తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం! | Two Coaches Of Telangana Express Catch Fire In Delhi | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

Published Thu, Aug 29 2019 9:22 AM | Last Updated on Thu, Aug 29 2019 10:26 AM

Two Coaches Of Telangana Express Catch Fire In Delhi - Sakshi

సాక్షి, ఢిల్లీ:  హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళుతున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలులో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. హర్యానాలోని బల్లబ్‌గఢ్‌ వద్ద ఇవాళ ఉదయం 7.45 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనలో ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంటలు అంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు.

అయితే ఏసీ బోగీలో షార్ట్‌ సర్య్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ముందుగా  B-1 బోగీలో చెలరేగిన మంటలు ప్యాంట్రీ, ఆ తర్వాత  S-10 బోగీకి వ్యాపించినట్లు తెలుస్తోంది.  బ్రేక్ బైండింగ్ గట్టిగా పట్టి వేయడంతో పొగలు వ్యాపించాయని, ఈ సంఘటనతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు ఉత్తర రైల్వే సీపీఆర్వో ఓ ప్రకటన చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement