కాజీపేట-బల్లార్ష రూట్‌లో పనులు.. పలు రైళ్లు రద్దు | SCR: Few Trains Cancelled And Few Diverted In Kazipet To Balharshah Route | Sakshi
Sakshi News home page

కాజీపేట-బల్లార్ష రూట్‌లో పనులు: ఈ తేదీల్లో కాగజ్‌నగర్‌తో పాటు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ కూడా..

Published Wed, Jun 26 2024 7:53 AM | Last Updated on Wed, Jun 26 2024 8:22 AM

SCR: Few Trains Cancelled And Few Diverted In Kazipet To Balharshah Route

హైదరాబాద్‌, సాక్షి: దక్షిణ మధ్య రైల్వేజోన్‌ పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఆసిఫాబాద్‌-రేచ్ని స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణం కారణంగా.. వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లను రద్దు చేశారు. అలాగే 26 ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించి నడపనున్నారు. వాటి వివరాలను ద.మ.రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

రద్దయిన రైళ్లు ఇవే.. 

సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ల మధ్య తిరిగే కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (నం.12757/12758) జూన్‌ 26 నుంచి జులై 6 వరకు రద్దు. 

  • పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ (నం.22151) ఈ నెల 28, జులై 5న..  
  • కాజీపేట-పుణె ఎక్స్‌ప్రెస్‌ (నం.22152) జూన్‌ 30, జులై 7న.. 

 

  • హైదరాబాద్‌-గోరఖ్‌పుర్‌ (నం.02575) జూన్‌ 28న, 
  • గోరఖ్‌పుర్‌-హైదరాబాద్‌ (నం.02576) ఎక్స్‌ప్రెస్‌ జులై 30న రద్దు

 

  • ముజఫర్‌పుర్‌-సికింద్రాబాద్‌ (నం.05293) జులై 2న, 
  • సికింద్రాబాద్‌-ముజఫర్‌పుర్‌ (నం.05294) జూన్‌ 27, జులై 4న రద్దు

 

  • గోరఖ్‌పుర్‌-జడ్చర్ల (నం.05303) రైలు జూన్‌ 29న, 
  • జడ్చర్ల-గోరఖ్‌పుర్‌ (నం.05304) రైళ్లు జులై 1న రద్దు

సికింద్రాబాద్‌-రాక్సల్‌ మధ్య తిరిగే వేర్వేరు మూడు రైళ్లు జూన్‌ 26, 27, 28 తేదీల్లో.. 
సికింద్రాబాద్‌-దానాపుర్‌ల మధ్య తిరిగే వేర్వేరు ఆరు రైళ్లు జూన్‌ 27, 28, 29, జులై 1 తేదీల్లో..  
సికింద్రాబాద్‌-సుభేదార్‌గంజ్‌ మధ్య తిరిగే రైళ్లు జూన్‌ 27, 29 తేదీల్లో రద్దయ్యాయి.

దారి మళ్లింపు..

  • కాజీపేట మీదుగా వెళ్లే సికింద్రాబాద్‌-న్యూఢిల్లీ (నం.12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌..  జులై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్‌ మీదుగా దారి మళ్లించనున్నారు. అంటే.. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లను ప్రయాణం ఉండదు. 
  • న్యూఢిల్లీ-సికింద్రాబాద్‌ (నం.12724) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 3, 4, 5 తేదీల్లో ముద్కేడ్, నిజామాబాద్‌ మీదుగా నడిపిస్తారు. ఆ తేదీల్లో బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్ల మీదుగా రైలు వెళ్లదు.
  • సికింద్రాబాద్‌-నిజాముద్దీన్‌ (దిల్లీ), నిజాముద్దీన్‌-సికింద్రాబాద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను (నం.12285/12286) జులై 4, 5 తేదీల్లో నిజామాబాద్‌ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement