'శృంగారంలో పాల్గొనాలి లేదంటే అరెస్ట్ చేస్తా' | Police officer forced prostitutes to perform sex acts on him or face arrest | Sakshi
Sakshi News home page

'శృంగారంలో పాల్గొనాలి లేదంటే అరెస్ట్ చేస్తా'

Published Wed, Feb 3 2016 11:31 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

'శృంగారంలో పాల్గొనాలి లేదంటే అరెస్ట్ చేస్తా' - Sakshi

'శృంగారంలో పాల్గొనాలి లేదంటే అరెస్ట్ చేస్తా'

ఈ పోలీస్ అధికారి చాలా మంచోడట. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. 'అరెస్ట్ చేయవచ్చు లేదా జరిమానా వేయవచ్చు కానీ నేను మంచోడు కాబట్టి వదిలేస్తా.. అయితే నాతో శృంగారంలో పాల్గొనాలి లేదంటే అరెస్ట్ చేస్తా'.. వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఓ మహిళకు పోలీస్ అధికారి ఇచ్చిన ఆఫర్ ఇది. కారణం ఏదైనా కానీ ఆమె ఒళ్లు అమ్ముకుంటే.. అతను విధుల్లో ఉంటూ పోలీస్ యూనిఫామ్ను తాకట్టుపెట్టాడు. ఇంగ్లండ్లో జరిగిన ఈ ఘటనలో డేవిడ్ గిబ్సన్ (44) అనే పోలీస్ అధికారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. లివర్పూల్ క్రౌన్ కోర్టులో ఈ కేసు విచారణ  సాగుతోంది. పోలీసు యూనిఫామ్లో ఉంటూ తన పట్ల దారుణంగా వ్యవహరించిన తీరును బాధితురాలు వెల్లడించింది.

కోర్టులో ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం.. వెస్ట్ డెర్బీలోని ఈటన్ రోడ్డు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్ గిబ్సన్ 2014, నవంబర్ 6న నైట్ డ్యూటీలో ఉన్నాడు. స్టేషన్లో ఎవరికీ చెప్పకుండా టూబ్రూక్లో షీల్ రోడ్ ఏరియాలో తన వాహనాన్ని పార్క్ చేశాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఈ ప్రాంతానికి సెక్స్ వర్కర్లు వస్తుంటారు. ఆ సమయంలో బాధిత మహిళ గిబ్సన్ కంటపడింది. 'జరిమానా కట్టాలని పోలీస్ అధికారి ఆదేశించగా, తన వద్ద డబ్బులు లేవని బాధిత మహిళ చెప్పింది. తనను వదిలిస్తే ఈ వీధుల్లోకి రానని ఆమె చెప్పింది. అయితే తాను మంచివాడినని, అరెస్ట్ చేయనని, జరిమానా వేయనని, తన కోసం ఏం చేస్తావని గిబ్సన్ అడిగాడు. గిబ్సన్ ఓ పోలీస్ అధికారిగా తన హోదాను దుర్వినియోగం చేశాడు. తన శారీరక వాంఛ తీర్చుకునేందుకు దుర్భల స్థితిలో ఉన్న ఓ మహిళను అవకాశంగా తీసుకున్నాడు. గిబ్సన్ తన వాహనంలో ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి తన కోరిక తీర్చుకున్నాడు. బాధితురాలిని బ్లాక్మెయిల్ చేశాడు' అని కోర్టులో ప్రాసిక్యూటర్ మరియా మస్సెలిస్ వాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement