సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మపై విమర్శలు గుప్పించారు. శనివారం బొంగైగావ్ ప్రాంతంలో ఓ సమావేశంలో పాల్గొన్న బద్రుద్దీన్.. సీఎం హిమంత బిస్వాను టార్గెట్ చేశారు. గతంలో హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో ముస్లింలు వేసిన ఓట్ల వల్లనే ఆయన గెలిచారని అన్నారు.
హిమంత కాంగ్రెస్ ఉన్న సమయంలో ముస్లింల మద్దతు అధికంగా ఉండేదని తెలిపారు. కానీ.. ప్రస్తుత సమయంలో తమ వర్గానికి సీఎం హిమంత తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. తన గెలుపులో కీలకమైన తమకు హిమంత.. బీజేపీలో చేరిన తర్వాత తమకు చేయవల్సిన సంక్షేమాన్ని పూర్తిగా పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీ కాకుండా కేంద్రంలోని హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదీ చెబితే.. రాష్ట్రంలో అది చేస్తున్నారని ఎద్దేవా చేశారు
ఇక.. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్, అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ ఇద్దరూ.. దేశానికి ప్రధానమంత్రి అవుతామని పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. కానీ.. వాళ్లు తమ రాష్ట్రాల్లో చేస్తున్న పరిపాలన రోజురోజుకు వారి ప్రభ కోల్పోయేలా చేస్తోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు సీఎం హిమంత.. తన గెలుపులో కీలకమైన ముస్లీం వర్గం ఓట్లును కోల్పోవద్దని హితవు పలికారు.
చదవండి: భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment