పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. పలు రైళ్లు రద్దు | several trains cancelled as goods train derails | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. పలు రైళ్లు రద్దు

Published Fri, Jan 6 2017 7:12 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. పలు రైళ్లు రద్దు

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. పలు రైళ్లు రద్దు

హైదరాబాద్: మహారాష్ట్రలోని మానిక్‌గఢ్‌-వీర్గామ్‌ స్టేషన్ల మధ్య ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో సికింద్రాబాద్‌-ఢిల్లీల మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని రద్దు చేశారు. దర్బంగా ఎక్స్‌ప్రెస్‌, నాగపూర్‌ ప్యాసింజర్‌ రైళ్లను కగజ్‌నగర్ వద్ద, చెన్నై- న్యూఢిల్లీ (జీటీ ఎక్స్‌ప్రెస్‌)ను మంచిర్యాల వద్ద నిలిపివేశారు. హైదరాబాద్‌- ఢిల్లీ (తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌), బల్లార్షా-సికింద్రాబాద్‌(భాగ్యనగర్‌) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, చెన్నైకి వెళ్లే రైళ్లను సికింద్రాబాద్‌-నాందేడ్‌ మార్గంలో మళ్లిస్తున్నారు.

ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్(040-27786170, 27700868)‌, వరంగల్‌(0870- 2426232), ఖమ్మం(0874- 2234541), కాజీపేట్‌(0870-2576430), కాగజ్‌నగర్‌(0873-8238717) రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు బోగీలను తొలగించేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement