Russia: పట్టాలు తప్పిన రైలు.. 100 మందికి గాయాలు | Train Derails in Russia Over 100 Injured | Sakshi
Sakshi News home page

Russia: పట్టాలు తప్పిన రైలు.. 100 మందికి గాయాలు

Published Tue, Jul 30 2024 6:48 AM | Last Updated on Tue, Jul 30 2024 6:48 AM

Train Derails in Russia Over 100 Injured

రష్యాలోని దక్షిణ వోల్గోగ్రాడ్ ప్రాంతంలో  ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 800 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.

ట్రక్కును ఢీకొట్టిన అనంతరం రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. రష్యా టుడే తెలిపిన వివరాల ప్రకారం 20 బోగీలతో కూడిన ఈ రైలు రష్యాలోని టాటర్‌స్థాన్ రిపబ్లిక్‌లోని కజాన్ నుంచి సోచి సమీపంలోని రిసార్ట్ నగరం అడ్లెర్‌కు వెళుతోంది. రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పినట్లు వోల్గోగ్రాడ్ రీజియన్ గవర్నర్ ఆండ్రీ బోచారోవ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ప్రమాదం నుంచి ట్రక్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే అతని తలకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు  అధికారులు తెలిపారు. కాగా ఈ ఏడాది జూన్‌లో రష్యాలోని కోమిలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్యాసింజర్ రైలులోని తొమ్మిది కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్యాసింజర్ రైలు ఈశాన్య కోమిలోని వోర్కుటా నుండి నల్ల సముద్రపు నొవోరోసిస్క్ ఓడరేవుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రాంతాల మధ్య దూరం ఐదు వేల కిలోమీటర్లు ఉంటుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement