local train
-
రైలుకు వేలాడుతూ స్టంట్లు, కట్ చేస్తే..
సరదా మాటున విషాదం నెలకొంటున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. అయినా సోయి లేని పనులు చేస్తున్నారు కొందరు. అలా ఓ కుర్రాడు రైలుకు వేలాడుతూ స్టంట్లు చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యి పోలీసుల దాకా వెళ్లింది. అతన్ని వెతుక్కుంటూ ఆ కుర్రాడి ఇంటికి వెళ్లిన పోలీసులు.. చివరకు అక్కడి దృశ్యం చూసి కంగుతిన్నారు. ముంబైలోని సెవ్రీ రైల్వే స్టేషన్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిలో ఓ కుర్రాడు ముంబై లోకల్ ట్రైన్ డోర్ దగ్గర వేలాడుతూ విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో రైల్వే పోలీసులు ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టారు. ఆ కుర్రాడి ఆచూకీ తెలుసుకున్నారు. అయితే ఆ కుర్రాడిని ఒక చేయి, ఒక కాలు కోల్పోయిన స్థితిలో చూసి షాకయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం వాడాలాలోని ఆంటోప్ హిల్‌లో నివసిస్తున్న ఫర్హత్ అజా షేక్ అనే కుర్రాడిని లోకల్ రైలులో స్టంట్ చేసిన వ్యక్తిగా ఆర్పీఎఫ్ పోలీసులు కనుగొన్నారు. స్టంట్ చేస్తుండగా ఆ కుర్రాడు ఒక కాలు, ఒక చేయిని కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.ఈ కుర్రాడి స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన దరిమిలా రైల్వే పోలీసులు జూలై 14న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ కుర్రాడు ముంబైలోని ఆంటోప్ హిల్‌లో ఉంటున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం వారు అతని ఇంటికి వెళ్లారు. అక్కడ ఆ కుర్రాడు చేయి, కాలు కోల్పోయి కనిపించడంతో కంగుతిన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. #MumbaiAttn : @RailMinIndia @drmmumbaicr @grpmumbai @RPFCR @Central_Railway @cpgrpmumbaiSuch Idiots performing Stunts on speeding #MumbaiLocal trains are a Nuisance just like the Dancers inside the trains.Should be behind Bars.Loc: Sewri Station.#Stuntmen pic.twitter.com/ZWcC71J44z— मुंबई Matters™ (@mumbaimatterz) July 14, 2024 -
రైలు కింద పడిన మహిళ.. కాపాడేందుకు ట్రైన్ రివర్స్
ముంబై: ఓ మహిళ రైలు కింద పడి ప్రాణాలతో బయడపటింది. రైలు కింద మహిళా చిక్కుకున్న విషయాన్ని గ్రహించిన పైలట్ ట్రైన్‌ను వెనక్కి వెళ్లనివ్వడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది, అయితే ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లను కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై లోకల్ స్టేషన్లో సోమవారం చోటుచేసుకుంది.ముంబైలోని బేలాపూర్ స్టేషన్ నుంచి థానేకు వెళ్లేందుకు ఓ మహిళ లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ రైలు రద్దీగా ఉండటంతో ఆమె ఎక్కే క్రమంలో కాలు జారింది. దీంతో.. రైలు కింద పడిపోయింది. అప్పటికే రైలు కదలడంతో.. ఒక కంపార్ట్మెంట్ ఆమె పై నుంచి వెళ్లింది. అప్పుడు ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులతో పాటు భద్రతా సిబ్బంది అలారం మోగించడంతో.. రైలు వెనక్కు వెళ్లింది.పోలీసు అధికారులు ట్రాక్‌లపై దిగి.. ఆమెను పైకి తీసుకొచ్చారు. వెంటనే మహిళను సమీపంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నిల తెలిపారు. ఈ ఘటనలో మహిళ తన రెండు కాళ్లను కోల్పోయింది.కాగా.. ముంబైలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో నగరంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను రద్దు కావడంతో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరింది. ఫుట్‌బోర్డు వద్ద కూడా నిలబడి మరీ ప్రయాణిస్తున్నారు. ఈక్రమంలోనే బేలాపూర్ స్టేషన్లో చాలాసేపు తర్వాత థానేకి వెళ్లే రైలు రావడంతో.. జనాలందరూ ఎగబడ్డారు. దీంతో బాధిత మహిళ కాలుజారి కిందపడినట్లు అధికారులు పేర్కొన్నారు. -
జర్ర ఆగరాదే..! చాలా స్మార్ట్ గురూ!
-
'బాల్యం ఇక్కడే గడిపాను'.. లోకల్ ట్రైన్లో పీయూష్ గోయల్
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ నేతలు మంగళ్ ప్రభాత్ లోధా, ఆశిష్ షెలార్‌లతో కలిసి ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించిన తర్వాత గురువారం లోకల్ ట్రైన్లో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. గోయల్ సిద్ధివినాయకుని ఆలయంలో దర్శనం పూర్తి చేసుకున్న తరువాత మీడియాతో మాట్లాడుతూ.. నేను తెల్లవారు జామున 3 గంటలకు క్యూలో నిలబడి దర్శనం చేసుకున్నారు. ముంబై ప్రజలు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చడానికి సహాయపడతారని నేను విశ్వసిస్తున్నాను అని అన్నారు. #WATCH | Mumbai: Union Minister Piyush Goyal says, "I did 'darshan' in Siddhivinayak temple, which reminds me of my old days when I used to come here and stood in the queue at 3 am...I am fully confident that our Mumbai brothers and sisters are on hell-bent making India 'Viksit… pic.twitter.com/aruHSjOXjY — ANI (@ANI) March 14, 2024 లోకల్ ట్రైన్లో ప్రయాణించే సమయంలో.. ముంబై మహానగరం మీద తనకున్న అభిమానం గురించి వెల్లడించారు. తన బాల్యం ముంబైలో గడిపానని, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో నివాసం ఉంటున్నప్పటికీ తన హృదయంలో ముంబయికి చెందిన స్ఫూర్తి, సంస్కృతి ఉందని అన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో గోయల్ విద్యుత్, రైల్వేలు, బొగ్గుతో సహా ముఖ్యమైన శాఖలలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంకా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం, ప్రజా పంపిణీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. గతంలో మూడు సార్లు రాజ్యసభలో ఎన్నికైన గోయల్.. ప్రస్తుతం ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. #WATCH | Maharashtra | Union Minister Piyush Goyal travels in a Mumbai local train. pic.twitter.com/W1lTQfNkNL — ANI (@ANI) March 14, 2024 -
లోకల్ ట్రైన్లో మహిళల సిగపట్లు.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు..!
కలకత్తా: ట్రైన్లలో ప్రయాణికుల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. రైళ్లలో గొడవ పడుతూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ముంబయి లోకల్ ట్రైన్లో మహిళల ఫైటింగ్ వార్త మరవక ముందే కలకత్తా లోకల్ ట్రైన్లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలు గుంపుగా ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కలకత్తా లోకల్ ట్రైన్లో మహిళలు వీరంగం సృష్టించారు. ఒకరినొకరు జట్లు పట్టుకుని చెప్పులతో కొట్టుకున్నారు. బూతులు తిట్టుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. లోకల్ ట్రైన్ మహిళా కంపార్ట్మెంట్లో జరిగిన ఈ ఘటనను ఓ యూజర్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. కేవలం మూడు రోజుల్లో 6 వేల వ్యూస్ వచ్చాయి. Kolkata local🙂 pic.twitter.com/fZDjsJm93L — Ayushi (@Ayushihihaha) July 11, 2023 ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ట్రైన్లో ఉచితంగా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్ చూడొచ్చు అంటూ ఓ యూజర్ ఫన్నీగా కామెంట్ చేశాడు. మహిళలకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది.. కానీ ఇలాంటి ఘటనలు కూడా చూడాల్సి వస్తోందంటూ మరో యూజర్ స్పందించాడు. క్లినిక్ ప్లస్ యాడ్‌లా ఉందంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇదీ చదవండి: సీబీఐ స్కెచ్.. వలలో చిక్కిన హెడ్ కానిస్టేబుల్.. వీడియో వైరల్.. -
మయాంక్ లేవరా ప్లీజ్.. సెకన్ల గ్యాప్‌లో లోకల్ ట్రైన్ ఢీకొనడంతో..
ముంబై: మనిషి చేసే చిన్న చిన్న తప్పిదాలు వారి ప్రాణాల మీదకు తెస్తాయి. సెకన్ల వ్యవధిలో ప్రాణాలుపోయే పరిస్థితి వస్తుంది. రైలు ఎక్కే సమయంలో దిగే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సోషల్ మీడియా కారణంగా రీల్స్, వీడియోలు అంటూ కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన రైలు ఓ యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు స్పాట్లోనే చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌పై ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ కూర్చున్నారు. వారంతా అక్కడే టిఫిన్ తిన్నారు. ఓ కుర్రాడు పైకి లేచి ప్లాట్ ఫామ్ చివరగా వెళ్లి చేతులు కడుక్కున్నాడు. ఇంతలో అతడి ఫ్రెండ్ మయాంక్ అనిల్ శర్మ(17) కూడా చేతులు కడుక్కోవడానికి ప్లాట్ ఫామ్ అంచువరకు వెళ్లాడు. మరో స్నేహితుడు తన చేతులు కడుక్కుని వాటర్ బాటిల్లోని నీరు తాగి. ఆ తర్వాత బాటిల్‌ని అనిల్‌కు ఇచ్చాడు. అనిల్ తన చేతులు వాష్ చేసుకుంటున్నాడు. ఇంతలో ప్లాట్‌ఫామ్-3పైకి లోకల్ ట్రైన్ దూసుకొచ్చింది. ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్ అంచునే ఉన్న మయాంక్‌ను గట్టిగా ఢీకొనడంతో ఒక్కసారిగా గాల్లోకి లేచి కిందపడిపోయాడు. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. ఈ క్రమంలో స్పాట్లోనే మయాంక్ మృతిచెందాడు. మరో స్నేహితుడికి గాయలయ్యాయి. అయితే, ఈ ప్రమాదం జూన్ 17వ తేదీన చోటుచేసుకుంది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ప్లాట్‌ఫాంలపై జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హాయ్ అంటూ దగ్గరయ్యాడు.. నమ్మకంతో ఆమె వీడియో కాల్స్ చేసి.. -
అక్కడకు రాగానే రైళ్లలో లైట్లు బంద్.. విచిత్రమో, విడ్డూరమో కాదు!
రైలు నడుస్తున్నప్పుడు ఆ రైలులోని లైట్లన్నింటినీ ఆర్పివేయడమనేది ఎక్కడైనా చూశారా? టెక్నికల్ ప్రోబ్లం కాకుండా అలా ఎప్పుడైనా జరుగుతుందా? సాధారణంగా ఇలా జరగదు. అయితే వీటికి భిన్నంగా ఆ ప్రాంతంలోకి రైలు రాగానే దానిలోని లైట్లన్నీ బంద్ అయిపోతాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో? అటువంటి ప్రాంతం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకిలా చేస్తారంటే.. చైన్నైలోని ఒక రైల్వే స్టేషన్ సమీపంలో ఇలా జరుగుతుంది. చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్‌కు సమీపంలోని కొంత దూరంలోకి లోకల్ రైలు రాగానే దానిలోని లైట్లు ఆరిపోతాయి. అయితే ఇలా లోకల్ రైళ్ల విషయంలోనే జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఒక లోకోపైలెట్ సమాధానమిచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కొద్దిదూరం వరకూ మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ కాస్త దూరంలో ఓహెచ్‌ఈలో కరెంట్ ఉండదు. ఓహెచ్ఈ అనేది లోకోమోటివ్‌కు విద్యుత్‌ను అందిస్తుంది. అక్కడి ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్‌లో విద్యుత్ ఉండదు. ఇటువంటి ప్రాంతాన్ని నేచురల్ సెక్షన్ అని అంటారు. కట్ కరెంట్ ప్రాంతంగా.. ఇటువంటి స్థలాలను రైల్వేనే రూపొందిస్తుంది. దీనిని ఓవర్ హెడ్ వోల్టేజ్, విద్యుత్ నిర్వహణ కోసం తయారు చేస్తారు. దీనిని కట్ కరెంట్ అని పిలుస్తారు. ఇది నూతన విద్యుత్ జోన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. దీని వల్ల కొంత దూరం వరకు కరెంటు ఉండదు. లోకల్ రైళ్ల లైట్లు డ్రైవర్ క్యాబిన్ నుండి పనిచేస్తాయి. వాటి పవర్ సిస్టమ్ భిన్నంగా ఉంటుంది. ఇది ఈ ప్రదేశంలో ప్రభావితమవుతుంది. ఇక ఎక్స్‌ప్రెస్ రైళ్లు, పాసింజర్ రైళ్లలో కోచ్‌లకు వేర్వేరుగా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు ఉంటాయి. దీని కారణంగా ఆ రైళ్లలో ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తదు. నూతన జోన్ కారణంగా ఇక్కడ నుండి వెళ్ళే లోకల్ రైళ్లలోని లైట్లు స్విచ్ ఆఫ్ అవుతాయి. ఇది కూడా చదవండి: పాములు పట్టడంలో ఎవరైనా అతని తర్వాతే.. ‘స్నేక్ మ్యాన్’ స్టోరీ! -
లోకల్ ట్రైన్లో అగ్ని ప్రమాదం.. బోగీలకు మంటలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో రెండు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. రత్లామ్ పట్టణంలో ఆదివారం ఉదయం రత్లామ్-అంబేద్కర్ నగర్ డెమూ మార్గంలో వెళ్తున్న ఓ లోకల్ ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో రత్లామ్ స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రీతమ్ నగర్ స్టేషన్‌కు ట్రైన్ చేరుకోగానే ఆ రైల్లో మంటలు చెలరేగాయి. దాంతో అప్రమత్తమైన రైలు లోకో పైలెట్లు, స్టేషన్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పి వేశారని పశ్చిమ రైల్వే రత్లాం డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) ఖేమ్రాజ్ మీనా తెలిపారు. అయితే, రైలు జనరేటర్ కార్లో ముందుగా మంటలు చెలరేగాయని, ఆ తర్వాత బోగీ అంతటికి విస్తరించాయని అధికారులు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు రైలును ఆపేయడంతో పెను ముప్పు తప్పిందని, మంటలు ప్రయాణికుల బోగీలకు వ్యాపించకుండా ఆగిపోయాయని అన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. కాగా, లోకల్ రైలులోని ప్రయాణీకులను అంబేద్కర్ నగర్ స్టేషన్‌కు మరో రైలులో చేర్చినట్టు అధికారులు వెల్లడించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Madhya Pradesh: Fire broke out in the generator car of Ratlam-Dr Ambedkar Nagar Demu train at Pritam Nagar station in Ratlam earlier this morning. The fire was later extinguished. No injuries or casualties reported. pic.twitter.com/hrT3GRGhby — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 23, 2023 -
నేను లాయర్.. నా ఇష్టం.. లోకల్ ట్రైన్లో యువతి రుబాబు..
ముంబై: మహారాష్ట్ర ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణికుడి సీటుపై కాలుపెట్టి మహిళా లాయర్ రుబాబు చేసింది. కాలు తీయమన్నా తీయకుండా దురుసుగా ప్రవర్తించింది. తాము లాయర్లమని, ఇష్టమొచ్చినట్లు ఉంటామని హల్చల్ చేసింది. తనతో పాటు ఉన్న మరోవ్యక్తితో కలిసి ప్రయాణికుడిపై వాగ్వాదానికి దిగింది అంతేకాదు ఈ దృశ్యాలను రికార్డు చేసినందుకు ప్రయాణికుడి మొబైల్‌ను లాక్కునేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సదరు వ్యక్తి ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఈ లాయర్లు లోకల్ ట్రైన్లో ప్రయాణికులకు ఇబ్బంది కల్గించారని పేర్కొన్నాడు. ముంబై పోలీసులు, రైల్వే శాఖను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశాడు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. @MumbaiPolice @Central_Railway @CPMumbaiPolice these people supposed to be lawyers and sitting in the train like this pic.twitter.com/W3dYwtGnSr — prashantwaydande (@prashantwaydan3) February 1, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లాయర్ల తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. లా చదివి ఇలాగేనా ప్రవర్తించేది అని మండిపడ్డారు. సామాన్యులంటే గౌరవం లేదా అని ఫైర్ అయ్యారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. చదవండి: దారుణం.. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడిని.. -
ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణించిన స్టార్ హీరోయిన్
సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ వాహనాల్లోనే ప్రయాణిస్తుంటారు. జనాల కంట పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ తాజాగా స్టార్ కిడ్ సారా అలీఖాన్ మాత్రం ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణించి ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వీడియోను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది 'సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో తన టీంతో కలిసి ఇలా లోకల్ ట్రైన్లో ప్రయాణం చేశాను' అంటూ సారా తన ఇన్‌స్టా వీడియోలో చెప్పుకొచ్చింది. ట్రైన్ దిగిన తర్వాత కూడా సారా ఆటోలో ప్రయాణంచడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
Local Train: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన రైలు.. ప్రయాణికుల పరుగులు
సబర్బన్ రైలు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని బీచ్ స్టేషన్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, చెన్నై వర్క్‌షాప్ నుంచి కోస్టల్ రైల్వేస్టేషన్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో ప్లాట్‌ఫామ్ వైపుపైకి దూసుకోచ్చింది. ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణీకులందరూ పరుగులు పెట్టారు. రైలులో ఉన్న పలువురు ప్రయాణికులు సైతం రైలు నుంచి బయటకు దూకారు. Empty rake of suburban train overshot buffer end of the platform at #Chennai Beach Station resulting in an accident, driver jumps to safety. No passenger injured @GMSRailway orders probe into the incident. Video courtesy Wa group #TamilNadu pic.twitter.com/vKnYJDvssQ — Vijay Kumar S (@vijaythehindu) April 24, 2022 ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్ మాత్రం గాయపడగా వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. -
లోకల్లో అందరికీ అనుమతివ్వండి
సాక్షి, ముంబై: సామాన్యులను కూడా లోకల్ రైళ్లలో అనుమతివ్వాలని, లేదంటే ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకునే ప్రమాదముందని రైల్వే ప్రయాణికుల సంఘటన ప్రభుత్వాన్ని, రైల్వే అధికారులను హెచ్చరించింది. ఆ తరువాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, షాపుల్లో పనిచేసే ఉద్యోగులు, కూలీలు, కార్మికులు, చిరు ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేసే కష్టజీవులు విధులకు హాజరయ్యేందుకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోకల్ రైళ్లలో సామాన్యులకు అనుమతి లేకపోవడం వల్ల ప్రజా రవాణ వ్యవస్థపై లేదా సొంత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. విజ్ఞప్తులపై దాటవేత.. ప్రజా రవాణ వ్యవస్థను ఆశ్రయిస్తున్న చిరు ఉద్యోగులు, కార్మికులు, కూలీలు, కష్టజీవులకు ప్రతీరోజు రూ.100–150 చార్జీలు చెల్లించి విధులకు రావడం వీలుపడటం లేదు. అదేవిధంగా ఇందనం ధరలు పెరగడంతో ప్రైవేటు సంస్థల్లో పనిచేసే సామాన్య ఉద్యోగులు కూడా సొంత వాహనాల్లో రాకపోకలు సాగించడం ఆర్థిక పరంగా గిట్టుబాటు కావడం లేదు. దీంతో లోకల్ రైళ్లలో సామాన్యులందరికి అనుమతివ్వాలని ఇటు ప్రభుత్వానికి అటు రైల్వే పరిపాలనా విభాగానికి ప్రయాణికుల సంఘటన వినతి పత్రాలు అందజేసింది. అయినప్పటికీ ఇరు సంస్థల నుంచి స్పందన రాలేదు. దీంతో సామాన్య రైల్వే ప్రయాణికులు వచ్చే బీఎంసీ ఎన్నికల్లో ఓటు వేయవద్దని పిలుపునిస్తూ సంఘటన ద్వారా సోషల్ మీడియాలో సందేశాలు వైరల్ అయ్యాయి. అయినప్పటికీ స్పందన రాలేదు. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారిని అనుమతించాలని సంఘటన విజ్ఙప్తి చేసింది. అయినప్పటికీ ఇరు సంస్థలు నిర్లక్ష్యం చేశాయి. లోకల్ రైళ్లలో అనుమతించకపోవడం వల్ల చిరు ఉద్యోగులు, కార్మికులు, కష్టజీవులు, కూలీలు, ఇతర రంగాల్లో చేనిచేస్తూ పొట్ట నింపుకునే పేదలు తమ కుటుంబాన్ని పస్తులుంచాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ అనుమతించడానికి ప్రభుత్వం, రైల్వే ముందుకు రావడం లేదు. గణేశోత్సవాల తరువాతే సామాన్యులకు అనుమతించే విషయంపై ఆలోచిస్తామని ఇటీవల ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో ప్రయాణికులు సంఘటన ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో చిరు ఉద్యోగులు, కార్మికులు, కూలీలు, కష్టజీవులు ఇటు లోకల్ రైళ్లలో అనుమతి లేక అటు ప్రజా రవాణ వ్యవస్థ ద్వారా, సొంత వాహనాల్లో కార్యాలయాలకు, వ్యాపార సంస్ధలకు, షాపులకు చేరుకోలేక గత సంవత్సరన్నర నుంచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి తక్కువ చార్జీలు, వేగంగా రాకపోకలు సాగించాలంటే ముంబైకర్లకు లోకల్ రైళ్లు ఒక్కటే ప్రధాన రవాణ సాధనాలుగా ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు నిత్యం 75–80 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారంటే దీన్ని బట్టి లోకల్ రైళ్లకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఇతర వాహనాల్లో విపరీతమైన రద్దీ.. లోకల్ రైళ్లలో సామాన్యులందరికి అనుమతినిస్తే రద్దీ పెరుగుతుంది. ఫలితంగా తగ్గుముఖం పడుతున్న కరోనా వైరస్ మళ్లీ పడగవిప్పే ప్రమాదముందని ప్రభుత్వం అంటుంది. ఒక్క పొంచి ఉన్న కరోనా మూడో వేవ్ ప్రమాదం, మరోపక్క రోజురోజుకు పెరుగుతున్న బ్లాక్ ఫంగస్, డేల్టా వేరియంట్ కేసులను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడే సామాన్యులందరికి లోకల్ రైళ్లలో అనుమతివ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. కానీ, ప్రైవేట్ వాహనాలు, ప్రజా రవాణ బస్సుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. వీటివల్ల కరోనా, బ్లాక్ ఫంగస్, డేల్టా వేరియంట్ కేసులు పెరగవా..? కేవలం లోకల్ రైళ్లలో రద్దీ వల్ల కేసులు పెరుగుతాయా..? అంటూ ప్రయాణికుల సంఘటన నిలదీసింది. ఇప్పటికే సామాన్య ప్రజలు, నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. త్వరలో గణేశోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వీటన్నింటిని పరిగణంలోకి తీసుకుని దశల వారిగా అందరికి అనుమతివ్వాలని ప్రయాణికుల సంఘటన విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో ప్రజా ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని, ఆ తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వం, రైల్వే పరిపాలన విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. -
Viral Video: టికెట్ లేకుండా దొరికాడు.. ఆపై మన్‌కీబాత్‌తో ముంబైనే కదలించాడు!
ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది అంటుంటారు పెద్దలు. అలాగే ముంబై మొత్తాన్ని ఆ ఒక్కడి వీడియో కదిలించింది. ‘టికెట్ లేని ప్రయాణం నేరం’ అనే ఆదేశాలకు తలొగ్గిన ఆ యువకుడు.. తనలాంటి వేలమంది ఆవేదనను ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఎందుకు అర్థం చేసుకోవట్లేదంటూ నిలదీశాడు. ఆ వీడియో గంటల వ్యవధిలోనే వైరల్ కావడంతో వేలమంది అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ముంబై: మహానగరం.. జూన్ చివరివారంలో ఒక రోజు. లోకల్ రైలులో ప్రయాణిస్తున్న ఆ యువకుడ్ని.. పరేల్ స్టేషన్ వద్ద టీసీ దొరకబట్టాడు. టికెట్ లేదని, పైగా అనుమతి లేకున్నా రైళ్లో ప్రయాణిస్తున్నాడని ఛలానా రాయబోయాడు. ఆ యువకుడు బతిమాలడమో, లేదంటే పారిపోవడమో లాంటి ప్రయత్నాలు చేయలేదు. సరాసరి టీసీ వెంట ఆఫీస్‌కి వెళ్లాడు. అక్కడ తనకు విధించిన ఫైన్‌ను కట్టడానికి కూడా సిద్ధం అయ్యాడు. కానీ, ఆ ఘటనంతా సెల్ఫోన్లో రికార్డ్ చేస్తుండగా.. అధికారులు సైతం అడ్డుచెప్పలేదు. ‘‘ఒకప్పుడు నెలకు 35 వేల రూపాయలు సంపాదించేవాడ్ని. ఏడాదిన్నర క్రితం ఉద్యోగం పోయింది. ఖర్చులన్నీ పోనూ నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు 400రూ. చేరింది. ఈ మధ్యే జాబ్ దొరికింది. వెళ్లాలంటే రైలు మార్గం తప్ప నాకు వేరే దిక్కులేదు. కానీ, రెండో రోజే ఇలా టీసీకి దొరికిపోయా. టీసీ సాబ్ తన డ్యూటీ తాను చేశాడు. అలాగే ఫైన్ కట్టడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, లాక్‌డౌన్‌తో నాకంటే దారుణమైన కష్టాలు పడుతున్నవాళ్లను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. This situation is there with the youth now in Mumbai. Same story can be guessed for me & my fellow DJ's from the Entertainment Industry. The government should look into this very seriously..#LockDown #adityathackeray #mumbailocal @AUThackeray @UdhavThackeray @VijayWadettiwar pic.twitter.com/8pnqtHWPyu — Omkar Raut (@djomkar) June 27, 2021 ఇప్పుడు రోజూ రైళ్లలో నాలాంటి వందల మంది ప్రయాణిస్తున్నారు. వాళ్లంతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాళ్లే. కానీ, అది సరదా కోసం చేయట్లేదు కదా. కుటుంబాల్ని పోషించుకోవాలనే తాపత్రయంతోనే అలా చేస్తున్నారు. కరోనా.. లాక్డౌన్ ఇక చాలు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే సంపాదించుకోవడానికి అర్హులా? మాలాంటి వాళ్లకు రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతులు ఇవ్వరా? దయచేసి ప్రభుత్వం ఆ నిబంధనల్ని ఎత్తేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇదేం పబ్లిసిటీ స్టంట్ కాదు’’ అని మాట్లాడాడు ఆ యువకుడు. వెల్లువలా మద్దతు కరోనా కమ్మేసిన మహా నగరం ముంబైలో.. ఆంక్షల్ని క్రమంగా సడలిస్తూ వస్తోంది బీఎంసీ. అయితే లోకల్ ట్రైన్లను నడిపిస్తున్నా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురాలేదు. అత్యవసర సర్వీసుల పేరుతో గవర్నమెంట్ ఉద్యోగులకు, ఎమర్జెన్సీ కేటగిరీలో చేర్చిన ఉద్యోగులకు మాత్రమే లోకల్ ట్రైన్ ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ఈ తరుణంలో తనలాంటి వేల మంది ప్రైవేట్ ఉద్యోగుల ఆవేదనను ప్రతిబింబిస్తూ ప్రశ్నించాడు ఆ యువకుడు. దీంతో సోషల్ మీడియా మొత్తం అతనికి మద్ధతుగా నిలుస్తోంది. ప్రైవేట్ వాహనాలకు రోజూ బోలెడు ఖర్చులు చేస్తున్నామని..భరించలేకపోతున్నామని కొందరు, ప్రభుత్వ ఉద్యోగుల వేళలు మార్చాలని మరికొందరు, గవర్నమెంట్ ఉద్యోగులతో కరోనా వ్యాపించదా?.. అందరికీ అనుమతులు ఇవ్వాల్సిందేనని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక కరోనా సాకుతో సామాన్యుడికి లోకల్ రైలులో ప్రయాణాలపై ఆంక్షలు విధించిన అధికార యంత్రాగం.. బస్సు ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని కొందరు అంటున్నారు. ఇలా ఆ యువకుడి వీడియో సోషల్ మీడియాలో, టీవీ ఛానెల్లో చర్చకు దారితీసింది. పరిష్కారం ఏమిటసలు? కరోనా మహమ్మారి భయం పూర్తిగా పోని తరుణంలో.. రైలు ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తేయడం సరికాదనే అభిప్రాయంలో ఉన్నారు అధికారులు. లోకల్ రైళ్లలో గుంపులుగా ప్రయాణిస్తారు గనుకే ధైర్యం చేయడం లేదని బీఎంసీ చీఫ్ ఇక్బాల్ చాహల్ వెల్లడించారు. అయితే త్వరలో ఆ ఆంక్షల్ని సడలిస్తామని, ముందుగా మహిళలకు, ఆపై మిగతా సెక్టారలకు ఒక్కో దశలో అనుమతులు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. చదవండి: బాప్రే.. మాస్క్ లేకుండా నెలలో లక్షమంది!! -
విషాదం: దొంగను పట్టుకోబోయి రైలు కింద పడ్డ మహిళ
ముంబై: రైల్లో నుంచి జారిపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ముంబైలోని కల్వా, ముంబ్రా స్టేషన్ల మధ్య నడుస్తున్న స్థానిక రైలులో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తన మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన ఓ దొంగతో పోరాడుతూ విద్యా పాటిల్(35) అనే మహిళ రైల్లో నుంచి జారిపడింది. బాధితురాలిని డోంబివ్లి నివాసిగా గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కుర్లా స్టేషన్లో రైలు ఎక్కారు. ఫైసల్ షేక్ అనే వ్యక్తి రాత్రి 7.15 గంటలకు కల్వా స్టేషన్ వద్ద కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. అతడు పాటిల్ ఫోన్‌ను లాక్కొని రైలు దిగడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె ప్రతిఘటించింది. ఈ పెనుగులాటలో నిందితుడు ఆమెను నెట్టి వేయడంతో రైలు కింద పడిపోయింది. కాగా మహిళను రక్షించే ప్రయత్నంలో కోచ్‌లోని ప్రయాణికులు వెంటనే గొలుసును లాగారు. ఆ తర్వాత రైలు డ్రైవర్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడిని ముంబ్రాకు చెందిన ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. (చదవండి: అక్రమ మైనింగ్ గనిలో ఇరుక్కుపోయిన ఐదుగురు) -
లోకల్ ట్రైన్ ఢీకొని కాబోయే దంపతులు మృతి
-
ఎంఎంటీఎస్‌కు పదిహేనేళ్లు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సిటీ బస్సులే అందుబాటులో ఉన్న రోజుల్లో ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్ పట్టాలెక్కింది. ఈ వ్యవస్థ లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకు నగరం రెండు వైపులనుఅనుసంధానించేదిగా నిలిచింది. ప్రస్తుతం 121 సర్వీసులతో ప్రతిరోజు 1.6 లక్షల మంది రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న ఎంఎంటీఎస్2003 ఆగస్టు 9న తొలి రైలు పట్టాలెక్కినేటికి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. రైలు పరుగులు ఇలా మొదలు.. పెరుగుతున్న జనాభా, రోడ్లపై వాహనాల రద్దీ, ప్రయాణికుల అవసరాలు, అన్నింటికీ మించి వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎంఎంటీఎస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో రూ.69.50 కోట్లతో ఈ లోకల్ రైళ్లు పట్టాలెక్కాయి. మొదట సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటి ఉపప్రధాని ఎల్కే అద్వానీ ముఖ్య అతిథిగా హాజరై ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. అనతి కాలంలోనే సేవలు విస్తరించి సికింద్రాబాద్–ఫలక్‌నుమా మధ్య కూడా సర్వీసులను ప్రారంభించారు. మొదట 25 వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్ సేవలు.. ప్రయానికుల రద్దీకి అనుగుణంగా 2005 నాటికి సర్వీసుల సంఖ్య 48కి పెరిగాయి. ప్రస్తుతం 121 సర్వీసులు తిరుగుతున్నాయి. సుమారు లక్షా 60 వేల మంది ఎంఎంటీఎస్‌ను వినియోగించుకుంటున్నారు. రోజు రోజుకు ప్రయాణికుల రద్దీ పెరగడంతో 2009లో బోగీల సంఖ్యను 6 నుంచి 9కి పెంచారు. అటు హైటెక్ సిటీ నుంచి ఇటు పాతనగరం వరకు అన్ని వర్గాల జీవితాల్లో ఎంఎంటీఎస్ ఒక భాగమైంది. ఈ క్రమంలోనే 2010లో మహిళల కోసం ‘మాతృభూమి’ని అందుబాటులోకి వచ్చారు. ప్రయాణికుల రద్దీ మేరకు రెండో దశ విస్తరణకు చర్యలు చేపట్టారు. ఇందులో సికింద్రాబాద్–బొల్లారం మధ్య త్వరలో రెండో దశ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. అటు ఘట్కేసర్ నుంచి ఇటు పటాన్చెరు, తెల్లాపూర్ వరకు, సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు నగరం నలువైపులా శివారు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ 2013లో రెండోదశ నిర్మాణం చేపట్టారు. నేడు పుట్టిన రోజు వేడుక నిత్యం ఎంఎంటీఎస్‌లో ప్రయానించే కొంతమంది ప్రయాణికులు కలిసి 10 ఏళ్ల క్రితం ‘ఎంఎంటీఎస్ ట్రావెలర్స్ అసోసియేషన్’ను ఏర్పాటు చేశారు. ఈ సంఘం ఏటా ఆగస్టు 9న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ‘ఎంఎంటీఎస్ పుట్టిన రోజు’ వేడుకలు నిర్వహిస్తుంది. రైల్వే ఉన్నతాధికారులు, ప్రయాణికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం 15 ఏళ్లు నిండిన సందర్భంగా గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేçషÙన్ 10వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు సంఘం ప్రతినిధులు చంద్ర, రవి తదితరులు తెలిపారు. అలాగే హైటెక్‌సిటీ స్టేషన్లో మొక్కలు నాటనున్నారు. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. మా సేవలు ఎలా ఉన్నాయి.. నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభించిన 15 ఏళ్లు నిండిన సందర్భంగా దక్షిణమధ్య రైల్వే ప్రయాణికుల అభిప్రాయాల సేకరిస్తోంది. వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఆశిస్తోంది. ఎలాంటి సర్వీసులను కోరుకుంటున్నారు. ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. స్టేషన్లలో ఉన్న సమస్యలు వంటిపై ఆరా తీస్తోంది. ప్రయాణికులు తమ సలహాలు, సూచనలను uఠిఝఝ్టటఃజఝ్చజీ .ఛిౌఝకు మెయిల్ ద్వారా తెలియజేవచ్చు. ఈ మేరకు 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక లోగోను విడుదల చేశారు. -
ప్రియురాలు మోసం చేసిందని..
ముంబై : ప్రియురాలు మోసం చేసిందని ఓ 25 ఏళ్ల యువకుడు ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని కళ్యాణ్ సమీపంలో అంబివ్లీకి చెందిన రాజేశ్ ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. అయితే రాజేశ్, అతని ప్రియురాలికి మధ్య ఇటీవలే గొడవ అయినట్టు అధికారులు తెలిపారు. జూలై 26న ఆమె రాజేశ్‌కు ఫోన్ చేసి వితుల్ వాడీ స్టేషన్‌కు రావాలని కోరింది. స్టేషన్లో వారిద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో అక్కడే ఉన్న రైల్వే పోలీసులు వారిద్దరిని అక్కడి నుంచి వెళ్లాలని సూచించారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే రాజేశ్ తన ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రియురాలు తనని చీట్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. చివరగా తన సోదరుడు, మిత్రుడితో మాట్లాడాడు. ఫోన్ పాస్‌వర్డ్‌ను మిత్రుడితో చెప్పి, స్విచ్ఆఫ్ చేసి లోకల్ ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 26న ఈ సంఘటన చోటుచేసుకున్నా, ఆత్మహత్యకు మందు రాజేశ్ తీసిన సెల్ఫీ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రైన్లో ఫుట్‌బోర్డు ప్రయాణం.. ఆరుగురి మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలో కిక్కిరిసిన రైలులో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ జరిగిన ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు విద్యార్థులే కావడం గమనార్హం. చెన్నై తాంబరం–బీచ్ రైలు మార్గంలో మంగళవారం ఉదయం 7.30 గంటలకు విద్యుత్ తీగ తెగిపోగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్లాట్‌ఫారాలపై వందలకొద్దీ ప్రయాణికులు వేచి ఉండాల్సి వచ్చింది. తిరిగి 8.30 గంటల తరువాత రైళ్ల రాకపోకలు ప్రారంభం కావటంతో తిరుమాల్పూరు ఎక్స్‌ప్రెస్ రైలు కిక్కిరిసిన ప్రయాణికులతో బీచ్‌స్టేషన్ నుంచి 8.55 గంటలకు బయలుదేరింది. అయితే, అది లోకల్ రైలుగా పొరపాటుపడిన విద్యార్థులు, యువకులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఎక్కారు. పరంగిమలై రైల్వేస్టేషన్ సమీపంలోని రెండు రైల్వేలైన్ల మధ్యన ఉన్న ఎత్తైన డివైడర్ గోడ వీరికి తగలడంతో 20 మందికిపైగా కిందపడిపోయారు. వీరిలో భరత్ (17), శివకుమార్ (20), నవీన్‌కుమార్ (21) అనే విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శంకర్ (23), భారతి (22) అనే వారు ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు.సుమారు 15 మంది తీవ్రగాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రైలులో ప్రయాణిస్తూ సోమవారం రాత్రి ఇదే డివైడర్ గోడను ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయారు. మంగళవారం ఉదయం ఘటనలోని మృతుల కుటుంబాలకు రూ.లక్ష, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున సీఎం పళనిస్వామి సాయం ప్రకటించారు. ఎక్స్‌ప్రెస్ రైళ్ల లైన్లోకి సబర్బన్ రైలును మళ్లించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలపై రైల్వే అధికారులు మాట్లాడుతూ.. సబర్బన్ రైళ్ల లైన్లో విద్యుత్ నిలిచిపోయినందునే ఇలా చేశామని తెలిపారు. ఫుట్ బోర్డ్ ప్రయాణం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ప్రజలను కోరారు. ఫుట్‌బోర్డ్ ప్రయాణమే ఈ విషాదానికి కారణమని, ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
వైరల్ : జీన్స్ ధరించిన యువతికి బెదిరింపులు
కోల్‌కతా : కోల్‌కతా నగరంలోని రైళ్లలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. గతంలో ఓ జంట కౌగిలించుకున్నారని ఆరోపిస్తూ అల్లరిమూక దాడికి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా జీన్స్ ధరించిన యువతి వస్త్రధారణను తప్పుపడుతూ ఓ వ్యక్తి ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఆమె స్నేహితుడితో కూడా మాటల దాడికి దిగారు. ఈ ఘటనను ఆమె తన మొబైలో చిత్రీకరించిడంతో పాటు తనపై జరిగిన దాడికి సంబంధించి ఫేస్బుక్లో వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై ఆ యువతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 24 ఏళ్ల యువతి తన స్నేహితుడితో కలసి శనివారం రాత్రి బారక్పూర్ వెళ్లేందుకు సీల్దా స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కారు. వారిద్దరు ఒకే దగ్గర కూర్చోవడానికి వీలుగా ఓ వ్యక్తిని కొంచెం పక్కకు జరగాల్సిందిగా కోరారు. కానీ ఆ వ్యక్తి అందుకు నిరాకరించడంతో వారు ఉన్న స్థలంలోనే సర్దుకుని కూర్చున్నారు. వారు అలా కూర్చోవడాన్ని తప్పుబట్టిన సదరు వ్యక్తి వారితో వాగ్వాదానికి దిగాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న మరో వ్యక్తి వారి మధ్య జోక్యం చేసుకున్నాడు. ఆ యువతి టీ షర్ట్, జీన్స్ ధరించడంపై అభ్యంతరం తెలిపాడు. ఆమె వస్త్రధారణపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. అంతేకాకుండా బెదిరింపులకు కూడా దిగాడు. ఈ ఘటనపై ఆ యువతి స్పందిస్తూ.. ‘మన దేశంలో స్త్రీలు ఇంకా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి రావడం బాధకరం. బస్సులో, రైళ్లలో ఈ రకమైన ఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. తమకంటే పెద్దవారి నుంచి ఇలాంటి ప్రవర్తనను తాము కోరుకోవడం లేదు’ అని తెలిపారు. -
జీన్స్ ధరించిన యువతిపై అసభ్య పదజాలంతో..
-
ప్రయాణికులకు చుక్కలు చూపిన ఏసీ ట్రైన్
ముంబై : ముంబైలో ఓ లోకల్ ఏసీ సర్వీస్ రైలు శుక్రవారం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ట్రైన్‌లోని కొన్ని కోచ్‌లలో ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం బోరివాలి స్టేషన్ దాటక ట్రైన్లో ఒక్కసారిగా కొన్ని కోచ్‌లలో ఏసీలు ఆగిపోవడంతో.. ఉష్ణోగ్రత క్రమంగా 36 డిగ్రీలకు చేరుకుంది. ట్రైన్ డోర్లు మూసి ఉండేవి కావడంతో ఊపిరాడక, ఉక్కపోతతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆగ్రహా, ఆవేశాలకు లోనైనా కొందరు ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్‌ని అంధేరిలో నిలిపివేశారు. ట్రైన్‌ను పరిశీలించిన అధికారులు.. ఏసీ ఫెయిల్ కావడానికి కారణాలు తెలియకపోవడంతో దానిని షెడ్‌కు తరలించారు. ఈ సమస్యను ప్రయాణికులు ట్విటర్లో రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రైల్వే శాఖ ఈ ఘటనపై క్షమాపణ తెలిపింది.3 కోచ్‌లలో ఈ సమస్య తలెత్తినట్టుగా పేర్కొంది. పశ్చిమ రైల్వే ముంబైలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి గతేడాది డిసెంబర్లో 12 ఏసీ సర్వీస్‌లకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. -
లోకల్ ట్రైన్ కిందపడి వ్యక్తి ఆత్మహత్య
-
క్షణం ఆలస్యం అయ్యుంటేనా...
సాక్షి, ముంబై : రైల్వే ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్ని ప్రకటనలు చేస్తున్నా... కొందరు ప్రయాణికులు మాత్రం అవేం పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కిందపడిన తన బ్యాగ్ కోసం కదులుతున్న రైల్లోంచి దూకిన ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అయితే క్షణం ఆలస్యం చేయకుండా అక్కడున్న కొందరు అప్రమత్తం కావటంతో ప్రాణాలతో బయటపడింది. మహారాష్ట్రలోని కుర్లా రైల్వేస్టేషన్లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. లోకల్ ట్రైయిన్ బయలుదేరటంతో ఓ యువతి రన్నింగ్‌లోనే ఆ రైలును ఎక్కేసింది. ఇంతలో ఓ మహిళ పరిగెత్తుకుంటూ ఆమె పక్కగా వెళ్లటంతో బ్యాగ్ రైల్లోంచి కింద పడిపోయింది. దాని కోసం ఆమె కిందకి దూకగా.. ప్లాట్‌ఫామ్‌పై పడిపోయింది. రైలు వేగానికి కాస్తుంటే ఆమె పట్టాల కిందకు వెళ్లిపోయేది. అక్కడేవున్న రైల్వే పోలీసులు, ప్రయాణికులు స్పందించి వెంటనే ఆమెని పక్కకు లాగేశారు. ఆ మహిళను కాపాడిన రైల్వే పోలీసులను నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
క్షణం ఆలస్యం అయ్యుంటేనా...
-
15ఏళ్ల తర్వాత లోకల్ రైలులో హీరో
ముంబయి: దాదాపు పదిహేనేళ్ల తర్వాత బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ లోకల్ రైలులో ప్రయాణించారు. తన కలల ప్రాజెక్టు అయిన కర్మ్ బ్రహ్మాండ్ హౌజింగ్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆయన లోకల్ రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన అమితానందాన్ని వ్యక్తం చేశారు. సాధారణ పౌరులకు అతి తక్కువ ధరకే ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ముంబయిలోని బీచ్ పక్కనే దాదాపు ఐదు వేల నివాసాల బృహత్తర ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాను వెళుతున్నానని, ఇది తన జీవిత కల అని తెలిపారు. కెల్వ్ రోడ్డులోని లోకల్ రైలులో సెకండ్ క్లాస్‌లో వివేక్ ఒబెరాయ్ మీడియా ప్రతినిధులతో సహా వెళ్లారు. ఆయన 2002లో సాతియా అనే చిత్రం షూటింగ్ సమయంలో చివరిసారిగా లోకల్ రైలు ఎక్కారంట. ‘ఎంతో మంది పేదవారు, సామాన్యులు అసురక్షితమైన జీవితాన్ని కఠిన పరిస్థితుల మధ్య బతికేస్తున్నారు. కెల్వ్ రోడ్డు మాదిరిగానే షాపూర్ కూడా మారిపోయింది. 2018 నుంచి దాదాపు 14,000 వేల కుటుంబాలు నాణ్యమైన జీవితాన్ని ప్రారంభిస్తారు’ అని వివేక్ చెప్పారు. -
ఈ వీడియో చూస్తే ఇంకోసారి ఇలా చెయ్యరు..
-
పద్మవ్యూహంలో ప్రజారవాణా
ముంబై నగరజీవికి తక్కిన అన్నింటికంటే సమయం చాలా ముఖ్యమైనది. సకాలంలో బస్సు దొరక్కపోవడం అంటే లోకల్ ట్రెయిన్ని పట్టుకోలేకపోవడం వంటిది కాదు. బస్సు మిస్సయితే అప్పాయింట్మెంట్లు కూడా తప్పిపోవచ్చు. కార్ల ధరలూ, వాటి ఇంధనం గురించి పెద్దగా పట్టించుకోరు కానీ, భారత్‌లో ప్రజలు అనేక కారణాలతో కార్లు కొంటుం టారు. ఒకటి. మీవద్ద డబ్బు ఉంటుంది. కాబట్టి ఒకటి లేదా ఎక్కువగా కార్లు కొంటారు. రెండు. మీవద్ద డబ్బులేదు కానీ మీకు అవసరమనిపించింది కాబట్టి దేన్నయినా తనఖా పెట్టి మరీ కొంటారు. మూడు. ప్రజా రవాణా వ్యవస్థ నరకప్రాయంగా మారింది కాబట్టి కొనాల్సిన అవసరం ఉంటోంది. పైగా, కారు ఒక హోదా చిహ్నం అయిపోయింది. కార్లలో తిరిగే జనాభా పెరుగుతున్నందున రహదా రులు ఇరుగ్గా మారిపోయాయి. చాలా నగరాల్లో ఏమా త్రం స్థలం లేదు. ప్రజారవాణా దుస్థితే కార్ల కొను గోలుకు ఒక ప్రోత్సాహకంగా ఉంటోంది. ఇది నిజంగానే ఒక విష వలయం. ఒకే ఒక్క చర్యతో దీన్ని తునాతున కలు చేయవచ్చు. ప్రజారవాణాలో పెట్టుబడులను వేగ వంతం చేయడమే. అయితే ఇదంత సులువైన అంశం కాదు. వస్తున్న కాసిన్ని పెట్టుబడులు కూడా డిమాండ్‌తో పోలిస్తే చాలా తక్కువే మరి. ఇక భారీ ఖర్చుతో కూడిన ప్రాజెక్టు విషయానికి వస్తే వాటి ప్రణాళికకే ఎక్కువ సమయం తీసుకుం టుంది. వాటి నత్తనడకన సాగటం వాటి లక్షణం. దీని ఫలితమే మరిన్ని కార్లకు డిమాండ్ ఏర్పడటం. కార్లు లేనివారికి ముంబై వంటి నగరంలో మోటార్‌బైకులు సురక్షితం కావు. బైకులకు ఎవ్వరూ దారి కల్పించరు. కిక్కిరిసిన కార్ల మధ్యలో బైకర్లు ఉక్కిరిబిక్కిరి అవుతుం టారు. అయినా వీటి సంఖ్య కూడా పెరుగుతుంటుంది. నగర ప్రణాళిక లోనే లోపం ఉంటోంది కనుక మీరు కార్ల కొనుగోలుదార్లను, వినియోగదార్లను తప్పుపట్టలేరు. దేశంలోనే అతి ఎక్కువగా కార్లు ఉన్న నగరం ముంబై. నిజానికి కారు కొని నడపడానికి ఏదైనా అడ్డంకి ఉందంటే అది పార్కింగ్ స్థలాలు లేకపోవడమే. కారు డ్రైవింగ్ ఎంత అలసట గొలుపుతున్నప్పటికీ, డ్రైవర్లకు పెట్టవలసిన వ్యయం కారణంగా కారు యజమానులు సుదూర ప్రాంతాలకు కూడా తామే నడుపుకుంటూ వెళు తుంటారు. పైగా చాలా పెద్దనగరం కాబట్టి, యజమా నిని దింపిన తర్వాత అతడి కుటుంబం ఉప యోగించు కోవడానికి డ్రైవర్లు ఆ కారును వెనక్కు తీసుకెళ్లలేరు. వారు తోటి డ్రైవర్లతో కలసి కారు బ్యానెట్లపై కూర్చుని వృథా కాలక్షేపం చేస్తూ పేకాట ఆడుతూ ఉంటారు. కారు పార్కు చేసి ఉంచడమే డ్రైవర్ పని అన్నమాట. దాదాపు 29 సంవత్సరాల నా నగర జీవితంలో పాదచారులు తిరిగే ప్రాంతాలనుకూడా పార్కింగ్ కోసం ఆక్రమించుకునేంతగా పరిస్థితి రాన్రానూ దిగజారుతోనే వస్తోంది. ఇకపోతే, భవనాల వెలుపలి ప్రాంతంలో రాత్రిపూట పార్కింగ్ చేసేవారినుంచి రుసుము వసూలు చేయడానికి నగరపాలక సంస్థ తలపెట్టిన పథకం తీవ్ర వ్యతిరేకతను చవిచూసింది. పార్కింగ్ స్థలాల కోసం, ముందే నిర్మించిన భవనాలను మార్పు చేసే వీలులేదు. కొత్త భవనాలను నిర్మించాలంటే ప్రతి అపార్టుమెంటు లోపలే పార్కింగ్ స్థలం ఉండేలా నిబంధనలు ఉన్నాయి. అయితే ఇది నూతన నిర్మాణాలకు మాత్రమే వర్తి స్తుంది. మెర్సిడెజ్, బీఎమ్‌డబ్ల్యూ వంటి విలాసవంత మైన కార్లు రోడ్డు పక్కనే పార్కు చేయడం తప్పితే వేరే గత్యంతరం లేదు. నగరంలో ఏ ప్రాంతాన్ని చూసినా డ్రైవ్ చేయడానికి కాకుండా నడవడానికి మాత్రమే పని కొచ్చేలా కనిపిస్తుంటుంది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది కాబట్టి మీరు డ్రైవ్ చేయలేరు. ఒక ఫ్లాట్‌కు ఒక పార్కింగ్ స్థలం అంటూ తీసుకొచ్చిన నూతన భవన నిర్మాణ నిబంధనలు బిల్డర్లకు అదనపు డబ్బు సంపాదించుకోవడంలో సహాయం చేస్తున్నాయి. దీన్ని పురపాలక సంస్థ అసలు పట్టించుకోదు. మరొకవైపున, నగరం వింత పరిస్థితిలో చిక్కుకు పోయింది. బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై - ట్రాన్స్పోర్ట్ (బీఈఎస్‌టీ) పేరిట ఉన్న ప్రజారవాణా సంస్థ నగ రంలో అన్ని ప్రాంతాలకూ సేవలందించేలా చక్కటి రూట్ ప్లాన్‌ని కలిగి ఉన్నప్పటికీ, వాటిని ప్రజలకు అను కూలంగా నడపడం లేదు. కార్ల ట్రాఫిక్ బస్సు వేగాన్ని మందగింపజేస్తోంది. ఒక బస్సు రోజుకు కనీసం 200 కిలోమీటర్లు ప్రయాణించడం అసాధ్యంగా మారింది. ఫలితంగా, ఒక మార్గంలో అన్ని బస్సులు తిరగడం అసాధ్యమైపోయింది, ముంబై నగరజీవికి తక్కిన అన్నిం టికంటే సమయం చాలా ముఖ్యమైనది. బస్సు రాకపో వడం, దొరక్కపోవడం అనేది లోకల్ ట్రెయిన్ని పట్టు కోలేకపోవడం వంటిది కాదు. బస్సు మిస్సయితే అప్పా యింట్మెంట్లు తప్పిపోవచ్చు. అమూల్యమైన సమ యాన్ని కోల్పోవచ్చు కూడా. ముంబైలో నివసించే వ్యక్తికి విహారం అంటే తెలియదు. నిర్దిష్ట ప్రయోజనంతోటే అతడు నడుస్తుంటాడు. ఎందుకంటే అతని వ్యక్తిత్వంలో సమయపాలన చాలా ముఖ్యమైన అంశం మరి. ముంబైలో నివసించేవారి జీవితంలో స్థానిక రైళ్ల గాథ మరొక నిరాశాపూరితమైన భాగం. అయితే ప్రతి రోజూ సుదూర ప్రయాణాలు చేయవలసిన అవసరం వల్ల ప్రయాణికులు కార్లను కొనలేరు, ఉపయోగించ లేరు. వాళ్లు నిజంగా కార్లను కొంటే సగం పనిగంటలను పనిస్థలానికి చేరుకోవడానికి, మిగిలిన సగం పనిగంట లను ఇంటికి వెళ్లడానికి వెచ్చించాల్సి ఉంటుంది. అంటే వారు చేసే పని ఏమీ ఉండదనే దీనర్థం. పైగా కారు యజమానిగా మారాలన్న ఆలోచనను వారి ఆర్థిక స్థితి నీరుగారుస్తుంది.కానీ స్టేషన్ నుంచి పనిచేసే చోటుకి, లేదా ఇంటికి వెళ్లడానికి కార్లతో పోటీ పడవలసి వచ్చిన ప్పుడు మాత్రం వారు వాటిని శాపనార్థాలు పెడతారు. రోడ్లపై కార్లు కిక్కిరిసిపోవడం, రోడ్డు పక్కన పార్కు చేసిన కార్ల వల్ల రహదారులు ఇరుగ్గా మారడం అనేవి బస్సుల వేగాన్ని మందగింపజేస్తుంటాయి. దీంతో ప్రజా రవాణా సంస్థ నష్టాల్లో కూరుకుపోతుం టుంది. డిమాండ్, సరఫరా అనే సమీకరణ రేఖను అధిగమించడం ముంబై ప్రజా రవాణా సంస్థకు సాధ్యం కావటం లేదు. డిమాండును తీర్చనందున రోడ్లపై కార్ల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో అది తన్ను తాను దెబ్బ తీసుకుంటోంది. ప్రయాణికులను ఆకర్షించడానికి ఈ మధ్యే ప్రయాణ చార్జీలపై అది కోత విధించింది. ప్రైవేట్ ఆపరేటర్‌కు ఈ స్థితి కలిగితే తన సంస్థను మూసివేయడం తప్ప మరొక మార్గం ఉండేది కాదు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేష్ విజాపుర్కార్ ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
పట్టాలు తప్పిన లోకల్ రైలు
ముంబై: నగరంలో లోకల్ రైలు ప్రమాదానికి గురికావడంతో మిగతా సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టాలు మారుతున్నప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో రైలు కోచ్ పూర్తిగా ఓ వైపు ఒరిగి పడిపోయింది. లోయర్ పారెల్, ఎలిఫ్ స్టన్ రోడ్ జంక్షన్ల మధ్య జరిగిన ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో బాంద్రా, చర్చ్ గేట్ల మధ్య ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను నెమ్మదిగా నడుపుతుండగా... ఫాస్ట్ లైన్ల రూట్లలో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. కాగా, ప్రమాదానికి గురైన రైలుబోగీలను అక్కడి నుంచి తొలగించేందుకు అధికారులు క్రేన్లను ఉపయోగిస్తున్నారు. -
ఆగిన ముంబై జీవనాడి
ముంబై: హార్బర్ లైన్ మార్గంలో సీఎస్టీ-వడాల మధ్య చేపట్టిన జంబో బ్లాక్ ఆదివారం మూడో రోజుకు చేరుకుంది. అప్ అండ్ డౌన్ మార్గంలో రైల్వే సేవలను మరో 24 గంటలపాటు పూర్తిగా నిలిపేయనున్నారు. దీంతో సీఎస్టీ-వడాల మధ్య మెగాబ్లాక్ కారణంగా రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. శుక్రవారం ప్రారంభమైన మెగా బ్లాక్ ఫిబ్రవరి 22న ఉదయం 1.30 గంటలకు ముగుస్తుంది. రెండు దశలలో నిర్వహిస్తున్న ఈ బ్లాక్‌ను 12 బోగీల రైళ్లను హార్బర్ మార్గంలో నడిపేందుకు కావలసిన మౌలిక సదుపాయలను స్టేషన్లలో కల్పించేందుకు సెంట్రల్ రైల్వే (సీఆర్) చేపట్టింది. మొదటి 24 గంటల్లో సీఎస్టీ వద్ద ప్లాట్‌ఫాం నంబర్ 1 నుంచి రైళ్లు రాక పోకలు నిలిపేశారు. శుక్రవారం మొత్తం 590 సర్వీసుల్లో 445 సేవలు మాత్రమే నడిచాయి. శనివారం ఉదయం 1.30 గంటల నుంచి మొత్తం సర్వీసులను రద్దు చేశారు. హార్బర్ లైన్ సర్వీసులు వడాల నుంచి పన్వెల్, అంధేరి కారిడార్ల మధ్య మాత్రమే రైళ్లు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో ప్రయాణికులను పాస్‌లపై ప్రత్యామ్నాయ మార్గాల్లో అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ‘శుక్రవారం బ్లాక్ ప్రారంభించాం. బ్లాక్ మొదటి దశలో చేయాల్సిన పనులు పూర్తి చేశాం. సీఎస్టీ వద్ద యార్డ్ రీమోడలింగ్ చేశాం. ఈ పని పూర్తయిన తర్వాత డీసీ-ఏసీ కన్వర్షన్ పనులు మార్చి నుంచి మొదలవుతాయి’ అని సీఆర్ చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ చెప్పారు. మెయిన్ లైన్, ట్రాన్స్హార్బర్లైన్ మధ్య సర్వీసుల్లో మార్పు లేదన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే మెగాబ్లాక్ ఈ ఆదివారం ఉండదని, ఆదివారం సర్వీసులు వీక్లీ టైంటేబుల్ ప్రకారం నడుస్తాయన్నారు. సీఎస్టీ-వడాల మధ్య మరిన్ని బస్సులు.. ప్రయాణికుల సౌకర్యార్థం వడాల-సీఎస్టీ స్టేషన్ల మధ్య మరిన్ని బస్సులు నడపనున్నట్లు బెస్ట్ సంస్థ తెలిపింది. కాగా, ప్రాజెక్టు అదనపు సదుపాయాలను ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ (ఎంయూటీపీ) కల్పిస్తుందని, ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎంఆర్వీసీ) ప్రాజెక్టును అమలు చేస్తుందని సీఆర్ పేర్కొంది. అలాగే 12 బోగీల హార్బర్ లైన్ ఈ ఏడాది మే నాటికి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. హార్బర్ లైన్ మార్గంలో పనుల కోసం 300 మంది కార్మికులు, రైల్వే అధికారులను నియమించినట్లు వెల్లడించింది. హార్బర్ లైన్లో సీఎస్టీ-పన్వెల్, సీఎస్టీ-అంధేరి, సీఎస్టీ-బోరివలి మార్గాలున్నాయి. మా కోసమేగా..? ఉదయం, సాయంత్రం సమయాల్లో రైళ్లు సమయానుసారం నడవడంలేద ని, మరోపక్క రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని హార్బర్ లైన్ నివాసి సునీల్ కాంబ్లే అన్నారు. అయితే పని పూర్తయిన తర్వాత తమకు లబ్ధి చేకూరుతుందన్నారు. త్వరలో 12 బోగీల రైళ్లు హార్బర్ మార్గంలో నడవనున్నాయని మరో ప్రయాణికుడు చెప్పారు. మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం వడాల-అంధేరి, వడాల-పన్వెల్ మధ్య ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నామని సీఆర్ చీఫ్ పీఆర్వో పాటిల్ చెప్పారు. సీజన్ టికెట్లపై థానే, కుర్లా, దాదర్ నుంచి వెళ్లేం దుకు ప్రయాణికులకు అనుమతిచ్చామన్నారు. కాగా, గమ్యస్థానానికి చేరుకునేం దుకు ఎక్కువ రైళ్లు మారాల్సి వస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
రైల్లో బట్టలు విప్పి చితకబాదారు
ముంబై: మొబైల్ ఫోన్‌ను దొంగలించారన్న కారణంతో ముంబై లోకల్ ట్రైన్లో దారుణం జరిగింది. ఇద్దరు టీనేజ్ యువకులను కొందరు ప్రయాణికులు చితకబాదారు. వారి బట్టలు విప్పి దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. బాధిత యువకులు నిస్సహాయంగా వేడుకుంటున్నా కనికరం చూపని ఆ వ్యక్తులు దుస్తులు విప్పి వారిని రైలు కంపార్ట్మెంట్లో చితకబాదారు. అనంతరం ప్లాట్‌ఫామ్‌పైకి దిగిన తర్వాత కూడా మళ్లీ యువకులపై దాడి చేసి.. తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయాలైన ఆ యువకుల పరిస్థితి ఏమిటన్నది తెలియరాలేదు. కొన్ని రోజుల కిందట జరిగినట్టు భావిస్తున్న ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, వీడియో ఆధారంగా యువకులను, దాడి చేసినవారిని గుర్తిస్తామని ముంబై రైల్వే పోలీసులు తెలిపారు. -
లోకల్ ట్రైన్లో అమితాబ్ సందడి!
అమితాబ్ బచ్చన్ హఠాత్తుగా లోకల్ ట్రైన్లో ప్రత్యక్షమైతే ప్రయాణీకులు స్వీట్ షాక్‌కు గురవుతారు. వాళ్లతో మాటలు కలిపి, పాటలు కూడా పాడితే జీవితాంతం గుర్తుంచుకోదగ్గ తియ్యని అనుభూతి మిగిలిపోతుంది. ఆదివారం ఉదయం కొంతమంది ప్రయాణీకులకు అలాంటి అనుభూతే మిగిలింది. ముంబయ్ లోకల్ ట్రైన్ ఎక్కి వీటీ నుంచి భండుప్ స్టేషన్ వరకూ అమితాబ్ ప్రయాణం చేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఆదర్శవంతంగా నిలిచే కామన్ మ్యాన్ జీవితానుభవాలను ఆవిష్కరించే ‘ఆజ్ కీ రాత్ హై జిందగీ’ అనే బుల్లితెర షో చేస్తున్నారు అమితాబ్. షోలో మాత్రమే కాకుండా విడిగా ఎవరైనా రియల్ లైఫ్ హీరోని కలవాలనుకున్నారు. ఇందులో భాగంగా సౌరబ్ నింబ్కర్ అనే కుర్రాణ్ణి కలిశారు. లోకల్ ట్రైన్లో దాదర్ నుంచి అంబర్నాథ్ వరకూ ప్రయాణం చేస్తూ, సౌరబ్ పాటలు పాడతాడు. ఆ పాటలను మెచ్చి, ప్రయాణీకులు ఇచ్చే డబ్బుని ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు ఇచ్చేస్తాడు. ఫార్మాక్యూటికల్ కంపెనీలో పని చేస్తున్న సౌరబ్ ఈ పని చేయడానికి కారణం అతని తల్లి కేన్సర్ వ్యాధితో చనిపోవడమే. అప్పట్నుంచీ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఇది తెలిసి, సౌరబ్‌ని ఎంకరేజ్ చేయడం కోసమే అమితాబ్ లోకల్ ట్రైన్లో ప్రయాణం చేశారు. సౌరబ్‌తో కలిసి ఆయన పాటలు పాడారు. బిగ్ బి ఇచ్చిన ఈ ప్రోత్సాహానికి సౌరబ్ ఆనందపడిపోయాడు. -
ముంబైలో మళ్లీ పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్
ముంబై : ముంబై మహానగరంలో మంగళవారం లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అంథేరి నుంచి చర్చి గేట్ కు వెళ్తున్న ఈ లోకల్ ట్రైన్ విల్లే పార్లీ మరియు అంథేరి స్టేషన్ల మధ్య పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటన కారణంగా నగరంలోని లోకల్ ట్రైన్ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రయాణికుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. సోమవారం సాయంత్రం ముంబైలోని చత్రపతి శివాజీ టెర్మినస్ సమీపంలో లోకల్ ట్రైన్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదన్న విషయం తెలిసిందే. -
కోల్‌కతా లోకల్ రైలులో బాంబు పేలుడు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా శివారులో సీల్దా-కష్ణానగర్ లోకల్ రైలులో మంగళవారం తెల్లవారుజామున బాంబు పేలుడు సంభవించింది. 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వైరివర్గాల గ్యాంగ్‌వార్‌లో భాగంగా పేలుడు ఘటన జరిగి ఉంటుందని ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.కె.గుప్తా అభిప్రాయపడ్డారు. -
కోల్ కతా లోకల్ ట్రైన్ లో పేలుడు..
-
కోల్‌కతా లోకల్ ట్రైన్లో పేలుడు,17 మందికి గాయాలు
కోల్ కతా: లోకల్ ట్రైన్ లో పేలుడు సంభవించి సుమారు 17 మంది గాయపడ్డ సంఘటన కోల్‌కతాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సీల్డా-కృష్ణానగర్ రైలు మంగళవారం తెల్లవారుజామున 3:55 గంటలకి టిటాఘడ్ స్టేషన్ నుంచి బయలుదేరిన తరువాత ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా లోకల్ ట్రైన్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. -
మూడో దశకు బెస్ట్ డిపో స్థలాలు
సాక్షి, ముంబై: మెట్రో రైలు ప్రాజెక్టు మూడో దశకు ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఈ దశలో భాగంగా కొలాబా-బాంద్రా-సిబ్జ్ మధ్య నిర్మించనున్న మార్గానికి సంబంధించి బస్సు డిపోకు చెందిన స్థలాల్ని ఇచ్చేందుకు బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ అంగీకరించింది. బెస్ట్ డిపో స్థలాలను ఇవ్వడం వల్ల బస్సు దిగిన ప్రయాణికులకు మెట్రో రైలు, అదేవిధంగా మెట్రో రైలు దిగిన ప్రయాణికులకు బెస్ట్ బస్సులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న బెస్ట్ సంస్థకు లాభం కూడా చేకూరనుంది. నగరంలో అనేక సంవత్సరాల నుంచి బెస్ట్ బస్సులు, లోకల్ రైలు సంయుక్తంగా సేవలందిస్తున్నాయి. లోకల్ రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటపడగానే బెస్ట్ బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. అలాగే వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చిన ప్రయాణిలకు బస్సు దిగగానే రైలు సేవలు అందుతున్నాయి. ఇదే తరహాలో భూగర్భ మార్గంలో చేపట్టనున్న మెట్రో-3 ప్రాజెక్టు పనులకు బెస్ట్ డిపో స్థలాలను వినియోగించుకోవాలని ఎమ్మెమ్మార్సీఎల్ నిర్ణయించింది. ఈ విషయమై బెస్ట్ సంస్థ పరిపాలనా విభాగానికి విజ్ఞప్తి చేసింది. దీంతో హుతాత్మ చౌక్‌లోని విద్యుత్ సబ్ స్టేషన్లో ఖాళీ ఉన్న స్థలాన్ని, సిబ్జ్, సేనాపతి బాపట్ మార్గ్పైనున్న అంబికా మిల్ బస్సు డిపో స్థలాలను ఇచ్చేందుకు బెస్ట్ అంగీకరించింది. ఈ మూడు బెస్ట్ స్థలాల వద్ద భూగర్భంలో మెట్రో-3 రైలు స్టేషన్లు ఉంటాయి. భూగర్భంలో మెట్రో రైలు దిగిన ప్రయాణికులు పైకొచ్చి బెస్ట్ బస్సులు ఎక్కేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దాదాపు 32.5 కి.మీ. భూగర్భ మెట్రో-3 ప్రాజెక్టులో మొత్తం 27 స్టేషన్లు ఉంటాయి. ఇదివరకు చేపట్టిన మెట్రో-1,2 ప్రాజెక్టు కారణంగా బెస్ట్‌కు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. మొన్నటి వరకు బెస్ట్ బస్సుల్లో ప్రయాణించే వారంతా మెట్రో రైలు రావడంతో అందులోనే వెళుతున్నారు. దీంతో బెస్ట్ సంస్థ తీవ్రంగా నష్టపోతోంది. అయితే మెట్రో-3 ప్రాజెక్టులో బెస్ట్ డిపో స్థలాలను వాడుకోవడం వల్ల రైలు దిగిన ప్రయాణికులకు బస్సులు అక్కడే అందుబాటులో ఉంటాయి. దీంతో రైలు దిగిన ప్రయాణికులు ఆటోలు, ట్యాక్సీలకు బదులుగా బెస్ట్ బస్సులనే ఆశ్రయిస్తారు. ఇదొక రకంగా బెస్ట్‌ను ఆర్థికంగా ఆదుకున్నట్లే అవుతుందని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎమ్మెమ్మార్సీఎల్) భావిస్తోంది. -
‘లోకల్’ ఢీకొని గ్యాంగ్‌మేన్ మృతి
సాక్షి, ముంబై: సెంట్రల్ రైల్వే మార్గంలో సోమవారం మధ్యాహ్నం ఓ లోకల్ రైలు ఢీ కొని గ్యాంగ్‌మేన్ మరణించాడు. దీంతో ఆగ్రహానికి గురైన నాలుగో శ్రేణి ఉద్యోగులందరూ రైలురోకో నిర్వహించారు. దీంతో అరగంట పాటు ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఠాణే-ములుండ్ స్టేషన్ల మధ్య గ్యాంగ్ మెన్ పట్టాలపై పనులు చేస్తున్నారు. ఠాణే నుంచి ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) దిశగా వెళుతున్న లోకల్ రైలు వేగంగా దూసుకొచ్చింది. రైలు దగ్గరకు వచ్చేవరకు వీరికి తెలియకపోవడంతో పట్టాల మధ్యలో పనిచేస్తున్న మాధవ్ స్వామి (54)ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడే మరణించాడు. దీంతో నాలుగో శ్రేణి ఉద్యోగులందరూ ఆగ్రహానికి గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆరోపించారు. గతంలో కూడా ఇలాగే అనేక సందర్భాలలో గ్యాంగ్మన్ పట్టాలపై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు రైళ్లు ఢీకొని మరణించిన ఘటనలున్నాయి. కాగా, వారికి భద్రత కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చిన అధికారులు నిధులు మంజూరు చేశారు కాని ఇంతవవరకు హామీలు అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో సోమవారం నాటి ఘటనతో తిరిగి గ్యాంగ్‌మెన్ రక్షణపై ఆందోళన వ్యక్తమైంది. తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైలు పట్టాలపై ఆందోళనకు దిగారు.దీంతో అరగంటపాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చివరకు ఉన్నతాధికారులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. -
నీటి కోసం రైలు ఎక్కాల్సిందే
సాక్షి, ముంబై: కిలోమీటర్ల దూరం వెళ్లి తాగేందుకు నెత్తిన బిందెలు మోసుకుంటూ వెళ్లే మహిళలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా కన్పిస్తుంటారు. అయితే ఇలాంటి సన్నివేశాలు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో దర్శనమిస్తున్నాయి. ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దివా ప్రాంతంలోని అనేక మంది మహిళలు ఉదయం తాగు నీటి కోసం ఏకంగా రైళ్లలో ప్రయాణించాల్సి వస్తోంది. బిందెడు నీటి కోసం ప్రతి రోజు లోకల్ రైళ్లో ఉదయం వెళ్లడం ఇక్కడ సర్వసాధరణమైన విషయం అయిపోయింది. కేవలం నీటి కోసం ఇక్కడి మహిళలు ప్రతి నెల లోకల్ రైలు పాస్ తీసుకుంటున్నారంటే ఇక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్నది అర్థమవుతోంది. ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దివా ప్రాంతంలో నీటి సరఫరా సరిగా లేదు. ఇక్కడ చాలా చౌకగా ఇళ్లు లభిస్తుండడంతో అనేక మంది మద్యతరగతి, పేద ప్రజలు దివాలో ఇళ్లను కొనుగోలు చేశారు. అయితే ఈ ఇళ్లలో తాగేందుకు నీరు రాక నరకయాతన అనుభవిస్తున్నారు. దివాలోని అనేక ప్రాంతాల్లోని మహిళలు ప్రతిరోజు కళ్యాణ్ నుంచి ముంబై సీఎస్టీ వెళ్లే లోకల్ రైల్లో ముంబ్రాకి వెళుతున్నారు. ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో దివా రైల్వేస్టేషన్లో బిందె లు పట్టుకున్న మహిళలు కనిపిస్తున్నారు. కొత్తగా నిర్మించిన దివాలోనే... దివా గ్రామంలో మాత్రం నీటి సరఫరా బాగానే ఉంది. అయితే గత ఏడెనిమిది ఏళ్ల క్రితం కొత్తగా ఏర్పాటైన దివా ప్రాంతంలోని చాల్స్, బిల్డింగ్‌లలోనే ఈ నీటి ఇక్కట్లు ఉన్నాయి. ప్రారంభంలో చాల్స్‌లోని కొన్ని ఇళ్లకు నీటి కుళాయిల ద్వారా నీటి సరఫరా జరిగేదని కొందరు స్థానికులు చెప్పారు. అయితే భవనాలన్నీ నిర్మాణ దశలో ఉన్నాయని, దీంతో తొందర్లోనే 24 గంటల నీటి సరఫరా ఉంటుందని చెప్పి దాదాపు అన్ని గదులు, ఫ్లాట్లను బిల్డర్లు విక్రయించారు. ఆ తర్వాత కొంతకాలం వీరే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశారు. ఇలా మెల్లమెల్లగా నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో తాగు నీటి సమస్య తీవ్రంగా ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో బోరింగులున్నా తాగేనీటి కోసం ముంబ్రా వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తూర్పు ముంబ్రాలోని శని మందిరం సమీపంలో ఉన్న నీటి కుళాయి నుంచి నీరు నింపుకుంటున్నారు. దీంతో ఇక్కడ కూడా రద్దీ కన్పిస్తోంది. ఒక్క బిందేడు నీటి కోసం రెండు గంటల సమయం శ్రమించాల్సి వస్తోందని ఇక్కడి మహిళలు తమ గోడును వెల్లబోస్తున్నారు. -
విడిపోయిన లోకల్రైలు బోగీలు
మోటర్‌మెన్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి కల్యాణ్ బయలుదేరిన లోకల్ రైలు మధ్య కప్లింగ్ ఊడి బోగీలు విడిపోయాయి. అయితే మోటార్‌మెన్ (డ్రైవర్) అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం దీవా-కోపర్ స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. దీనివల్ల దాదాపు గంటకుపైగా లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సాయంత్రం విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేకమంది రైలు దిగి కాలినడకన వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో దీవా స్టేషన్ నుంచి లోకల్ రైలు కల్యాణ్ దిశగా బయలుదేరింది. కొంత దూరం వెళ్లగానే ఏడో బోగీ, ఎనిమిదో బోగీ మధ్యనున్న కప్లింగ్ ఊడింది. అప్పటికీ రైలు వేగం పుంజుకోలేదు. ఏడు బోగీలతో రైలు ముందుకు వెళ్లిపోయింది. వెనకా ఉన్న ఐదు బోగీలు కొంత దూరం వెళ్లి ఆగిపోయాయి. చీకటి కారణంగా రైలులో ఉన్న ప్రయాణికులకు అసలేం జరిగిందో తెలియలేదు. బయటకు తొంగి చూడగా కప్లింగ్ ఊడిపోవడంతో ఏడు బోగీలతో రైలు ముందుకు వెళ్లినట్లు గుర్తించారు. ఐదు బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులు కిందికి దిగేశారు. ఈ విషయాన్ని గుర్తించిన మోటార్‌మెన్ వెంటనే రైలును ఆపాడు. తర్వాత విడిపోయిన ఐదు బోగీలను కారుషెడ్డుకు తరలించారు. అప్పటికే వెనకాల వచ్చిన రైళ్లన్నీ ట్రాక్‌పై నిలిచిపోయాయి. కొన్ని లోకల్ రైళ్లను వీలున్న చోట దారి మళ్లించి ఫాస్ట్ ట్రాక్ మీదుగా నడిపారు. రైళ్లను పునరుద్ధరించడానికి అధికారులు కష్టపడ్డారు. రాత్రి 10 గంటల తర్వాత రైళ్లన్నీ షెడ్యూల్ ప్రకారం నడిచాయి. -
‘లోకల్’ కనీస చార్జీ రూ. 10
సాక్షి, ముంబై: లోకల్ రైళ్ల కనీస చార్జీ త్వరలో రూ. 10 కానుంది. ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ (ఎంయూటీపీ) ప్రాజెక్టు కోసం ముంబై రైల్వే అభివృద్ధి సంస్థ (ఎంఆర్వీసీ) గతంలో ప్రపంచ బ్యాం కు నుంచి రెండు విడతలుగా రుణం తీసుకుంది. ఈ రుణాలను తిరిగి ప్రపంచ బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుందని, ఇందుకోసం కనీస చార్జీలను పెంచాలని నిర్ణయించామని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. కాగా ఎంఆర్వీసీ.. ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడత కింద రూ.1,613 కోట్లు, రెండోవిడత కింద రూ.1,910 కోట్ల రుణం తీసుకుంది. ఇటీవల సమావేశమైన రైల్వేబోర్డు కనీస చార్జీలను పెంచాలని నిర ్ణయించింది. కనీస చార్జీతోపాటు నెలసరి పాస్ చార్జీలుకూడా పెరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ విషయమై సంబంధిత అధికారులు మాట్లాడుతూ తాము ప్రపంచబ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను తీర్చడానికి సంవత్సరానికి రూ.40 కోట్లు సం పాదించాల్సి వస్తుందన్నారు. దీంతో గత్యంతరం లేక చార్జీలను పెంచాల్సి వచ్చిందన్నారు. చార్జీలను పెంచితే రాబడి పెరుగుతుందని, తద్వారా ప్రపంచబ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించడం సులభమవుతుందన్నారు. అయితే రైల్వే బోర్డు నిర్ణయంపై కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని మరోసారి పరిశీలిస్తే బాగుంటుందంటూ భారత్ మర్చెంట్స్ చాంబర్ సభ్యులు... రైల్వేబోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మా చేతుల్లోమీ ఏమీ లేదు రైల్వే బోర్డు సూచనల మేరకే తాము నడుచుకుంటుమని పశ్చిమ రైల్వే విభాగం పీఆర్వో శరత్ చంద్రాయన్ పేర్కొన్నారు. చార్జీలను పెంచడం, పెంచకపోవడం వారి చేతుల్లోనే ఉంటుం దన్నారు. -
మహిళా బోగీలో ప్రయాణం:ఇద్దరు యువకుల అరెస్టు
ముంబై: లోకల్రైలు మహిళా బోగీలో ప్రయాణించిన ఐదుగురు యువకులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు శనివారం అరెస్టు చేశారు. కింగ్స్ సర్కిల్ రైల్వే స్టేషన్ నుంచి మాిహ ం వరకు మహిళాబోగీలో ప్రయాణించిన రాజ్‌కుమార్, సిరాజ్ షేక్, మోహినుద్దీన్ షేక్, సత్య గణేష్, మరో బాలుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. న్యాయమూర్తి వీరికి జరిమానా విధించారు. ఇదిలా వుండగా హార్బర్‌లైన్‌లో మహిళా బోగీల్లో కొందరు యువకులు తరచూ ప్రయాణిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో ఇలాంటి వారిని గుర్తించడానికి ఆర్పీఎఫ్ ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది.