‘వారు వేసే బిస్కెట్‌ తినకుండా రాజీనామా చేశా’ | Himanta Sarma claims Rahul Gandhi gave dogs biscuit To worker Video Viral | Sakshi
Sakshi News home page

‘వారు వేసే బిస్కెట్‌ తినకుండా రాజీనామా చేశా’

Published Tue, Feb 6 2024 3:41 PM | Last Updated on Tue, Feb 6 2024 4:15 PM

Himanta Sarma claims Rahul Gandhi gave dogs biscuit To worker Video Viral - Sakshi

న్యూఢిల్లీ: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్శ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై మరోసారి విమర్శలు గుప్పించారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ ప్రస్తుతం జార్ఖండ్‌లో కొనసాగుతోంది. అక్కడ చోటుచేసుకున్న ఓ సంఘటనపై హిమంత ఎద్దేవా చేశారు.

రాహుల్‌ చేట్టిన యాత్రలో భాగంగా  ఒక కాంగ్రెస్‌  కార్యకర్త తన పెంపుడు కుక్కను తీసుకువచ్చారు. ర్యాలీ చేస్తున్న వాహనంపైకి తీసుకెవెళ్లగా.. రాహుల్‌ గాంధీ దానికి బిస్కెట్‌ తినిపించడానికి ప్రయత్నించారు. అయితే ఆ పెంపుడు కుక్క రాహుల్‌ గాంధీ పెట్టిన బిస్కెట్‌ తినకుండా తిరస్కరించింది. దీంతో ఆయన కుక్క తినకుండా తిరస్కరించిన బిస్కెట్‌ను కాంగ్రెస్‌ కార్యకర్తకు అందించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

‘గతంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుక్కలతో పోల్చుతారు. ఇప్పుడేమే కుక్క తినకుండా నిరాకరించిన బిస్కెట్‌ను రాహుల్‌ గాంధీ కార్యకర్తలు ఇచ్చారు. వాళ్లు కాంగ్రెస్‌ కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లకు  ఇచ్చే గౌరవం ఇదా? అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. 

దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్వ స్పందించారు. ‘రాహుల్ గాంధీ మాత్రమే కాదు. ఆ కుటుంబం.. వాళ్లు వేసే బిస్కెట్‌ను నేను తినేలా చేయలేకపోయారు. నేను గర్వించదగిన అస్సామీని, భారతీయుడిని. నేను ఆ బిస్కెట్‌ తినడానికి నిరాకరించాను. అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేశాను’ అని ‘ఎక్స్’ ట్విటర్‌ వేదికగా తెలిపారు.  

ఇక.. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాహుల్‌ గాంధీని కవలడానికి వారి నివాసానికి వెళ్లితే.. రాహుల్‌ తన పెంపుడు కుక్క బిస్కెట్లు తినే ప్లేట్‌లోనే కాంగ్రెస్‌ నేతలకు బిస్కెట్లు ఇచ్చేవారని ఆరోపణలు చేశారు.

మరోవైపు.. రాహుల్‌ గాంధీ కుక్క తినకుండా తిరస్కరించిన బిస్కెట్‌ను కుక్క యజమాని అయిన కాంగ్రెస్‌ కార్యకర్తకు ఇస్తే దాన్ని ఆ యజమాని కుక్కకు తినిపించినట్లు మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేయటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement