Jharkhan‍d: పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం | Goods Train Derails Near Tupkadih | Sakshi
Sakshi News home page

Jharkhan‍d: పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Published Thu, Sep 26 2024 9:30 AM | Last Updated on Thu, Sep 26 2024 10:52 AM

Goods Train Derails Near Tupkadih

తుప్కాడి: జార్ఖండ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బొకారో స్టీల్ ప్లాంట్ నుండి వల్లభ్‌గఢ్‌కు వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. తుప్కాడి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ నేపధ్యంలోనే వారణాసి నుంచి రాంచీ వెళ్తున్న వందే భారత్ రైలును చందర్‌పురా రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు.

ఈ ప్రమాదం అనంతరం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పోస్టు సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది.  దానిలో గూడ్స్ రైలు వ్యాగన్లు బోల్తా పడటాన్ని గమనించవచ్చు. ప్రస్తుతం రైల్వే ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఇటీవలి కాలంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మధురలలో రైళ్లు పట్టాలు తప్పాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా రైలును పట్టాలు తప్పించే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో పంజాబ్‌లోని భటిండాలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్ర పన్నారు. అయితే డ్రైవర్ తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదాలు తప్పాయి. 

 


ఇది కూడా చదవండి: ఊపిరి తీసిన హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement