ఏపీ కంటే ఎక్కువ విద్యుత్ వాడుకుంటున్న తెలంగాణ
విలేకరుల సమావేశంలో యనమల
హైదరాబాద్: ఏపీలోని పలు విద్యుత్ ఉత్పాదన సంస్థల నుంచి రావాల్సిన వాటా కంటే ఎక్కువ వినియోగించుకుంటు న్న తెలంగాణ ప్రభుత్వం, తమ ప్రభుత్వంపై ఆభాండాలు వేయటం ద్వారా లబ్ధిపొందాలని చూస్తోందని మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. కొన్ని ప్రాజెక్టుల్లో తమకు రావాల్సిన వాటాను కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వటం లేదని చెప్పారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య ఏవైనా సమస్యలుంటే చర్చించి పరిష్కరించుకోవాలి తప్ప అసెంబ్లీ వేదికగా తమపై ఆరోపణలు చే యటం సరికాదన్నారు. సమస్యలు చర్చలతో పరిష్కా రం కాకపోతే కోర్టులున్నాయని సూచించారు.
అదేమైనా విద్యుత్ ప్లాంటా?: సోమిరెడ్డి
చంద్రబాబు ముక్కు పిండి విద్యుత్‌ను తీసుకుంటామని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు చెప్తున్నారని, ముక్కు పిండితే వచ్చేందుకు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముక్కు విద్యుత్ ప్లాంట్ కాదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మంగళ వారం ఎన్‌టీఆర్ భవన్‌లో వ్యాఖ్యానించారు.