kagaznagar express
-
కాజీపేట-బల్లార్ష రూట్లో పనులు.. పలు రైళ్లు రద్దు
హైదరాబాద్, సాక్షి: దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్లో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఆసిఫాబాద్-రేచ్ని స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణం కారణంగా.. వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లను రద్దు చేశారు. అలాగే 26 ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించి నడపనున్నారు. వాటి వివరాలను ద.మ.రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రద్దయిన రైళ్లు ఇవే.. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్‌ల మధ్య తిరిగే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (నం.12757/12758) జూన్ 26 నుంచి జులై 6 వరకు రద్దు. పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్ (నం.22151) ఈ నెల 28, జులై 5న.. కాజీపేట-పుణె ఎక్స్‌ప్రెస్ (నం.22152) జూన్ 30, జులై 7న.. హైదరాబాద్-గోరఖ్‌పుర్ (నం.02575) జూన్ 28న, గోరఖ్‌పుర్-హైదరాబాద్ (నం.02576) ఎక్స్‌ప్రెస్ జులై 30న రద్దు ముజఫర్‌పుర్-సికింద్రాబాద్ (నం.05293) జులై 2న, సికింద్రాబాద్-ముజఫర్‌పుర్ (నం.05294) జూన్ 27, జులై 4న రద్దు గోరఖ్‌పుర్-జడ్చర్ల (నం.05303) రైలు జూన్ 29న, జడ్చర్ల-గోరఖ్‌పుర్ (నం.05304) రైళ్లు జులై 1న రద్దుసికింద్రాబాద్-రాక్సల్ మధ్య తిరిగే వేర్వేరు మూడు రైళ్లు జూన్ 26, 27, 28 తేదీల్లో.. సికింద్రాబాద్-దానాపుర్ల మధ్య తిరిగే వేర్వేరు ఆరు రైళ్లు జూన్ 27, 28, 29, జులై 1 తేదీల్లో.. సికింద్రాబాద్-సుభేదార్‌గంజ్ మధ్య తిరిగే రైళ్లు జూన్ 27, 29 తేదీల్లో రద్దయ్యాయి.దారి మళ్లింపు..కాజీపేట మీదుగా వెళ్లే సికింద్రాబాద్-న్యూఢిల్లీ (నం.12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్.. జులై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్ మీదుగా దారి మళ్లించనున్నారు. అంటే.. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లను ప్రయాణం ఉండదు. న్యూఢిల్లీ-సికింద్రాబాద్ (నం.12724) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 3, 4, 5 తేదీల్లో ముద్కేడ్, నిజామాబాద్ మీదుగా నడిపిస్తారు. ఆ తేదీల్లో బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్ల మీదుగా రైలు వెళ్లదు.సికింద్రాబాద్-నిజాముద్దీన్ (దిల్లీ), నిజాముద్దీన్-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను (నం.12285/12286) జులై 4, 5 తేదీల్లో నిజామాబాద్ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు. -
ప్రయాణికులపై సర్'చార్జ్'
బెల్లంపల్లి :‘చెప్పుకోను పోతే పట్టుకొని కొట్టినట్లు’గా తయారైంది రైలు ప్రయాణికుల పరిస్థితి. ఎక్స్‌ప్రెస్ రైలుకు బదులు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని అడిగిన పాపానికి ప్రయాణికులపై రైల్వే శాఖ పెను భారం మోపింది. కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలును సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చి సర్‌చార్జి వసూళ్లకు పాల్పడుతోంది. గమ్య స్థానానికి కేవలం ఐదు నిమిషాలు ముందుగా వెళ్తోందనే కారణంతో ఒక్కో ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ.15 రైలు ప్రయాణికులపై సర్‘చార్జ్’ చొప్పున సర్‌చార్జి వసూలు చేస్తోంది. ప్రయాణికుల కష్టనష్టాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా, కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా సర్‌చార్జి భారం మోపి జేబులు గుల్ల చేస్తోంది. సర్‌చార్జి వసూలుతో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం వద్దురా బాబోయ్ అని ప్రయాణికులు గగ్గోలు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. రైల్వే శాఖ అనుసరిస్తున్న తీరుపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌ను సూపర్‌ఫాస్ట్ రైలుగా మార్చి.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్–రాష్ట్ర రాజధాని సికింద్రాబాద్ మధ్య కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ పేరుతో రైలును ప్రవేశపెట్టారు. ఈ రైలు కుమ్రం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జనగామ, యాదాద్రి జిల్లాల మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. సుమారు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణంలో ఈ రైలు 12 స్టేషన్లలో ఆగుతుంది. రోజువారీగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నా ఈ రైలుకు ముఖ్యమైన, సాధారణ రైల్వే స్టేషన్లలోనూ హాల్టింగ్ ఇస్తున్నారు. సత్వరంగా గమ్యస్థానం చేరుకోలేక రైలులోనే గంటలకొద్ది ప్రయాణం సాగిస్తున్నారు. పేరు మారిందే కాని... కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలును సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారే తప్ప మరెలాంటి మార్పులు జరగలేదు. వేగంలో కొద్దిపాటిగా తేడా ఉన్నా, రైల్వే స్టేషన్ల హాల్టింగ్లో మాత్రం మార్పులు చోటు చేసుకోలేదు. పాత పద్ధతిలోనే ప్రతి రైల్వేస్టేçÙన్‌లోనూ కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగుతోంది. కాకపోతే గతంలో కన్న ఐదు నిమిషాల ముందు గమ్యస్థానం చేరుకుంటోంది. ఎక్స్‌ప్రెస్ రైలు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా రూపాంతరం చెందిన ప్రయాణికులకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. పైపెచ్చు సర్‌చార్జి వసూలుతో నిలువుదోపిడీకి గురవుతున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ చార్జి వసూలు చేస్తున్నారు. రూ.కోట్ల భారం సర్‌చార్జి పేరుతో రైల్వే శాఖ ప్రయాణికుల నుంచి రూ.కోట్లలో ఆదాయం సమకూర్చుకుంటోంది. తద్వారా ప్రయాణికులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కి ముందు వచ్చే రైల్వే స్టేషన్లో దిగిన కూడా సర్‌చార్జి రూ.15 చెల్లించుకోక తప్పదు. తూర్పు ప్రాంతంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలలోని పలు ప్రాంతాల నుంచి రోజువారీగా వేల సంఖ్యలో ప్రయాణికులు కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో రాకపోకలు చేస్తున్నారు. రోజువారీగా కనిష్టంగా 3 వేల నుంచి గరిష్టంగా 4 వేల మంది వరకు ప్రయాణిస్తుంటారు. ఆ తీరుగా ఒక్కో టికెట్‌పై రూ.15 చొప్పున సర్‌చార్జి రోజుకు రూ.45 వేలు వసూలు అవుతుండగా, నెలకు రూ.13.50 లక్షలు, ఆ ప్రాతిపదికన ఏడాదికి సుమారు రూ.1.62 కోట్లు రైల్వే ఖజానాకు సమకూరుతోంది. మాది బెల్లంపల్లి. కిరాణ వ్యాపారం చేస్తున్నాను. ప్రతి నెలలో హైదరాబాద్‌కు రెండు, మూడుసార్లు ప్రయాణం సాగిస్తాను. కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగుతుండటంతో ఇన్నాళ్లు ఇబ్బందు లు పడ్డాం. అదే రైలును ఇప్పుడు సూపర్‌ఫాస్ట్‌గా మార్చారు. కానీ.. ఎక్స్‌ప్రెస్ రైలు మాదిరిగానే అన్ని స్టేషన్లలోనూ ఆగుతోంది. సర్‌చార్జి మాత్రం రూ.15 అదనంగా వసూలు చేస్తుండడం గమనార్హం. రైల్వేస్టేషన్ల హాల్టింగ్లో మార్పులు చేయకుండా, వేగం పెంచకుండా సర్‌చార్జి వసూలు చేయడం సరికాదు. - బ్రిజ్గోపాల్ లోయ