selfy video
-
టెక్ టమారం : ఎగిరిపోయే సెల్ఫీ కెమెరాలు వచ్చేశాయి..ధరెంతంటే?!
స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు తీసుకోవడం అందరికీ తెలిసిన సంగతే! స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీలు తీసుకోవడంలో చాలా పరిమితులు ఉన్నాయి. పరిమితమైన భంగిమల్లోనే ఫొటోలు తీసుకోవడం సాధ్యమవుతుంది. సెల్ఫీలను మరింత చక్కగా, స్పష్టంగా తీసుకునేందుకు వీలైన డ్రోన్ కెమెరాను అమెరికన్ కంపెనీ ‘హోవర్’ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. అరచేతిలో ఇమిడిపోయే పరిమాణంలో ఉండే ఈ డ్రోన్ కెమెరా చాలా తేలికగా కూడా ఉంటుంది. దీని బరువు 125 గ్రాములు మాత్రమే. దీనిని అరచేతి నుంచే టేకాఫ్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా దీని కదలికలను నియంత్రించవచ్చు. ఇందులో క్విక్షాట్ మోడ్‌ను ఎంపిక చేసుకుంటే, వెంట వెంటనే సెల్ఫీ ఫొటోలు, వీడియోలు తీస్తుంది. ఫాలో మోడ్‌ను ఎంపిక చేసుకుంటే, మనం కోరుకున్న చోటుకు అనుసరిస్తూ వీడియోలు చిత్రిస్తుంది. ఇది తీసే ఫొటోలను, వీడియోల ప్రీవ్యూలను మొబైల్లో లైవ్‌లో చూసుకోవచ్చు. ‘హోవర్ కెమెరా ఎక్స్1’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ కెమెరా వీడియో బ్లాగర్లకు, ఔత్సాహిక ఫిలిమ్ మేకర్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని ధర 389 డాలర్లు (రూ.31,924) మాత్రమే! -
‘సోనీ క్షమించు! నీకు ఏం చేయలేకపోయా’ కన్నీటితో భర్త
గుడిహత్నూర్ (బోథ్): ‘సోనీ.. నన్ను క్షమించు. నీకు, పిల్లలకు ఏం చేయలేక పోయాను. నువ్వు చాలా అమాయకురాలివి.. నీ సంతోషం కోసం ఎక్కడికి తీసుకెళ్లలేకపోయా.. బంగారం లాంటి నా పిల్లలను వీడి చనిపోతున్నా’ అంటూ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వ్యాపారి జక్కుల శ్రీనివాస్ (38) సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ‘అప్పులు, వడ్డీల మీద వడ్డీలు తీసుకుంటున్న వారిని దూషి స్తూ.. నా చావుతోనైనా వారికి కనువిప్పు కలగాలి’ అని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుడిహత్నూర్‌లో జరిగింది. ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్ కాలనీకి చెందిన జక్కుల శ్రీనివాస్ ఉస్మాస్ బిస్కెట్ ఏజెన్సీ నడిపిస్తూ ఉపాధి పొందుతున్నాడు. వ్యాపారంతోపాటు తనకు తెలిసిన వారికి ఇతరుల దగ్గరి నుంచి అప్పులు ఇప్పించాడు. శ్రీనివాస్ పూచికత్తుగా ఉండి అప్పులు ఇప్పించడంతో అప్పు తీసుకున్నవారు సకాలంలో చెల్లించకపోవడంతో ఇచ్చినవారికి శ్రీనివాస్ వడ్డీలు కూడా చెల్లించాడు. ఇలా ఇతరుల అప్పులు చెల్లిస్తూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తన భార్య సోనిని జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్‌లో ఉండే అత్తవారింట్లో వదిలి పనిపై గుడిహత్నూర్ వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. మాన్కాపూర్ శివారులో పత్తి చేను వద్ద పురుగుల మందుతో వెళ్లిన శ్రీనివాస్ ముందుగా సెల్ఫీ వీడియో తీశాడు. భార్య సోని, కూతురు లక్ష్మీభవాని, కొడుకు దుర్గాప్రసాద్‌ను తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. (చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి) తీసుకున్న అప్పులు, ఇప్పించి అప్పులు వాటికి తాను నెలనెలా కడుతున్న వడ్డీలు మానవత్వం లేకుండా అప్పులు ఇచ్చినవారు వేధిస్తున్న తీరును చెప్పుకొచ్చాడు. తన చావుకు అప్పులు వారు, డీసీబీ బ్యాంకు సిబ్బంది వేధింపులే కారణమని తెలిపాడు. గత్యంతరం లేక తాను ఆత్మహత్య చేసుకుని తన కుటుంబానికి దూరమవుతున్నానని అన్నాడు. కాగా, సాయంత్రం అయినా శ్రీనివాస్ ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు వాకబు చేస్తూ వెతికారు. గురువారం ఉదయం మాన్కాపూర్ శివారు పత్తి చేనులో శ్రీనివాస్ పురుగుల మందు తాగి విగత జీవిగా పడి ఉన్నాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. చదవండి: 8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే! -
అత్తారింట్లో గొడవ: చనిపోతున్నానని సెల్ఫీ వీడియో
సాక్షి,దోమకొండ(నిజామాబాద్): బీబీపేట మండలం యడారం గ్రామానికి చెందిన వల్లెపు రమేష్(39)అనే యువకుడు ఆదివారంరాత్రి దోమకొండ మండలంలింగుపల్లిలో అత్తారింట్లో గొడవపడి వెళ్లిపోయడని ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ తెలిపారు. వివరాలు.. రమేష్ ఆదివారం రాత్రి అత్తారింట్లో బావమరిది శ్రీకాంత్‌తో గొడవ పడి బైక్ తీసుకుని వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి తాను ఆత్మహత్య చేసుకుంటున్నాననిసెల్ఫీ వీడియో తీసి దానిని బావమరిది శ్రీకాంత్కుపంపినట్లు ఎస్సై చెప్పారు. దీంతో రమేష్ మామ,బావమరిది వెంటనే పోలీస్‌స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ అధారంగా ఆదివారం రాత్రి నుంచి వెతకగా సోమవారంఉదయం దోమకొండ శివారులోని మల్లికార్జునస్వామి ఆలయం సమీపంలో రమేష్ బైక్, దానికి కొద్ది దూరంలో షర్టు లభించాయన్నారు. కాగా తమ కొడుకును అత్తాగారింటి వారు చంపి ఉంటారని రమేష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డాగ్‌స్వాడ్‌తో వెతికినా ఆచూకీ లభించలేదని ఎస్సైతెలిపారు. రమేష్ తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా రమేష్ మామతో పాటు బావమరిదిపై గతంలో పలువురిపై దాడులు, దొంగతనం కేసులు ఉన్నాయని ఎస్సై చెప్పారు. చదవండి: వామ్మో.. బంధువులని చేరదీస్తే ఎంత పనిచేశారు.. -
ప్రియురాలు మోసం చేసిందని..
ముంబై : ప్రియురాలు మోసం చేసిందని ఓ 25 ఏళ్ల యువకుడు ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని కళ్యాణ్ సమీపంలో అంబివ్లీకి చెందిన రాజేశ్ ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. అయితే రాజేశ్, అతని ప్రియురాలికి మధ్య ఇటీవలే గొడవ అయినట్టు అధికారులు తెలిపారు. జూలై 26న ఆమె రాజేశ్‌కు ఫోన్ చేసి వితుల్ వాడీ స్టేషన్‌కు రావాలని కోరింది. స్టేషన్లో వారిద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో అక్కడే ఉన్న రైల్వే పోలీసులు వారిద్దరిని అక్కడి నుంచి వెళ్లాలని సూచించారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే రాజేశ్ తన ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రియురాలు తనని చీట్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. చివరగా తన సోదరుడు, మిత్రుడితో మాట్లాడాడు. ఫోన్ పాస్‌వర్డ్‌ను మిత్రుడితో చెప్పి, స్విచ్ఆఫ్ చేసి లోకల్ ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 26న ఈ సంఘటన చోటుచేసుకున్నా, ఆత్మహత్యకు మందు రాజేశ్ తీసిన సెల్ఫీ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భానూ.. నా ముఖాన ఇంత బొట్టు పెట్టు
♦ సెల్ఫీ వీడియోలో స్నేహితుడికి చివరి విజ్ఞప్తి ♦ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సాక్షి, నెల్లూరు: ‘భానూ..ఒకే ఒక కోరిక ఉంది తీరుస్తావా..నా చేతులకు గాజులు వేసి..నా ముఖాన ఇంత బొట్టుపెట్టు..మనకి భగవంతుని దృష్టిలో ఎప్పుడో పెళ్లయిపోయింది భానూ.. ఈ ఒకే ఒక్క కోరిక తీరుస్తావని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇంకెప్పుడు నీ లైఫ్‌లోకి..ఇంకెవరి లైఫ్‌లోకి రాను.. మీకందరికీ దూరంగా వెళ్లిపోవాలని..ముఖ్యంగా ఈ నరకాన్ని భరించలేక వెళ్లిపోతున్నాను.. ఇక సెలవ్..’ అంటూ వీడియో సెల్ఫీ తీసుకున్న ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ బలవన్మరణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం నింపాయి. కావలిలోని కో-ఆపరేటివ్ కాలనీకి చెందిన వీర మాధవి (28) పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు నెల్లూరుకు చెందిన భానుతేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో నగదు, నగలు, సర్వం అర్పించుకుంది. తర్వాత ప్రేమించిన వ్యక్తి ముఖం చాటేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన మనస్సులోని బాధనంతా సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాక సోదరి జానకి మాధవికి చెందిన సెల్‌ఫోన్‌ను పరిశీలించడంతో సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడు భానుతేజను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. -
సూసైడ్ నోట్‌గా సెల్ఫీ వీడియో
* అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య * ప్రేమ వ్యవహారమే కారణం * సూసైడ్ నోట్‌గా సెల్ఫీ వీడియో కావలి అర్బన్/నెల్లూరు (క్రైమ్): ‘భానూ..బతుకుమీద ఆశలేదు..బతకాలన్న కోరికలేదు..చనిపోవాలన్న ఒక్కే ఒక్క ఉద్దేశం..ఎప్పుడెప్పుడు ఈ లైఫ్ నుంచి తప్పుకోవాలి..నీకు దూరంగా..నీ జ్ఞాపకాలకు దూరంగా వెళ్లిపోవాలి..ఎవరికీ భారం కాను..నేను వెళ్లిపోతున్నా..ఈ సమస్యలకు పరిష్కారం ఉంటుందని ఈ పని చేస్తున్నాను..నరకం అనుభవించాను భానూ.. ఇక నావళ్లకాదు..తప్పే చేస్తున్నానో..మంచే చేస్తున్నానో నాకు తెలియదు..కానీ నాకు ఈ బతుకు వద్దు..ఈ బతుకు నేను భరించలేను..ఇప్పటికే చాలా నరకం చూశాను..ఇక నాకు మాట్లాడే టైమ్‌లేదు..అంత అవకాశము లేదూ..నీకు చెప్పాల్సిన అవసరమూ లేదు. కాని ఒకే ఒక కోరిక..మధూ నిన్నే చేసుకుంటాను..నిన్ను వదులుకోను..మా వాళ్లను ఒప్పించుకుంటానని అన్నావే..అంత అవసరం ఏముందిలే భాను..నేనే నీకు దూరంగా వెళ్లిపోతున్నాను.. చనిపోవాలని రోజురోజుకు నాలో ఆలోచన ఎక్కువైపోతోందే తప్ప అందరి దృష్టిలో మంచిగా ఉంటూ పైకి నటిస్తున్నానే తప్ప...నాలో ఎంత బాధననేది ఉందో ఎంత నరకమనేది ఉందో ఎవరికీ చెప్పుకోలేను..ఇక నేను తిరిగిరాని లోకాలకు వెళుదామని నిర్ణయించుకొని ఈ పనిచేస్తున్నాను. ఇది తప్పా...ఒప్పో నాకైతే తెలియదు..నన్ను క్షమించండి ప్రతి ఒక్కరు..ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నన్ను క్షమించమని..సునీల్ భానుతో పాటు నన్ను చూడడానికి వస్తారు కదా.. ఒకే ఒక కోరిక ఉంది తీరుస్తావా భానూ..నా చేతులకు గాజులువేసి..నా ముఖాన అంత బొట్టుపెట్టు..మనకి భగవంతుని దృష్టిలో ఎప్పుడో పెళ్లపోయింది భాను...ఈ ఒకే ఒక్క కోర్కే తీరుస్తావని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇంకెపుడు నీలైఫ్లోకి...ఇంకెవ్వరి లైఫ్‌లోకి రాను. మీకందరికి దూరంగా వెళ్లిపోవాలని..ముఖ్యంగా ఈ నరకాన్ని భరించలేక వెళ్లిపోతున్నాను. భానూ..నీకు దూరంగా...నీ జ్ఞాపకాలకు దూరంగా వెళ్లిపోదామని నేను ఇలాగా...ఆలోచించాను... ఇది తప్పుకాదు..ఎవ్వరిని నేను బ్లాక్మెయిల్ చేయడం లేదు..ఎవ్వరిని మోసం చేయడం లేదు. నాకు అంత టైంలేదు...ఇక మాట్లాడేంత అవకాశములేదు.ఈ టైమ్ మళ్లీమళ్లీ నాకు రాదు. ఎన్నో సార్లు ప్రయత్నంచేశాను...ఏమైనా చేసేసేకోవాలని..కాని అవన్నీ నన్ను ఏం చేయలేకపోయాయి. ఇక ఇప్పుడు తప్పదు..తప్పనిసరిగా వెళ్లిపోవాలి..నాకు ఈ బతుకు వద్దు...ఈ బతుకును బతకలేను భాను..రోజూ ఈ నరకం అనుభవిస్తూ నేను బతకలేను. నావల్లకాదు భాను...సెలవు భాను....మీ అందరికి సెలవు...ఒక్కసారి నేను చనిపోయానని తెలుసుకొని నీవ్వొస్తావని ఎదురు చూస్తూ ఉంటాను భాను..సునీ ఇక నీకు చెల్లెలు లేరు..నన్ను క్షమించండి..ఇంతకు మించి నేనేమి చెప్పలేను..ఈ నరకాన్ని మాత్రం నేను భరించలేక..ఈ.సమస్యకు పరిష్కారమొక్కటే...నేననేదాన్ని ఉండకూడదు.ఇదొక్కటే సమస్యకు పరిష్కారం..వెళుతున్నాను. సెలవు..’ ఇవి ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ సెల్‌ఫోన్ వీడియోలో రికార్డ చేసిన చివరి మాటలు. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఆమె ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు..కావలి కోఆపరేటివ్ కాలనీకి చెందిన వీర మాధవి(28) పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాథ్స అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణం చెందింది. అనంతరం సోదరి జానకి ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించగా అందులో రికార్డు చేసిన సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లి శాంతమ్మ పోలీసులను ఆశ్రయించింది. విచారిస్తే..మాధవికి నెల్లూరులో ఓ బంగారు దుకాణంలో పనిచేసే భానుతేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అతనితో సన్నిహితంగా మెలిగింది. అయితే మాధవి తల్లి శాంతమ్మ పేరు మీదున్న ఆస్తులపై భానుతేజ కన్నేశాడు. అవి తన పేరిట రాసివ్వాలని డిమాండ్ చేశాడు. పెళ్లయిన తర్వాత రాస్తామని చెప్పినా అతడు అంగీకరించలేదు. ఈ విషయంలోనే ఆమె మనస్థాపానికి గురై ప్రాణాన్ని తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సోమవారం కావలి ఏరియా ఆస్పత్రిలో మాధవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. సెల్‌ఫోన్‌లోని సెల్ఫీవీడియో, మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తల్లి పేరుతో రాసిన సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.