీసి పెట్టడం లేదు. పెద్ద సంఖ్యలో అనాథ శవాలు వివిధ ప్రైవేటు కాలేజీలకు తరలిపోయాయి. అందులో సగానికిపైగా వివిధ రాష్ట్రాలకు పంపారు. ఇవన్నీ జీవో నం.231 ప్రకారం.. అన్క్లెయిమ్డ్ డెడ్‌బాడీస్ అని చెబుతున్నారు. కానీ అందులో 174 సీఆర్పీసీ వర్తించే అనుమానాస్పద డెడ్‌బాడీలు కూడా ఉండే ఉంటాయి. ఏళ్లుగా వేలాది శవాలను ఎవరూ క్లెయిమ్ చేసుకోకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. అలా పంపిన శవాల వివరాలను ఎక్కడ పొందుపర్చారో తెలియాలి. ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తాం. – రాజేశ్వర్‌రావు, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ -
వైరల్: సిగరెట్‌తో రాకెట్ల ప్రయోగం
-
సిగరెట్‌తో రాకెట్ల లాంచింగ్..
గాల్లో ఎగిరే రాకెట్ పయనం నేల మీద నుంచే ప్రారంభమవుతుంది. అది ఇస్రోలోనైనా, ఇంటి ముందు వాకిట్లో అయినా! అయితే ఓ పెద్దాయన మాత్రం రాకెట్‌ను పంపించేందుకు కొత్త విధానాన్ని కనుగొన్నాడు. కానీ దీన్ని ఎవరూ ప్రయత్నించద్దని కోరుతున్నాడు. అదేంటని తికమకపడకుండా ముందుగా ఈ వార్త చదివేయండి.. అటవీ అధికారి సుశాంత్ నందా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ఓ వ్యక్తి నడిరోడ్డుపై నిలబడుతూ ఓ సాహసానికి పూనుకున్నాడు. దర్జాగా సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. ఓ చేతిలో రాకెట్లతో నిలబడ్డాడు. (అవార్డు విన్నింగ్ లెవల్లో నటించింది) ఇంకేముందీ.. ఎవరూ ఆ దారి గుండా రావడం లేదని నిశ్చయించుకున్నాక అసలు పని ప్రారంభించాడు. ఒక్కో రాకెట్‌ను కుడి చేతులోకి తీసుకుని దాని చివరను నోట్లో ఉన్న సిగరెట్‌కు అంటించి గాల్లోకి పంపాడు. ఏ మాత్రం తొణుకు బెణుకూ లేకుండా సునాయాసంగా రాకెట్లను అంతరిక్షంలోకి కాకపోయినా ఆకాశంలోకి పంపాడు. సుమారు పది రాకెట్లను కేవలం పద్దెనిమిది సెకండ్లలో గాల్లోకి పంపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. "అదిరిందయ్యా నీ ప్రయోగం" అంటూ కొందరు అదుర్స్ అని కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం "కొంచెం తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదం" అని మండిపడుతున్నారు. కాగా ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి వైరల్ అవుతోంది. (బర్త్‌డే గిఫ్ట్.. సర్ప్రైజ్ సూపర్!!) -
అర్ధసెంచరీకి అడుగు దూరంలో..
సాక్షి, సూళ్లూరుపేట: షార్ కేంద్రం నుంచి ఇప్పటి వరకూ చేసిన ప్రయోగాల్లో పీఎస్ఎల్వీ రాకెట్‌దే అగ్రతాంబూలం. 74 ప్రయోగాల్లో 49 పీఎస్ఎల్వీ రాకెట్లే ఉన్నాయి. 1993 సెప్టెంబర్ 20న తొలిసారిగా పీఎస్ఎల్వీ డీ–1, 2017 ఆగస్ట్ 31న ప్రయోగించింది. 27ఏళ్ల ముందు మొదలైన విజయపరంపర కొనసాగుతోంది. 49 ప్రయోగాల్లో రెండు మాత్రమే విఫలమయ్యాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) రాకెట్ బహుళ ప్రయోజనకారిగా మారి ఇస్రో చరిత్ర, గతినే మార్చేసింది. పీఎస్ఎల్వీ రాకెట్ ఇస్రోకు నమ్మకమైన బ్రహ్మాస్త్రంలా తయారైంది. బుధవారం ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్‌తో పీఎస్ఎల్వీ సిరీస్ అర్ధసెంచరీని పూర్తి చేసుకోనుంది. ఇస్రోకు దేశీయంగానే కాకుండా వాణిజ్యపరమైన ప్రయోగాల్లోనూ అగ్రస్థానంలో వెలుగొందుతూ బహుళ ప్రయోజనకారిగా దోహదపడుతోంది. దేశీయంగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలతో పాటు అతి చిన్న విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా తీసుకెళ్తూ ఆదాయ గనిగా మారింది. చంద్రయాన్, మంగళ్యాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకే సారి పది ఉపగ్రహాలు, మళ్లీ 20 ఉపగ్రహాలు, ఆ తర్వాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్ఎల్వీకే సొంతం. ఇప్పటివరకు 49 పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 310 విదేశీ ఉపగ్రహాలు, 46 స్వదేశీ ఉపగ్రహాలు, దేశంలోని పలు యూనివర్సిటీలకు 10 స్టూడెంట్ ఉపగ్రహాలను పంపించి ఇస్రో ప్రగతికి బాటలు వేస్తోంది. కంటికి రెప్పలా.. దేశీయ అవసరాల నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భూమిని అన్ని రకాలుగా పరిశోధన చేసే రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాలను (రిశాట్) ప్రయోగిస్తోంది. దేశ భద్రతకు సంబంధించి కంటికిరెప్పలా కాపాడుతోంది. సరిహద్దులో జరిగే చొరబాట్లను పసిగడుతోంది. ఇప్పటివరకు రెండు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలు మూడోసారి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ – 48 రాకెట్ ద్వారా రిశాట్ – 2బీఆర్1 అనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపగ్రహ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్‌ను అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. 2012 ఏప్రిల్ 20 పీఎస్ఎల్వీ సీ – 19 రాకెట్ ద్వారా రిశాట్ – 2 అనే ఉపగ్రహాన్ని పంపించారు. దీని కాలపరిమితి పూర్తవడంతో ఈ ఏడాది మే 22న పీఎస్ఎల్వీ సీ 4–6 రాకెట్ ద్వారా రిశాట్ – 3బీ అనే ఉపగ్రహాన్ని పంపించారు. ఈ ఉపగ్రహాల్లో అమర్చిన పేలోడ్స్ భూమ్మీద 20 గీ 30 సెంటీమీటర్ల వ్యాసార్థంలో మాత్రమే ఛాయా చిత్రాలు తీసేవి. సీ – 48లో అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఎక్స్‌బాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్ భూమ్మీద జరిగే మార్పులను 10 సెంటీమీటర్ల వ్యాసార్థంలో ఉండే చిన్నవాటినైనా సరే అత్యంత నాణ్యమైన చిత్రాలను పంపించే సామర్థ్యం కలిగి ఉంది. దేశ సరిహద్దుల్లో జరిగే అక్రమ చొరబాట్లు, పంటల విస్తీర్ణం, సాగువిస్తీర్ణం, అడవులను పరిశోధించడమే కాకుండా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలోనైనా అత్యంత నాణ్యమైన ఛాయా చిత్రాలు తీసి పంపిస్తుంది. ఈ ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్ భూమికి 576 కిలోమీటర్ల ఎత్తు నుంచి దేశానికి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది. రాత్రీ పగలు అనే తేడా లేకుండా అత్యంత నాణ్యమైన ఛాయా చిత్రాలు తీసే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంది. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు రోదసీలో ఉండి పనిచేస్తుంది. భవిష్యత్తులో రి«శాట్ ఉపగ్రహాలను పెంచుకునే దిశగా ఇస్రో అడుగులేస్తోంది. -
బ్రిటీష్‌ను బెంబేలెత్తించిన... మైసూరు రాకెట్లు...!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని శివమొగ్గ దగ్గరలోనే ఓ గ్రామంలోని పాడుపడిన బావి నుంచి ఇటీవల వెయ్యి రాకెట్లు (తారాజువ్వల వంటివి) బయటపడ్డాయి. లండన్ మ్యూజియంలో భద్రపరిచిన రాకెట్లతో ఇవి పోలి ఉండడంతో పాటు టిప్పు సుల్తాన్ కాలం నాటివిగా భావిస్తున్న ఇలాంటి రాకెట్లనే మరి కొన్నింటిని కొంత కాలం క్రితమే వెలికి తీశారు. దీంతో దాదాపు 250 ఏళ్ల క్రితమే టిప్పు సుల్తాన్ శత్రువుపై ముఖ్యంగా ఇంగ్లీష్ బలగాలు మైసూరు రాజ్యంలోకి అడుగుపెట్టకుండా ఎలాంటి యుద్ధనీతులు, సైనికవ్యూహాలతో పాటు ఎలాంటి వినూత్న ఆయుధాలు ఉపయోగించి ఉంటాడనేది చర్చనీయాంశమైంది. ఆంగ్లేయులతో మైసూరు రాజ్యానికి జరిగిన యుద్ధాల్లో ‘రాకెట్వ్యూహం’ విస్తృతంగా ఉపయోగించినట్టు వెల్లడైంది. ‘శత్రువు ఉపయోగించిన మందుగుండు, ఇతర ఆయుధాల కంటే కూడా రాకెట్ల వల్లనే బ్రిటీష్ సైన్యానికి ఎక్కువ నష్టం వాటిల్లింది’ అని చరిత్రకారులు ఎల్.డే, ఐ.మెక్నీల్ తమ గ్రంథం ‘బయోగ్రఫికల్ డిక్షనరీ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ టెక్నాలజీ’లో పేర్కొన్నారు. టిప్పు బలగాలు మెరుగైన సైనిక నైపుణ్యాలు కలిగి ఉన్న కారణంగా నాలుగో యుద్ధంలో దౌత్యపరమైన నైపుణ్యాలతోనే మైసూరు సైన్యంపై బ్రిటీష్‌సైన్యం చివరగా గెలుపొందగలిగిందనే అభిప్రాయంతో చరిత్రకారులున్నారు. అసలేమిటీ రాకెట్ల చరిత్ర ? 19వ శతాబ్దం మొదట్లో నెపోలియన్ యుద్ధాల్లో భాగంగా ఫ్రాన్స్‌తో బ్రిటన్ తలపడినపుడు అప్పటి వరకు ఐరోపా ఖండంలోనే ఎవరు ఉపయోగించని ‘కాంగ్రీవ్ ర్యాకెట్’లు ప్రయోగించింది. ఇంగ్లిష్ సైన్యానికి చెందిన సర్ విలియమ్ కాంగ్రీవ్ దీనిని కనిపెట్టినట్టు భావిస్తున్నారు.18వ శతాబ్దం ప్రారంభంలో పలు ప్రయోగాలు నిర్వహించాక ‘మండే తారాజువ్వలు’ కాంగ్రీవ్ తయారుచేశారు. యుద్ధంలో వినియోగించినపుడు బాగా ప్రభావం చూపడంతో ఈ ర్యాకెట్లపై డెన్మార్క్, ఈజిప్ట్, ప్రాన్స్, రష్యా, ఇతర దేశాల మిలటరీ ఇంజనీర్ల దృష్టిని ఆకర్షించింది. అయితే 19వ శతాబ్దం మధ్యలో చరిత్రకారులు బ్రిటీష్ మిలటరీ చరిత్ర, నేపథ్యాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసినపుడు కాంగ్రీవ్ రాకెట్ మూలాలు భారత్‌లో మరీ ముఖ్యంగా టిప్పు సుల్తాన్ రాజ్యంలో ఉన్నట్టు గుర్తించారు. కొన్ని శతాబ్దాల క్రితమే మండే బాణాల రూపంలో ఐరోపా దేశాల్లో వీటిని ఉపయోగించినా, టిప్పుకాలంలోనే వీటిని ఆధునీకరించడంతో ‘మైసూరు రాకెట్లు’గా ఇవి బాగా ప్రచారంలోకి వచ్చాయి. ‘ప్రధానంగా ఇంథనం పట్టి ఉంచేందుకు వీలుగా ఇనుపగొట్టాలు వినియోగించిన కారణంగా బ్రిటీషర్లకు తెలిసిన, చూసిన వాటి కంటే కూడా టిప్పు కాలం నాటి రాకెట్లు ఎంతో అధునాతనమైనవి’ అని శాస్త్రవేత్త రొద్దం నరసింహ పేర్కొన్నారు. ఏమిటీ ప్రత్యేకత ? ఇనుప గొట్టంతో తయారుచేసిన ఈ రాకెట్లు (ఇవి వివిధ సైజుల్లో ఉంటాయి) ఓ చివర మూసివేస్తారు. వెదురుబద్ధకు ఓ ట్యూబ్‌ను జతచేశాక అది మండే వాహకంగా (కంబాషన్ ఛాంబర్)గా పనిచేస్తుంది. వాటిలో గన్ఫౌడర్ను ఇంథనంగా ఉపయోగిస్తారు. ఈ రాకెట్లు 500 గ్రాముల గన్ఫౌడర్తో 900 మీటర్ల వరకు లక్ష్యాలు చేధించేలా రూపొందించారు. గతంలో ఐరోపా, చైనాతో సహా ఇండియాలోనూ కనుక్కున్న రాకెట్లలో (ఇనుప కేసింగ్ లేనివి కూడా) ఇంత ఎక్కువ దూరం వెళ్లలేకపోయినట్లు గుర్తించారు. ఈ రాకెట్ల ఉన్నతస్థాయి యాంత్రిక నిర్మాణంలో ఇనుము, స్టీలు, గన్‌పౌడర్‌ను మంచి మిశ్రమంగా ఉపయోగించిన తీరు అద్భుతమని చరిత్రకారులు హెచ్ఎం ఇఫ్తకార్ జామ్, జాస్మిన జైమ్ తమ పుస్తకంలో పేర్కొన్నారు. టిప్పు సుల్తాన్ పర్యవేక్షణలో ర చించిన ‘ద ఫతూల్ ముజాహిదీన్’ మిలటరీ మ్యానువల్‌లో సైనికదాడుల్లో రాకెట్ల వినియోగం గురించి వివరంగా రాశారు. ప్రతీ సైనికదళంతోనూ ‘జౌక్’గా పిలిచే రాకెట్‌సైన్యం ఉండేది. టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్అలీ కాలంలో 1200 మంది ఉన్న రాకెట్‌సైన్యం, టిప్పు కాలం నాటికి 5 వేల మందికి చేరుకుందని చారిత్రక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. - సాక్షి, నాలెడ్జ్సెంటర్ -
పాడుపడిన బావిని తవ్వితే..
బెంగళూరు : టిప్పు సుల్తాన్ భారతదేశ శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలిచిన చక్రవర్తి. ఆంగ్లేయులను గడగడలాడించిన ఈ యుద్ధ వీరునికి సంబంధించిన అరుదైన సంపద శిమొగ్గ జిల్లా పరిసర ప్రాంతాల్లోని ఒక పురాతన బావిలో వెలుగు చూసింది. క్రీస్తుశకం 18 వ శతాబ్దంలో మైసూర్ యుద్ధంలో వాడిన అరుదైన యుద్ధ సామగ్రి బయటపడింది. ఉప్పరివారు ఒక పురాతన బావిని తవ్వుతుండగా ఈ చారిత్రక సంపద వెలుగులోకి వచ్చినట్లు కర్ణాటక ఆర్కియాలజిస్టులు తెలిపారు. ఈ విషయం గురించి ఆర్కియాలజి డిపార్ట్మెంట్ అధికారి ఆర్ రాజేశ్వర నాయక ఈ పురాతన బావి నుంచి గన్ పౌడర్ వాసన రావడంతో ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఈ బావిలో ‘మైసురియన్ రాకెట్లు’గా ప్రసిద్ధి గాంచిన 1000 రాకెట్లు, గుళ్లు లభించాయి. వీటిని యుద్ధాలలో వినియోగించడం కోసం ఇక్కడ భద్రపరిచి ఉంటారు. ఈ రాకెట్ల పొడవు 23 - 26 సెంమీల పొడవు ఉన్నాయి. అంతేకాక ఇవి నెపోలియన్ చక్రవర్తి ఉపయోగించిన రాకెట్ల మాదిరిగానే ఉన్నాయి’ అని తెలిపారు. వీటిని వెలికి తీయడం కోసం 15 మంది ఆర్కియాలిజిస్ట్‌లు, పనివారు మూడు రోజుల పాటు శ్రమించారన్నారు. టిప్పు సుల్తాన్ 1799లో జరిగిన చివరి ఆంగ్లో - మైసూర్ యుద్ధంలో వీర మరణం పొందారు. ఈ యుద్ధల సమయంలోనే టిప్పు సుల్తాన్ మైసూరియన్ రాకెట్లుగా ప్రసిద్ధి పొందిన ఈ ఆయుధాలను తయారు చేసి, వినియోగించేవారని చరిత్రకారులు అభిప్రాయాపడుతున్నారు. ఆర్కియాలజిస్టుల రికార్డుల ప్రకారం ప్రస్తుతం శిమొగ్గలో ఉన్న కోట టిప్పు సుల్తాన్ కాలానికి చెందినది. -
జపాన్‌లో కుప్పకూలిన రాకెట్
-
ఎగిరింది 60 అడుగులే.. కుప్పకూలిన రాకెట్..
టోక్యో, జపాన్ : ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తయారు చేసిన రాకెట్ తారాజువ్వలా 60 అడుగులు ఎగిరి అక్కడే కుప్పకూలింది. జపాన్‌కు చెందిన ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ మోమో-2 పేరుతో దాదాపు 2.7 మిలియన్ డాలర్లను ఖర్చు చేసి రాకెట్‌ను తయారు చేసింది. దక్షిణ హొకైడో ద్వీపంలోని టైకి అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. దాదాపు 10 మీటర్ల పొడవున్న మోమో-2 రాకెట్ లాంచింగ్ పాడ్ నుంచి గాలిలోకి 60 అడుగుల ఎత్తు ఎగిరి కుప్పకూలింది. గతేడాది మోమో రాకెట్ ప్రయోగం కూడా ఇదే తరహాలో విఫలం చెందింది. ఈ ఘటనలో లాంచింగ్ పాడ్ కొద్దిగా దెబ్బతింది. అయితే, ఎవరికీ గాయాలు కాలేదని ఇంటర్స్టెల్లార్ వ్యవస్థాపకుడు టకఫుమి హొరీ తెలిపారు. ప్రయోగ విఫలానికి గల కారణాలను అన్వేషించి మళ్లీ ప్రయోగం చేపడతామని ఆయన వెల్లడించారు. -
ఆకాశంలో అద్భుతం : ఏలియన్స్ అని భయాందోళన
సైబీరియా, రష్యా : అర్ధరాత్రి కావొస్తోంది. ఒక్కసారిగా ఆకాశంలో భారీ వెలుగు. ఏం జరుగుతుందో ఉత్తర సైబీరియా ప్రజలకు అర్థం కాలేదు. గుండ్రటి ఆకారంలో ఆకాశం నుంచి పెద్ద వెలుగు ఏర్పడటాన్ని అందరూ గుర్తించారు. ఆ దృశ్యాలను ఫోన్లలో బంధించారు. ఏలియన్లు రష్యాలో దిగుతున్నాయంటూ సోషల్‌మీడియాలో కొందరు పోస్టులు చేశారు. దీంతో కొందరు సైబీరియన్లు భయంతో వణికిపోయారు. ఈలోగా ఆకాశంలో వచ్చిన వెలుగు మిలటరీ చేసిన రాకెట్ ప్రయోగం వల్ల ఏర్పడి ఉండొచ్చిన లేదా ఉత్తర ధ్రువం నుంచి వచ్చే వెలుగు కావొచ్చని, ప్రజలు భయాందోళనలకు గురికావొద్దంటూ రష్యన్ కథనాలను ప్రసారం చేయడంతో వారందరూ ఊపరిపీల్చుకున్నారు. నాలుగు రాకెట్లను ఒకేసారి ప్రయోగించడంతో వాటి ఇంధన ప్రభావం వల్ల ఆకాశం మిరుమిట్లు గొలుపుతూ దర్శనం ఇచ్చినట్లు చెబుతున్నారు. 2009లో నార్వే కూడా అర్థరాత్రి ప్రయోగాలు నిర్వహించడంతో ఆ ప్రదేశంలోని ఆకాశం మిరుమిట్లు గొలుపుతూ కనిపించింది. -
వెయ్యి రాకెట్లకు నిప్పు.. వైరల్ వీడియో
సాక్షి ప్రత్యేకం: అమెరికాకు చెందిన కొలిన్ ఫర్జ్ అనే వ్యక్తి చేసిన సహసం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. వెయ్యి రాకెట్ టపాసులను సైకిల్ వెనుక పెట్టుకుని దాన్ని తొక్కుతూ వాటికి నిప్పంటించాడు. అంతే ఒక్కసారిగా భారీ శబ్దాలతో రాకెట్లన్నీ నింగిలోకి దూసుకెళ్లాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్ చక్కర్లు కొడుతోంది. మరి మీరు ఓ లుక్కేసేయండి. -
2,200 రాకెట్లు.. ఒకేసారి
సీబీఐటీ, వీబీఐటీ విద్యార్థుల వినూత్న ప్రయోగం వైఎస్ఆర్ జిల్లా చాపాడులోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (సీబీఐటీ), విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీబీఐటీ) కళాశాల విద్యార్థులు సంయుక్తంగా ఏక కాలంలో 2,200 ఎయిర్ రాకెట్లను ప్రయోగించారు.‘14 యంత్రాస్’ అనే సంస్థ చెన్నై ఐఐటీ, బెంగళూరు ఐఐఎం సహకారంతో రూ. 25 లక్షల ఖర్చుతో 2,200 మంది విద్యార్థులతో ఎయిర్ రాకెట్లను తయారు చేయించింది. వాటిని సీబీఐటీ, వీబీఐటీ ప్రాంగణ ం వేదికగా ప్రయోగించారు. చైనాలో ఓ విద్యా సంస్థ 2011లో 1,056 మందితో ఇలాంటి ప్రయోగం చేసి గిన్నిస్ రికార్డు సాధించగా, తాజా ప్రయోగం ఆ రికార్డును అధిగమించాయి. రాకెట్లు 100 అడుగుల ఎత్తుకు వెళ్లాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో టెక్నాలజీపై విశ్వాసం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని సీబీఐటీ, వీబీఐటి కరస్పాండెంట్ వి.జయచంద్రారెడ్డి చెప్పారు. గిన్నిస్ రికార్డు వారికి ఈ ప్రయోగ వివరాలు పంపుతామన్నారు. - చాపాడు -
ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి
జెరూసలెం: పాలస్తీనా ఉగ్రవాదులకు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య భీకర పోరు జరుగుతోంది. పాలస్తీనా ఉగ్రవాదులు సోమవారం ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి చేశారు. పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంపై పది పేలుడు పదార్థాలను ప్రయోగించినట్టు ఓ వార్త సంస్థ తెలపగా.. ఆదివారం రాత్రి కనీసం 16 రాకెట్లతో దాడి చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టేందుకు ప్రతీకార దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రకటించింది. గాజాలోని ఉగ్రవాదుల స్థావరం లక్ష్యంగా చేసుకున్న్టట్టు తెలిపారు. రాకెట్లతో దాడి చేసేందుకు చేస్తున్న సన్నాహకాలు చివరిదశకు వచ్చాయని సైనికాధికారులు చెప్పారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఓ ఉగ్రవాది మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని పాలస్తీనా వర్గాలు తెలిపాయి. గాజా దక్షిణప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.