దేశంలోని పేదలలో హిందువులు, క్రైస్తవులు, పార్సీలు అందరూ ఉన్నారని. అందరూ రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందాలని ప్రధాని అన్నారు. అయితే మత ప్రతిపాదికన కాంగ్రెస్ ఒక వర్గానికి మాత్రమే రిజర్వేషన్ కట్టబెట్టేలాని చూస్తున్నట్లు ఆరోపించారు. దీనిపైన కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. మేము భారత రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామని పేర్కొన్నారు. మత ప్రతిపాదికన రిజర్వేషన్లను కల్పించడాన్ని రాజ్యాంగం కూడా ఒప్పుకోదని అన్నారు. దీని ప్రకారమే మేము మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా పేర్కొన్నామని అన్నారు.
రిజర్వేషన్స్ గురించి మాత్రమే కాకుండా.. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేయడం మీద కూడా పవన్ ఖేరా స్పందించారు. కేజ్రీవాల్‌కు తప్పకుండా న్యాయం జరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
#WATCH | Congress leader Pawan Khera says, "As far as we are concerned, there is no controversy at all, we go by the Constitution of India and the Constitution of India does not allow reservations based on religion. Our manifesto is very clear..." pic.twitter.com/R1h3GkvwXM
— ANI (@ANI) May 7, 2024
Comments
Please login to add a commentAdd a comment