Himanta Bisva Sharma
-
చొరబాటుదార్లను తరిమికొట్టాలి
రాంచీ: అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ వివాదాస్పద మరోసారి వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ నుంచి చొరబాటుదారులను తరిమికొట్టాలని అన్నారు. లేకపోతే రాష్ట్రంలో హిందువుల జనాభా మరో 20 ఏళ్లలో సగానికి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువులంతా ఐక్యంగా ఉండాలని కోరారు. శనివారం పాలాములో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో హిమంతబిశ్వ శర్మ ప్రసంగించారు. ఆయన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ–ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. చొరబాటుదార్లను బయటకు వెళ్లగొట్టడానికి, హిందువులను కాపాడడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. జార్ఖండ్‌లో పలు ప్రాంతాల్లో హిందువుల జనాభా ఇప్పటికే భారీగా తగ్గిపోయిందని గుర్తుచేశారు. భారతదేశాన్ని హిందువులు కాపాడుతున్నారని, జైశ్రీరామ్ అని నినదించడానికి అందరూ ఐక్యమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఓ వర్గం ప్రజలు ఎల్లప్పుడూ జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకే ఓటు వేస్తున్నారని, హిందువుల ఓట్లు మాత్రం పారీ్టల వారీగా చీలిపోతున్నాయని తెలిపారు. అలా కాకుండా హిందువులంతా ఒక్కటై జేఎంఎం కూటమిని ఓడించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాం«దీపై హిమంతబిశ్వ శర్మ మండిపడ్డారు. రాహుల్ విభజన రాజకీయాలు చేస్తున్నారని, హిందువుల మధ్య చిచ్చుపెట్టి విడదీస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్‌లో అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. అస్సాంలో జార్ఖండ్ గిరిజనులకు గుర్తింపేదీ?: హేమంత్ సోరెన్ అస్సాంలో జార్ఖండ్ గిరిజనుల గుర్తింపును హిమంతబిశ్వ శర్మ ప్రభుత్వం చెరిపేస్తోందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. జార్ఖండ్ నుంచి వెళ్లిన గిరిజనులకు అస్సాంలో ఎస్టీ హోదా కలి్పంచడం లేదని విమర్శించారు. శనివారం కుంతీ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో సోరెన్ మాట్లాడారు. జార్ఖండ్ మూలాలున్న ప్రజలు అస్సాం టీ తోటల్లో పని చేస్తున్నారని, వారి బతుకులు దుర్బరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అస్సాం ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. బీజేపీపై సోరెన్ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ కుల మతాల పేరిట సమాజాన్ని విచి్ఛన్నం చేస్తోందని దుయ్యబట్టారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామని, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హేమంత్ సోరెన్ ధీమా వ్యక్తంచేశారు. -
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన చంపయీ సోరెన్!
ఢిల్లీ: జార్ఖండ్ ఆదివాసీ నేత, మాజీ సీఎం చంపయీ సోరెన్.. జేఎంఎంకు ఝలక్ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరునున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై చంపయీ సైతం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజాగా ఆయన చేరికను నిర్ధారిస్తూ.. బీజేపీ నేత, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ‘ఎక్స్’ వేదికగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మాజీ సీఎం, ఆదివాసీ నేత చంపయీ సోరెన్ ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. రాంచీలో చంపయీ అధికారికంగా ఆగస్టు 30 (శుక్రవారం)బీజేపీలో చేరనున్నారు’అని పేర్కొన్నారు.Former Chief Minister of Jharkhand and a distinguished Adivasi leader of our country, @ChampaiSoren Ji met Hon’ble Union Home Minister @AmitShah Ji a short while ago. He will officially join the @BJP4India on 30th August in Ranchi. pic.twitter.com/OOAhpgrvmu— Himanta Biswa Sarma (@himantabiswa) August 26, 2024ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సొంత పార్టీ నేతలే తనను దారుణంగా అవమానించారని, దాంతో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చిందని చంపయ సోరెన్ ఇటీవల అన్నారు. మరోవైపు.. బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేస్తోందని జేఎంఎం కార్యవర్గ నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించిన విషయం తెలిసిందే. బీజేపీ గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర నుంచి నాయకులను జార్ఖండ్‌కు తెచ్చి గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల్లో విషం నింపుతోందని, ఒకరిపైకి మరొకరిని ఉసిగోల్పుతోందని అన్నారు.భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. ఈడీ అరెస్ట్‌తో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సోరెన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న చంపయీ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. వరుస పరిణామాల అనంతరం హేమంత్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే తనను సీఎం పదవి నుంచి తప్పించడం వల్ల చంపయీ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల గడువు జనవరి 5, 2025తో ముగియనుంది. దీంతో.. ఈ ఏడాది చివర్లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. తాజాగా జమ్ము కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. జార్ఖండ్‌కు ప్రకటన చేయొచ్చనే ప్రచారం జరిగింది. కానీ, ఈసీ అలాంటిదేం చేయలేదు. -
ప్రపంచవ్యాప్తంగా రైట్‌వింగ్ నేతలపైనే టార్గెట్: అస్సొం సీఎం
ఢిల్లీ: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పులను ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. తాజాగా ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై అస్సొం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రైట్ వింగ్ నేతలను లెఫ్ట్ వింగ్ పార్టీలు టార్గెట్ చేస్తున్నాయని అన్నారు. దేశమే తొలి ప్రాధాన్యం అనే జాతీయవాదాన్ని కలిగి ఉన్న నేతలను ఎవరు ఓడించలేరని తెలిపారు.‘‘భౌతికంగా, మరోరకంగా ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ నేతలపై లెఫ్ట్ పార్టీ దాడులతో టార్గెట్ చేస్తోంది. ఈ దాడులు జాతీయవాదం కలిగి ఉండే నేతలను ఓడించలేవు. జాతీయవాదం అనేది పూర్తిగా ఆధ్యాత్మిక సనాతనతత్వం నుంచి ప్రేరణ పొందింది. డొనాల్డ్ ట్రంప్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.Physical or otherwise, right-wing leaders across the globe are now active targets of the radical left. However, these attacks will not be able to defeat the "nation first" ideology. This is rooted in deep spirituality and inspired by the Sanatan philosophy of "Janani Janmabhoomi…— Himanta Biswa Sarma (@himantabiswa) July 14, 2024 ఇక, శనివారం పెన్సిల్వేనియాలో చేపట్టిన ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ పక్కనుంచి దూసుకుపోవటంతో గాయమైంది. వెంటనే అప్రత్తమై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదిక పైకి వచ్చి.. ట్రంప్‌ను అక్కడి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు.ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తాజాగా గుర్తించింది. అతణ్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా ధ్రువీకరించారు. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు క్రూక్స్‌ను షూట్ చేసినట్లు ఎఫ్‌బీఐ ఏజెన్సీ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో సహా ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. -
‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మధురలోని కృష్ణ జన్మభూమి స్థలంలో, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో దేవాలయాలు నిర్మిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.“డబుల్, ట్రిపుల్ సెంచరీలు ఎందుకు సాధించావని సచిన్ టెండూల్కర్‌ని ఎవరైనా అడుగుతారా? మనకు 300 సీట్లు ఉన్నప్పుడు రామమందిరాన్ని నిర్మించాం. ఇప్పుడు మనకు 400 సీట్లు వస్తే మధురలో కృష్ణ జన్మభూమి సాక్షాత్కరిస్తుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు స్థానంలో విశ్వనాథుని ఆలయాన్ని కూడా నిర్మిస్తాం” అని మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో అసోం సీఎం పేర్కొన్నారు.బీజేపీ తూర్పు ఢిల్లీ అభ్యర్థి హర్ష్ మల్హోత్రా తరపున ప్రచారం చేసేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దేశ రాజధానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన నాయకత్వంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అవుతుందన్నారు. ‘కశ్మీర్ భారత్, పాకిస్థాన్ రెండింటిలోనూ భాగమని కాంగ్రెస్ హయాంలో చెప్పాం. మోదీకి 400 సీట్లు వస్తే పీఓకేని భారత్‌కు తీసుకువస్తాం. 400 సీట్లతో మా ప్రణాళికలను కొనసాగిస్తూ పోతాం.. కాంగ్రెస్ ఐసీయూకి చేరుతుంది" అని హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. -
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం.. మండిపడ్డ బీజేపీ
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత శ్యామ్ పిట్రోడా ఇటీవల వారసత్వ పన్నుపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటంతో.. అధికార బీజేపీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఆయన జాతీయ ఐక్యతపై చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఓ ఇంటర్వ్యూ భారత్ గురించి మాట్లాడారు."We could hold together a country as diverse as India, where people on East look like Chinese, people on West look like Arab, people on North look like maybe White and people in South look like Africa" 💀💀(VC : @TheStatesmanLtd) pic.twitter.com/aPQUyJflag— Darshan Pathak (@darshanpathak) May 8, 2024‘భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. తూర్పు వైపు ఉన్న ప్రజలు చైనా వారిని పోలి ఉంటారు. దక్షిణం వైపు ఉన్న ప్రజలు అరబ్ వారిలా ఉంటారు. ఉత్తర దిక్కు వాళ్లు అయితే నల్లగా లేదా తెల్లగా ఉంటారు. దక్షిణ భారతంలోని ప్రజలు అఫ్రికా వారిలా కనిపిస్తారు’ అని శ్యామ్ పిట్రోడా తెలిపారు.Sam bhai, I am from the North East and I look like an Indian. We are a diverse country - we may look different but we are all one. Hamare desh ke bare mein thoda to samajh lo! https://t.co/eXairi0n1n— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) May 8, 2024శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఖండించారు. ‘శ్యామ్ భాయ్.. నేను ఈశాన్య భారతీయుడను. నేను భారతీయుడిలాగే కనిపిస్తాను. భిన్నత్వమున్న దేశంలో ఉన్నా.. భిన్నంగా కనిపించినా మేమంతా ఒక్కటే అని ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ వేశారు. ముందు భారత దేశ భిన్నత్వం గురించి ఎంతోకొంత అర్థం చేసుకోవాలని శ్యామ్ ప్రిటోడాకు హితవు పలికారు. శ్యామ్ చేసిన వ్యాఖ్యలపై ఈశాన్య భారతంలోని ముఖ్యమంత్రులు, మణిపూర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టో: ఆ దేశానికి కరెక్ట్‌గా సరిపోతుందని హిమంత సెటైర్లు
దిస్పూర్:కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోఫై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గమనిస్తే.. భారత్‌లోని ఎన్నికల కంటే పాకిస్థాన్‌లో ఎన్నికలకు తగినట్లు ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎద్దేవా చేశారు. దేశంలో విభజన వాదాన్ని సృష్టించి అధికారంలోకి రావాని కాంగ్రెస్ భావిస్తోందని మండిపడ్డారు. శనివారం జోరాట్ స్థానంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో బుజ్జగింపు రాజకీలకు నిదర్శనం. మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను గమనిస్తే.. భారత్‌లో ఎన్నికల కంటే పాకిస్తాన్లో ఎన్నికలు సరిపోయేటట్టు ఉంది. సమాజంలో విభజన చిచ్టుపెట్టి అధకారంలోకి రావాలనుకోవటమే కాంగ్రెస్ స్వాభావం. అస్సాంలో ఉన్న మొత్తం 14 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. భారత దేశాన్ని విశ్వగురువుగా మర్చేందుకు బీజేపీ ఉద్యమాన్ని చేపట్టింది’ అని హిమంత అన్నారు. హిమంత విమర్శలపై కాంగ్రెస్ కౌంటర్... అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. పార్టీలు మారే హిమంత బిశ్వ శర్మకు కాంగ్రెస్ పార్టీ లైకిక, సమ్మిలిత తత్వం అస్సలు అర్థం కావని కౌంటర్ ఇచ్చింది. ఇక.. హిమంత 2015లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ‘హిమంత ఏళ్ల తరబడి కాంగ్రెస్ ఉన్నా.. పార్టీ విలువలు అర్థం చేసుకోలేపోయారు. అందుకే ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ లో ఉన్నప్పటకీ కేవలం తన నిజాయితీని చాటుకోవటం కోసమే కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తారు’ అని అస్సాం కాంగ్రెస్ అధికార ప్రతినిధి బేదబ్రతా బోరా అన్నారు. మరోవైపు.. సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేస్తోంది. ఆ పార్టీ మేనిఫెస్టోలో న్యూయార్క్, థాయ్‌లాండ్‌ల ఫోటోలను ఉపయోగించారని బీజేపీ నేత సుధాన్షు త్రివేది ఆరోపించారు. ఇక.. అస్సాంలో మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. -
‘అలా జరిగితే.. నేను రాజీనామా చేస్తాను’.. అస్సాం సీఎం హిమంత
దిస్పూర్: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేస్తూ విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం నోటీఫై చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏను అమలు చేస్తూ మళ్లీ తెరపైకి తీసుకురావటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. అస్సాం రాష్ట్రంలో కూడా సీఏఏ అమలుపై వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్వ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) జాబితాలో నమోదు చేసుకోనివారికి ఒక్కరికైనా కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ కింద పౌరసత్వం కల్పిస్తే.. తన సీఎం పదవి రాజీనామ చేస్తామని తెలిపారు. ‘నేను అస్సాం పుత్రుడను. ఒక్క వ్యక్తి అయినా ఎన్ఆర్సీలో నమోదు కాకుండా సీఏఏ ద్వారా పౌరసత్వం పొందితే మొదట నేనే నా పదవికి రాజీనామా చేస్తా. సీఏఏ అనేది కొత్త చట్టం కాదు. గతంలో కూడా ఇలాంటి చట్టం ఉంది. పారదర్శంగా ప్రజలు నమోదు చేసుకునేందుకు పోర్టల్ కూడా అందుబాటులోకి తెచ్చాం. అయినా ప్రజలు విధుల్లో నిరసన తెలపటంలో అర్థం లేదు. ఈ చట్టం సరైందో? కాదో? అని విషయాన్ని.. సమాచారంతో కూడిన పోర్టల్ తెలియజేస్తుంది’ అని శివసాగరల్లోని ఓ కార్యక్రమంలో సీఎం హిమంత అన్నారు. సీఏఏ అమలుపై నిరసన తెలుపుతున్న పలు సంఘాలపై పోలీసుల నోటీసులు పంపారు. అయినప్పటికీ నిరసనలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. 16 పార్టీల యునైటెట్ అపోజిషన్ పోరం అస్సాం( యూఓఎఫ్‌ఏ) సీఏఏ అమలుపై నిరసన చేపడతామని ప్రకటన విడదల చేసిన విషయం తెలిసిందే. -
‘వారు వేసే బిస్కెట్ తినకుండా రాజీనామా చేశా’
న్యూఢిల్లీ: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్శ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరోసారి విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ప్రస్తుతం జార్ఖండ్‌లో కొనసాగుతోంది. అక్కడ చోటుచేసుకున్న ఓ సంఘటనపై హిమంత ఎద్దేవా చేశారు. రాహుల్ చేట్టిన యాత్రలో భాగంగా ఒక కాంగ్రెస్ కార్యకర్త తన పెంపుడు కుక్కను తీసుకువచ్చారు. ర్యాలీ చేస్తున్న వాహనంపైకి తీసుకెవెళ్లగా.. రాహుల్ గాంధీ దానికి బిస్కెట్ తినిపించడానికి ప్రయత్నించారు. అయితే ఆ పెంపుడు కుక్క రాహుల్ గాంధీ పెట్టిన బిస్కెట్ తినకుండా తిరస్కరించింది. దీంతో ఆయన కుక్క తినకుండా తిరస్కరించిన బిస్కెట్‌ను కాంగ్రెస్ కార్యకర్తకు అందించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. A brief pause for a paw-some furry friend. 🐾#BharatJodoNyayYatra pic.twitter.com/ccysNDVIHr — Bharat Jodo Nyay Yatra (@bharatjodo) February 4, 2024 ‘గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుక్కలతో పోల్చుతారు. ఇప్పుడేమే కుక్క తినకుండా నిరాకరించిన బిస్కెట్‌ను రాహుల్ గాంధీ కార్యకర్తలు ఇచ్చారు. వాళ్లు కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లకు ఇచ్చే గౌరవం ఇదా? అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. How shameless First, Rahul Gandhi made @himantabiswa ji eat biscuits 🍪 from same plate as his pet dog 🐕 Pidi Then Congress President Khargeji compares party workers to dogs 🐕 & now, Shehzada gives a biscuit 🍪 rejected by a dog 🐕 to a party worker This is the RESPECT… pic.twitter.com/hXZGwGa2Ks — PallaviCT (@pallavict) February 5, 2024 దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్వ స్పందించారు. ‘రాహుల్ గాంధీ మాత్రమే కాదు. ఆ కుటుంబం.. వాళ్లు వేసే బిస్కెట్‌ను నేను తినేలా చేయలేకపోయారు. నేను గర్వించదగిన అస్సామీని, భారతీయుడిని. నేను ఆ బిస్కెట్ తినడానికి నిరాకరించాను. అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేశాను’ అని ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా తెలిపారు. Pallavi ji, not only Rahul Gandhi but the entire family could not make me eat that biscuit. I am a proud Assamese and Indian . I refused to eat and resign from the Congress. https://t.co/ywumO3iuBr — Himanta Biswa Sarma (@himantabiswa) February 5, 2024 ఇక.. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని కవలడానికి వారి నివాసానికి వెళ్లితే.. రాహుల్ తన పెంపుడు కుక్క బిస్కెట్లు తినే ప్లేట్లోనే కాంగ్రెస్ నేతలకు బిస్కెట్లు ఇచ్చేవారని ఆరోపణలు చేశారు. మరోవైపు.. రాహుల్ గాంధీ కుక్క తినకుండా తిరస్కరించిన బిస్కెట్‌ను కుక్క యజమాని అయిన కాంగ్రెస్ కార్యకర్తకు ఇస్తే దాన్ని ఆ యజమాని కుక్కకు తినిపించినట్లు మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేయటం గమనార్హం. -
అలాంటి వాళ్లు కాంగ్రెస్ వీడాలనుకున్నా: రాహుల్ గాంధీ
కోల్‌కతా: కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండేవారు తమ పార్టీలో నుంచి వెళ్లిపోయినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ తాను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా పశ్చిమ బెంగాల్లో ‘డిజిటల్ మీడియా వారియర్స్’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ పతనం, ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. హిమంత, మిలింద్ దేవరా వంటి వ్యక్తులు కాంగ్రెస్‌కు విడిచిపెట్టాలకున్నానని తెలిపారు. వారు పార్టీ నుంచి వెళ్లిపోవటం వల్ల ఇబ్బంది ఏం లేదన్నారు. వారి పార్టీ మార్పు సరైందేనని తెలిపారు. హిమంత విచిత్రమైన రాజకీయనాయుడని.. అతని వంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు సరిపోడని అన్నారు. అతను ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనమని తెలిపారు. తాను రక్షించాలనుకుంటున్న విలువలకు అతని వ్యాఖ్యలు చాలా వ్యతిరేకమని చెప్పారు. ఇటీవల అస్సాం సీఎం హిమంత, రాహుల్ గాంధీ.. తీవ్రమైన విమర్శ, ప్రతివిమర్శలకు దిగిన విషయం తెలిసిందే. రాహుల్ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ద్వారా అస్సాంలో అలజడి సృష్టించాలని చూశారని విమర్శించారు. దీంతో అత్యంత అవినీతిపరుడైన సీఎం.. హిమంత అని రాహుల్ గాంధీ మండిపడ్డ విషయం తెలిసిందే. ఇటీవల మహారాష్ట్రలో కీలక నేత అయిన మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేవలో చేరిన విషయం తెలిసిందే. ముంబై సౌత్ నియోజకవర్గానికి సంబంధించి.. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురై పార్టీ మారిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విలువలు లేని అటువంటి నేతలు వెళ్లిపోవటం అనేది ప్రతిపక్ష ఇండియా కూటమిపై కూడా ఎటువంటి ప్రభావం పడదని రాహుల్ గాంధీ తెలిపారు. చదవండి: karnataka: కాంగ్రెస్‌పై సొంత పార్టీ నేత తీవ్ర విమర్శలు -
పాతిక కేసులు పెట్టుకోండి: రాహుల్
బార్పేట(అస్సాం): అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తనపై మోపిన కేసులకు భయపడేది లేదని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. నాగాలాండ్ నుంచి అస్సాంలోని గువాహటిలోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నపుడు జరిగిన ఘర్షణలకు రాహుల్ కారకుడంటూ హిమంత సర్కార్ కేసులు పెట్టడం తెల్సిందే. అస్సాంలో ఏడురోజుల యాత్ర బర్పెటా జిల్లా కేంద్రంలో బుధవారం ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన తొలి బహిరంగ సభలో సీఎంపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ కేసులు పెట్టి నన్ను బయపెట్టొచ్చన్న ఐడియా హిమంతకు ఎందుకు వచి్చందో నాకైతే తెలీదు. మీరు(హిమంత, పోలీసులు) ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. మరో పాతిక తప్పుడు కేసులు బనాయించండి. నేను అస్సలు భయపడను. బీజేపీ–ఆర్ఎస్ఎస్ నన్ను భయపెట్టలేవు’’ అని అన్నారు. హిమంతను అతిపెద్ద అవినీతి సీఎంగా అభివరి్ణంచారు. ‘‘ మీరు ఆయనతో మాట్లాడుతుంటే ఆలోపు మీ భూమి కొట్టేస్తారు. మీరు వక్కపలుకులు నమిలినంత తేలిగ్గా ఆయన సుపారీ బిజినెస్ కానచ్చేస్తారు. మీ జేబులో డబ్బు నొక్కేస్తారు. ఏకంగా కజిరంగా నేషనల్ పార్క్ స్థలాలనే సీఎం ఆక్రమించారు. సీఎంతో జాగ్రత్త’ అని జనాన్ని అప్రమత్తం చేశారు. ఎన్నికలయ్యాక లోపలేస్తాం: సీఎం మంగళవారం నాటి ఘర్షణలకు సంబంధించిన కేసులో రాహుల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత చెప్పారు. -
రాహుల్ గాంధీ అరెస్ట్ ఖాయం: అస్సాం సీఎం
గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర అస్సాం(అసోం)లో రాజకీయ వేడిని పెంచుతోంది. రాహుల్ వర్సెస్ హిమంత బిశ్వ శర్మగా మారి తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీ అరెస్ట్ కావటం ఖాయమని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. బుధవారం సిబ్సాగర్ జిల్లాలోని నజిరా ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాబోయే లోక్ సభ ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ అరెస్ట్ అవుతారని సీఎం హిమంత చెప్పారు. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) కూడా విచారణ చేపట్టిందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ అరెస్ట్ కావటం ఖాయని అన్నారు. మంగళవారం మేఘాలయా నుంచి అసోం గువాహటిలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుండగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని అది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అసోంలో ఘర్షణలు సృష్టించినందుకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలపై పోలీసు కేసులు నమోదు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో హింస, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడికి పురిగొల్పినందుకు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అస్సాం ఉద్రిక్తతల వేళ.. మళ్లీ సంచలన ఆరోపణలకు దిగిన రాహుల్ గాంధీ -
‘అస్సాం సీఎం మాకు తీవ్ర అన్యాయం చేశారు’
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మపై విమర్శలు గుప్పించారు. శనివారం బొంగైగావ్ ప్రాంతంలో ఓ సమావేశంలో పాల్గొన్న బద్రుద్దీన్.. సీఎం హిమంత బిస్వాను టార్గెట్ చేశారు. గతంలో హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో ముస్లింలు వేసిన ఓట్ల వల్లనే ఆయన గెలిచారని అన్నారు. హిమంత కాంగ్రెస్ ఉన్న సమయంలో ముస్లింల మద్దతు అధికంగా ఉండేదని తెలిపారు. కానీ.. ప్రస్తుత సమయంలో తమ వర్గానికి సీఎం హిమంత తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. తన గెలుపులో కీలకమైన తమకు హిమంత.. బీజేపీలో చేరిన తర్వాత తమకు చేయవల్సిన సంక్షేమాన్ని పూర్తిగా పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీ కాకుండా కేంద్రంలోని హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదీ చెబితే.. రాష్ట్రంలో అది చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఇక.. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్, అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ ఇద్దరూ.. దేశానికి ప్రధానమంత్రి అవుతామని పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. కానీ.. వాళ్లు తమ రాష్ట్రాల్లో చేస్తున్న పరిపాలన రోజురోజుకు వారి ప్రభ కోల్పోయేలా చేస్తోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు సీఎం హిమంత.. తన గెలుపులో కీలకమైన ముస్లీం వర్గం ఓట్లును కోల్పోవద్దని హితవు పలికారు. చదవండి: భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం -
అసోంలో ఇక శాంతి పవనాలు
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమాలతో అట్టుడికిపోతున్న అసోంలో శాంతి సుస్థిరతలు నెలకొనే దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శాంతి ఒప్పందంపై వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం(ఉల్ఫా) సంతకం చేసింది. ఇకపై హింసకు దూరంగా ఉంటామని, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకుంటామని ప్రకటించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్మ శర్మ సమక్షంలో ఉల్ఫా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అసోం ప్రజలకు ఇదొక మరుపురాని గొప్ప రోజు అని అమిత్ షా చెప్పారు. హింసాకాండ వల్ల అసోం ప్రజలు ఎంతగానో నష్టపోయారని, 1979 నుంచి 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. హింసను విడనాడేందుకు ఉల్ఫా అంగీకరించిందని తెలిపారు. శాంతి ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి భారీ అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఒప్పందంలోని ప్రతి అంశాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. శాంతి ఒప్పందం చరిత్రాత్మకమని సీఎం హిమంతబిశ్మ వర్మ అభివరి్ణంచారు. ప్రధానమంత్రి నరంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవతో ఈ ఒప్పందం కార్యరూపం దాలి్చందని హర్షం వ్యక్తం చేశారు. ఏమిటీ ఉల్ఫా? ‘సార్వభౌమత్వ అస్సాం’ అనే డిమాండ్‌తో 1979 ఏప్రిల్ 7న ఉల్ఫా ఏర్పాటయ్యింది. డిమాండ్‌ను నెరవేర్చుకొనేందుకు ఉల్ఫా హింసాకాండనే నమ్ముకుంది. 1990లో ఈ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఉల్ఫాలోని అరబిందా రాజ్‌ఖోవా వర్గం 2011 సెపె్టంబర్ 3 నుంచి శాంతి చర్చలు కొనసాగిస్తోంది. ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. అయితే, ఉల్ఫాలో పరేశ్ బారువా నేతృత్వంలోని మరో వర్గం ఈ ఒప్పందంలో భాగస్వామిగా చేరలేదు. పరేశ్ బారువా ప్రస్తుతం చైనా–మయన్మార్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో నివసిస్తున్నట్లు సమాచారం. -
అస్సాం సీఎం శర్మకు ఈసీ నోటీసు
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారం సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో ఈనెల 18వ తేదీన జరిగిన ఎన్నికల ప్రచార సభలో హిమాంత శర్మ మాట్లాడుతూ..‘ఒక చోటికి ఒక అక్బర్ వచ్చాడంటే అతడు మరో 100 మంది అక్బర్లను పిలుస్తాడు. అందుకే సాధ్యమైనంత త్వరగా అక్బర్‌ను పంపించివేయాలి. అలా చేయలేకపోతే కౌశల్య మాత పుట్టిన ఈ నేల అపవిత్రమవుతుంది’ అంటూ రాష్ట్ర కేబినెట్లోని ఏకైక ముస్లిం మంత్రి మహ్మద్ అక్బర్నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తమకు సమాధానమివ్వాలని ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
శరద్ పవార్‌పై అసోం సీఎం వ్యంగ్యాస్త్రాలు
ముంబయి: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో భారత్ స్టాండ్‌ను ఎన్సీపీ నేత శరత్‌పవార్ తప్పుబట్టడాన్ని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శించారు. శరత్ పవార్ తన కూతురు సుప్రియా సూలేను యుద్ధంలో హమాస్ తరుపున పోరాడటానికి పంపుతారని వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఇజ్రాయెల్‌లోని నోవా ఫెస్టివల్ వేళ హమాస్ దళాలు రాకెట్ దాడులు జరిపాయి. ఇజ్రాయెలీలను దారుణంగా హతమార్చాయి. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. హమాస్ దాడులను ఖండించారు. అమాయక ప్రజల పక్షాన నిలుస్తూ ఇజ్రాయెలీలకు మద్దతు తెలిపారు. అయితే.. హమాస్ దాడులపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో శరద్ పవార్.. ప్రధాని మోదీ స్టాండ్‌ను విమర్శించారు. పాలస్తీనా ప్రజల పక్షాన నిలబడాలని ఆయన భావించారు. ఇజ్రాయెలీలకు భారత్ మద్దతు తెలపడంపై శరద్ పవార్ తప్పుబట్టడాన్ని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలని కోరారు. హమాస్ పట్ల సీనియర్ నాయకుడైన శరద్ పవార్ దృక్పథం సరిగా లేదని అన్నారు. దేశం గురించి మొదలు ఆలోచించాలని కోరారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా శరద్ పవార్ వ్యాఖ్యలను ఖండించారు. ఇదీ చదవండి: కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు -
కాంగ్రెస్ వివాదాస్పద భారత మ్యాప్.. బీజేపీ ఫైర్
డిస్పూర్: ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ ఉన్న ఒక వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ వీడియోలో ఈశాన్య రాష్ట్రాలను తొలగిస్తూ ఉంచిన భారతదేశం మ్యాప్ ఫోటోను జత చేస్తూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈశాన్య రాష్ట్రాలపై ఇదే కాంగ్రెస్ పార్టీ వైఖరి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చైనాకు అమ్మేశారా? హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే తొందరలో ఈశాన్య రాష్ట్రాలపై వారి అసలు ఉద్దేశ్యాన్ని బయటపెట్టుకున్నారు. భారతదేశం పటంలో ఈశాన్య రాష్ట్రాలను తొలగించి విదేశాల్లో కలిపేశారు. బహుశా మొత్తం భూమిని ఏదైనా పొరుగుదేశానికి అమ్మెందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుని ఉంటారని అన్నారు. దీని కోసమేనా రాహుల్ గాంధీ ఇటీవల విదేశాలకు వెళ్లారు. లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి జైలు పాలైన షర్జీల్ ఇమామ్‌కు వారి పార్టీలో సభ్యత్వం ఏమైనా కల్పించారా? అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ చూడగానే షాకయ్యా. కాంగ్రెస్ పార్టీ మన ఈశాన్య రాష్ట్రాలను చైనాకు అమ్మేసిందా ఏంటనుకున్నాను. ఇది ఉద్దేశ్యపూర్వకంగానే పాల్పడిన దేశ వ్యతిరేక చర్య అని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది జరిగబోయే లోక్‌సభ ఎన్నికలు వారిని చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. Seems the Congress party has secretly struck a deal to sell the entire land of North East to some neighbouring country. Is this why Rahul went abroad? Or has the party given membership to Sharjeel Imam? pic.twitter.com/oO9fLp86p8 — Himanta Biswa Sarma (@himantabiswa) September 16, 2023 ఎగతాళి చేయబోయి.. అసలు వివాదం మొదలవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోనే కారణం. ఆ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ బాలీవుడ్ క్లాసిక్ 'దీవార్' సినిమాలోని అమితాబ్ బచ్చన్ శశి కపూర్ మధ్య జరిగే సంభాషణను పేరడీ చేశారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. మోదీ మాట్లాడుతూ.. ' నా దగ్గర ఈడీ, పోలీస్, అధికారం, డబ్బు. స్నేహితులు అనీ ఉన్నాయి.. నీ దగ్గరఏముంది? అని అడగగా రాహుల్ పాత్ర సమాధానమిస్తూ నా దగ్గర తల్లి లాంటి యావత్ భారతదేశమే ఉందని సమాధానమిస్తారు. వీడియో వరకు అంతా బాగానే ఉంది కానీ వెనుక వైపున గోడకు తగిలించిన భారతదేశం మ్యాప్‌లో ఈశాన్య రాష్ట్రాలను లేపేయడమే అసలు వివాదానికి తెరతీసింది. ఇంకేముంది ఈ స్క్రీన్‌షాట్‌ను తీసుకుని అదే సొషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నాయి బీజేపీ వర్గాలు. नरेंद्र मोदी: मेरे पास ED है, पुलिस है, सत्ता है, पैसा है, दोस्त है.. क्या है तुम्हारे पास? राहुल गांधी: मेरे साथ पूरा देश है ❤️ pic.twitter.com/IMY6MHVz8q — Congress (@INCIndia) September 16, 2023 ఇది కూడా చదవండి: వీడియో: విధిని ఎవరూ ఎదురించలేరు.. ఇదే ఉదాహరణ.. -
ఇకపై బహుభార్యత్వం నిషేధం.. డిసెంబర్లో బిల్లు
గౌహతి: డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. టిన్సుకియాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ వచ్చే 45 రోజుల్లో ఈ బిల్లును సిద్ధం చేసి డిసెంబర్ సమావేశాల్లో ప్రవేశపెడతామని అన్నారు. లీగల్ కమిటీ.. శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ అసోం ప్రభుత్వం బహుభార్యత్వం బిల్లును సీరియస్‌గా తీసుకుందని దీనిపై ఒక లీగల్ కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. బహుభార్యత్వాన్ని నిషేధించడంలో సాధ్యాసాధ్యాలు గురించి అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని సూచించినట్లు తెలిపారు. ప్రజాభిప్రాయం కూడా.. ఇదే అంశంపై ప్రజాభిప్రాయాలను కూడా సేకరించగా ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని మొత్తం 149 మంది నుంచి అభిప్రాయసేకరణ చేయగా వారిలో 146 మంది సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మరో ముగ్గురు మాత్రం బహుభార్యత్వాన్ని సమర్ధించినట్లు తెలిపారు. బిల్లును రూపొందించడమే మా తదుపరి కార్యాచరణని అన్నారు. వీలైతే రాష్ట్రంలో లవ్ జిహాద్‌ను కూడా అంతం చేసే విధంగా ఇదే బిల్లులో మరికొన్ని అంశాలను కూడా చేర్చనున్నామన్నారు. ఈ సందర్బంగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు ఉపసంహరించే చట్టం గురించి ప్రస్తావిస్తూ.. అది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయమని ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని.. ఈ నెలాఖరులో కేంద్రంతో చర్చించి కచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటామని అన్నారు. సాయుధ దళాల ప్రత్యేక చట్టం.. 1958 సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రాంతాల్లో ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా చేయడానికి పార్లమెంట్ వారికి ఈ అధికారాలను మంజూరు చేసింది. 1972లో ఈ చట్టాన్ని సవరిస్తూ ఒకసారి ఇబ్బందికరమైన ప్రాంతమని ప్రకటించాక అక్కడ కనీసం మూడు నెలల పాటు విధులు నిర్వర్తించేందుకు సాయుధ దళాలకు ప్రత్యేక అధికారముంటుంది. #WATCH | On banning polygamy in the state, Assam CM Himanta Biswa Sarma says "A legal committee was formed to check if polygamy can be banned by the state govt or not. Later, we asked the public for their opinion if they had any objections. We received a total of 149 suggestions… pic.twitter.com/ZC9U2TNSQQ — ANI (@ANI) September 3, 2023 ఇది కూడా చదవండి: సరదా సన్నివేశం.. రాహుల్‌కు మటన్ కర్రీ వండటం నేర్పిన లాలూ -
మీ ఇంట్లో గేదె పాలు ఇవ్వకపోయినా మేమే కారణమా?
న్యూఢిల్లీ: ముస్లిం వ్యాపారుల వల్లనే కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలకు ప్రతి స్పందిస్తూ ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. మీ ఇళ్లలో గేదెలు పాలు ఇవ్వకపోయినా దానికి ముస్లింలే కారణం అనేలా ఉన్నారే.. అంటూ ట్విట్టర్లో ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అస్సామీయులు ఎప్పుడు వ్యాపారం చేసినా కాయగూరల ధరలు ఇంతగా పెరగలేదని ముస్లిం వ్యాపారులే ధరలను పెంచుకుంటూ పోతున్నారని అన్నారు. మీరే చెప్పండి కాయగూరల ధరలను పెంచింది ఎవరు మియాలు(అసోంలో ఉంటూ బెంగాలీ మాట్లాడే స్థానిక ముస్లింలు) కాదా? అని ఎదురు ప్రశ్నించారు. ఈ సందర్బంగా మియా సంఘం వారిని బయటవారిగా చెబుతూ వారు అస్సామీ సంస్కృతిని, భాషని కించపరుస్తూ చాలా జాత్యహంకారంతో వ్యవహరిస్తూ ఉంటారని ఘాటు విమర్శలు చేశారు. అసోం సీఎం చేసిన ఈ వ్యాఖ్యలకు ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. అసోంలో ఒక విచిత్రమైన గుంపు తయారయ్యింది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టక పోయినా దానికి మియాలే కారణమంటారు. బహుశా వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారేమోనని చురకలంటించారు. మన ప్రధాని విదేశీ ముస్లింలతో చాలా చనువుగా ఉంటారు కదా మరి అక్కడికి వెళ్ళినప్పుడు టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఎగుమతి చేయమని ఆయా దేశాలను కోరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. देश में एक ऐसी मंडिली है जिसके घर अगर भैंस दूध ना दे या मुर्ग़ी अण्डा ना दे तो उसका इल्ज़ाम भी मियाँ जी पर ही लगा देंगे। शायद अपने “निजी” नाकामियों का ठीकरा भी मियाँ भाई के सर ही फोड़ते होंगे।आज कल मोदी जी की विदेशी मुसलमानों से गहरी यारी चल रही है, उन्हीं से कुछ टमाटर, पालक, आलू… https://t.co/1MtjCnrmDT — Asaduddin Owaisi (@asadowaisi) July 14, 2023 ఇది కూడా చదవండి: రాంగ్ రూటులో వచ్చి అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్ -
లేడీ సింగం పోస్టుమార్టంలో సంచలన విషయం
గువాహటి: లేడీ సింగంగా పేరు తెచ్చుకున్న అసోం ఎస్సై జున్మోని రభా కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో.. తాజాగా పోస్టుమార్టం రిపోర్టు వెలువడటంతో కొత్తకోణం బయటపడింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందినప్పటికీ.. జున్మోని శరీరంపై వెనకభాగంలో అనేక గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడికావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు వైపుల అనేక పక్కటెముకలకు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. అంతేగాక బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా జున్మోని రభా మరణించారని కూడా ఈ నివేదికలో వెల్లడైంది. ఆమె రెండు మోకాళ్లు, కాళ్లు మోచేతి,చేతులపై గాయాలు గుర్తులు కనిపించినట్లు తేలింది. కుటుంబ సభ్యుల అనుమానం మోరికోలాంగ్ పోలీస్ అవుట్ పోస్ట్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రభా.. మంగళవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. జున్మోని రభా సివిల్ దుస్తుల్లో ఒంటరిగా తన ప్రైవేట్ కారులో వెళ్తుండగా నాగోన్ జిల్లాలోఈ ఘోరం జరిగింది. అయితే ఈ ప్రమాదంపై రభా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్లానింగ్ తోనే ఈ హత్య జరిగిందని జున్మోని రభా తల్లి సుమిత్రా రభా ఆరోపిస్తున్నారు. నిజాన్ని తెలుసుకోవడానికి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద సమయంలో ప్రత్యక్ష సాక్షి అయిన ప్రణబ్ దాస్‌ను సీన్ రీ క్రియేట్ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య గౌహతి నుండి గురువారం సాయంత్రం నాగోన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రమాదంపై టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం అతన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాస్‌ను నాగాన్ పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం ముందు హాజరుపరిచారు. చదవండి: సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీల నియామకం.. 34కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య అయితే ఘటన జరిగినప్పుడు తాను గువాహటి నుంచి వస్తున్నట్లు ప్రణబ్ దాస్ తెలిపారు. రోడ్డుకు ఎడమ పక్కన కారు పార్క్ చేసి ఉందని, ఇంతలో ఓ ట్రక్లు ఎదురుగా దూసుకొచ్చి కారును ఢీకొట్టినట్లు తెలిపారు. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు బ్లాక్ జీన్స్ ధరించిన ఓ వ్యక్తి కారు నుంచి దిగి కిందకు వెళ్లిపోయినట్లు పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత కొద్దిసేపు తాను అక్కడే ఉండగా.. పోలీసులు మాత్రం తనను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు ఆరోపించారు. నిందితుడి లోంగుబాటు ఎస్సై జన్మోని రభా మృతి కేసులో ప్రధాన నిందితుడైన పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ అస్సాం పోలీసుల ఎదుట గురువారం లొంగిపోయాడు. రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను సుమిత్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సుమిత్‌ను జఖలబంధ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సుమిత్ అదుపులో ఉన్నాడని అతన్ని విచారించిన అనంతరం కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. స్పందించిన సీఎం జన్మోని మరణంపై ఎట్టకేలకు సీఎం హిమాంత బిస్వా శర్మ నోరు విప్పారు. పోలీసు మృతిపై సీఐడీతోపాటు.. మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తే కేసును సీబీకి అప్పగించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇది సున్నితమైన విషయమని, ఈ ఘటనలో చాలా కోణాలు ఉన్నాయన్నారు. దీనికి మొత్తం పోలీస్ శాఖపై అంటిపెట్టడం సరైనది కాదన్నారు. కాబోయే భర్తను అరెస్ట్ చేయించి ఒకప్పుడు ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్నాడని కాబోయే భర్తను అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది రభా. నేరుస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో ఆమెను దబాంగ్ కాప్ అని కూడా పిలిచేవారు. అయితే డేరింగ్ పోలీస్ అధికారిగా పేరు సంపాదించిన ఆమెను పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. జున్మోని రభాకు ఎంత పేరుందో అంతకుమించిన వివాదాలు కూడా ఉన్నాయి. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని జున్మోని రభాపై అభియోగాలు రావడంతో కాబోయే భర్తతోపాటు ఆమె కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో మజులీ జిల్లాకోర్టు జ్యూడిషీయల్ కస్టడీ విధించడంతో విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. అనంతరం సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యేతో వివాదం గత ఏడాది జనవరిలో భుయాన్ నియోజకవర్గంలో చట్టవిరుద్ధంగా అమర్చిన యంత్రాలతో బోట్లను నడుపుతున్నారనే ఆరోపణలపై కొందరు బోట్ మెన్ లను రభా అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యేతో మాట్లాడిన ఆడీయో టేప్ లీక్ కావడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ...ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వాలంటూ రభాకు సూచించారు. -
అదానీ, ఐదుగురు నేతలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
-
Elections: ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం
గుహవటి: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. అసోంలోని గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, మిత్రపక్షం ఏజీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం అసోం సీఎం హిమంత్ బిస్వాస్ శర్మ.. ప్రజలకు శిరసువంచి అభివాదం చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 వార్డులకు ఎన్నికలుగా జరుగగా 58 వార్డులను బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థులు 52 వార్డుల్లో గెలుపొందగా, 7 వార్డులలో పోటీ చేసిన ఏజేపీ 6 వార్డులు దక్కించుకుంది. అసోంలో తొలిసారిగా బరిలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఇక, కాంగ్రెస్ పార్టీకి మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క వార్డు కూడా గెలుచుకోకపోవడంతో హస్తం నేతలు ఖంగుతిన్నారు. ఇదిలా ఉండగా.. మున్సిపల్ ఎన్నికలు చివరిసారిగా 2013లో జరిగాయి. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక, ఈ విజయంపై అసోం సీఎం హిమంత్ బిస్వాస్ శర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భారీ విజయాన్ని అందించిన ప్రజలకు తన శిరసువంచి అభివాదం చేస్తున్నానని అన్నారు. బీజేపీ విజయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఘన విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. I bow my head to the people of Guwahati for giving @BJP4Assam & its allies a historic win in #GMCElections. With this massive mandate, people have reaffirmed their faith on our development journey under the guidance of Adarniya PM Shri @narendramodi ji.@JPNadda @BJP4India pic.twitter.com/AWZ5mqIhc3 — Himanta Biswa Sarma (@himantabiswa) April 24, 2022 -
ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు.. అస్సాం సీఎంపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో పోలుసులు కేసు నమోదు చేశారు. కాగా మహిళలను అవమానించేలా మాట్లాడిన హేమంతపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రేవంత్ సోమవారం పోలీసులను కోరిన సంగతి తెలిసిందే. 48గంటల పాటు చూస్తామని.. అప్పటి వరకు కేసులు పెట్టకపోతే పోలీస్ స్టేషన్లు ముట్టడిస్తామన్నారు. ఈ నెల 16వ తేదీ 12 గంటలలోపు అసోం సీఎంను అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. చదవండి: ఆగేదే లే! ముందుకెళ్లాల్సిందే.. మంత్రి కేటీఆర్ ఆదేశం ఎన్నికల ప్రచారంలో అసభ్యకరంగా కామెంట్స్ చేశాడని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం పదవిలో ఉన్న హేమంత బిశ్వశర్మ అలా మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. వెంటనే హేమంత బిస్వాపై క్రిమినల్ కేసు నమోదు చేసి, సీఎం పదవి నుండి బర్తరఫ్ చేయాలన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిమంత బిశ్వశర్మపై సోమవారం రేవంత్ రెడ్డి పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చదవండి: జీడిమెట్లలో బాలిక అనుమానాస్పద మృతి -
అసోంలో 15 నుంచి కరోనా ఆంక్షల ఎత్తివేత
గౌహతి: రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలన్నింటినీ ఫిబ్రవరి 15 నుంచి ఎత్తేయాలని అసోం నిర్ణయించింది. కరోనా విజృంభణ, కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం హిమంత బిశ్వశర్మ సోమవారం మీడియాకు వెల్లడించారు. వచ్చే రెండు నెలల వ్యవధిలో స్కూలు బోర్డు పరీక్షలు, మున్సిపల్ తదితర ఎన్నికలు షెడ్యూల్ మేరకే జరుగుతాయని చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే స్టూడెంట్లంతా వ్యాక్సిన్ రెండు డోసులు విధిగా వేసుకోవాలన్నారు. ‘‘ఇక రాత్రి కర్ఫ్యూలుండవు. షాపింగ్, సినిమా మాల్స్ పూర్తి సామర్థ్యంతో నడుస్తాయి. పెళ్లిళ్లు, వేడుకలను రాత్రిళ్లు కూడా జరుపుకోవచ్చు. వాటిలో పాల్గొనే వాళ్లంతా విధిగా రెండు డోసులూ వేసుకోవాలి. మాస్కు ధరించాలి.’’ అని వివరించారు. దేశంలో 83,876 కేసులు దేశవ్యాప్తంగా సోమవారం 83,876 కొత్త కరోనా కేసులు, 895 మరణాలు నమోదయ్యాయి. మరణాల్లో 515 కేరళలో, 66 మహారాష్ట్రలో జరిగాయి. ఒమిక్రాన్ విజృంభణ తర్వాత గత 32 రోజుల్లో రోజువారీ కరోనా కేసులు లక్ష కంటే తగ్గడం ఇదే తొలిసారి. దేశంలో మొత్తం కరోనా కేసులు 4,2,72,014కు, మరణాలు 5,02,874కు చేరాయి. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 11,08,938కి తగ్గాయి. కోవిడ్ రికవరీ రేటు 96,19 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ పేర్కొంది. -
ఇద్దరు సంతానం ఉంటేనే పథకాల లబ్ధి
గువాహటి: రాష్ట్రంలో జనాభా పెరుగుదలకు కళ్లెం వేయడమే లక్ష్యంగా హిమంత బిశ్వ శర్మ సారథ్యంలోని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇద్దరు సంతానం ఉన్న కుటుంబాలకే రాష్ట్రంలో అమలయ్యే పలు పథకాల నుంచి లబ్ధిపొందే అవకాశం కల్పిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత శనివారం స్పష్టంచేశారు. ప్రస్తుతం అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కొన్ని పథకాలకు మాత్రమే ‘ఇద్దరు సంతానం’ నియమాన్ని అమలుచేస్తామని, ఆ తర్వాత క్రమక్రమంగా అన్ని ప్రభుత్వ పథకాలకూ ఈ నియమాన్ని తప్పనిసరి చేస్తామని ఆయన ప్రకటించారు. అస్సాంలో కేంద్ర పథకాలకు ప్రస్తుతం ఈ నియమం వర్తించదు. పాఠశాల, కళాశాలల్లో ఉచిత ప్రవేశం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలకు ఈ నియమాన్ని విధించబోమని ఆయన వివరణ ఇచ్చారు. -
అస్సాం సీఎంగా హిమంత ప్రమాణ స్వీకారం