![Case Against Ranveer Allahbadia In Assam](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/ranveerallahbadia.jpg.webp?itok=QYyMgCHv)
గువహతి:ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో అశ్లీల వ్యాఖ్యలు చేసినందుకుగాను ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియాపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. ఎఫ్‌ఐఆర్‌లో రణ్‌వీర్ అలహాబాదియాతో పాటు ఇండియాస్ గాట్ లేటెంట్‌లో పాల్గొన్న ప్యానెలిస్టుల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు తెలిపారు.
Today @GuwahatiPol has registered an FIR against against certain Youtubers and social Influencers, namely
1. Shri Ashish Chanchlani
2. Shri Jaspreet Singh
3. Shri Apoorva Makhija
4. Shri Ranveer Allahbadia
5. Shri Samay Raina and others
for promoting obscenity and engaging in…— Himanta Biswa Sarma (@himantabiswa) February 10, 2025
అశ్లీల వ్యాఖ్యలకుగాను ఇప్పటికే రణ్‌వీర్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.కేసు దర్యాప్తులో భాగంగా షో జరిగిన సెట్‌లోకి కూడా పోలీసులు వెళ్లి పరిశీలించారు. రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి.
నెటిజన్లంతా రణ్‌వీర్‌పై దుమ్మెత్తిపోశారు.రణ్‌వీర్ వ్యాఖ్యల వీడియోలను తొలగించాల్సిందిగా జాతీయ మనావహక్కుల సంఘం ఇప్పటికే యూట్యూబ్‌ను కోరింది. అయితే తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో రణ్‌వీర్ ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment