ముంబైలో మళ్లీ పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్ | Mumbai: 4 Coaches of Local train derails near Vile Parle | Sakshi
Sakshi News home page

ముంబైలో మళ్లీ పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్

Published Tue, Sep 15 2015 12:01 PM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

ముంబైలో మళ్లీ పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్

ముంబైలో మళ్లీ పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్

ముంబై : ముంబై మహానగరంలో మంగళవారం లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అంథేరి నుంచి చర్చి గేట్ కు వెళ్తున్న ఈ లోకల్ ట్రైన్ విల్లే పార్లీ మరియు అంథేరి స్టేషన్ల మధ్య పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటన కారణంగా నగరంలోని లోకల్ ట్రైన్ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రయాణికుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. సోమవారం సాయంత్రం ముంబైలోని చత్రపతి శివాజీ టెర్మినస్ సమీపంలో లోకల్ ట్రైన్కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదన్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement