ఇక ఏపీ ఎక్స్‌ప్రెస్ కాదు | ap express changes telangana express | Sakshi
Sakshi News home page

ఇక ఏపీ ఎక్స్‌ప్రెస్ కాదు

Published Tue, Sep 2 2014 2:04 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఇక ఏపీ ఎక్స్‌ప్రెస్ కాదు - Sakshi

ఇక ఏపీ ఎక్స్‌ప్రెస్ కాదు

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-ఢిల్లీ మధ్య తిరుగుతున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మారనుంది. మొన్నటి రైల్వే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం విజయవాడ-ఢిల్లీ మధ్య ఒక కొత్త ఎక్స్‌ప్రెస్‌ను కేటాయించింది. ఆ రైలు ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరిట నడవనుంది. దీంతో హైదరాబాద్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌కు మరో పేరు పెట్టాలని దక్షిణ మధ్య రైల్వే రైల్వే బోర్డుకు ప్రతిపాదించింది.ఈ క్రమంలో 12723/12724 నంబరుతో ఏపీ ఎక్స్‌ప్రెస్‌గా ప్రస్తుతం తిరుగుతున్న రైలుకు తెలంగాణ పేరు పెట్టాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ పేరుతో సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు(నం.17035) నడుస్తోంది. దీంతో ఆ రైలుకు మరోపేరు పెట్టి హైదరాబాద్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌కు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టాలని కొందరు ఎంపీలు సీఎం కేసీఆర్‌కు సూచించారు.అధికారికంగా రైల్వేబోర్డుకు సమాచారం అందగానే పేరు మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement