దిస్పూర్:కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోఫై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గమనిస్తే.. భారత్‌లోని ఎన్నికల కంటే పాకిస్థాన్‌లో ఎన్నికలకు తగినట్లు ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎద్దేవా చేశారు. దేశంలో విభజన వాదాన్ని సృష్టించి అధికారంలోకి రావాని కాంగ్రెస్ భావిస్తోందని మండిపడ్డారు.
శనివారం జోరాట్ స్థానంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో బుజ్జగింపు రాజకీలకు నిదర్శనం. మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను గమనిస్తే.. భారత్‌లో ఎన్నికల కంటే పాకిస్తాన్‌లో ఎన్నికలు సరిపోయేటట్టు ఉంది. సమాజంలో విభజన చిచ్టుపెట్టి అధకారంలోకి రావాలనుకోవటమే కాంగ్రెస్ స్వాభావం. అస్సాంలో ఉన్న మొత్తం 14 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. భారత దేశాన్ని విశ్వగురువుగా మర్చేందుకు బీజేపీ ఉద్యమాన్ని చేపట్టింది’ అని హిమంత అన్నారు.
హిమంత విమర్శలపై కాంగ్రెస్ కౌంటర్...
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. పార్టీలు మారే హిమంత బిశ్వ శర్మకు కాంగ్రెస్ పార్టీ లైకిక, సమ్మిలిత తత్వం అస్సలు అర్థం కావని కౌంటర్ ఇచ్చింది. ఇక.. హిమంత 2015లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
‘హిమంత ఏళ్ల తరబడి కాంగ్రెస్ ఉన్నా.. పార్టీ విలువలు అర్థం చేసుకోలేపోయారు. అందుకే ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ లో ఉన్నప్పటకీ కేవలం తన నిజాయితీని చాటుకోవటం కోసమే కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తారు’ అని అస్సాం కాంగ్రెస్ అధికార ప్రతినిధి బేదబ్రతా బోరా అన్నారు.
మరోవైపు.. సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేస్తోంది. ఆ పార్టీ మేనిఫెస్టోలో న్యూయార్క్, థాయ్‌లాండ్‌ల ఫోటోలను ఉపయోగించారని బీజేపీ నేత సుధాన్షు త్రివేది ఆరోపించారు. ఇక.. అస్సాంలో మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment