ఢిల్లీ: లోక్సభ ఎన్నికలు విస్తృతంగా జరుగుతున్న తరుణంలో ఇండోర్ లోక్సభ అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థి లేకుండా పోయారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా అక్షయ్ కాంతి బామ్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈయన ఇప్పుడు ఊహించని విధంగా, తన నామినేషన్ను వెనక్కు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ స్థానంలో వేరొక అభ్యర్థిని నియమించడానికి కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఇండోర్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి లేకపోవడంతో బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దీంతో సోమవారం జరగబోయే నాలుగో దశ ఎన్నికల్లో కార్యకర్తలు, ప్రజలు నోటా గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నోటాకు ఓటు వేసి బీజేపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు.
నోటాకు ఓటు వేయాలని ప్రజలొక విజ్ఞప్తి చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సజ్జన్ వర్మ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఓటర్ల పరంగా మధ్యప్రదేశ్లో అతిపెద్ద నియోజకవర్గమైన ఇండోర్ నియోజకవర్గాన్ని 35 ఏళ్లలో (1989 నుంచి) కాంగ్రెస్ గెలవలేదు, అయితే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోవడం ఇదే మొదటిసారి.
इंदौर में लोकतंत्र की हत्या के खिलाफ गांधी प्रतिमा पर आयोजित प्रदर्शन में सम्मिलित हुआ। इंदौर का मतदाता पढ़ा लिखा और जागरूक है, नोटा के साथ अपना जवाब देगा।#Indore #NOTA pic.twitter.com/NMf5FbeIux
— Sajjan Singh Verma (@sajjanvermaINC) May 11, 2024
Comments
Please login to add a commentAdd a comment