సిమ్లా: దేశంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. కాంగ్రెస్ మేనిఫెస్టోను విదేశీ శక్తులు ప్రభావితం చేస్తున్నాయని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి పాకిస్తాన్ నుంచి మద్దతు లభిస్తుందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ చాలా దిగజారిపోయిందని అన్నారు.
సోమవారం హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో వినాశకరమైన వరదలు, వర్షాల సమయంలో చురుకైన పాత్ర పోషించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.
రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తామని, వాయనాడ్ బరిలోకి దిగారు. ఇప్పుడు రాయ్‌బరేలీ నుండి పోటీ చేస్తున్నారు. రాయ్‌బరేలీ నుంచి కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఠాకూర్ అన్నారు. తప్పుడు వాగ్దానాలతో ఎన్నికల్లో గెలుపొందడం అనే మూర్ఖుల స్వర్గంలో జీవించడం కాంగ్రెస్ లక్ష్యమని ఆయన అన్నారు. జూన్ 4న విడుదలయ్యే పోలింగ్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ కలలు చెదిరిపోతాయని పేర్కొన్నారు.
అనురాగ్ ఠాకూర్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో హమీర్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన నాలుగు లక్షల ఓట్ల కంటే ఈసారి మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 400 సీట్లకు పైగా సొంత చేసుకుంటుందని కూడా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment