ప్రియురాలు మోసం చేసిందని.. | Youth commits suicide by jumping in front of train in Mumbai | Sakshi
Sakshi News home page

ప్రియురాలు మోసం చేసిందని..

Published Tue, Jul 31 2018 1:15 PM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Youth commits suicide by jumping in front of train in Mumbai - Sakshi

ముంబై : ప్రియురాలు మోసం చేసిందని ఓ 25 ఏళ్ల యువకుడు ట్రైన్‌ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని కళ్యాణ్‌ సమీపంలో అంబివ్లీకి చెందిన రాజేశ్‌ ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్నాడు. అయితే రాజేశ్‌, అతని ప్రియురాలికి మధ్య ఇటీవలే గొడవ అయినట్టు అధికారులు తెలిపారు. జూలై 26న ఆమె రాజేశ్‌కు ఫోన్‌ చేసి వితుల్‌ వాడీ స్టేషన్‌కు రావాలని కోరింది. స్టేషన్‌లో వారిద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో అక్కడే ఉన్న రైల్వే పోలీసులు వారిద్దరిని అక్కడి నుంచి వెళ్లాలని సూచించారు.

ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే రాజేశ్‌ తన ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రియురాలు తనని చీట్‌ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. చివరగా తన సోదరుడు, మిత్రుడితో మాట్లాడాడు. ఫోన్‌ పాస్‌వర్డ్‌ను మిత్రుడితో చెప్పి, స్విచ్‌ఆఫ్‌ చేసి లోకల్‌ ట్రైన్‌ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 26న ఈ సంఘటన చోటుచేసుకున్నా, ఆత్మహత్యకు మందు రాజేశ్‌ తీసిన సెల్ఫీ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement