గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర అస్సాం(అసోం)లో రాజకీయ వేడిని పెంచుతోంది. రాహుల్ వర్సెస్ హిమంత బిశ్వ శర్మగా మారి తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీ అరెస్ట్ కావటం ఖాయమని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. బుధవారం సిబ్‌సాగర్ జిల్లాలోని నజిరా ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ అరెస్ట్ అవుతారని సీఎం హిమంత చెప్పారు. రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయినట్లు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) కూడా విచారణ చేపట్టిందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ అరెస్ట్ కావటం ఖాయని అన్నారు.
మంగళవారం మేఘాలయా నుంచి అసోం గువాహటిలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుండగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని అది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
అసోంలో ఘర్షణలు సృష్టించినందుకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలపై పోలీసు కేసులు నమోదు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో హింస, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడికి పురిగొల్పినందుకు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: అస్సాం ఉద్రిక్తతల వేళ.. మళ్లీ సంచలన ఆరోపణలకు దిగిన రాహుల్ గాంధీ
Comments
Please login to add a commentAdd a comment