డెయిరీ ముసుగులో వ్యభిచారం.. ఇంట్లోనే దందా | Madhya Pradesh Police Busted A Sex Racket In The Murar Area In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

Madhya Pradesh: డెయిరీ ముసుగులో వ్యభిచారం.. ఇంట్లోనే దందా

Published Fri, Oct 29 2021 8:17 AM | Last Updated on Fri, Oct 29 2021 11:27 AM

Madhya Pradesh Police Busted A Sex Racket In The Murar Area In Madhya Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్‌ రాకెట్‌ దందా బయటపడింది.  గ్వాలియర్‌లోని మురార్‌ ప్రాంతంలోని జాడేరు డామ్‌ సమీపంలో ఉన్న  ప్రీతమ్‌ మనోహర్‌ అనే వ్యక్తి ఇంట్లో.. వ్యభిచారం జరుగుందనే సమాచారంతో పోలీసులు నిన్నరాత్రి (గురువారం) దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలతో పాటు 10 మంది పురుషులను పోలీసులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ప్రీతమ్‌ మనోహర్‌ ఇం‍ట్లో పాల వ్యాపారం ముసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రతిరోజు చాలా మంది వారి ఇంటికి వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. రెండెళ్లుగా ఈ రాకెట్‌ నడుస్తోందని  తెలిపారు. ఇంటి యజమాని భార్య.. విటుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విటులను, మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తరలించామని మురార్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ శైలేంద్ర భార్గవ్‌ తెలిపారు.   

చదవండి: ముగ్గురు స్నేహితురాళ్ల ఆత్మహత్య? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement