ముంబై: ఓ మహిళ రైలు కింద పడి ప్రాణాలతో బయడపటింది. రైలు కింద మహిళా చిక్కుకున్న విషయాన్ని గ్రహించిన పైలట్ ట్రైన్‌ను వెనక్కి వెళ్లనివ్వడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది, అయితే ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లను కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై లోకల్ స్టేషన్‌లో సోమవారం చోటుచేసుకుంది.
ముంబైలోని బేలాపూర్ స్టేషన్ నుంచి థానేకు వెళ్లేందుకు ఓ మహిళ లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ రైలు రద్దీగా ఉండటంతో ఆమె ఎక్కే క్రమంలో కాలు జారింది. దీంతో.. రైలు కింద పడిపోయింది. అప్పటికే రైలు కదలడంతో.. ఒక కంపార్ట్‌మెంట్ ఆమె పై నుంచి వెళ్లింది. అప్పుడు ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులతో పాటు భద్రతా సిబ్బంది అలారం మోగించడంతో.. రైలు వెనక్కు వెళ్లింది.
పోలీసు అధికారులు ట్రాక్‌లపై దిగి.. ఆమెను పైకి తీసుకొచ్చారు. వెంటనే మహిళను సమీపంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నిల తెలిపారు. ఈ ఘటనలో మహిళ తన రెండు కాళ్లను కోల్పోయింది.
కాగా.. ముంబైలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో నగరంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను రద్దు కావడంతో స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీ పెరింది. ఫుట్‌బోర్డు వద్ద కూడా నిలబడి మరీ ప్రయాణిస్తున్నారు. ఈక్రమంలోనే బేలాపూర్ స్టేషన్‌లో చాలాసేపు తర్వాత థానేకి వెళ్లే రైలు రావడంతో.. జనాలందరూ ఎగబడ్డారు. దీంతో బాధిత మహిళ కాలుజారి కిందపడినట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment