అనంతపురం : అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న గూడ్స్ రైలు ఆదివారం పట్టాలు తప్పింది. ఇంజన్కు చెందిన నాలుగు పట్టాలు తప్పడంతో ఆ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. గూడ్స్ రైలు ఇంజన్ తప్పించి.. మరో ఇంజన్ను రైలుకు జత చేశారు. దీంతో గంటపాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.