సూసైడ్ నోట్గా సెల్ఫీ వీడియో
* అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య
* ప్రేమ వ్యవహారమే కారణం
* సూసైడ్ నోట్గా సెల్ఫీ వీడియో
కావలి అర్బన్/నెల్లూరు (క్రైమ్): ‘భానూ..బతుకుమీద ఆశలేదు..బతకాలన్న కోరికలేదు..చనిపోవాలన్న ఒక్కే ఒక్క ఉద్దేశం..ఎప్పుడెప్పుడు ఈ లైఫ్ నుంచి తప్పుకోవాలి..నీకు దూరంగా..నీ జ్ఞాపకాలకు దూరంగా వెళ్లిపోవాలి..ఎవరికీ భారం కాను..నేను వెళ్లిపోతున్నా..ఈ సమస్యలకు పరిష్కారం ఉంటుందని ఈ పని చేస్తున్నాను..నరకం అనుభవించాను భానూ..
ఇక నావళ్లకాదు..తప్పే చేస్తున్నానో..మంచే చేస్తున్నానో నాకు తెలియదు..కానీ నాకు ఈ బతుకు వద్దు..ఈ బతుకు నేను భరించలేను..ఇప్పటికే చాలా నరకం చూశాను..ఇక నాకు మాట్లాడే టైమ్‌లేదు..అంత అవకాశము లేదూ..నీకు చెప్పాల్సిన అవసరమూ లేదు. కాని ఒకే ఒక కోరిక..మధూ నిన్నే చేసుకుంటాను..నిన్ను వదులుకోను..మా వాళ్లను ఒప్పించుకుంటానని అన్నావే..అంత అవసరం ఏముందిలే భాను..నేనే నీకు దూరంగా వెళ్లిపోతున్నాను..
చనిపోవాలని రోజురోజుకు నాలో ఆలోచన ఎక్కువైపోతోందే తప్ప అందరి దృష్టిలో మంచిగా ఉంటూ పైకి నటిస్తున్నానే తప్ప...నాలో ఎంత బాధననేది ఉందో ఎంత నరకమనేది ఉందో ఎవరికీ చెప్పుకోలేను..ఇక నేను తిరిగిరాని లోకాలకు వెళుదామని నిర్ణయించుకొని ఈ పనిచేస్తున్నాను. ఇది తప్పా...ఒప్పో నాకైతే తెలియదు..నన్ను క్షమించండి ప్రతి ఒక్కరు..ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నన్ను క్షమించమని..సునీల్ భానుతో పాటు నన్ను చూడడానికి వస్తారు కదా..
ఒకే ఒక కోరిక ఉంది తీరుస్తావా భానూ..నా చేతులకు గాజులువేసి..నా ముఖాన అంత బొట్టుపెట్టు..మనకి భగవంతుని దృష్టిలో ఎప్పుడో పెళ్లపోయింది భాను...ఈ ఒకే ఒక్క కోర్కే తీరుస్తావని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇంకెపుడు నీలైఫ్‌లోకి...ఇంకెవ్వరి లైఫ్‌లోకి రాను.
మీకందరికి దూరంగా వెళ్లిపోవాలని..ముఖ్యంగా ఈ నరకాన్ని భరించలేక వెళ్లిపోతున్నాను. భానూ..నీకు దూరంగా...నీ జ్ఞాపకాలకు దూరంగా వెళ్లిపోదామని నేను ఇలాగా...ఆలోచించాను...
ఇది తప్పుకాదు..ఎవ్వరిని నేను బ్లాక్‌మెయిల్ చేయడం లేదు..ఎవ్వరిని మోసం చేయడం లేదు.
నాకు అంత టైంలేదు...ఇక మాట్లాడేంత అవకాశములేదు.ఈ టైమ్ మళ్లీమళ్లీ నాకు రాదు. ఎన్నో సార్లు ప్రయత్నంచేశాను...ఏమైనా చేసేసేకోవాలని..కాని అవన్నీ నన్ను ఏం చేయలేకపోయాయి.
ఇక ఇప్పుడు తప్పదు..తప్పనిసరిగా వెళ్లిపోవాలి..నాకు ఈ బతుకు వద్దు...ఈ బతుకును బతకలేను భాను..రోజూ ఈ నరకం అనుభవిస్తూ నేను బతకలేను. నావల్లకాదు భాను...సెలవు భాను....మీ అందరికి సెలవు...ఒక్కసారి నేను చనిపోయానని తెలుసుకొని నీవ్వొస్తావని ఎదురు చూస్తూ ఉంటాను భాను..సునీ ఇక నీకు చెల్లెలు లేరు..నన్ను క్షమించండి..ఇంతకు మించి నేనేమి చెప్పలేను..ఈ నరకాన్ని మాత్రం నేను భరించలేక..ఈ.సమస్యకు పరిష్కారమొక్కటే...నేననేదాన్ని ఉండకూడదు.ఇదొక్కటే సమస్యకు పరిష్కారం..వెళుతున్నాను. సెలవు..’
ఇవి ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ సెల్‌ఫోన్ వీడియోలో రికార్‌డ చేసిన చివరి మాటలు.
ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఆమె ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు..కావలి కోఆపరేటివ్ కాలనీకి చెందిన వీర మాధవి(28) పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాథ్‌స అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణం చెందింది.
అనంతరం సోదరి జానకి ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించగా అందులో రికార్డు చేసిన సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లి శాంతమ్మ పోలీసులను ఆశ్రయించింది. విచారిస్తే..మాధవికి నెల్లూరులో ఓ బంగారు దుకాణంలో పనిచేసే భానుతేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అతనితో సన్నిహితంగా మెలిగింది. అయితే మాధవి తల్లి శాంతమ్మ పేరు మీదున్న ఆస్తులపై భానుతేజ కన్నేశాడు. అవి తన పేరిట రాసివ్వాలని డిమాండ్ చేశాడు.
పెళ్లయిన తర్వాత రాస్తామని చెప్పినా అతడు అంగీకరించలేదు. ఈ విషయంలోనే ఆమె మనస్థాపానికి గురై ప్రాణాన్ని తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సోమవారం కావలి ఏరియా ఆస్పత్రిలో మాధవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. సెల్‌ఫోన్‌లోని సెల్ఫీవీడియో, మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తల్లి పేరుతో రాసిన సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.