'ఆ పోలీసు నన్ను వ్యభిచారి అన్నాడు' | Mumbai: Woman alleged cop abused her, called her 'prostitute' | Sakshi
Sakshi News home page

'ఆ పోలీసు నన్ను వ్యభిచారి అన్నాడు'

Published Thu, Jan 7 2016 3:01 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

'ఆ పోలీసు నన్ను వ్యభిచారి అన్నాడు'

'ఆ పోలీసు నన్ను వ్యభిచారి అన్నాడు'

ముంబయి: ముంబయిలో ఓ మహిళ(35) పోలీసు అధికారిపై కేసు పెట్టింది. అతడు ఆమెను అనరాని మాటలు అన్నాడని, వ్యభిచారివి అంటూ దుర్భాషలాడాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం తాను కారులో వస్తుండగా ఓ పోలీసు అధికారి ఆపేశాడు. అనంతరం ఏదైనా గుర్తింపుకార్డు చూపించమని కోరాడు.

ఆ తర్వాత ఆ మాట ఈమాట అంటూ నోటితో చెప్పలేని మాటలు మాట్లాడాడు. ఆమె ఆయన మాటలకు అడ్డుచెప్పేందుకు ప్రయత్నించడంతో 'నువ్వొక వ్యభిచారివే' అంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించాడు. ఈ మేరకు ఫిర్యాదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే ఆ పోలీసు అధికారిని గుర్తించామని, అతడు నిజంగా తప్పుచేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement