Dairy Form
-
పాడి పరిశ్రమ, పశు వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
చీపురుపల్లి(గరివిడి): పశు సంపద పుష్కలంగా ఉన్నప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యపడుతుందన్న గాంధీజీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో పశు సంపద, పాడి పరిశ్రమ, పశు వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు తెలిపారు. గరివిడిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి చెందిన పశువైద్య కళాశాలలో రూ.81.25 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించిన పశువైద్య చికిత్స సముదాయం, పశుగణ క్షేత్ర సముదాయం, బాలుర, బాలికల వసతిగృహాల భవనాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో సీదిరి మాట్లాడారు. ఏపీలో ఆర్బీకేలలో అందిస్తున్న సేవలు దేశ చరిత్రలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రతీ వెయ్యి మూగజీవాల వైద్య సేవలకు ఒక వెటర్నరీ అసిస్టెంట్‌ను నియమించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. మనుషుల వలే త్వరలో వెటర్నరీ అంబులెన్స్‌లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దీనికి సీఎం ఇప్పటికే ఆమోద ముద్రవేశారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మూగజీవాలకు కష్టంవస్తే మండల, నియోజకవర్గ కేంద్రాల్లోని ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఊరిలోనే వైద్యసేవలు అందజేస్తున్నట్టు వెల్లడించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా పటిష్ట్రపణాళికలను ప్రభుత్వం రూపొందించిందన్నారు. పశు వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి భవిష్యత్‌లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. గరివిడిలో పశు వైద్య కళాశాల అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కళాశాలను అభివృద్ధి చేస్తోందన్నారు. గరివిడిలోని కళాశాలను వర్సిటీ స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్‌కు విద్యార్థులే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్‌కు విద్యార్థులే పెట్టుబడి అని, వారి చదువుల కోసం ప్రభుత్వం అధిక నిధులు ఖర్చుచేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కలెక్టర్, వైస్‌చాన్సలర్ సూచనల మేరకు రూ.5 కోట్ల వ్యయంతో జిల్లా స్థాయి ఆడిటోరియంను గరివిడి పశువైద్య కళాశాలలో నిర్మించనున్నట్టు వెల్లడించారు. గరివిడిలో పశువైద్య కళాశాలకు 2016లోనే జీఓలు ఇచ్చినప్పటికీ పనులపై అప్పటి ప్రభుత్వం శ్రద్ధ చూపలేదన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పశువైద్య కళాశాల అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో పశువైద్య వృత్తికి భారీ డిమాండ్ పెరుగుతోందన్నారు. కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. చదువుతోనే పేదరిక నిర్మూలనతో పాటు రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నది సీఎం అభిమతంగా పేర్కొన్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పశువైద్య కళాశాలకు జీఓలు ఇచ్చినప్పటికీ కేంద్రం అనుమతులు తీసుకురాలేదన్నారు. ఎంపీ అయ్యాక కేంద్ర అధికారులతో మాట్లాడి, బృందాలను రప్పించి పరిశీలన జరిపించి అనుమతులు తెప్పించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వీసీ పద్మనాభరెడ్డి, బోర్డు మెంబర్లు జీఎస్.రెడ్డి, జానకీరామ్, విజయ్‌కుమార్, కలెక్టర్ ఎ.సూర్యకుమారి, అసోసియేట్ డీన్ సీవీ రాయులు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు, సర్పంచ్ గేదెల కృష్ణవేణి, ఏఎంసీ చైర్మన్ దన్నాన జనార్దనరావు, నాలుగు మండలాల వైఎస్సార్సీపీ నాయకులు కేవీ సూర్యనారాయణరాజు, ఎస్వీ రమణరాజు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మీసాల విశ్వేశ్వరరావు, కోట్ల వెంకటరావు, పొట్నూరు సన్యాసినాయుడు, తహసీల్దార్ టి. గోవింద, ఎంపీడీఓ జి.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబువి శవ రాజకీయాలు శవ రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతూ సిగ్గులేని మాటలు చెబుతున్న చంద్రబాబునాయుడు ‘శవాల వద్దకే చంద్రబాబు’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మంత్రి డా.సీదిరి అప్పలరాజు విమర్శించారు. విజయనగరం జిల్లా గరివిడిలో పశువైద్య కళాశాలలో కొత్తగా నిర్మించిన చికిత్స సముదాయాలను ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంగ్లిష్ మీడియంపై సిగ్గులేని మాటలు అడుతున్నారని విమర్శించారు. ఇంగ్లిష్ మీడియం చదివితే మొద్దు అవుతారన్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఆయన కొడుకు, మనవడు ఏ మీడియంలో చదివారు... మనవడుకు తెలుగు అక్షరాలు వచ్చా అని ప్రశ్నించారు. చంద్రబాబు పిల్లలు, కుటుంబ సభ్యులు మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో చదవాలే తప్ప రాష్ట్రంలోని పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవకూడదన్నది ఆయన నైజమన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంక్షదబాబు చేయలేని పనులు రెండేళ్లలో జగన్మోహన్రెడ్డి చేసి చూపించారన్నారు. ప్రజల్లో మంచి పేరు రావడంతో జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మాతృభాష అయిన తెలుగును గౌరవిస్తూనే... మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపేలా ఆంగ్లమాధ్యమ చదువులకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న ఆంగ్లమాధ్యమ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమల్లోకి తెచ్చారన్నారు. చంద్రబాబునాయుడు జాతీయ అధ్యక్షుడు కదా... అక్కడ ఆంగ్లమాధ్యమం అమలుపై ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు జై జగన్ అంటూ జనం నినదిస్తున్న తీరుచూస్తే ‘బాబుకు బాదుడే బాదుడు’ తప్పదన్నారు. 2024 నాటికి తెలుగు దొంగల పార్టీ అంతరించిపోవడం ఖాయమన్నారు. ఎన్ని శవ యాత్రలు చేసినా, లోకేష్ ఎన్ని శవాలు వద్దకు వెళ్లి ఫొటోలు తీయించుకున్నా ప్రజలు నమ్మరని చెప్పారు. 2024లో మరోసారీ భారీ మెజారిటీతో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రతిపక్షాలు శవ రాజకీయాలు మానుకుని హుందాగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఉన్నారు. -
డెయిరీ ముసుగులో వ్యభిచారం.. ఇంట్లోనే దందా
భోపాల్: మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్ రాకెట్ దందా బయటపడింది. గ్వాలియర్‌లోని మురార్ ప్రాంతంలోని జాడేరు డామ్ సమీపంలో ఉన్న ప్రీతమ్ మనోహర్ అనే వ్యక్తి ఇంట్లో.. వ్యభిచారం జరుగుందనే సమాచారంతో పోలీసులు నిన్నరాత్రి (గురువారం) దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలతో పాటు 10 మంది పురుషులను పోలీసులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ప్రీతమ్ మనోహర్ ఇంట్లో పాల వ్యాపారం ముసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు చాలా మంది వారి ఇంటికి వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. రెండెళ్లుగా ఈ రాకెట్ నడుస్తోందని తెలిపారు. ఇంటి యజమాని భార్య.. విటుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విటులను, మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తరలించామని మురార్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ శైలేంద్ర భార్గవ్ తెలిపారు. చదవండి: ముగ్గురు స్నేహితురాళ్ల ఆత్మహత్య? -
ఇంటెల్‌లో జాబ్ వదిలి.. 20 ఆవులతో మొదలై.. రూ. 44 కోట్ల సంపాదన
బెంగళూరు: మన పెద్దలు ఓ మాట చెప్తుంటారు. బుర్ర చెప్పింది వింటే బాగుంటాం.. మనసు చెప్పింది వింటే సంతోషంగా, సంతృప్తిగా బతుకుతామని. ఈ మాటని నిజం చేసి చూపాడు ఓ వ్యక్తి. ఐఐటీలో చదివి.. ప్రతిష్టాత్మక ఇంటెల్ కంపెనీలో కొలువు చేస్తున్న ఓ ఇంజనీర్ దాన్ని వదిలేసుకుని.. తనకు ఎంతో ఇష్టమైన పని చేయడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం అతడు సంతృప్తిగా బతకడమే కాక మరో 100 మందికి పైగా ఉపాధి చూపుతున్నాడు. ఇంతకు అతడు ఏం చేస్తున్నాడంటే.. ఉద్యోగం వదిలి 20 ఆవులతో పాల వ్యాపారం ప్రారంభించి, ఇప్పుడు ఏకంగా ఏడాదికి 44 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. అతడి విజయ గాథ వివరాలు.. కర్ణాటకకు చెందిన కిశోర్ ఇందుకూరి అనే వ్యక్తి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో మాస్టర్స్, పీహెచ్డీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇంటెల్ కంపెనీలో ఆరేళ్లు పని చేశాడు. ఉద్యోగంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికి అతడికి సంతృప్తి లేదు. దాంతో ఇండియాకు తిరిగి వచ్చాడు. అప్పుడే అతడి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. ఓ సారి పని నిమిత్తం కిశోర్ హైదరాబాద్ వచ్చాడు. ఆ సమయంలో అతడు నగరవాసులు స్వచ్ఛమైన పాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారని గ్రహించాడు. ఆ సమయంలో కిశోర్‌కి వచ్చిన ఓ ఆలోచన అతడి జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పింది. దానిలో భాగంగా కిశోర్ జాబ్ వదిలేసి 20 ఆవులు కొని సొంత డెయిరీ ప్రారంభించాడు. కుటుంబ సభ్యులతో కలిసి స్వచ్ఛమైన పాలను వినియోగదారుల గుమ్మం వద్దకే తీసుకెళ్లసాగాడు. ఇక పాలు ఎక్కువ సమయం నిల్వ ఉండేలా చల్లబర్చి, నిల్వ చేసే విధానాన్ని ఉపయోగించాడు కిశోర్. అంచెలంచెలుగా ఎదుగుతూ, 2018 నాటికి డెయిరీ విస్తరించింది. దానికి తన కుమారుడు సిద్దార్థ్ పేరు మీద “సిద్ ఫార్మ్” అని పేరు పెట్టాడు కిశోర్. ప్రస్తుతం అతడు 6 వేల మందికి పాలు పోస్తున్నాడు. ఇక షాబాద్‌లో విస్తరించిన ఇతడి ఫామ్‌లో ప్రస్తుతం 120 మంది పని చేస్తున్నారు. ఇక కిశోర్ కేవలం పాలు మాత్రమే కాక సేంద్రీయ పాల ఉత్పత్తులైన పెరుగు, నెయ్యిని విక్రయిస్తాడు. సిద్ ఫామ్ ఇప్పుడు రోజుకు దాదాపు 10,000 మంది వినియోగదారులకు తన ఉత్పత్తులను అందిస్తుంది. ఇక ఈ డెయిరీ మీద అతడు సంవత్సరానికి 44 కోట్లు ఆర్జిస్తున్నాడు. చదవండి: 67 ఏళ్ళ వయసులో ‘గేట్’ సాధించాడు! -
పా‘పాల’ భైరవుల ఆటకట్టు!
సాక్షి, సిటీబ్యూరో: వెటర్నరీ వినియోగంలో నిషేధించిన ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను కర్ణాటకలోని బీదర్ నుంచి అక్రమ రవాణా చేసి, నగరంలోని డెయిరీ ఫామ్స్‌కు విక్రయిస్తున్న ముఠా గుట్టును సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఓ నిందితుడిని పట్టుకుని 100 ఎంఎల్ పరిమాణం కలిగిన 1920 లేబుల్స్ లేని ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ ఆదివారం వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. ప్రసూతి సమయంలో మహిళలకు వినియోగించే ఈ ఇంజెక్షన్లను గతంలో పశువులకు వాడేవారు. అయితే వీటి దుష్పరిణామాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వీటి వినియోగాన్ని నిషేధించింది. దీంతో అధికారికంగా వాటి ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. దీనిని సొమ్ము చేసుకునేందుకు కొన్ని అంతర్రాష్ట్ర ముఠాలు పుట్టుకొచ్చాయి. బీదర్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి ప్రసూతి మహిళలకు వాడే వాటినే పశువులకు వినియోగించేందుకు అనువుగా తయారు చేసి నగరంలోని బాబానగర్‌కు చెందిన ఇంతియాజ్ ద్వారా వాటిని మార్కెటింగ్ చేస్తున్నాడు. ఇంతియాజ్ ఆర్డర్ మేరకు ఈ ఇంజెక్షన్లు తయారు చేసే ఇస్మాయిల్ వాటిని తీసుకుని సిటీకి వచ్చేవాడు. ఇంతియాజ్ సూచన మేరకు డెయిరీ యజమానులకు అప్పగించి వెళ్లేవాడు. ఆర్థిక లావాదేవీలన్నీ ఇద్దరూ కలిసి పర్యవేక్షిస్తుంటారు. గేదెలు అధికంగా పాలు ఇవ్వడానికి ఈ ఇంజెక్షన్లు ఇస్తున్నారని, నగరంతో పాటు శివార్లలోని డెయిరీ ఫామ్స్‌లో దాదాపు 70 శాతం వీటిని వినియోగిస్తున్నట్లు అనుమానిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. గేదెలకు ఈ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా తీసిన పాలు, ఆ పాల ఉత్పత్తులు తీసుకుంటే అనేక అనర్థాలు కలుగుతాయన్నారు. ఈ దందాపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు నరేందర్ తదితరులతో కూడిన బృందం రంగంలోకి దిగింది. పాతబస్తీలో మాటువేసి ఇస్మాయిల్‌ను పట్టుకుని ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న మరో నిందితుడు ఇంతియాజ్ కోసం గాలిస్తోంది. అనర్థాలూ ఎన్నో... ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల వాడకంతో అనేక అనర్థాలు ఉన్నాయని పశు వైద్యులు చెబుతున్నారు. వీటిని వినియోగిస్తే గేదెలకే కాకుండా ఆ పాలను వినియోగించే మనుషులకూ ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఇంజెక్షన్లను అత్యధికంగా గేదెలకే ఇస్తుంటారు. సాధారణంగా గేదెలు పాలు ఇవ్వాలంటే వాటి పొదుగును దూడలు తాకి పాలు తాగాల్సిందే. అప్పుడే ఆ గేదెల మెదడులో ఉండే పిట్యుటరీ గ్రంథి ప్రేరేపితమై హార్మోన్స్‌ను విడుదల చేస్తుంది. వీటి కారణంగానే గేదె పాలు ఇవ్వడం జరుగుతుంది. దూడలు లేని పశువు నుంచి సామర్థ్యానికి మించి పాలను పిండాలని భావించే యజమానులే ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను వాడతారు. ప్రస్తుతం వీటిపై నిషేధం ఉండటంతో ప్రసూతి సమయంలో మనుషులకు వాడే వాటినే గేదెలకూ వినియోగిస్తున్నారు. ఒక్కో గేదెకు రోజుకు 8 ఎంఎల్ నుంచి 20 ఎమ్ఎల్ వరకు ఇంజెక్ట్ చేస్తుంటారు. ఆ తర్వాత గేదె ఇచ్చే పాలలోనూ ఆక్సిటోసిన్ ఆనవాళ్ళు ఉంటాయి. ఈ పాలు తాగిన మనుషులూ అనేక రుగ్మతలకు లోనవటంతో పాటు రోగాల బారినపడతారు. చిన్నారులకు ఈ పాలను కొన్నాళ్ళ పాటు తాగిస్తే వారికి ఫిట్స్ వంటి నరాల సంబంధ వ్యాధులు వస్తాయి. మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ పాలు వాడిన వారిలో అసహజమైన ఎదుగుదల కనిపిస్తుంది. వీరు త్వరగా వృద్ధులుగా మారతారు. నెలలకు నిండక ముందే ప్రసవాలు, చిన్నారులకు బుద్ధిమాంద్యం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం తదితర ఇబ్బందులు ఎదురవుతాయి. పాలల్లో ఉన్న ఆక్సిటోసిన్ ఆనవాళ్లను కేవలం ప్రయోగశాలల్లో మాత్రమే గుర్తించగలుగుతామని నిపుణులు పేర్కొన్నారు. ‘కుటీర పరిశ్రమగా’ తయారీ ఒకప్పుడు పశువులకు వినియోగించే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను ప్రభుత్వం 2003లో నిషేధించింది. అప్పటి నుంచి పలువురు అక్రమంగా వీటిని సేకరించి విక్రయిస్తున్నారు. ఈ ముఠాలు ప్రసూతి సమయంలో మహిళలకు వాడే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసి 300 ఎంఎల్ ఆక్సిటోసిన్‌లో 1200 ఎంఎల్ ఫినాయిల్, కేజీ గళ్ల ఉప్పు, 160 లీటర్ల నీరు కలిసి కృత్రిమ ఆక్సిటోసిన్ ద్రావణం తయారు చేస్తున్నారు. దీనిని 140, 180, 200 ఎంఎల్ బాటిల్స్‌లో ప్యాక్ చేసి ఇంజెక్షన్ల రూపంలో విక్రయిస్తున్నారు. 160 లీటర్ల ద్రావణం తయారీకి రూ.4 వేల వరకు ఖర్చవుతుండగా.. దానిని ఇంజెక్షన్లుగా మార్చి ఏకంగా రూ.90 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని డెయిరీ ఫామ్స్ హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ల నుంచి గేదెల్ని ఖరీదు చేసుకుని వస్తున్నాయి. అక్కడి ఫామ్స్‌లో ఏళ్ల పాటు వినియోగించి, అవసానదశకు చేరిన వాటిని తక్కువ ధరకు తీసుకువస్తున్నారు. వీటికి దూడలు కూడా ఉండకపోవడంతో పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. వీటి నుంచి పాలు తీసేముందు 4 ఎంఎల్ చొప్పున ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తూ భారీగా పాలు పిండుతున్నారు. ఈ పంథాలో పాలిచ్చిన గేదెలు గరిష్టంగా ఏడాదికే వట్టిపోయి స్లాటర్ హౌస్‌లకు చేరాల్సి వస్తోంది. -
విద్యుత్ సబ్స్టేషన్ల సామర్థ్యం పెంపు
విశాఖపట్నం : విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచాలని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఎం.వి.శేషగిరిబాబు ఆదేశించారు. గురుద్వార వద్ద గల సంస్థ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్‌కో అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లోడ్ పెరుగుతున్న దృష్ట్యా సబ్స్టేషన్ల సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. డెయిరీఫారం, పోర్టు 132 కేవీ సబ్స్టేషన్ల సామర్ధ్యం పెంచాలన్నారు. డెయిరీఫారం సబ్‌స్టేషన్‌లో గల 31.5 ఎంవీఏ సామర్థ్యాన్ని 50 ఎంవీఏకి పెంచాలన్నారు. పోర్టు సబ్‌స్టేషన్‌లోని 16 ఎంవీఏ సామర్థ్యాన్ని 31.5కి పెంచాలన్నారు. నక్కవానిపాలెం-సింహాచలం మధ్యగల విద్యుత్ లైన్ సామర్థ్యం తక్కువగా ఉన్నందున కండక్టర్ సైజ్ మార్చాలని ఆదేశించారు. ఇక బొబ్బిలిలోని 222 కేవీ సబ్‌స్టేషన్ పనుల ఆలస్యం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు లోడ్ విడుదలలో జాప్యం కలుగుతోందన్నారు. ట్రాన్స్‌కో డెరైక్టర్ (ప్రాజెక్ట్స్) సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విజయనగరం జిల్లా గరివిడి మండలం మరడాం గ్రామంలో 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ మండలికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజినీర్ సీతారామాచార్యులు, ఈపీడీసీఎల్ డెరైక్టర్ (ఆపరేషన్స్) పి.రామ్మోహన్, చీఫ్ జనరల్ మేనేజర్ (ఓఎన్సిఎస్) కె.ఎస్.ఎన్.మూరి పాల్గొన్నారు.