ఏపీ ఎక్స్ప్రెస్ పేరు మార్చాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని రైల్వే శాఖకు లేఖ రాశారు.
ఏపీ ఎక్స్ప్రెస్ పేరు మార్చాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని రైల్వే శాఖకు లేఖ రాశారు. దాంతోపాటు మరో రైలు విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్, ఢిల్లీ నగరాల మధ్య నడిచే ఏపీ ఎక్స్ప్రెస్ పేరు మార్చాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఇంకా దాన్ని ఏపీ పేరుతో పిలవడం సమంజసంగా ఉండబోదని కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ప్రెస్ పేరును కొమురం భీం ఎక్స్ప్రెస్గా మార్చాలని కోరారు.