Telangana Express
-
కాజీపేట-బల్లార్ష రూట్లో పనులు.. పలు రైళ్లు రద్దు
హైదరాబాద్, సాక్షి: దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్లో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఆసిఫాబాద్-రేచ్ని స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణం కారణంగా.. వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లను రద్దు చేశారు. అలాగే 26 ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించి నడపనున్నారు. వాటి వివరాలను ద.మ.రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రద్దయిన రైళ్లు ఇవే.. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్‌ల మధ్య తిరిగే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (నం.12757/12758) జూన్ 26 నుంచి జులై 6 వరకు రద్దు. పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్ (నం.22151) ఈ నెల 28, జులై 5న.. కాజీపేట-పుణె ఎక్స్‌ప్రెస్ (నం.22152) జూన్ 30, జులై 7న.. హైదరాబాద్-గోరఖ్‌పుర్ (నం.02575) జూన్ 28న, గోరఖ్‌పుర్-హైదరాబాద్ (నం.02576) ఎక్స్‌ప్రెస్ జులై 30న రద్దు ముజఫర్‌పుర్-సికింద్రాబాద్ (నం.05293) జులై 2న, సికింద్రాబాద్-ముజఫర్‌పుర్ (నం.05294) జూన్ 27, జులై 4న రద్దు గోరఖ్‌పుర్-జడ్చర్ల (నం.05303) రైలు జూన్ 29న, జడ్చర్ల-గోరఖ్‌పుర్ (నం.05304) రైళ్లు జులై 1న రద్దుసికింద్రాబాద్-రాక్సల్ మధ్య తిరిగే వేర్వేరు మూడు రైళ్లు జూన్ 26, 27, 28 తేదీల్లో.. సికింద్రాబాద్-దానాపుర్ల మధ్య తిరిగే వేర్వేరు ఆరు రైళ్లు జూన్ 27, 28, 29, జులై 1 తేదీల్లో.. సికింద్రాబాద్-సుభేదార్‌గంజ్ మధ్య తిరిగే రైళ్లు జూన్ 27, 29 తేదీల్లో రద్దయ్యాయి.దారి మళ్లింపు..కాజీపేట మీదుగా వెళ్లే సికింద్రాబాద్-న్యూఢిల్లీ (నం.12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్.. జులై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్ మీదుగా దారి మళ్లించనున్నారు. అంటే.. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లను ప్రయాణం ఉండదు. న్యూఢిల్లీ-సికింద్రాబాద్ (నం.12724) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 3, 4, 5 తేదీల్లో ముద్కేడ్, నిజామాబాద్ మీదుగా నడిపిస్తారు. ఆ తేదీల్లో బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్ల మీదుగా రైలు వెళ్లదు.సికింద్రాబాద్-నిజాముద్దీన్ (దిల్లీ), నిజాముద్దీన్-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను (నం.12285/12286) జులై 4, 5 తేదీల్లో నిజామాబాద్ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు. -
తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. మహారాష్ట్ర నాగ్‌పూర్ వద్ద రైల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రయాణికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆగష్టు 18వ తేదీ ఢిల్లీ నుంచి రైలు బయల్దేరింది. 19వ తేదీ ఉదయం ఎస్ 2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైలును వెంటనే నాగ్‌పూర్‌లో ఆపేశారు. దీంతో ప్రయాణికులు బోగి దిగి బయటకు పరిగెత్తారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రమాదానికి కారణాలు దర్యాప్తు తర్వాతే వెల్లడిస్తామని అంటున్నారు. ఉద్యావన్ ఎక్స్‌ప్రెస్‌లోనూ.. బెంగళూరులోనూ ఓ రైలుకు ప్రమాదం తప్పింది. కేఎస్ఆర్ స్టేషన్లో ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. ఘటనలో ఎవరికీ ఏం కాలేదని అధికారులు ప్రకటించారు. Fire broke out at banglore railway station in #UdyanExpress at KSR #Bengaluru #FireAccident Train no - 11301 Route - CSMT to SBC (KSR Bengaluru) pic.twitter.com/ldvjAXg1O5 — Pune Pulse (@pulse_pune) August 19, 2023 -
తొలికూత తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌దే..!
సాక్షి, రామగుండం: డెభ్బై రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం సికింద్రాబాద్ డివిజన్లో ముందుగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. కాగా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే 200 శ్రామిక్ రైళ్లను నడిపించినా సాధారణ ప్రయాణికుల రాకపోకల నిమిత్తం కొన్ని రైళ్లను నడిపించక తప్పడం లేదు. లాక్డౌన్ కొనసాగుతుండడంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కొన్ని సడలింపులు ఇచ్చిన కేంద్రం అందులో కొన్ని రైళ్లను సైతం నడిపించాలని నిర్ణయించింది. కాగా సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా నాలుగు రైళ్లను నడిపిస్తుంది. ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ముందస్తు రిజర్వేషన్ ఉన్నవారికే ప్రయాణానికి అనుమతిస్తున్న రైల్వేశాఖ రాకపోకలు సాగించేవారి పట్ల పటిష్ట చర్యలకు వైద్య సిబ్బంది శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రైలు సమయానికి గంటన్నర ముందు స్టేషన్‌కు చేరుకోగానే రైల్వేశాఖ, వైద్య శాఖ అధికారులు వివరాలను నమోదు చేసుకొని థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా వేరే ప్రాంతాల నుంచి రామగుండంలో దిగినవారికి సైతం థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి వారి చేతికి క్వారంటైన్ ముద్ర వేసి ప్రయాణికుల చిరునామా పరిధిలోని వైద్య సిబ్బందికి సమాచారం అందించి పర్యవేక్షించాలని ఆదేశిస్తున్నారు. తొలిరోజు రామగుండం రైల్వేస్టేషన్‌ను డిప్యూటీ జిల్లా వైద్యాధికారి కృపాబాయి, రామగుండం తహసీల్దార్ రవీందర్ సందర్శించి వైద్య సిబ్బంది పనితీరును సమీక్షించారు. డాక్టర్ సురేష్, హెల్త్ సహాయకులు వడ్డెపల్లి సమ్మయ్య, ఏఎన్ఎం సరోజ, లక్ష్మి, రైల్వేస్టేషన్ మేనేజర్ కేఎన్.రామారావు, రైల్వే డాక్టర్ దీప, ఆర్పీఎఫ్ సీఐ పాశ్వాన్, కమర్షియల్ అధికారులు తదితరులున్నారు. హోంక్వారంటైన్ ముద్ర వేస్తున్న వైద్య సిబ్బంది తెరుచుకున్న రైల్వే ఎంక్వయిరీ సిస్టం.. లాక్డౌన్ నేపథ్యంలో మూతపడిన రైల్వే ఎంక్వయిరీ సిస్టం సోమవారం ప్రారంభం కావడంతో అధికారులు విధులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బుకింగ్ కార్యాలయం, పరిసరాలను పారిశుధ్య సిబ్బంది శానిటైజ్ చేశారు. కేవలం రైళ్ల సమాచారం మాత్రమే తెలుసుకునే వీలున్నప్పటికీ కార్యాలయంలో అధికారిక పనుల్లో నిమగ్నమయ్యారు. ఏలాంటి టికెట్ల జారీకి రామగుండంకు అనుమతించలేదు. ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా ప్లాట్‌ఫారంపై పెయింటింగ్‌తో బాక్సులు ఏర్పాటు చేశారు. రైళ్ల రాకపోకలను సూచించే స్లైడింగ్ (డిస్ప్లే) ప్రారంభించారు. చదవండి: టీవీ నటి ఆత్మహత్య హోం క్వారంటైన్‌తో మొగ్గుచూపని ప్రయాణికులు..? లాక్‌డౌన్‌కు ముందు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయి ప్రస్తుతం తమ స్వస్థలాలకు వెళ్లేవారు మాత్రమే రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. హోం క్వారంటైన్ ముద్ర వేయడంతో అత్యవసర పరిస్థితుల్లో పొరుగు ప్రాంతాలకు రైలులో వెళ్లి రావాలనుకునే అవకాశం లేకపోవడంతో రాకపోకలకు అంతగా ఆసక్తి చూపడం లేదని స్పష్టమవుతోంది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో హైదరాబాద్ నుంచి రామగుండంకు తొమ్మిది మంది ప్రయాణికులు రావాల్సి ఉండగా కేవలం ముగ్గురే దిగారు. దాణాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో పది మంది రామగుండంలో దిగాల్సి ఉండగా ఒక్కరు కూడా దిగకపోవడం గమనార్హం. ఇందులో కొంతమంది పెద్దపల్లిలో దిగినట్లు అధికారులు తెలిపారు. స్థానికంగా దిగిన ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి వారి చేతిపై హోంక్వారంటైన్ ముద్రవేసి పంపిస్తున్నారు. స్టేషన్ల వారీగా దిగే, ఎక్కే ప్రయాణికుల జాబితా, బోగీ వివరాలను రైలులో టీటీఈతో పాటు భద్రతా సిబ్బంది పరిశీలిస్తూ ప్రయాణికులకు భద్రత కల్పిస్తున్నారు. రాకపోకలను పరిశీలిస్తున్న రైల్వే అధికారులు తొలిరోజు పెద్దపల్లికి దాణాపూర్ ఎక్స్‌ప్రెస్.. పెద్దపల్లికమాన్: సికింద్రాబాద్ నుంచి దాణాపూర్ వరకు ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ రైళ్లు సోమవారం పెద్దపల్లి జంక్షన్ మీదుగా వెళ్లాయి. ఈ మేరకు దానాపూర్, వారణాసీ, బీహార్, మహారాష్ట్రకు వెళ్లే 17 మంది ప్రయాణికులు రైలు వచ్చే సమాయానికి గంటముందే రైల్వేస్టేషన్‌కు చేరుకోగా వైద్యాధికారి మమత నేతృత్వంలో వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించిన తర్వాతే వారిని ప్రయాణానికి అనుమతించారు. కార్యక్రమంలో వైద్యబృందం ఉమా మహేశ్వర్, జయమణి, రజియా, భాగ్యలక్ష్మి, స్టేషన్ మేనేజర్ వెంకట్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: తాకట్టులో సాగరిక.. విడిపించిన మాజీ ఎంపీ నేటి నుంచి ఎనిమిది రైళ్ల రాకపోకలు రామగుండం: లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా తొలిసారిగా 70 రోజుల విరామం తర్వాత సోమవారం నుంచి తెలంగాణ మీదుగా నడిచే నాలుగు రైళ్లను ప్రారంభించారు. కాగా తొలిరోజు సదరు రైళ్లు గమ్యస్థానాలకు బయలుదేరినప్పటికీ రామగుండంకు మరుసటి రోజు చేరుకోనున్నాయి. దీంతో మంగళవారం నుంచి ఇరువైపుల ఎనిమిది రైళ్లు రాకపోకలు సాగించనుండడంతో వైద్య సిబ్బంది షిఫ్టుల వారీగా రైల్వేస్టేషన్లో థర్మల్ స్క్రీనింగ్ విధులు నిర్వహించనున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఉన్న రాకపోకలు సాగించే సమయాలే ఇప్పుడు వర్తిస్తాయి. ప్రస్తుత రైళ్ల రాకపోకల సమయాలు ఏమీ మారలేదని రైల్వే అధికారులు తెలిపారు. పెద్దపల్లి, రామగుండం మీదుగా నడిచే రైళ్లు.. ►న్యూఢిల్లీ నుంచి విశాఖపట్టణం మధ్య నడిచే ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.02805/02806) ఇరువైపుల రాకపోకలు సాగించనుంది. పెద్దపల్లి, రామగుండంలో హాల్టింగ్ ఉంది. ►దాణాపూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే దాణాపూర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.02792/02791) ఇరువైపుల రాకపోకలు సాగించనుంది. పెద్దపల్లి, రామగుండంలో హాల్టింగ్ ఉంది. ►హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.02724/02723) ఇరువైపుల రాకపోకలు సాగించనుంది. పెద్దపల్లి, రామగుండంలో హాల్టింగ్ ఉంది. ►దాణాపూర్ నుంచి ఏఎస్ఆర్ బెంగళూరు మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ (రైలు నం.02296/02295) ఇరువైపుల రాకపోకలు సాగించనుంది. ఒక రామగుండంలోనే హాల్టింగ్ ఉంది. -
నేడు పట్టాలెక్కనున్న సాదారణ రైళ్లు
-
నేటి నుంచి రైళ్లు షురూ
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత రైళ్లు మళ్లీ పరుగు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. లాక్డౌన్ తర్వాత తొలిసారి సాధారణ ప్రయాణికుల రైళ్లు ప్రారంభమవుతున్నాయి. వలస కార్మికులను తరలించేందుకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లు, కొన్ని రాజధాని స్పెషల్ రైళ్లు కాకుండా టైం టేబుల్లోని షెడ్యూల్ రైళ్లు సోమవారం నుంచి మొదలవుతున్నాయి. దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడుస్తుండగా, దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి 8 రైళ్లు (9వ రైలున్నా.. అది నాందెడ్ వాసులకు అందుబాటులో ఉంటుంది) ప్రారంభమవుతున్నాయి. ఇవికాక ఇతర జోన్లకు చెంది దక్షిణ మధ్య రైల్వే పరిధి మీదుగా ప్రయాణించే మ రో 5 రైళ్లు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబా టులో ఉండనున్నాయి. రైళ్లలో కరోనా నిబంధనలు పాటించేందుకు రైల్వే శాఖ సమాయత్తమైనా.. రైళ్లలో సీట్ల మధ్య దూరం ఉండని నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన అగత్యం ఏర్పడింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణానికి సిద్ధం కాకపోవటం మంచిద న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తోటి ప్రయాణికుల్లో ఎవరైనా అనారోగ్య లక్షణా లతో ఉన్నా, తోటి ప్రయాణికులు మాస్క్ ధరించకున్నా ఫిర్యాదు చేయాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో మొదలు: రైళ్ల పున:ప్రయాణం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో మొదలు కానుంది. సోమవారం ఉదయం 6 గంటలకు ఈ రైలు నాంపల్లి స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్, మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్, అనంతరం ముంబై వెళ్లే హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్, తర్వాత హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, సాయంత్రం నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్, తర్వాత విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ బయల్దేరతాయి. నెల రిజర్వేషన్ ఫుల్: ఇప్పటికే నెలకు సంబంధించిన బెర్తులన్నీ ఫుల్ అయ్యాయి. తొలుత ఈ రైళ్లకు నెల రోజుల రిజ ర్వేషన్ మాత్రమే కల్పించారు. ఆ తర్వాత 120 రోజులకు పెం చారు. మిగతా రోజులకూ రిజర్వేషన్ వేగంగా పూర్తవుతోంది. నాలుగు రైళ్లకే కొన్ని సీట్లు ఖాళీ ఉండగా, మిగతావి దాదాపు పూర్తయ్యాయి. ఈ రైళ్లలో ప్రస్తుతానికి రిజర్వేషన్ ప్రయాణా నికే అవకాశం కల్పించారు. దీంతో అన్‌రిజర్వ్‌డ్‌గా ఉండే జనరల్ బోగీల్లో కూర్చుని ప్రయాణించేలా సీట్లు ఏర్పాటు చేశారు. వాటికి కూడా రిజర్వేషన్ టికెట్లనే అందుబాటులో ఉంచారు. గంటన్నర ముందే..: రైలు బయలుదేరటానికి గంటన్నర ముందే ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవాలి. ప్రయాణికుల్లో కరోనా లక్షణాలున్నా, ఇతరత్రా అనారోగ్యంతో ఉన్నా అనుమతించరు. ప్రతి ఒక్కరిని థర్మో స్క్రీనింగ్ ద్వారా పరీక్షిస్తారు. కన్ఫర్మ్ టికెట్ ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. ప్రయాణికుల వెంట వచ్చే వారు బయటే ఉండాల్సి ఉంటుంది. రైళ్లలో భోజనం అందించరు. ప్రయాణికులు ఇంటి నుంచే నీళ్లు, భోజనం తెచ్చుకోవటమే శ్రేయస్కరం. బెర్తులపై పడుకునేవారు శుభ్రమైన బె డ్షీట్ తెచ్చుకోవటం మంచిది. వృ ద్ధులు, చిన్నపిల్లలు ప్రయాణానికి దూరంగా ఉంటే మంచిది. కూలీ లు అందుబాటులో ఉండనందున తక్కువ లగేజీతో వెళ్లటం మం చి ది. స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రారంభమవుతున్న రైళ్లు ఇవే.. హైదరాబాద్–ముంబై సీఎస్టీ హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–దానాపూర్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్–తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్ తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ఇతర జోన్ల రైళ్లు.. ముంబైæ–భువనేశ్వర్, ముంబై–బెంగళూరు, దానాపూర్–బెంగళూరు, న్యూఢిల్లీ–విశాఖపట్నం, హౌరా–యశ్వంతపూర్. -
విమాన టికెట్ ధరలకు పోటీగా..
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఏసీ మొదటి, రెండో తరగతి వెయిటింగ్ లిస్ట్ 50కు మించి ఉంది. తత్కాల్లో కూడా టికెట్లు లభించక ప్రయాణికులు ఉసూరుమన్నారు. కిక్కిరిసి ఆ రైలు ఢిల్లీకి పరుగుపెట్టింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ బోగీలో ఐదుగురు, సెకండ్ క్లాస్ బోగీల్లో 15 మంది ఉన్నారు. మిగతా సీట్లన్నీ ఖాళీ. వెలవెలబోతూ ఈ ప్రీమియం ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ బయల్దేరింది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ దొరకని ప్రయాణికులు ‘రాజధాని’ వైపు ఎందుకు చూడలేదు. ప్రత్యామ్నాయంగా అదేరోజు ఈ ప్రీమియం ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉన్నా.. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకునేందుకే ఎందుకు మొగ్గు చూపారు. ఎందుకంటే ఆదాయ వేటలో రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాలే కారణం. సాక్షి, హైదరాబాద్: విమానయాన సంస్థలో అమల్లో ఉన్న డైనమిక్ ఫేర్ విధానాన్ని ప్రారంభించిన రైల్వే శాఖ ఇప్పుడు చేతులు కాల్చుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్‌ను బట్టి టికెట్ ధరను సవరించటమే ఈ విధానం. ఎక్కువ డిమాండ్ ఉన్న రోజులు, అప్పటికప్పుడు బుక్ చేసుకున్న సందర్భంలో టికెట్ ధర అమాంతం పెరుగుతుంది. ఇంతకాలం పట్టించుకోకుండా మొండిగా ముందుకెళ్లాలన్న ఆ శాఖ ఇప్పుడు ఈ విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని చూస్తోంది. ఇటీవల రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ హైదరాబాద్ పర్యటనలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆయన దాన్ని సమీక్షించేందుకు ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని హైదరాబాద్ నుంచే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ సంగతి.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి డిమాండ్ లేని సాధారణ రోజుల్లో అడ్వాన్సుగా టికెట్ బుక్ చేసుకుంటే విమాన చార్జీ రూ.4 వేల లోపు ఉంటుంది. అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే రూ.ఐదున్నర వేల నుంచి మొదలవుతుంది. రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ప్రీమి యం రైళ్లలో మొదటి శ్రేణి, రెండో శ్రేణి టికెట్ ధర కూడా విమాన టికెట్‌కు దగ్గరగా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువే. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో సెకండ్ ఏసీ ధర (డైనమిక్‌లో నిలకడ ఉండదు) దాదాపు రూ.4,800 ఉంటోంది. కొన్నిమార్లు రూ.5 వేలు మించుతోంది. పీక్ డిమాండ్‌లో ఫస్ట్‌క్లాస్ చార్జి రూ.7 వేలు పలుకుతోంది. ఈ రైలు ప్రయాణ సమయం 22 గంటలు. అంత చార్జి భరించి ఇన్ని గంటలు ప్రయాణించే బదులు, అంతే చార్జి ఉండే విమానంలో 2 గంటల్లో వెళ్లిపోవచ్చు. దీంతో డబ్బున్న వాళ్లు, విమానాల వైపు, సాధారణ ప్రజలు మరో రైలువైపు చూస్తున్నారు. ఇలా రైల్వేకు భారీ నష్టం వాటిల్లుతోంది. రైలు నిర్వహణ ఖర్చులు యథావిధిగా ఉంటుం డగా, టికెట్ ఆదాయం నామమాత్రంగా ఉంటోంది.ఆ రైలు వల్ల మరో రైలును అదే సమయంలో నడిపే అవకాశం లేక ప్రయాణ అవకాశాన్ని కూడా ప్రయాణికులు కోల్పోవాల్సి వస్తోంది. ఆ విధానాన్ని మార్చాలి.. ఈ సమస్యకు కారణమవుతున్న డైనమిక్ ఫేర్ విధానాన్ని మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. తాజాగా రైల్వే బోర్డు పరిధిలోని ఆలిండియా రైల్వే ప్యాసింజర్స్ సర్వీస్ కమిటీ సభ్యుడు వెంకటరమణి, రైల్వే ప్యాసింజర్స్ ఎమినిటీస్ కమిటీ సభ్యుడు ప్రేమేందర్‌రెడ్డితో కలసి మంగళవారం రైల్వే మంత్రి పీయూష్ గోయెల్‌తో దీనిపై చర్చించారు. తాము ఈ కేటగిరీ రైళ్ల తీరును అధ్యయనం చేసి వాస్తవాలు గుర్తించామని, ఈ రైళ్లు ఖాళీగా వెళ్లడం వల్ల నష్టం వాటిల్లుతోందని, డైనమిక్ ఫేర్ విధానాన్ని సడలిస్తే ఆ రైళ్లు కూడా నిండుతాయని పేర్కొన్నారు. -
మొరాయించిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్
కాజీపేట రూరల్: హైదరాబాద్ నుంచి కొత్త ఢిల్లీ వెళ్లాల్సిన తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం మార్గమధ్యలో పలు ప్రాంతాల్లో మొరాయించింది. బుధవారం ఉదయం బయలు దేరిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ భువనగిరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక బ్రేక్ బోల్డు స్టార్ రిలీజింగ్ పైపు విరగగా అక్కడ 20 నిమిషాల పాటు ఆపి తాత్కాలిక మరమ్మతు చేసి, కాజీపేట పంపించారు. కాజీపేటలో మెకానిక్ సిబ్బంది కూడా 10 నిమిషాల పాటు శ్రమించి మరమ్మతు పూర్తి చేశారు. ఇక రామగుండం వెళ్లే సరికి మళ్లీ ఆగిపోయింది. దీంతో కాజీపేట నుంచి మెకానిక్ సిబ్బంది కొత్త బోల్డు స్టార్ పైప్ తీసుకెళ్లారు. అక్కడి సిబ్బందితో కలసి గంట పాటు శ్రమించి బోల్డు స్టార్‌ను తొలగించి కొత్తది అమర్చారు. ఇలా సాంకేతిక సమస్య కారణంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల పాటు ఆలస్యంగా వెళ్లినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. -
తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌పై ‘సింగరేణి’ సమాచారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ బోగీలకు వెలువల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు సంబంధించిన సమాచారం కనిపించనుంది. ఆ కంపెనీ ఆవిర్భావం, ప్రత్యేకతలు, విశిష్టతలు.. ఇలా సమస్త సమాచారం ఒక్కో బోగీపై ఒక్కో రకంగా కనిపిస్తుంది. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే, సింగరేణి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ ఏర్పాటు జరిగింది. దక్షిణ మధ్య రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు బొగ్గు సరఫరా రూపంలోనే వస్తుంది. కానీ ఆ కంపెనీ మాత్రం ఇతరత్రా మార్గాల్లో అడ్వర్టైజ్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రధాన ఆదాయాన్ని అందించే సంస్థలు రైళ్లపై ప్రకటనలు అతికిస్తే రైల్వేకు ఆదాయం వస్తుందన్న ఉద్దేశంతో ఇలాంటి ఏర్పాటు చేయాల్సిందిగా రైల్వే బోర్డు అధికారులను ఆదేశించింది. ఇప్పటికే రెండు జోన్లు వీటిని అమలులో పెట్టాయి. తాజాగా దక్షిణ మధ్య రైల్వే తన తొలిప్రయత్నంగా సింగరేణితో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాది పాటు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ బోగీలపై ఆ కంపెనీ వినాయిల్ రాపింగ్ ద్వారా ప్రకటనలు ప్రదర్శిస్తుంది. ఇందుకు రైల్వేకు సింగరేణి రూ.50 లక్షలు చెల్లిస్తుంది. 8 రాష్ట్రాల మీదుగా దాదాపు 2 వేల కిలోమీటర్లు ప్రయాణించే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌పై ఈ ప్రకటనలతో తమ కంపెనీకి దేశవ్యాప్తంగా గుర్తింపు పెరగడంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని కోల్‌మైన్స్ కంపెనీలతో ఉన్న పోటీలో ప్రయోజనం ఉంటుందని సింగరేణి భావిస్తోంది. సింగరేణి ప్రకటనలతో కూడిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ తొలి ప్రయాణం శుక్రవారం మొదలైంది. -
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు
-
తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం!
సాక్షి, ఢిల్లీ: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. హర్యానాలోని బల్లబ్‌గఢ్ వద్ద ఇవాళ ఉదయం 7.45 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనలో ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంటలు అంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. అయితే ఏసీ బోగీలో షార్ట్ సర్య్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ముందుగా B-1 బోగీలో చెలరేగిన మంటలు ప్యాంట్రీ, ఆ తర్వాత S-10 బోగీకి వ్యాపించినట్లు తెలుస్తోంది. బ్రేక్ బైండింగ్ గట్టిగా పట్టి వేయడంతో పొగలు వ్యాపించాయని, ఈ సంఘటనతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు ఉత్తర రైల్వే సీపీఆర్వో ఓ ప్రకటన చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంజన్ నుంచే కరెంట్..!
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో బోగీలకు విద్యుత్ సరఫరా కోసం కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కొన్నేళ్లుగా యత్నిస్తోంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో కూడిన రైళ్లలో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రతి రైలుకు రెండు పవర్‌కార్లను వినియోగిస్తున్నారు. డీజిల్‌తో ఇందులో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి బోగీలకు సరఫరా చేస్తుంటారు. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో పాటు శబ్ద, వాయు కాలుష్యాలకు కారణమవుతోంది. దీంతో పవర్కార్లు లేకుండా నేరుగా ఇంజన్ నుంచే విద్యుత్‌ను సరఫరా చేసే ‘హెడ్ ఆన్ జనరేషన్ (హెచ్ఓజీ)’పేరుతో కొత్త విధానానికి రైల్వే శ్రీకారం చుట్టింది. తొలుత హైదరాబాద్–ఢిల్లీ మధ్య తిరిగే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం నుంచి ప్రారంభించారు. ఏంటా విధానం.. విద్యుత్‌తో నడిచే రైళ్లకు ఈ విధానం అందుబాటులో ఉంటుంది. విద్యుత్ వైర్ల నుంచి రైలుకు 25 కేవీ విద్యుత్ తీసుకుంటారు. వైర్ల నుంచి యాంటీనా వంటి ఉపకరణం విద్యుత్‌ను ఇంజన్‌కు అందిస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మరో ఉపకరణాన్ని ఇంజన్ వద్ద అమరుస్తారు. అది 25 కేవీ విద్యుత్‌ను 110 వోల్టులకు మార్చి ఇంజన్‌కు అవసరమైన దాన్ని ఇంజన్‌కు సరఫరా చేసి మిగతా దాన్ని బోగీలకు మళ్లిస్తుంది. ఆ విద్యుత్‌తో బోగీల్లో ఫ్యాన్లు, లైట్లు, ఏసీ పనిచేస్తాయి. -
నేడు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్– న్యూఢిల్లీ(12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్ బుధవారం(3న) ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. నాంపల్లి నుంచి ఉదయం 6.25కు బదులు మధ్యాహ్నం 2.25కు బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు. పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకల్లో అంతరాయం చోటుచేసుకున్నట్లు తెలిపారు. -
నేడు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్(12723) మంగళవారం(2న) ఆలస్యంగా బయలుదేరనుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఉదయం 6.25కు బదులు మధ్యాహ్నం 1.55కు బయలుదేరుతుందని తెలిపింది. ఢిల్లీ నుంచి నగరానికి రావాల్సిన రైలు మంచు కారణంగా ఆలస్యంగా రానున్న నేపథ్యంలో ఈ జాప్యం చోటుచేసుకుందని వెల్లడించింది. -
గూడ్స్ బండి పట్టాలు తప్పి..
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్లు రద్దు
హైదరాబాద్: మహారాష్ట్రలోని మానిక్గఢ్-వీర్గామ్ స్టేషన్ల మధ్య ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో సికింద్రాబాద్-ఢిల్లీల మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని రద్దు చేశారు. దర్బంగా ఎక్స్‌ప్రెస్, నాగపూర్ ప్యాసింజర్ రైళ్లను కగజ్నగర్ వద్ద, చెన్నై- న్యూఢిల్లీ (జీటీ ఎక్స్‌ప్రెస్)ను మంచిర్యాల వద్ద నిలిపివేశారు. హైదరాబాద్- ఢిల్లీ (తెలంగాణ ఎక్స్‌ప్రెస్), బల్లార్షా-సికింద్రాబాద్(భాగ్యనగర్) ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, చెన్నైకి వెళ్లే రైళ్లను సికింద్రాబాద్-నాందేడ్ మార్గంలో మళ్లిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్(040-27786170, 27700868), వరంగల్(0870- 2426232), ఖమ్మం(0874- 2234541), కాజీపేట్(0870-2576430), కాగజ్‌నగర్(0873-8238717) రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు బోగీలను తొలగించేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. -
నరకం.. ఆ రైళ్లలో ప్రయాణం!
♦ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు ఎక్స్‌ప్రెస్‌లలో తీవ్ర సమస్యలు ♦ ప్రయాణంలో భారీ కుదుపులు.. బెర్తుల్లోంచి కిందపడుతున్న ప్రయాణికులు ♦ బోగీలు విడిపోకుండా ఏర్పాటు చేసిన సీబీపీ కప్లర్లతో తలెత్తిన సమస్య సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్.. అర్ధరాత్రి.. రైల్లో అంతా గాఢనిద్రలో ఉన్నారు. ఇంతలో భారీ కుదుపు.. బెర్తుల్లోంచి కొందరు కిందపడిపోగా, పక్క బెర్తుల్లో పడుకున్న వారి తలలు బోగీ గోడలకు బలంగా గుద్దుకు న్నాయి.. అప్పర్ బెర్తుల్లోని లగేజీ కిందపడి పోయింది. అందరూ గాఢ నిద్రలో ఉండ టంతో బోగీలు పట్టాలు తప్పాయేమో అని భయాందోళనకు గురయ్యారు. తర్వాత అది సాంకేతిక పరమైన సమస్యతో ఏర్పడ్డ కుదుపు అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకు న్నారు. బోగీ–బోగీని కలిపి ఉంచే కప్లింగుల్లో చేసిన మార్పు ఇప్పుడు ప్రయాణికులకు నరకాన్ని చూపుతోంది. గతంలో ఉన్న సంప్ర దాయ స్క్రూ కప్లర్ల స్థానంలో కొత్తగా సెంటర్ బఫర్ కప్లర్ల (సీబీపీ)ను ఏర్పాటు చేయటంతో కొత్త సమస్యలు ఏర్పడ్డాయి. పాత కప్లర్లకు కుషన్ విధానం ఉండేది. ఇంజిన్ వేగం పెరిగి నా, బ్రేకు వేసినా బోగీబోగీ మధ్య ఘర్షణ ఏర్పడ్డప్పుడు కప్లర్లకు ఉన్న కుషన్ వల్ల కుదుపు ఏర్పడేది కాదు. కానీ కొత్తగా ఏర్పా టు చేసిన కప్లర్లలో కుషన్ విధానం లేక రెండు బోగీల కప్లర్లు వేగంగా గుద్దుకుని బోగీల్లో భారీ కుదుపులు ఏర్పడుతున్నాయి. రైలు భారీ వేగంలో ఉన్న సమయంలో కుదుపులు ఏర్పడితే బెర్తుల్లోంచి కిందపడిపోయేంతగా ఉంటున్నాయి. బెర్తుల్లో పడుకు ని ఉన్నవారు కిందపడిపోవటం, తలలు బోగీ పార్టీషన్ గోడకు ఢీకొని గాయపడటం వంటివి జరుగు తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రైళ్లలోనే ఇబ్బందులు... దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాద్–ఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–కాకినాడ టౌన్ గౌతమి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్– విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్, హైదరా బాద్–కోల్‌కతా షాలీమార్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–చెన్నై చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లకు ఈ సీబీపీ కప్లర్లు అమర్చారు. కానీ, వీటివల్ల కుదుపులతో ప్రయాణికులు గాయపడుతు న్నారు. వారి నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తుండటంతో కొత్త కప్లర్లను మార్చాలని రైల్వే నిర్ణయించింది. కానీ ఉన్న వాటిని మా త్రం తొలగించలేదు. తాజాగా తెలంగాణ, గౌతమి, గోదావరి తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు పెరిగాయి. దీంతో అధికారులు విషయాన్ని రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకీ పరిస్థితి.. పాత కప్లర్లలో భద్రత పరమైన లోపాలున్నాయని గుర్తించిన రైల్వే.. కొత్త సీబీపీ కప్లర్లను తయారు చేయిస్తోంది. రైల్వేనే సొంతంగా వాటిని సిద్ధం చేసుకుం టోంది. గతంలో వేగంగా వెళ్తున్న కొన్ని రైళ్ల బోగీలు విడిపోయి ప్రమాదాలు జరగడానికి కప్లర్ల డిజైన్ లోపమే కారణమని గుర్తించిన రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. దూరప్రాంతాల మధ్య తిరిగే ఎక్కువ బోగీలుండే రైళ్లు, వేగంగా వెళ్లే రైళ్లకు తొలుత వీటిని ఏర్పాటు చేస్తున్నారు. 21, అంతకంటే ఎక్కువ బోగీ లున్న రైళ్లలో బోగీలు విడిపోయే ప్రమాదం ఉందని, వాటికి యుద్ధప్రాతిపదికన కొత్త కప్లర్లను అమరుస్తున్నారు. -
నేడు 2 గంటలు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్(12723) 15వ తేదీ బుధవారం నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి 2 గంటల ఆలస్యంగా ఉదయం 8.25 గంటలకు బయలుదేరనుంది. దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
‘వెయిటింగ్ లిస్టు’కు ‘వికల్ప్’ ఊరట
సికింద్రాబాద్-న్యూఢిల్లీ మధ్య సేవలు అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: చాంతాడంత వెయిటింగ్ లిస్టు... చార్ట్ సన్నద్ధమయ్యే వరకూ ఉత్కంఠగా ఎదురుచూపు... చివరకు బెర్త్ కన్ఫర్మ్ కాకపోతే చేసేది లేక ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు ఊరట కల్పించే ‘వికల్ప్’ పథకాన్ని ఇటీవల దక్షిణ మధ్య రైల్వే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. మొదటగా హైదరాబాద్- ఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ పథకాన్ని ప్రారంభించింది. వీటిలోని ఏదైనా రైలులో వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు ఆ తరువాత వచ్చే రైలును ఆప్షన్‌గా ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నిరీక్షణ జాబితాలో ఉన్నవారు మరో ఆప్షన్‌గా దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ తొలుత కోరుకున్న రైలులో బెర్తు పొందలేకపోతే తరువాతి రైలులో బెర్తులు ఖాళీగా ఉంటే వాటిని కేటాయిస్తారు. గతేడాది న్యూఢిల్లీ- జమ్మూ, న్యూఢిల్లీ-అమృత్సర్ మార్గాల్లో ప్రవేశపెట్టిన ‘వికల్ప్’ సత్ఫలితాలివ్వడంతో... తాజాగా ఈ పథకాన్ని హైదరాబాద్-న్యూఢిల్లీ ప్రయాణికులకూ అందుబాటులోకి తెచ్చారు. దీన్ని వినియోగించుకొనేందుకు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకొనే సమయంలోనే ‘ఆల్టర్నేట్ ట్రైన్ అకామడేషన్ స్కీమ్’ (ఏటీఏఎస్) ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. టికెట్ ధర తక్కువగా ఉంటే వారి ఖాతాలో జమవుతుంది. అధికంగా ఉంటే ప్రయాణికులు ప్రయాణ సమయంలో చెల్లించాలి. ఎమర్జెన్సీ కోటా దుర్వినియోగానికి కళ్లెం... ఎమర్జెన్సీ కోటా బెర్తులు తరచుగా దుర్వినియోగం కావడం, అనర్హులు, ట్రావెల్ ఏజెంట్లు ఏదోలా వాటిని దక్కించుకొని సొమ్ము చేసుకోవడం వల్ల ముందుగా బుక్‌చేసుకున్న ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాధారణంగా ఎమర్జెన్సీ కోటా కింద స్లీపర్ క్లాసులో 30 నుంచి 40, థర్డ్ ఏసీలో 6, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీలో 4 చొప్పున బెర్తులు కేటాయిస్తారు. ఎంపీలు, మంత్రులు, వీఐపీల కోసం, అత్యవసర సమయాల్లో ప్రయాణించవలసిన రైల్వే అధికారులు, లోకో పైలట్ తదితరుల కోసం ఈ బెర్తులుంటాయి. కానీ రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో ఈ కోటా బెర్తులు దుర్వినియోగమవుతున్నట్లు రైల్వే శాఖ గుర్తిం చింది. దీన్ని అరికట్టేందుకు ‘వికల్ప్’కు శ్రీకారం చుట్టారు. త్వరలో మరిన్ని రద్దీ రూట్లకు విస్తరణ... ‘వికల్ప్’ పథకాన్ని దశలవారీగా రద్దీగా ఉండే సికింద్రాబాద్-విశాఖ, సికింద్రాబాద్-తిరుపతి, హైదరాబాద్-నర్సాపూర్, కాచిగూడ-బెంగళూరు వంటి మార్గాల్లో ప్రవేశపెడతామని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. -
సాంకేతిక లోపంతో నిలిచిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్
భువనగిరి: తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు నిలిచిపోయింది. సోమవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన రైలు 10.30 గంటల సమయంలో ఇంజన్ లో సమస్య వచ్చింది. వెంటనే గుర్దించిన డ్రైవర్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వేరే ఇంజన్‌తో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌ను భువనగిరి స్టేషన్‌కు తీసుకొచ్చి మరమ్మతులు చేపట్టారు. తెలంగాణ ఎక్స్ ప్రెస్ పునరుద్ధరణకు మరో అరగంటపాటు సమయం పడుతుందని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు. -
ఆ రైలు పేరు ఇక 'తెలంగాణ ఎక్స్ ప్రెస్'
విజయవాడ (రైల్వేస్టేషన్): రైలు నంబర్ 12723-12724 హైదరాబాద్-న్యూఢిల్లీ-హైదరాబాద్ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తున్నట్లు రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో మైఖేల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్పు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. రైలు నంబర్ 22631-22632 బికనీర్-చెన్నై-బికనీర్ మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను అనువరాత్ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. -
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ గా మారిన ఏపీ ఎక్స్‌ప్రెస్!
న్యూఢిల్లీ:సికింద్రాబాద్-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ఈ మేరకు ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును మారుస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే గురువారం ప్రకటించింది. ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని కోరుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి టీఆర్ఎస్ ఎంపీలు పలుమార్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కలిసి ఒత్తిడి తెచ్చారు. ప్రస్తుతం ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు మార్చుతూ దక్షిణమధ్య రైల్వే తీసుకున్న నిర్ణయం నవంబర్ 15 వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇదిలా ఉండగా విజయవాడ నుంచి న్యూఢిల్లీల మధ్య ఏపీ ఎక్స్ ప్రెస్ పేరుతో రైలును నడపడానికి దక్షిణమధ్య రైల్వే కసరత్తులు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్తగా ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపే యోచనలో దక్షిణమధ్య రైల్వే ఉంది. -
రెండు తెలుగు రాష్ట్రాలపై నిర్ణయాలు
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలలో మౌలిక సదుపాయాలపై కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్య నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి రెండు రాష్ట్రాలకు వేరువేరుగా ఢిల్లీకి రైల్వే సర్వీసులు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చే ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరుని తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్పు చేశారు. వైజాగ్ నుంచి న్యూఢిల్లీకి కొత్తగా రైలు సర్వీసు కల్పించనున్నారు. దానికి ఏపీ ఎక్స్‌ప్రెస్‌గా పేరు ఖరారు చేశారు. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ పేరును కొమరంభీమ్ ఎక్స్‌ప్రెస్‌గా మార్పు చేశారు. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు మేలో సన్మాహాలు మొదలుపెట్టనున్నట్లు మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. హుద్‌హుద్‌తో దెబ్బతిన్న వైజాగ్ విమానాశ్రయం మరమ్మతులు ఈ నెలలో పూర్తి అయ్యే అవకాశం ఉందన్నారు. విశాఖకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభును వెంకయ్య కోరారు. -
రైళ్లకు బ్రేకులు... ప్రయాణికుల పాట్లు
నల్లగొండ జిల్లా: ఖాజీపేట-సికింద్రాబాద్ రైల్వే మార్గంలో బీబీనగర్-ఘట్కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య సోమవారం ఓ గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో మార్గం మధ్యలో నిలిచిపోవడంతో... పలు ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఫలితంగా ఆయా రైళ్లలోని ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఆలేరులో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను సుమారు గంట 25 నిమిషాల పాటు నిలిపివేశారు. అలాగే వంగపల్లిలో ఫలక్ నుమా, పెంబర్తి రైల్వేస్టేషన్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. వీటితో పాటు ఇంకా పలు చోట్ల రైళ్లను ఆపివేయాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులు రైలు దిగి బస్సులను, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. (ఆలేరు) -
ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చండి: కేసీఆర్
ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని రైల్వే శాఖకు లేఖ రాశారు. దాంతోపాటు మరో రైలు విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్, ఢిల్లీ నగరాల మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఇంకా దాన్ని ఏపీ పేరుతో పిలవడం సమంజసంగా ఉండబోదని కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ పేరును కొమురం భీం ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని కోరారు. -
ఇక ఏపీ ఎక్స్‌ప్రెస్ కాదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-ఢిల్లీ మధ్య తిరుగుతున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మారనుంది. మొన్నటి రైల్వే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం విజయవాడ-ఢిల్లీ మధ్య ఒక కొత్త ఎక్స్‌ప్రెస్‌ను కేటాయించింది. ఆ రైలు ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరిట నడవనుంది. దీంతో హైదరాబాద్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌కు మరో పేరు పెట్టాలని దక్షిణ మధ్య రైల్వే రైల్వే బోర్డుకు ప్రతిపాదించింది.ఈ క్రమంలో 12723/12724 నంబరుతో ఏపీ ఎక్స్‌ప్రెస్‌గా ప్రస్తుతం తిరుగుతున్న రైలుకు తెలంగాణ పేరు పెట్టాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ పేరుతో సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు(నం.17035) నడుస్తోంది. దీంతో ఆ రైలుకు మరోపేరు పెట్టి హైదరాబాద్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌కు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టాలని కొందరు ఎంపీలు సీఎం కేసీఆర్‌కు సూచించారు.అధికారికంగా రైల్వేబోర్డుకు సమాచారం అందగానే పేరు మారనుంది.