ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా భీకర దాడి | Hezbollah fires about 250 rockets into Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా భీకర దాడి

Published Mon, Nov 25 2024 5:44 AM | Last Updated on Mon, Nov 25 2024 5:44 AM

Hezbollah fires about 250 rockets into Israel

250 రాకెట్లు ప్రయోగించిన మిలిటెంట్లు

బీరూట్‌: లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా మిలిటెంట్లు మరోసారి భీకర దాడులకు దిగారు. ఆదివారం ఇజ్రాయెల్‌ భూభాగంపై 250 రాకెట్లు, ఇతర డ్రోన్లు ప్రయోగించారు. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్‌ సైన్యం లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై విరుచుకుపడుతుండడంతో ప్రతీకార చర్యగా మిలిటెంట్లు రాకెట్లతో దాడి దిగారు.

 ఈ దాడుల్లో కనీసం ఏడుగురు ఇజ్రాయెల్‌ పౌరులు గాయపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్‌ సైన్యం లెబనాన్‌ ఆర్మీ సెంటర్‌పై దాడికి పాల్పడింది. నైరుతి కోస్తా తీర రహదారిపై టైర్, నఖౌరా మధ్య ఈ దాడి జరిగినట్లు లెబనాన్‌ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్‌ దాడిలో ఒక సైనికుడు మృతిచెందాడని, 18 మంది గాయపడ్డారని తెలియజేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement