ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 33 మంది మరణించారు. సుమారు 80 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్ రైలు రావల్పిండికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ప్రారంభించామని అధికారులు తెలిపారు.
Pakistan: 30 dead, 80 injured after 10 coaches of Hazara Express derail in Sindh
— ANI Digital (@ani_digital) August 6, 2023
Read @ANI Story | https://t.co/76FRYrynMI#Pakistan #hazaraexpress #Sindh pic.twitter.com/apJHUHBxFE
హజరా ఎక్స్‌ప్రెస్ రావల్పిండికి వెళ్తుండగా.. షాజాద్‌పూర్, నవాబ్‌షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు 10 బోగీలు పట్టాలు తప్పిపోయాయి. దీంతో 15 మంది అక్కకిడక్కడే మృతి చెందారు. కరాచీ నుంచి పంజాబ్‌కు వెళ్లే ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
ఇదీ చదవండి: అవయవ మార్పిడికి దేశంలో 56 వేల మంది వెయిటింగ్
Comments
Please login to add a commentAdd a comment