derails
-
Jharkhand: పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
తుప్కాడి: జార్ఖండ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బొకారో స్టీల్ ప్లాంట్ నుండి వల్లభ్‌గఢ్‌కు వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. తుప్కాడి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ నేపధ్యంలోనే వారణాసి నుంచి రాంచీ వెళ్తున్న వందే భారత్ రైలును చందర్పురా రైల్వే స్టేషన్లో నిలిపివేశారు.ఈ ప్రమాదం అనంతరం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దానిలో గూడ్స్ రైలు వ్యాగన్లు బోల్తా పడటాన్ని గమనించవచ్చు. ప్రస్తుతం రైల్వే ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.ఇటీవలి కాలంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మధురలలో రైళ్లు పట్టాలు తప్పాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా రైలును పట్టాలు తప్పించే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో పంజాబ్‌లోని భటిండాలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్ర పన్నారు. అయితే డ్రైవర్ తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదాలు తప్పాయి. Bokaro, Jharkhand: A goods train passing through Tupkadih got detached in two, with two of its wagons overturning after derailment. The incident occurred between Tupkadih and Rajabera sections. Train movement affected and the plying of trains on down line track suspended. A… pic.twitter.com/p3luQ0gppk— ANI (@ANI) September 26, 2024ఇది కూడా చదవండి: ఊపిరి తీసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ -
Russia: పట్టాలు తప్పిన రైలు.. 100 మందికి గాయాలు
రష్యాలోని దక్షిణ వోల్గోగ్రాడ్ ప్రాంతంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 800 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.ట్రక్కును ఢీకొట్టిన అనంతరం రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. రష్యా టుడే తెలిపిన వివరాల ప్రకారం 20 బోగీలతో కూడిన ఈ రైలు రష్యాలోని టాటర్స్థాన్ రిపబ్లిక్‌లోని కజాన్ నుంచి సోచి సమీపంలోని రిసార్ట్ నగరం అడ్లెర్‌కు వెళుతోంది. రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పినట్లు వోల్గోగ్రాడ్ రీజియన్ గవర్నర్ ఆండ్రీ బోచారోవ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ప్రమాదం నుంచి ట్రక్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే అతని తలకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ఏడాది జూన్‌లో రష్యాలోని కోమిలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్యాసింజర్ రైలులోని తొమ్మిది కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్యాసింజర్ రైలు ఈశాన్య కోమిలోని వోర్కుటా నుండి నల్ల సముద్రపు నొవోరోసిస్క్ ఓడరేవుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రాంతాల మధ్య దూరం ఐదు వేల కిలోమీటర్లు ఉంటుంది. WATCH | Russia Train-Truck Accident Injures 140, Derails Multiple Carriages#Russia #accident #Train https://t.co/Fs6k6KYVfe— Oneindia News (@Oneindia) July 29, 2024 -
దారుణం: ఘోర రైలు ప్రమాదం..33 మంది మృతి..
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 33 మంది మరణించారు. సుమారు 80 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్ రైలు రావల్పిండికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ప్రారంభించామని అధికారులు తెలిపారు. Pakistan: 30 dead, 80 injured after 10 coaches of Hazara Express derail in Sindh Read @ANI Story | https://t.co/76FRYrynMI#Pakistan #hazaraexpress #Sindh pic.twitter.com/apJHUHBxFE — ANI Digital (@ani_digital) August 6, 2023 హజరా ఎక్స్‌ప్రెస్ రావల్పిండికి వెళ్తుండగా.. షాజాద్‌పూర్, నవాబ్షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు 10 బోగీలు పట్టాలు తప్పిపోయాయి. దీంతో 15 మంది అక్కకిడక్కడే మృతి చెందారు. కరాచీ నుంచి పంజాబ్‌కు వెళ్లే ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: అవయవ మార్పిడికి దేశంలో 56 వేల మంది వెయిటింగ్ -
పట్టాలు తప్పిన గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు
గౌహతి: అసోంలో గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలుకు చెందిన నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలెట్ రైలును ఆపివేశాడు. గౌహతి- హౌరా స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం హౌరాకు బయల్దేరింది. అసోంలోని చాయ్‌గావ్ స్టేషన్ సమీపంలో ట్రాక్ మారుతుండగా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే పైలెట్ స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని ఈశాన్య సరిహద్దు రైల్వే అధికారులు ప్రకటించారు. వెంటనే స్పందించిన అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. చదవండి: ఎంతటి దుస్థితి! అఫ్గాన్ మంత్రి నేడు డెలివరీ బాయ్‌గా చదవండి: కలకలం.. ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేశారని విషం తాగిన టీచర్లు -
పట్టాలు తప్పిన రైలింజన్
సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖ రైల్వే స్టేషన్ ఔటర్లో ఖాళీ రైలు ఇంజిన్ పట్టాలు తప్పడంతో విశాఖ నుంచి బయల్దేరాల్సిన, విశాఖకు రావాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కొన్ని రద్దు కాగా, మరికొన్ని గమ్యం కుదించారు. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్లాల్సిన ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్(ఖాళీ రేకు)ను శనివారం యార్డు నుంచి ప్లాట్‌ఫాం మీదకు తీసుకువస్తున్న సమయంలో ఇంజిన్ పట్టాలు తప్పింది. అప్పటి నుంచి ఒకే ట్రాక్‌పై రైళ్లు నడిచాయి. దీంతో విశాఖపట్నం నుంచి పలు రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా రాకపోకలు సాగించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. తిరుపతి నుంచి విశాఖ రావాల్సిన డబుల్ డెక్కర్, ఎల్టీటీ, తిరుమల ఎక్స్‌ప్రెస్‌లను దువ్వాడలోనే నిలిపివేశారు. విజయవాడ నుంచి విశాఖపట్నం రావాల్సిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను దువ్వాడలోనే నిలిపివేసి.. అక్కడ నుంచి విజయవాడకు తరలించారు. డిఘా –విశాఖపట్నం(22873)ఎక్స్‌ప్రెస్‌ను సింహాచలం నార్త్‌లో నిలిపివేశారు. కోరాఫుట్– విశాఖపట్నం(18511)ఎక్స్‌ప్రెస్‌ను పెందుర్తిలో నిలిపివేసి అక్కడ నుంచి విశాఖపట్నం–భువనేశ్వర్ (22820) ఇంటర్‌సిటీగా పంపించారు. అలాగే దుర్గ్–విశాఖపట్నం(58529) పాసింజర్‌ను సింహాచలం నార్త్‌లో, రాయగడ–విశాఖపట్నం(58503)పాసింజర్‌ను కొత్తవలసలో, పలాస–విశాఖపట్నం(58531)పాసింజర్‌ను అలమండలో నిలిపివేశారు. ఇదిలా ఉండగా.. అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు పూర్తిస్థాయిలో రైళ్ల రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకున్నారు. రద్దయిన రైళ్లకు సంబంధించి ప్రయాణికులకు టికెట్ చార్జీలను వాపస్ ఇస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. గంటల తరబడి నిరీక్షణ మెయిల్‌కు కుటుంబ సభ్యులతో కలసి చెన్నై వెళ్లాలి. రైలు దాదాపు నాలుగు గంటల ఆలస్యంగా వస్తుందని ప్రకటించారు. రైలు ఎప్పుడొస్తుందో తెలియక.. స్టేషన్లోనే గంటల తరబడి వేచి ఉన్నాం. – దేముడు, విశాఖపట్నం నరకంగా ప్రయాణం మాది అనంతపురం. విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు కుటుంబంతో కలిసి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చాం. ఈ ప్రయాణం నరకం అనిపించింది. ఎక్కడపడితే అక్కడ గంటల కొద్దీ రైలును ఆపేశారు. ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డాం. – అర్చన, అనంతపురం రాయగడ వెళ్లాలి ఏలూరు నుంచి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు వచ్చాం. రాయగడ గుడికి వెళ్తున్నాం. కానీ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దువ్వాడలో నిలిపి వేయడంతో అక్కడే సాయంత్రం వరకు వేచి ఉండి.. ఇప్పుడు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ చేరుకున్నాం. కోర్బాలో రాయగడ వెళ్లాలనుకుంటున్నాం. అదీ కూడా సమయం మారిందని చెప్పారు. పిల్లా పాపలు, పెద్దలతో చాలా అవస్థలు పడ్డాం. – గౌరీ, ఏలూరు పరామర్శకు వెళ్లాలని వస్తే.. పార్వతీపురం నుంచి వస్తున్నాం. మా బంధువుకు ప్రమాదం జరిగింది. తొందరగా మచి లీపట్నం వెళ్లాలి. ఇక్కడకు వచ్చి చూస్తే.. మచిలీపట్నం రైలు రద్దు చేసినట్టు చెబుతున్నారు. ఎల్టీటీలోనైనా వెళ్తాం. – డి.పద్మ, పార్వతీపురం -
గూడ్స్ బండి పట్టాలు తప్పి..
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్లు రద్దు
హైదరాబాద్: మహారాష్ట్రలోని మానిక్గఢ్-వీర్గామ్ స్టేషన్ల మధ్య ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో సికింద్రాబాద్-ఢిల్లీల మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని రద్దు చేశారు. దర్బంగా ఎక్స్‌ప్రెస్, నాగపూర్ ప్యాసింజర్ రైళ్లను కగజ్నగర్ వద్ద, చెన్నై- న్యూఢిల్లీ (జీటీ ఎక్స్‌ప్రెస్)ను మంచిర్యాల వద్ద నిలిపివేశారు. హైదరాబాద్- ఢిల్లీ (తెలంగాణ ఎక్స్‌ప్రెస్), బల్లార్షా-సికింద్రాబాద్(భాగ్యనగర్) ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, చెన్నైకి వెళ్లే రైళ్లను సికింద్రాబాద్-నాందేడ్ మార్గంలో మళ్లిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్(040-27786170, 27700868), వరంగల్(0870- 2426232), ఖమ్మం(0874- 2234541), కాజీపేట్(0870-2576430), కాగజ్‌నగర్(0873-8238717) రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు బోగీలను తొలగించేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. -
పట్టాలు తప్పిన జీలం ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ : పంజాబ్‌లోని సట్లేజ్ నది బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జీలం ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 బోగీలు పట్టాలు తప్పగా... ముగ్గురు గాయపడ్డారు. ఈ మేరకు రైల్వే శాఖ ట్విట్టర్లో పేర్కొంది. ఫిలోర్ - లాడోవాల్ సెక్షన్ల మధ్య ఈ రైలు పట్టాలు తప్పిందని తెలిపింది. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే క్షతగాత్రులను లూథియానాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ప్రయాణికులను తరలించడానికి మూడు బస్సులను ప్రమాద ఘటన స్థలికి చేరుకున్నాయని రైల్వే మంత్రిత్వశాఖ వివరించింది. జీలం ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో మార్గంలో నడిచే నాలుగు ఎక్స్‌ప్రెస రైళ్లను తత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. జలంధర్ - న్యూఢిల్లీ, అమృత్సర్ - న్యూఢిల్లీ ఇంటర్ సిటీ, అమృత్సర్- హరిద్వార్ జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్, అమృత్సర్- ఛండీగడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు అయినవి. -
ముంబైలో మళ్లీ పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్
ముంబై : ముంబై మహానగరంలో మంగళవారం లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అంథేరి నుంచి చర్చి గేట్ కు వెళ్తున్న ఈ లోకల్ ట్రైన్ విల్లే పార్లీ మరియు అంథేరి స్టేషన్ల మధ్య పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటన కారణంగా నగరంలోని లోకల్ ట్రైన్ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రయాణికుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. సోమవారం సాయంత్రం ముంబైలోని చత్రపతి శివాజీ టెర్మినస్ సమీపంలో లోకల్ ట్రైన్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదన్న విషయం తెలిసిందే. -
పట్టాలు తప్పిన రైలు: ఇద్దరి మృతి
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
విజయవాడ: గూడ్స్ వ్యాగన్ ఒకటి విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖగారియా (పశ్చిమ బెంగాల్) నుంచి చాలపూడి (కోయంబత్తూరు) వెళ్లే గూడ్స్ రైలు విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ట్రిప్ షెడ్ సమీపంలో ట్రాక్ సరిగా లేకపోవడంతో అందులోని ఒక వ్యాగన్ ఆదివారం మధ్యాహ్నం 1.50 సమయంలో పట్టాలు తప్పింది. దీంతో విజయవాడ- గుంటూరు- తెనాలి మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడలోనే నిలిపివేసి విజయవాడ నుంచే తిరిగి సికింద్రాబాద్‌కు పంపారు. ఇదే రైలులో గుంటూరుకు వెళ్లాల్సిన ప్రయాణికులను నర్సాపూర్- నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్‌లో పంపించారు. వ్యాగన్ పట్టాలు తప్పగానే బ్రేక్ సిబ్బంది వచ్చి మరమ్మతులు ప్రారంభించారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
అనంతపురం : అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న గూడ్స్ రైలు ఆదివారం పట్టాలు తప్పింది. ఇంజన్‌కు చెందిన నాలుగు పట్టాలు తప్పడంతో ఆ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. గూడ్స్ రైలు ఇంజన్ తప్పించి.. మరో ఇంజన్‌ను రైలుకు జత చేశారు. దీంతో గంటపాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
పట్టాలు పేల్చిన మావోయిస్టులు
జార్ఖండ్: మరోసారి మావోయిస్టులు పంజా విప్పారు. జార్ఖండ్‌లో రైలు పట్టాలను పేల్చి వేశారు. దీంతో బీహార్‌కు చెందిన పాలము ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. లతేహార్ జిల్లాలోని చిపాఘోర్, బారుది మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పాలము స్టేషన్ మాస్టర్ తెలిపారు. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం
-
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం
అమెరికాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 238 మంది ప్రయాణికులతో రాజధాని నగరం వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వెళుతోన్న ఆమ్ట్రాక్ లోకల్ రైలు మంగళవారం రాత్రి ఫిలడెల్ఫియాలోని వీట్షెల్ఫ్ లేక్బ్లాక్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదురుగు మృతి చెందగా, దాదాపు 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 7:10 కి వాషింగ్టన్ స్టేషన్ నుంచి బయలుదేన 188వ నంబర్ ట్రైన్ 10:34కు న్యూయార్క్ చేరుకోవాల్సి ఉంది. ఈ రెండు స్టేషన్లకు సరిగ్గా మధ్యలో ఉండే ఫిలడెల్ఫియా వద్ద గల ఓ మూల మలుపు తిరిగే క్రమంలో నియంత్రణ కోల్పోయి రైలు పట్టాలు తప్పిందని, ప్రమాదం సమయంలో అది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని అధికారులు చెప్పారు. బోల్తా పడ్డ పది బోగీలు.. కొద్ది మీటర్లవరకు దొర్లుకుంటూ వెళ్లడంవల్ల పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారని వివరించారు. సహాయక బృందాలు రంగంలోకిదిగి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. -
పట్టాలు తప్పిన పూర్వ ఎక్స్‌ప్రెస్
కొల్కత్తా: హౌరా - న్యూఢిల్లీ పూర్వ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం పట్టాలు తప్పింది. హౌరా నుంచి బయలుదేరిన కొద్ది సేపట్టికే లిలూహ స్టేషన్ వద్ద ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 9 బోగిలు పట్టాలు తప్పాయి. అయితే ప్రయాణికులు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో పలు రైళ్లను మరో మార్గంలో మళ్లీస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.