ఉచిత రేష‌న్‌తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీ | Priyanka Gandhi Slams BJP 5 KG Ration | Sakshi
Sakshi News home page

ఉచిత రేష‌న్‌తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీ

Published Thu, May 9 2024 4:05 PM | Last Updated on Thu, May 9 2024 4:05 PM

Priyanka Gandhi Slams BJP 5 KG Ration

లక్నో: ఇప్పటికే మూడు దశల లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకో నాలుగు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నాయకురాలు, లోక్‌సభ ఎలక్షన్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ గురువారం బీజేపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ పోటీ చేసే ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ మీద విరుచుకుపడ్డారు. కేంద్రం అందించే ఐదు కేజీల రేష‌న్‌తో ప్రజల బతుకులు బాగుపడవని పేర్కొన్నారు. ఉద్యోగం కావలా? ఐదు కేజీల రేషన్ కావాలా? అని ఎవరినైనా అడిగితే.. తప్పకుండా ఉద్యోగాన్నే కోరుకుంటారని ఆమె పేర్కొన్నారు.

ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. తమ సమస్యలను గురించి తెలుసుకుని, వాటిని పరిష్కారం చూపాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగం కోసం ఏమి చేసింది, ఎక్కువగా ఉన్న ధరలను తగ్గించడానికి ఏమైనా చర్యలు తీసుకుందా? రైతులకు, కూలీలకు ఏమైనా సహాయం చేసిందా అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement