Prostitute
-
చిన్నతనంలోనే వేశ్యగా మారిన యువతి బయోపిక్.. త్వరలో ఓటీటీలోకి..
చెన్నై సినిమా: 'మాలై నేర మల్లిపూ' చిత్రం ఫస్ట్ లుక్ సినీ వర్గాలను ఆకట్టుకుంటోంది. 21 ఏళ్ల యువ కుడు సంజయ్ నారాయణన్ మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ఇది. కొత్త నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని యాన్ ఎవిరి.ఫేమ్ (మ్యాటర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై) విజయలక్ష్మి నారాయణన్ నిర్మించారు. హృతిక్ శక్తివేల్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ఒక ప్రము ఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోందని నిర్మాత తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఓ వ్యభిచార యువతి బయోపిక్‌గా పేర్కొన్నారు. చిన్న వయసులోనే వ్యభిచార కూపంలోకి నెట్టబడిన లక్ష్మీ అనే యువతి జీవితంలో జరిగిన ఘటనలు, ఎదుర్కొన్న సమస్యలను, చీకటి కోణాలను ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేయగా పరిశ్రమ వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. చదవండి: నా సినిమాకు నాకే టికెట్లు దొరకలేదు: యంగ్ హీరో -
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: ఆ మహిళలవి ప్రాణాలు కావా!!
‘పేద, దిక్కు మొక్కు లేని స్త్రీల హత్యలు పేపర్లలో వస్తుంటాయి. ఆ తర్వాత ఆ కేసులు ఏమయ్యాయో మీరెప్పుడైనా పట్టించుకున్నారా?’ అని అడుగుతుంది రిజులా దాస్. కోల్‌కతాలోని అతి పెద్ద రెడ్‌లైట్ ఏరియా ‘సోనాగాచి’లో ఎవరికీ పట్టని వేశ్యల హత్యల నేపథ్యంతో ఆమె రాసిన ‘ఏ డెత్ ఇన్ సోనాగాచి’ నవల విశేషంగా పాఠకాదరణ పొందింది. వెబ్ సిరీస్‌గా కూడా రానుంది. వేశ్యల జీవితాలపై ఎన్ని నవలలు వచ్చినా వారి గురించి సంపూర్ణంగా తెలిసే అవకాశం లేదు అంటున్న రిజులా ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో తన పుస్తకానికై చేసిన పరిశోధన గురించి మాట్లాడింది. ‘మురికివాడల్లో ఉన్న స్త్రీలు, భవన నిర్మాణ రంగంలో ఉన్న స్త్రీలు, కూలి పని చేసే మహిళలు, వేశ్యలు, ఇంకా ఇలాంటి మార్జినలైజ్డ్ సెక్షన్లలో ఉన్న ఆడవాళ్లలో ఎవరైనా హత్యకు గురైతే ఈ వార్త పేపర్లలో వస్తుంటుంది. మనం చదువుతాం. ఆ తర్వాత సౌకర్యంగా మర్చిపోతాం. ఆ హత్యలు చేసింది ఎవరో వారికి శిక్ష పడిందో లేదో పట్టించుకోము. మన సమాజంలో కొందరి ప్రాణాలకే విలువ. ఆ ప్రాణాలు తీసింది ఎవరో మనకు తెలియాలి. కాని ఇలాంటి స్త్రీలు మరణిస్తే ఎవరికీ పట్టదు. పోలీసులకూ పట్టదు. వారివి ప్రాణాలు కాదా? వారు చంపదగ్గ వారే అనుకుంటున్నామా మనం’ అంటుంది రిజులా దాస్. ఆమె రాసిన తొలి నవల ‘ఏ డెత్ ఇన్ సోనాగాచి’ గత సంవత్సరం విడుదలైంది. త్వరలో అమెరికన్ ఎడిషన్ రానుంది. ఇప్పటికే వెబ్ సిరీస్‌కు కూడా తీసుకున్నారు. ‘మీరు వెంటనే ఇదేదో మర్డర్ మిస్టరీ అని చదవడానికి బయలుదేరకండి. నా నవల యాంటీ మర్డర్ మిస్టరీ... యాంటీ థ్రిల్లర్. సమాజంలో ఒక అనామక స్త్రీ చనిపోతే ఆ కేసు తేలకపోవడం గురించి మీకెలా చింత లేదో నా నవలలో హత్యకు గురైన వేశ్య కేసు తేలాలన్న చింత నాకూ లేదు. సమాజంలో ఏ ధోరణి ఉందో ఆ ధోరణే నా నవలలో ఉంటుంది’ అంటుందామె. కోల్‌కతాకు చెందిన రిజులా దాస్ చాలా ఏళ్లుగా న్యూజిలాండ్‌లో ఉంటోంది. ఆమె అక్కడ క్రియేటివ్ ఫిక్షన్లో పిహెచ్డి చేసింది. తన తొలి నవల రాయడానికి దక్షిణ ఏసియాలోనే అతి పెద్ద రెడ్‌లైట్ ఏరియా అయిన ‘సోనాగాచి’ (కోల్‌కతా) గురించి ఆమె దాదాపు నాలుగైదేళ్లు పరిశోధన చేసింది. మరో రెండేళ్లు రాసింది. అంటే ఈ మొత్తం పనికి ఆమె ఏడేళ్లు వెచ్చించింది. ‘దీనిని రాసే ముందు నేను ఇది రాయడానికి అర్హురాలినా కాదా చూసుకున్నాను. ఎందుకంటే నాకు ఆ జీవన నేపథ్యం లేదు. ఆ కష్టాలూ తెలియదు. కాని వారు అలా ఉండటానికి నేనూ నా నగరం కోల్‌కతా నా సమాజం కారణమే కదా అనుకున్నాను. అందుకే సోనాగాచి స్త్రీలను విడిగా కాకుండా కోల్‌కతాలో భాగంగా తీసుకున్నాను. నగరం ప్రమేయం లేకుండా సోనాగాచి లేదు’ అంటుందామె. సోనాగాచిలో దాదాపు 50 వేల మంది వేశ్యలు ఉంటారు. వీరిని ఆధారం చేసుకుని ‘మేడమ్‌లు’, ‘బాబూలు’, పింప్స్... వీళ్లతో కుమ్మక్కు అయిన పోలీసులు... వేశ్యలను బాగు చేస్తాం అని తిరిగే సోషల్ వర్కర్లు... ఆధ్యాత్మిక మార్గం పట్టిస్తాం అని చెప్పే భక్త శిఖామణులు... ఇదంతా పెద్ద వ్యవస్థ. ‘అసలు సోనాగాచిలో ఉన్న సెక్స్‌వర్కర్లు తమను రక్షించి ఈ మురికి కూపం నుంచి బయటపడేయమని మనల్ని అడుగుతారా... లేదా వారి మానాన వారిని వదిలేయమంటారా అనేది మనం ఎప్పటికీ కనిపెట్టలేం’ అంటుంది రిజులా దాస్. ఆమె ఈ నవలను ‘లలీ’ అనే వేశ్య పాత్ర ద్వారా చెబుతుంది. నాసిరకం సరసకథలు రాసే రచయిత ఆమె ప్రియుడు. సోనాగాచిలో ఒక వేశ్య దారుణంగా హత్యకు గురైతే వ్యవస్థ అంతా ఇది మామూలే అని ఊరుకుంటుంది. కాని రిజులా ఏం చెబుతుందంటే అలా జరిగిన హత్యలు అంతటితో ఆగవు... అవి సోనాగాచిలో ఒక దానితో ఒకటిగా కలిసి అనేక స్త్రీ వ్యతిరేక ఘటనలకు కారణం అవుతాయి అని. ‘ఈ నవల రాసేప్పుడే డిమానిటైజేషన్ వచ్చింది. సెక్స్వర్కర్లది నోట్ల ఆధారిత వ్యవస్థ. ‘మేము ఎయిడ్స్ విజృంభించినప్పుడు తట్టుకుని నిలబడ్డాం కాని డిమానిటైజేషన్లో మాత్రం పూర్తిగా పతనమయ్యాం. అంతటి ఘోరమైన దెబ్బ మా జీవితాల్లో ఎరగం’ అని వారు అన్నారు. ఈ ముఖ్య పరిణామాన్ని నా నవలలో పెట్టడానికి మళ్లీ రీరైట్ చేశాను’ అంటుంది రిజులా. సెక్స్‌వర్కర్ల దగ్గర ఉన్న చాయిస్ ఏమిటి? సోనాగాచి విడిచిపెట్టి వెళ్లాలి అంటే వాళ్లకు పచ్చళ్లు పెట్టడం నేర్పించి పంపించేస్తే చాలా? లేదంటే సోనాగాచిలోనే ఉండిపోవాలి అంటే ఈ హింసాత్మకమైన బతుకును ఇలాగే బతకాలా? వారికి ఉన్న చాయిస్ ఏమిటి? సమాజం ఇచ్చే చాయిస్ ఏమిటి? ఈ ప్రశ్నలను లేవనెత్తుతూ ఈ నవల ముగుస్తుంది. ఇంగ్లిష్, బెంగాలీలలో రాసే రిజులా బాల్యంలో రష్యన్ సాహిత్యంతో ప్రభావితమైంది. రష్యన్లో కుప్రిన్ రాసిన ‘యమకూపం’ వేశ్యల మీద వచ్చిన గొప్ప నవల. ఇప్పుడు ఈమె రాసింది ఈ దేశ వేశ్యావాటికలను అర్థం చేయించే సమర్థమైన నవల. ఈ రెండూ మీరు చదవతగ్గవే. సోనాగాచిలో దాదాపు 50 వేల మంది వేశ్యలు ఉంటారు. వీరిని ఆధారం చేసుకుని ‘మేడమ్‌లు’, ‘బాబూలు’, పింప్స్... వీళ్లతో కుమ్మక్కు అయిన పోలీసులు... వేశ్యలను బాగుచేస్తాం అని తిరిగే సోషల్ వర్కర్లు... ఆధ్యాత్మిక మార్గం పట్టిస్తాం అని చెప్పే భక్త శిఖామణులు... ఇదంతా పెద్ద వ్యవస్థ. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
డెయిరీ ముసుగులో వ్యభిచారం.. ఇంట్లోనే దందా
భోపాల్: మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్ రాకెట్ దందా బయటపడింది. గ్వాలియర్‌లోని మురార్ ప్రాంతంలోని జాడేరు డామ్ సమీపంలో ఉన్న ప్రీతమ్ మనోహర్ అనే వ్యక్తి ఇంట్లో.. వ్యభిచారం జరుగుందనే సమాచారంతో పోలీసులు నిన్నరాత్రి (గురువారం) దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలతో పాటు 10 మంది పురుషులను పోలీసులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ప్రీతమ్ మనోహర్ ఇంట్లో పాల వ్యాపారం ముసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు చాలా మంది వారి ఇంటికి వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. రెండెళ్లుగా ఈ రాకెట్ నడుస్తోందని తెలిపారు. ఇంటి యజమాని భార్య.. విటుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విటులను, మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తరలించామని మురార్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ శైలేంద్ర భార్గవ్ తెలిపారు. చదవండి: ముగ్గురు స్నేహితురాళ్ల ఆత్మహత్య? -
వ్యభిచారం నిర్వహిస్తున్న ఇళ్లపై దాడి: పలువురి అరెస్టు
సాక్షి,పంజగుట్ట( హైదరాబాద్): గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, సీసీఎస్, పంజగుట్ట పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... కర్నాటకకు చెందిన రాజేష్ నాయక్ (34) నగరంలో ఫలక్నామాలో ఉంటున్నాడు. ఇతను ఎర్రమంజిల్, హిల్‌టాప్ కాలనీలో ఓ భవనంలో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడని సీసీఎస్ పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. మంగళవారం రాత్రి దాడి చేసి నిర్వాహకుడు రాజేష్నాయక్తో పాటు ఇద్దరు కస్టమర్లు, ఇద్దరు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ నాయక్‌ను విచారించగా శ్రీనగర్‌కాలనీలో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఈస్ట్‌గోదావరి జిల్లాకు చెందిన కె.రాము(28) కూడా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని దానిపై కూడా దాడి చేసి నిర్వాహకుడు రాము, ఒక సెక్స్ వర్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Kukatpally:వివాహేతర సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య -
'వేశ్య'గా యాంకర్ అనసూయ!
టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంతో పాటు అభినయం ఈ బ్యూటీ సొంతం. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెరను మెప్పిస్తున్న అనసూయ వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తోంది. అక్కడ విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్‌ని మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో ఆమె క్రేజీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజాగా హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న ఓ సినిమాలో అనసూయ నటించనుంది. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని మూవీ టీం వెల్లడించింది. మారుతి పదవ సినిమాగా రాబోతున్న ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రాశి ఖన్నా, ఈషా రెబ్బా కథానాయుకలుగా నటించున్నట్లు సమాచారం. చదవండి : (అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..!) (వైరల్ అవుతున్న దీపికా పదుకొనె డ్యాన్స్ వీడియో) -
నరక కూపం.. వేశ్యావాటికల్లో యువతులు
సాక్షి, హైదరాబాద్ : బంగ్లాదేశ్‌లో బతుకుదెరువు లేక చాలా పేద కుటుంబాలు అక్రమంగా భారత్‌కు వలస వస్తుంటాయి. అయితే ఉపాధి పేరిట కొందరు బంగ్లాదేశ్ యువతులకు డబ్బు ఎరవేసి అక్రమంగా సరిహద్దులు దాటించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. ఏజెంట్ల మాటలు నమ్మి వచ్చిన వారిని నరకకూపంలోకి నెడుతున్నారు. ఇక్కడికి వచ్చాక తిరిగి వెళ్లలేక.. కుటుంబ కష్టాలను గుర్తుకు తెచ్చుకుని, ఇష్టం లేకున్నా మనసు చంపు కొని నిర్వాహకులు ఎలా చెబితే అలా చేస్తున్నారా యువతులు. చదువు రాకపోవడం, బెంగాలీ తప్ప మరో భాష తెలియకపోవడంతో ఎవరితోనూ తమ బాధలు చెప్పుకోలేని నిస్సహాయ స్థితి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసిన హైటెక్ సెక్స్ రాకెట్ బంగ్లాదేశ్ యువతుల బాధలకు అద్దం పడుతోంది. 19–25 ఏళ్లలోపు వారే టార్గెట్ బంగ్లాదేశ్‌లో పేదరికం, నిరక్షరాస్యత ప్రధానంగా ప్రజలను పీడిస్తున్న అంశాలు. ఈ నేపథ్యంలో భారత్‌కు అక్రమంగా వచ్చిన కొందరు డబ్బు సంపాదనకు వక్రమార్గం పట్టారు. ‘భారత్‌లోని వేశ్యావాటికల్లో యువతులను ఉంచితే ఎవరికీ అనుమానం రాదు, పైగా తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించొచ్చు’అన్న దురాశతో ఇదే పనిని వృత్తిగా ఎంచుకున్నారు. బంగ్లాదేశ్‌లోని వీరి ఏజెంట్లు తమకు తెలిసిన మురికివాడల్లోని పేదలను సంప్రదిస్తారు. భారత్‌లో బాగా స్థితిమంతుల ఇళ్లు, హోటళ్లలో పనిచేసే అవకాశాలు ఉన్నాయంటూ అమ్మాయిలను పంపాలని కోరతారు. చిన్నపిల్లలైతే ఇబ్బందులు వస్తాయన్న అనుమానంతో 19 నుంచి 25 ఏళ్ల యువతులను ఎంపిక చేసుకుంటారు. పాస్‌పోర్ట్, వీసాలు లేకుండానే వీరిని అక్రమమార్గాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లోని వేశ్యా గృహాల్లో ఉంచుతారు. త్వరలో ఎన్ఐఏకు కేసు బదిలీ! అబ్దుల్లాపూర్‌మెట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ బాటసింగారం సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. వారి చెరలో మగ్గుతున్న ఇద్దరు యువతులను రక్షించారు. ఈ రాకెట్ ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన లిటన్ సర్కార్‌ది బంగ్లాదేశ్. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కావడంతో ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు త్వరలో బదిలీ కానుంది. యాప్‌లతో దందా లాక్డౌన్ కాలంలో వ్యాపారం తగ్గిందని చాలామంది నిర్వాహకులు అక్రమమార్గంలో తీసుకొచ్చిన బంగ్లాదేశీ యువతులను తిరిగి స్వదేశానికి పంపించేస్తున్నారు. అయితే కడుబీదరికంలో ఉన్న కొందరు మాత్రం ఇక్కడే ఉండిపోతున్నారు. డేటింగ్ యాప్స్‌లో ఈ యువతుల చిత్రాలు ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు. గూగుల్‌పే, ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేస్తే.. వారి వద్దకు యువతులను పంపడం లేదా విటులనే రప్పించుకోవడం పనిగా పెట్టుకున్నారు. -
వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రి అరెస్టు!
సాక్షి, చిలకలూరిపేట: పెంపుడు కుమార్తెను వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రిని పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అర్బన్ సీఐ వి.సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరులో నివాసం ఉండే ప్రత్తిపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మిట్టనోసుల ప్రభుదాసు ఎలియాస్ వీరారావు ఒక కుమార్తెను పెంచుకున్నాడు. ఆమె చేత 13 సంవత్సరాల వయస్సు నుంచే బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. ఆమెకు వివాహం జరిగాక కూడా వ్యభిచారం చేయిస్తుండటంతో భర్త వదలివేశాడు. దీంతో ఆమె చిలకలూరిపేట పట్టణంలో తన కుమార్తెతో కలసి జీవనం కొనసాగిస్తోంది. ఇది తెలిసి వీరారావు తిరిగి ఆమెను వ్యభిచారం చేయాల్సిందిగా కొట్టి గాయపరచటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
వేశ్య దగ్గరికి వెళ్లి మంచి పని చేశాడు
అక్కడికి వెళ్లాలనుకోవడం తప్పే.. కానీ వెళ్లి మంచి పని చేశాడు సుఖం కోసం వెళ్లి.. ఆమె బాధను చెరిపేశాడు మోసపోయి వ్యభిచార కూపంలో చిక్కుకున్న ఆమెకు విముక్తిని కల్పించాడు సాక్షి, న్యూఢిల్లీ : ఏ స్త్రీ వ్యభిచారం చేయాలనుకోదు. అలాగే వేశ్య వృత్తి కొనసాగించాలని కూడా ఎవరు అనుకోరు. ఇష్టపడి ఈ వృత్తిలోకి వచ్చేవాళ్లు చాలా అరుదనే చెప్పాలి. స్త్రీలను బలవంతంగా ఎత్తుకొచ్చి ఈ వృత్తిలోకి తోస్తారు లేదా ఏ తోడు లేక జీవనం కోసం ఏమి చేయాలో తెలియక ఇందులోకి వస్తారు. ప్రతి వేశ్య వెనక ఒక చీకటి బాధాకరమైన కథ తప్పక ఉంటుంది. అయితే వారి వద్దకు వెళ్లే కస్టమర్లు సుఖాన్ని కోరుకుంటారే తప్ప వారి బాధల్ని పట్టించుకోరు. కానీ ఓ వ్యక్తి ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. ఆ స్త్రీ వేశ్యగా మారడానికి గల కారణాలు తెలుసుకొని చలించిపోయాడు. ఎలాగైనా ఆమెను ఆ ఊబినుంచి రక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆమె వద్ద నుంచి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని వారికి సమాచారం ఇచ్చారు. చివరకు ఆమెకు విముక్తి కల్పించాడు. ఇదంతా దేశ రాజధాని ఢిల్లీలోని జీపీరోడ్‌లో జరిగింది. మోసపోయి వేశ్యగా.. కోల్‌కతాకు చెందిన ఓ 27 ఏళ్ల మహిళ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదు. మరో మంచి ఉద్యోగం కోసం ఆమె వెతుకుతోంది. అంతలోనే ఆమెకు పరిచయమైన ఓ మహిళ ఢిల్లీలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మపలికింది. ఆమె మాటలు నమ్మి జూన్ 8న ఢిల్లీకి వెళ్లింది. ఉద్యోగం ఇప్పిస్తుందనే ఆశతో ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. అక్కడికి వెళ్లాక తెలిసింది సదరు మహిళ ఆమెను మోసం చేసిందని. ఓ వ్యభిచార ముఠా చేతికి చిక్కిన ఆమె.. రెండు నెలలపాటు నరకం చూసింది. ఆమె దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్ తీసుకొని బందించారు. చిత్రహింసలకు గురిచేశారు. వచ్చిన కస్టమర్లను సుఖపెట్టకుంటే హింసించేవారు. ఇక తన బతుకు ఇంతే అనుకొని అలా శవంగా జీవిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఆమె వద్దకు కోల్‌కతా కస్టమర్ వచ్చాడు. అందరిలాగే అతను ఆమె సుఖాన్ని కోరుకోకుండా బాధను పంచుకున్నాడు. ఆమె వేశ్యగా మారడానికి గల కారణాలు తెలుసుకొని చలించిపోయాడు. ఆమె సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కస్టమర్‌గా వెళ్లిన సోదరుడు అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో మహిళ సోదరుడు ఢిల్లీకి వెళ్లి అతన్ని కలిశాడు. వివరాలు తెలుసుకొని... నిర్థారించుకోవడానికి కస్టమర్‌గా వేశ్య గృహానికి వెళ్లాడు. అక్కడ తన సోదరిని చూసి చలించిపోయాడు. బయటకు వచ్చి ఢిల్లీ మహిళా కమిషన్‌కు సమాచారం ఇచ్చాడు. కేసు ఫిర్యాదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు పథకం ప్రకారం దాడి చేసి వ్యభిచార ముఠాను అరెస్ట్ చేశారు. బందీగా ఉన్న మహిళకు విముక్తి కల్పించారు. ఉద్యోగం పేరిట మోసం చేసిన మహిళపై కేసు నమోదు చేశారు. చేసింది తప్పే అయినా ఆ కస్టమర్ ఓ మహిళను రక్షించి మంచి పని చేశాడు. -
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ విదేశీ యువతి
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఉన్న డౌన్‌టౌన్ హోటల్‌పై బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఓ విదేశీ యువతితో పాటు పంజాబ్‌కు చెందిన మరో యువతి ఇక్కడ వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కారు. వీరిని పోలీసులు శనివారం పునరావాస కేంద్రానికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే... సైఫాబాద్ సచివాలయం ఎదురుగా ఉన్న అమృతాక్యాజిల్ హోటల్లో సాయి అలియాస్ శర్మ అనే వ్యక్తి రెండు గదులను అద్దెకు తీసుకొని విదేశాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. కొంత మంది విటులు ఈ హోటల్‌కు కాకుండా తాము కోరుకున్న హోటల్‌కు యువతులను పంపించాలని ఒప్పందం కుదర్చుకుంటే ఆ మేరకు ఎక్కడికి పంపించమంటే అక్కడికి పంపిస్తూ సహాయకుడిగా రాజేష్‌కుమార్ సాహును నియమించుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఓ విటుడు బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ది డౌన్‌టౌన్ హోటల్లో గదిని బుక్ చేసుకొని అక్కడికి ఉజ్బకిస్తాన్ దేశానికి చెందిన ఓ యువతిని రప్పించుకున్నాడు. ఆమెతో పాటు పంజాబ్‌కు చెందిన మరో యువతిని కూడా ఒప్పందంలో భాగంగా పంపించాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌పై దాడి చేసి ఉజ్బకిస్తాన్‌కు చెందిన అజీజాతో పాటు ఖుషీపాటక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన వ్యభిచార నిర్వాహకుడు సాయి పరారీలో ఉండగా ఆయన అనుచరుడు రాజేష్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. యువతులను సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. ది టౌన్టౌన్ హోటల్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ఎస్ఐ బచ్చు శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దగా పడ్డ బతుకులు!
బతుకు తెరువు పేరుతో మోసం ఉపాధి కల్పిస్తామంటూ వ్యభిచారకూపంలోకి నెట్టేస్తున్న ట్రాఫికర్లు పునరావాసం పేరుతో వెనక్కు రప్పించుకుని ఉపాధి చూపని ప్రభుత్వం ట్రాఫికర్లకు, ప్రభుత్వానికి తేడాలేదంటున్న బాధితులు ఒకరికి వశమై... మరొకరికి పండై.. ఎపుడూ ఎడారై... ఎందరికో ఒయాసిస్సై... తనువంతా పుండై... తాను శవమై... అంటూ అభ్యుదయ కవి కలం నుంచి జారివాలిన ఈ పదాలు ఓ వేశ్య జీవితానికి అద్దం పడుతున్నాయి. నిత్యమూ కరువు కాటకాలతో విలవిల్లాడుతున్న అనంతపురం జిల్లాలోని యువతులకు గాలం వేసిన కొందరు ఉపాధి పేరుతో వారిని ముంబై, కొల్కత్తా... తదితర మహానగరాలకు తరలించి, బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టేశారు. అక్కడ ఎంతో దయనీయ జీవితాన్ని గడిపిన వారికి పునరావాసం కల్పిస్తామంటూ నమ్మబలికి వెనక్కు పిలుచుకువచ్చిన ప్రభుత్వం... తర్వాత తిరిగి వారి గురించి పట్టించుకోవడం లేదు. బతుకు తెరువు లేక.. సమాజంలో గౌరవం లేక వారి పరిస్థితి మరింత దిగజారింది. ఉపాధి పేరుతో తమను వ్యభిచార కూపంలోకి నెట్టినవాడికి, జీవనోపాధుల పేరుతో దగా చేసిన ప్రభుత్వానికి తేడా ఏముందంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. – కదిరి అర్బన్ కరువు... అనంతపురం జిల్లా ఆర్థిక స్థితిని పూర్తిగా దిగజార్చిన ఈ మహమ్మారి దెబ్బకు నిరుపేదలు శలభల్లా మాడిపోతున్నారు. ఉపాధి... వలసల పేరుతో బతుకులు బుగ్గిపాలు చేసుకుంటున్నారు. పేదల సంక్షేమమే ద్యేయంగా హామీలు గుప్పిస్తూ అధికారంలోకి వచ్చిన పాలకులు... తర్వాత అదే పేదల సంక్షేమానికి తిలోదకాలిచ్చేస్తుండడంతో పేదల బతుకులు మరింత దుర్భరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బయట రాష్ట్రాలకు పొట్టకూటి కోసం వెళ్లిన పురుషుల పరిస్థితి కొద్దోగొప్పో మంచిగానే ఉన్నా... మహిళల పరిస్థితి మాత్రం దారుణంగా మారింది. ట్రాఫికర్ల మాయాజాలం జిల్లాలోనే కదిరి ప్రాంతంలో కరువు ఛాయలు ఎక్కువ. కుటుంబ పోషణ కోసం ఈ ప్రాంత నిరుపేదలు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. ఇలాంటి తరుణంలోనే అమాయక గ్రామీణుల జీవితాలను అవకాశంగా తీసుకున్న కొందరు చెలరేగిపోయారు. పరాయి రాష్ట్రంలో పెద్దల ఇళ్లలో పాచి పనికి కుదిరిస్తామంంటూ యువతులు, మహిళలకు ఆశ చూపారు. వారి మాటలు నమ్మి వెంట వెళితే... పూణే, ఢిల్లీ, ముంబయి... తదితర ప్రాంతాల్లో నిర్ధయగా వ్యభిచార కూపంలో దింపారు. అవసరాలు తీరిన తర్వాత విక్రయించి సొమ్ము చేసుకున్నారు. దేశంలో ఎక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరిగినా అనంతపురం జిల్లా మహిళలు పట్టుబడుతున్నారంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కదిరి ప్రాంతంలోనే 150 మందికి పైగా మహిళలను వ్యభిచార కూపం నుంచి పోలీసులు, అధికారులు కాపాడి, తీసుకువచ్చారు. ఉపాధి లభ్యం కాక... తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న అనంతపురం జిల్లాలో ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశమున్న ఆ దిశగా పెట్టుబడిదారులను ప్రభుత్వం ప్రోత్సహించకపోవడం కూడా జిల్లా వెనుకబాటుతనానికి కారణమైంది. ఇలాంటి తరుణంలో నెలకు రూ. 5వేలు సంపాదించడం సామాన్యులకు గగనమే అయింది. ఈ పరిస్థితులను ట్రాఫికర్లు సొమ్ము చేసుకోసాగారు. నగరాల్లో నెలకు రూ. 25 వేలు సులువుగా సంపాదించవచ్చు అంటూ అమాయక యువతులను నమ్మించి, బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే జిల్లాలోనే ఉపాధి అవకాశలు మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయటి ప్రాంతాలకెళ్లి రూ. 25 వేలు సంపాదించడం కన్నా... స్థానికంగా పరిశ్రమల్లో రూ. 10 వేలు వచ్చిన బాధిత యువతుల జీవితాల్లో వెలుగులు నింపినట్లవుతుంది. ట్రాఫికర్లపై చర్యలు శూన్యం యువతులను వ్యభిచార కూపంలోకి దించుతున్న ట్రాఫికర్లపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగానే ఈ వ్యవస్థ పునరావృతమవుతోంది. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా ఓ పది మందిని వెనక్కు తీసుకువస్తే... రెండు రోజుల వ్యవధిలోనే కొత్తగా 20 మందిని వ్యభిచార రొంపిలోకి ట్రాఫికర్లు దించుతున్నారు. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే ట్రాఫికర్లపై కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. అదే సమయంలో వారి చేతిలో మోసపోయిన యువతులకు మెరుగైన పరిహారంతో పాటు పునరావాసం కల్పించి ఆదుకోవాలని పేర్కొంటున్నారు. రూ. 10 వేలతో సరిపెట్టారు నన్ను 2012లో ముంబయిలోని కామటి పుర నుంచి తీసుకువచ్చారు. ఆ సమయంలో కలెక్టర్ కార్యాలయంలో రూ. 10వేలు ఇచ్చారు. పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం నాకు ఆరోగ్యం బాగాలేదు. నాలుగేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. వితంతువు పెన్షన్ మంజూరు చేయాలంటూ అధికారులకు చాలా సార్లు అర్జీలు ఇచ్చాను. ఇంత వరకూ ఎవరూ పట్టించుకోలేదు. పునరావాసం అంటే ఇదేనా? – కె.తిరుపతిబాయి, కదిరి ప్రాంతం పునరావాసం పేరుతో మోసం చేశారు ఉపాధి చూపిస్తామంటూ బ్రోకర్లు మోసం చేశారు. పునరావాసం కల్పిస్తామంటూ అక్కడి నుంచి ఇక్కడకు తీసుకొచ్చి ప్రభుత్వం కూడా మోసం చేసింది. కుటుంబ పోషణ కోసం చాలా కష్టపడుతున్నాం. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మా గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడి నుంచి తీసుకొచ్చి మీ బతుకు మీరు బతకండి అంటూ వదిలేశారు. – లలిత, కదిరి ప్రాంతం సమాజంలో ఛీత్కారాలు డబ్బు కోసం నానాతిప్పలు పడుతున్నప్పుడు నగరాల్లో మెరుగైన ఉపాధి చూపిస్తామంటూ కొందరు ఆశ చూపారు. నమ్మి వారి వెంట పోతే నట్టేట ముంచారు. ఇంటికి తిరిగొస్తే సమాజంలో ఛీత్కారాలు... ఈసడింపులు. ఏదైనా పనిచేసుకుని బతుకుదామంటే ప్రభుత్వ సాయం లేదు. భర్త చనిపోయాడు. వితంతు పెన్షన్ కావాలని దరఖాస్తు చేసుకుంటే దిక్కులేకుండా పోయింది. ఇలాగైతే ఎలా బతకాలి. – బి.తిరుపతిబాయి, కదిరి ప్రాంతం గట్టి నిఘా ఏర్పాటు చేశాం మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. చదువురాని అమాయక యువతులకు ఎవరైనా బయట ఉపాధి కల్పిస్తామంటే వారి గురించి పూర్తిగా ఆరా తీస్తాం. ఈ విషయంలో మా సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. – వెంకటప్రసాద్, కదిరి రూరల్ మండల ఎస్ఐ -
భార్యతో వ్యభిచారం చేయించి.. చివరికిలా!
ఇస్తాంబుల్: డబ్బుకోసం భార్యతో వ్యభిచారం చేయించిన భర్త చివరికి ఆమె కస్టమర్ చేతిలో హతమైన ఘటన టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అబ్దుల్ తురాన్ (26) డబ్బు సంపాధించడానికి భార్య కాగ్లాను వ్యభిచార వృత్తిలోకి దింపాడు. అంతేకాదు అతనే కస్టమర్లతో మాట్లాడి మరీ.. ఎక్కువ డబ్బు ఇచ్చేవారికి భార్యను అప్పగించేవాడు. ఈ క్రమంలో అదే పట్టణానికి చెందిన సహిన్ అనే ఖరీదైన కస్టమర్ తో కాగ్లా ప్రేమలో పడింది. దీంతో తిరిగి భర్త వద్దకు వెళ్లడం ఇష్టం లేని కాగ్లా సహిన్తోనే ఉండిపోయింది. కాగ్లా చర్యతో కోపోద్రిక్తుడైన తురాన్.. సహిన్ను నిలదీయడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. తురాన్ తన భార్యను వెనక్కి ఇవ్వమని, ఎక్కువ డబ్బు చెల్లించాలని డిమాండ్ చేయడంతో సహిన్ తన స్నేహితులతో కలిసి అతడిని కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. -
'శృంగారంలో పాల్గొనాలి లేదంటే అరెస్ట్ చేస్తా'
ఈ పోలీస్ అధికారి చాలా మంచోడట. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. 'అరెస్ట్ చేయవచ్చు లేదా జరిమానా వేయవచ్చు కానీ నేను మంచోడు కాబట్టి వదిలేస్తా.. అయితే నాతో శృంగారంలో పాల్గొనాలి లేదంటే అరెస్ట్ చేస్తా'.. వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఓ మహిళకు పోలీస్ అధికారి ఇచ్చిన ఆఫర్ ఇది. కారణం ఏదైనా కానీ ఆమె ఒళ్లు అమ్ముకుంటే.. అతను విధుల్లో ఉంటూ పోలీస్ యూనిఫామ్‌ను తాకట్టుపెట్టాడు. ఇంగ్లండ్‌లో జరిగిన ఈ ఘటనలో డేవిడ్ గిబ్సన్ (44) అనే పోలీస్ అధికారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. లివర్‌పూల్ క్రౌన్ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. పోలీసు యూనిఫామ్‌లో ఉంటూ తన పట్ల దారుణంగా వ్యవహరించిన తీరును బాధితురాలు వెల్లడించింది. కోర్టులో ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం.. వెస్ట్ డెర్బీలోని ఈటన్ రోడ్డు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్ గిబ్సన్ 2014, నవంబర్ 6న నైట్ డ్యూటీలో ఉన్నాడు. స్టేషన్లో ఎవరికీ చెప్పకుండా టూబ్రూక్లో షీల్ రోడ్ ఏరియాలో తన వాహనాన్ని పార్క్ చేశాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఈ ప్రాంతానికి సెక్స్ వర్కర్లు వస్తుంటారు. ఆ సమయంలో బాధిత మహిళ గిబ్సన్ కంటపడింది. 'జరిమానా కట్టాలని పోలీస్ అధికారి ఆదేశించగా, తన వద్ద డబ్బులు లేవని బాధిత మహిళ చెప్పింది. తనను వదిలిస్తే ఈ వీధుల్లోకి రానని ఆమె చెప్పింది. అయితే తాను మంచివాడినని, అరెస్ట్ చేయనని, జరిమానా వేయనని, తన కోసం ఏం చేస్తావని గిబ్సన్ అడిగాడు. గిబ్సన్ ఓ పోలీస్ అధికారిగా తన హోదాను దుర్వినియోగం చేశాడు. తన శారీరక వాంఛ తీర్చుకునేందుకు దుర్భల స్థితిలో ఉన్న ఓ మహిళను అవకాశంగా తీసుకున్నాడు. గిబ్సన్ తన వాహనంలో ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి తన కోరిక తీర్చుకున్నాడు. బాధితురాలిని బ్లాక్మెయిల్ చేశాడు' అని కోర్టులో ప్రాసిక్యూటర్ మరియా మస్సెలిస్ వాదించారు. -
22 గంటల్లో ఆమెను 110 మంది రేప్ చేశారు!
-
22 గంటల్లో ఆమెను 110 మంది రేప్ చేశారు!
ఏథెన్స్: గ్రీకు దేశానికి ఆమె విహారయాత్ర జీవితంలో మరిచిపోలేని 'పీడకల'గా మారింది. 14 ఏళ్ల మేగన్ స్టీఫెన్స్ (పేరు మార్చారు) తన తల్లితో కలిసి 2009లో గ్రీస్ పర్యటనకు వెళ్లింది. కానీ విహారయాత్ర కాస్తా ఆమె పాలిట విషాదయాత్రగా మారింది. జీవితానికి సరిపడ నరకయాతనను మిగిల్చింది. మేగన్‌ను ఆమె ప్రియుడే 'సెక్స్ బానిస'గా అమ్మేశాడు. దీంతో ఆరేళ్లపాటు వేశ్యగా నరకయాతన అనుభవించిన మేగన్ ఎట్టకేలకు తప్పించుకొని బయటపడింది. ఇప్పుడు ఆ నరకయాతన, వ్యభిచార కూపపు అనుభవాలను మారుపేరుతో 'బాట్ అండ్ సోల్డ్'గా పుస్తకరూపంలో ప్రచురించింది. ఒక వ్యభిచారిగా తాను అనుభవించిన హృదయవిదారకమైన దుస్థితిని ఈ పుస్తకంలో మేగన్ వివరించింది. రోజుకు 50 మందితో పడుకునేలా ఆమెపై ఒత్తిడి తెచ్చేవారు. ఒక్కోసారి 22 గంటల్లో 110 మంది ఆమెతో బలవంతంగా శృంగారించేవారు. అక్రమ మానవ రవాణా దుండగులు మేగన్‌ను అనేకసార్లు అమ్మివేశారు. కొన్నిసార్లు వీధుల్లో, మరికొన్ని బ్రోతల్ గృహాల్లో ఆమె పడుపు వృత్తిని చేయాల్సి వచ్చింది. 14 ఏళ్ల వయస్సులో గ్రీకు వచ్చినప్పటి అనుభవాలను మేగన్ ఈ పుస్తకంలో వివరించింది. అప్పుడు తల్లితో కలిసి వచ్చిన ఆమె ఓ గ్రీకు బార్లో జాక్ (22)ను తొలిసారి కలిసింది. అప్పటికే ప్రేమ కోసం తహతహలాడుతున్న మేగన్ అతన్ని తొందరగానే వలచింది. తల్లికి జాక్ నచ్చకపోయినా అతనితో కలిసి ఉండేందుకు అంగీకరించింది. ఎందుకంటే ఆమె బార్ ఓనర్ నికోస్‌తో అప్పట్లో సన్నిహితంగా ఉండేది. విహారయాత్ర ముగిసాక జాక్‌తో గ్రీకులోనే ఉండిపోతానని మేగన్ తల్లిని ఒప్పించింది. తన అధీనంలోకి వచ్చిన తర్వాత టాప్‌లెస్ (అర్థనగ్న) బార్లో నర్తించాల్సిందిగా మేగన్‌ను జాక్ ఒత్తిడి తెచ్చాడు. అందువల్లే వచ్చే డబ్బుతో తన తల్లికి చికిత్స చేయిస్తానని బుకాయించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో చితకబాది బ్రోతల్ హౌస్ కి అమ్మేశాడు. క్రమంగా ఆమె పడుపువృత్తిలోకి నెట్టివేయబడింది. ఆమెతో ఐదు నిమిషాలు గడిపితే ఒక విటుడు 20 జీబీపీ (గ్రీకు కరెన్సీ) ఇచ్చేవాడు. కొన్ని సందర్భాల్లో 22 గంటలపాటు ఏకధాటిగా ఈ వృత్తి కొనసాగేది. దాదాపు 110 మందితో ఆమె శంగారంలో పాల్గొనేలా దారుణాతి దారుణంగా అక్కడ పరిస్థితులు ఉండేవని మేగన్ తన పుస్తకంలో ఆ చీకటి అనుభవాలను గుర్తుచేసుకుంది. ఆ తర్వాత ఎలాగోల బయటపడి తిరిగి బ్రిటన్ వచ్చిన మేగన్ తల్లిని కలుసుకుంది. ఇప్పుడు 25 ఏళ్ల ఆమె ఓ వ్యక్తిని పెళ్లాడి గర్భవతి అయింది. అక్రమ రవాణా బారినపడి నరకయాతన అనుభవిస్తున్న అభాగ్యులైన మహిళలకు చేయూత అందించేందుకు ఓ చారిటీని స్థాపించాలని మేగన్ భావిస్తోంది. -
'ఫస్ట్ టైం వ్యభిచారిగా నటిస్తున్నాను'
న్యూఢిల్లీ: విభిన్న పాత్రలతో మెప్పించడమే కాకుండా ఇటీవల 'చాక్ ఎన్ డస్టర్' చిత్రంలో నెగెటివ్ పాత్రలో నటించి అందరి అసహనానికి గురైన బాలీవుడ్ నటి ప్రియాదత్త ఇప్పుడు అనూహ్య పాత్రతో ముందుకు రానుంది. ఆమె వ్యభిచారి పాత్రలో నటించనుంది. అలా నటించాలని తనకు ఎప్పటి నుంచో ఉందని చెప్పింది. ఇంతవరకు ఆ కోవకు చెందిన పాత్ర తన ముందుకు రాలేదని, తొలిసారి వేశ్యగా నటించడం ఆసక్తిగా అనిపిస్తోందని పేర్కొంది. కోల్ కతాలోని సోనాగచి అనే రెడ్ లైట్ ఏరియాకు చెందిన వ్యభిచారుల పిల్లల నేపథ్యంతో 2004లో 'బోర్న్ ఇన్ టూ బ్రూత్లెస్' అనే డాక్యుమెంటరీ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు అదే చిత్ర నేపథ్యంలో మరో చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి అరూప్ దత్తా దర్శకత్వం వహించనున్నారు. 'నేను అరూప్ దత్తా చిత్రంలో ప్రాస్టిట్యూట్ గా నటిస్తున్నాను. మేం మార్చిలో షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది. కోల్ కతాలోని రెడ్ లైట్ ప్రాంతంలోనే షూటింగ్ జరపనున్నాం. సాప్నా పబ్బి, సీమా బిస్వాస్ నాతోపాటు నటిస్తున్నారు. వ్యభిచారి పాత్ర చాలా కష్టమైనది.. వాస్తవ జీవితానికి సంబంధించినది. అందుకే నాకు కొంత ఆసక్తిగా ఉంది' అంటూ దివ్యాదత్త చెప్పుకొచ్చింది. -
'ఆ పోలీసు నన్ను వ్యభిచారి అన్నాడు'
ముంబయి: ముంబయిలో ఓ మహిళ(35) పోలీసు అధికారిపై కేసు పెట్టింది. అతడు ఆమెను అనరాని మాటలు అన్నాడని, వ్యభిచారివి అంటూ దుర్భాషలాడాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం తాను కారులో వస్తుండగా ఓ పోలీసు అధికారి ఆపేశాడు. అనంతరం ఏదైనా గుర్తింపుకార్డు చూపించమని కోరాడు. ఆ తర్వాత ఆ మాట ఈమాట అంటూ నోటితో చెప్పలేని మాటలు మాట్లాడాడు. ఆమె ఆయన మాటలకు అడ్డుచెప్పేందుకు ప్రయత్నించడంతో 'నువ్వొక వ్యభిచారివే' అంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించాడు. ఈ మేరకు ఫిర్యాదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే ఆ పోలీసు అధికారిని గుర్తించామని, అతడు నిజంగా తప్పుచేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు. -
గూగుల్ ఉద్యోగి చావుకు కారణమైన సెక్స్ వర్కర్ కు జైలు
కాలిఫోర్నియా: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఉద్యోగి చావుకు కారణమైన వేశ్యకు అమెరికా కోర్టు ఆరేళ్లు జైలు శిక్ష విధించింది. ఉద్దేశపూర్వకంగా ఓ వ్యక్తి మరణానికి కారకురాలు అయినందుకు అలిక్స్ కేథరిన్ టిషెల్ మాన్(27) అనే సెక్స్ వర్కర్ ను శాంతాక్రజ్ సుపీరియర్ కోర్టు దోషిగా తేల్చి, శిక్ష విధించింది. గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఫోరెస్ట్ హేయస్స్(51)కు హెరాయిన్ ఇంజక్షన్ ఇచ్చి అతడి చావుకు కారణమైంది. విలాసవంతమైన శాంతాక్రూజ్ ఓడలో 2013, నవంబర్ లో ఆమె ఈ దారుణానికి పాల్పడింది. 2014లో ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసు అధికారి ఒకరు కస్టమర్ లా నటించి వెయ్యి డాలర్లు అధికంగా ఇస్తామని చెప్పి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఫోరెస్ట్ హేయస్స్ కు హెరాయిన్ ఇంజక్షన్ ఇవ్వడమే కాకుండా చివరి క్షణాల్లో అతడికి ఎటువంటి సహాయం చేయలేదని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అత్యవసర వైద్య సేవల కోసం 911 నంబర్ కూడా ఫోన్ చేయలేదని పేర్కొంది. ఆమె చేసిన నేరం సీసీ కెమెరాలో రికార్డయిందని వెల్లడించింది. హత్యానేరంతో పాటు నిషేధిత మాదకద్రవ్యాలు కలిగివుండడం, సాక్ష్యాలు నాశనం చేయడం, వ్యభిచారానికి పాల్పడడం వంటి అభియోగాలు మోపింది. ఈ నేరాలన్నింటికీ కనీసం 15 ఏళ్ల జైలు పడుతుందని భావించారు. అయితే నేరం అంగీకరించి, క్షమాపణ చెప్పడంతో ఆమెకు ఆరేళ్ల శిక్ష పడింది. -
‘వేశ్య, వ్యభిచారం’...
‘వేశ్య, వ్యభిచారం’... సమాజంలో ఈ విషయాలు మాట్లాడటం పెద్ద తప్పుగా, ఆ పదాలు ‘బీప్’ వాడి వినపడనట్లుగా చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. నిజంగా అవి వినకూడని పదాలా! వారి గురించి మాట్లాడటం, వారితో మాట్లాడటం అంత చేయకూడని పనా..? పెద్ద సినిమాల్లో చిన్న సందేశాల గురించి ఏమో కానీ... ‘బీప్’ అనే చిన్న సినిమా ద్వారా చాలా పెద్ద ఆలోచనను మనసుకు హత్తుకునేలా చూపించారు సుదీప్. యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ ‘బీప్’ చిత్రానికి ‘దాసరి షార్ట్ఫిలిమ్’ పోటీల్లో రెండో బహుమతి లభించింది. దీని రూపకర్త సుదీప్ ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు... చెన్నైలో బీటెక్ చేస్తున్నప్పటి నుంచే షార్ట్ఫిలిమ్స్ చేసేవాడిని. ఓ చిత్రానికి కాలేజ్‌లో మంచి పేరు వచ్చింది. అదే నాలో నమ్మకాన్ని పెంచింది. బీటెక్ తర్వాత బ్యాంక్ పీఓగా ఉద్యోగం వచ్చింది. కానీ... ఉద్యోగంలో చేరితే నాకిష్టమైన సినిమాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగమా..? సినిమాలా..? నేను మాత్రం రెండోదానికే ఫిక్సయిపోయా. కానీ ఇంట్లోవాళ్లు, మిత్రులు వద్దంటే వద్దన్నారు. మంచి ఉద్యోగాన్ని వద్దనుకొని భవిష్యత్తుపై భరోసా లేని ఫిల్మ్ ఫీల్డ్‌కు వెళ్లడమేమిటని ప్రశ్నించారు. సక్సెస్ కాకపోతే పిచ్చివాడివి అయిపోతావని ఇంకొంతమంది భయపెట్టారు. కానీ... నేను తీసిన ‘బీప్’కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడందరికీ నా మీద నమ్మకం పెరిగింది. మిత్రుడి ఫేస్బుక్ పోస్ట్‌కు ఇన్స్పైర్ అయ్యి... ఓ యథార్థ సంఘటన ఆధారంగా దీన్ని రూపొందించాం. ‘ఐక్లిక్’ సంస్థ, మిత్రులు సహకరించారు. అంతకుముందు ‘వి’ అనే షార్ట్ ఫిలిం చేశా. అది క్రైం థ్రిల్లర్. షార్ట్ ఫిల్మ్స్ కొనసాగిస్తూనే... భవిష్యత్తులో ఓ మంచి ఫీచర్ ఫిల్మ్ తీయాలన్నదే నా ఆకాంక్ష.