![Coconut Sellers Grounding Advice Post Goes Viral](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/coconut.jpg.webp?itok=2oujVS7j)
ప్రస్తుతం అందరివి బిజీ బిజీ జీవితాలే. క్షణం తీరిక లేకుండా సంపాదనే ధ్యేయంగా పరుగులు.కనీసం వేళకు తిండి తిప్పలు లేకుండా బతికేస్తున్నాం. పైగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్లు ఫోజులు కొడుతుంటాం. మన స్థాయి కంటే చిన్నవాళ్లు, చిన్న చితకా వ్యాపారాలు చేసుకునేవాళ్లు అద్భుతమైన సలహలిస్తుంటారు. వాటిని విన్నప్పుడు ఒక్క క్షణం నేనెందుకు ఇలా ఆలోచించలేకపోయానా..? అనిపిస్తుంది. మంచి ఆలోచనలనేవి ఉన్నత స్థితి నుంచి కాదు, అంతకుమించిన ఉన్నతమైన మనసు ఉన్నవారికేనని అర్థమవుతుంది. అలాంటి సందర్భమే ఎదురైంది ఈ మహిళకు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకుంది.
ముంబైకి చెందిన మహిళ(Mumbai woman) ఉబెర్ ఆటో బుక్ చేసుకుంది. అది వచ్చేలోపే అక్కడే కొబ్బరిబొండాలు అమ్ముకునే వ్యాపారి(Coconut Seller) వద్దకు వెళ్లి..కొబ్బరి బొండం ఇమ్మని అడుగుతుంది. అయితే ఆమె ఉబర్‌ఆటో వచ్చేస్తుందని తొందరగా కొబ్బరి బొండం కొట్టివ్వమని చెబుతుంది. దీంతో అతడు మేడమ్ ప్రజలంతా డబ్బు సంపాదించడానికే అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు
గానీ ఆ సంపాదన కాసేపు నిశ్చంతంగా తినడానికి తాగడానికి అవకాశం ఇవ్వలేప్పుడు వేస్టే కథా మేడమ్ అంటాడు. దీంతో ఆ మహిళకి అతడి మాటలు ఏదో మంత్రం చల్లినట్లుగా అనిపిస్తాయి. నిజమే కదా..అనే భావన కలిగుతుంది ఆమెలో. తానెందుకు ఇలా ఆలోచించలేకపోయాను, ఒక సాధారణ వీధి వ్యాపారి చెబితేగానీ తెలుసుకోలేకపోయానా అని ఫీలవుతుంది.
పని.. పని..అంటూ పరుగులు పెట్టేస్తాం. కానీ పనిని కాసేపు వదిలేసినా అలాగే ఉంటుంది. అంతేతప్ప ఏం కాదు. కనీస ప్రాథమిక అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఆ తర్వాత పని కాదు కదా..మనల్ని చూసుకునేవాడు కావాల్సిన దుస్థితి వస్తుంది. అంతటి పరిస్థితి వచ్చేలోపే మేల్కొంటే మంచిది అంటూ ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
మరికొందరూ కూడా తమ అనుభవాలను షేర్ చేస్తూ..మన గురించి మనల్ని పట్టించుకోవడం మర్చిపోతున్నాం అంటూ తమకెదురైన అనుభవాలను పంచుకున్నారు. కాబట్టి మనం క్షణ తీరిక లేని బిజీ లైఫ్‌తో అనారోగ్యం పాలవ్వడం కంటే..ముందుగానే మేల్కొని కొద్ది సమయమైన మనకోసం కేటాయించడం బెటర్ కదూ..!.
told bhaiya to cut my coconut fast because my uber was on the way & man casually said “itna paisa kyu kamate ho? kaam toh chalta rahega lekin khane peene ko time dena chahiye”
nice grounding advice pic.twitter.com/wz66mFqnUn— gargi (@archivesbygargi) February 7, 2025
(చదవండి: పాప్ రాక్ ఐకాన్, గ్రామీ అవార్డు గ్రహితకు చేదు అనుభవం..!)
Comments
Please login to add a commentAdd a comment