న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గృహనిర్మాణ పథకానికి ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని ఆయన చెప్పారు. గురువారం వెంకయ్యనాయుడితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలు సమావేశం అయ్యారు.
ఈ సమావేశం అనంతరం వెంకయ్యనాయుడు విలేకరులతో మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాల పెంపుపై చర్చించామని చెప్పారు. ఎమ్మెల్సీ స్థానాల పెంపుపై కొంత రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. తెలంగాణపై వివక్ష లేదని హడ్కో రుణం కింద రూ.3,500కోట్లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్లో తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు. హైకోర్టు, పలు విభజన అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణ అభివృద్దికి తన వంతు పూర్తి సహాయం అందిస్తానని వెంకయ్యనాయుడు చెప్పారు.
'మాకు తెలంగాణపై వివక్ష లేదు'
Published Thu, Dec 10 2015 4:13 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement