gutti railway station
-
ప్లాట్‌ఫామ్ పైనుంచి దూకి పట్టాలపై తల పెట్టి..
నంద్యాల జిల్లా: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ బుధవారం మధ్యాహ్నం ప్రయాణికులతో రద్దీగా ఉంది.. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు పట్టాలపైకి చేరుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హఠాత్తు సంఘటనతో అక్కడి ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లెకు చెందిన రామదాసు శ్రీరాములు, మునెమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం కాగా కూతురుకు వివాహమైంది. కుమారుడు మహేంద్ర (25) గతంలో గ్రామంలో వలంటీర్‌గా పని చేశాడు. ప్రస్తుతం అనంతపురం జిల్లా యాడికి సమీపంలోని ఓ సిమెంట్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే మార్గం లేక ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల గాలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం గుత్తి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న యువకుడు రైలు వేగంగా వస్తుండగా ప్రయాణికులు చూస్తుండగానే ప్లాట్‌ఫామ్ పైనుంచి దూకి పట్టాలపై తల పెట్టి పడుకోవడంతో రైలు అతనిపై వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీయగా గొర్విమానుపల్లెకు చెందిన మహేంద్రగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
పోలీసుల దాష్టీకం.. వీడియో వైరల్..!
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
అనంతపురం : అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న గూడ్స్ రైలు ఆదివారం పట్టాలు తప్పింది. ఇంజన్‌కు చెందిన నాలుగు పట్టాలు తప్పడంతో ఆ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. గూడ్స్ రైలు ఇంజన్ తప్పించి.. మరో ఇంజన్‌ను రైలుకు జత చేశారు. దీంతో గంటపాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
పట్టాలు తప్పిన గౌతమి ఎక్స్‌ప్రెస్
గుత్తి : హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్ (11111) రైలు గుత్తి జంక్షన్‌లోని తూర్పు క్యాబిన్ సమీపంలో పట్టాలు తప్పింది. రెండు బోగీలు పూర్తిగా పట్టాలు తప్పడంతో ఆరుగురు మరణించగా, మరో 16మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాద సంఘటన గార్డు కామేశ్వరరావు ద్వారా ఎస్ఎంఆర్ బిఎక్స్ ప్రసాద్‌కు సమాచారం అందివ్వడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, రైల్వేలోని అన్ని విభాగాల అధికారులు, కార్మికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బోగీల్లో ఇరుక్కుపోయిన వారిని రక్షించడానికి బోగీల కిటికీలను కోశారు. కిటికీల ద్వారా క్షత గాత్రులను అతి కష్టం మీద బయటకు తీసి అక్కడే వైద్యం చేయించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇదంతా నిజమనుకుంటున్నారా? కాదు.. రైల్వే విభాగం నిర్వహించిన మాక్‌డ్రిల్ గుత్తి రైల్వే స్టేషన్‌లోని తూర్పు క్యాబిన్ సమీపంలో గురువారం గుంతకల్ డీఆర్ఎం మనోహర్ జోషి, బెంగుళూరుకు చెందిన ఎన్డీఆర్ఎఫ్(నే షనల్ డిసార్డర్ రిలీఫ్ఫోర్స్) టీమ్ కమాండర్ సంతోష్ కుమార్ నేతృత్వంలో రైలు ప్రమాదాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, గుత్తి, గుంతకల్ రైల్వే ఉన్నతాధికారులు, అన్ని విభాగాల్లోని కార్మికులు, లయన్స్ క్లబ్ సభ్యులు మాక్‌డ్రిల్‌లో భాగస్వాములయ్యారు. నిజంగా రైలు ప్రమాదం సంభవించినపుడు అధికారులు, కార్మికులు, ప్రయాణికులు ఎలా స్పందిస్తారో అదే విధంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇది ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సాగింది. అనంతరం డీఆర్ఎం మనోహర్ జోషి విలేకరులతో మాట్లాడారు. ప్రమాదాలు సంభవించినపుడు బాధితుల(ప్రయాణికుల)ను ఎలా కాపాడాలి? వారికి వైద్యం ఎలా అందించాలి? అనే విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ మాక్‌డ్రిల్ నిర్వహించామని, అందరి సహకారంతో ఇది సక్సెస్ అయిందన్నారు. ఈ మాక్ డ్రిల్‌లో కళ్లు మూసుకున్న వారిని మృతులుగానూ, కళ్లు తెరుచుకుని ఉన్న వారిని క్షతగాత్రులుగానూ పరిగణించారు.