గౌహతి: అసోంలో గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలుకు చెందిన నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలెట్ రైలును ఆపివేశాడు. గౌహతి- హౌరా స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం హౌరాకు బయల్దేరింది. అసోంలోని చాయ్‌గావ్ స్టేషన్ సమీపంలో ట్రాక్ మారుతుండగా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే పైలెట్ స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని ఈశాన్య సరిహద్దు రైల్వే అధికారులు ప్రకటించారు. వెంటనే స్పందించిన అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.
చదవండి: ఎంతటి దుస్థితి! అఫ్గాన్ మంత్రి నేడు డెలివరీ బాయ్‌గా
చదవండి: కలకలం.. ఉద్యోగాలు ట్రాన్స్‌ఫర్ చేశారని విషం తాగిన టీచర్లు
పట్టాలు తప్పిన గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు
Published Wed, Aug 25 2021 6:03 PM | Last Updated on Wed, Aug 25 2021 7:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment