సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పార్టీ నేతల ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఎవరికి వారు మేనిఫెస్టోలు విడుదల చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
జైపూర్‌లో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే , కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కలిసి పార్టీ మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేస్తారని పార్టీ రాజస్థాన్ ఇన్‌చార్జి 'సుఖ్‌జీందర్ సింగ్ రంధవా' పేర్కొన్నారు. ఎన్నికల వ్యూహం సమావేశం పూర్తయిన తరువాత విలేకరులతో మాట్లాడుతూ రంధవా ఈ విషయాన్ని వెల్లడించారు.
త్వరలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్ల గురించి చర్చించినట్లు.. దీనికి సంబంధించిన బాధ్యతలను రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రాకు బాధ్యతలు అప్పగించారు. నాయకుల్లో మాత్రమే కాకుండా ప్రజల్లో కూడా ఉత్సాహం ఉంది. బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం వస్తారని సుఖ్‌జీందర్ సింగ్ రంధవా అన్నారు.
పదేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో ప్రజలకు తెలుసు. మా నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వస్తున్నారని, బహిరంగ సభలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారని ఈ సందర్భంగా దోతస్రా తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లను దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment