హోలీ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీతో సహా మిగిలిన లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ యూనిట్ చీఫ్ 'అజయ్ రాయ్' పేర్కొన్నారు. రాహుల్ గాంధీని అమేథీ నుంచి, ప్రియాంక గాంధీని రాయ్‌బరేలీ నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.
కాంగ్రెస్ వెల్లడించిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు లేవు. ఈ రెండు స్థానాలు ఒకప్పుడు నెహ్రూ-గాంధీ కుటుంబాల కంచుకోటలు. అయితే బీజేపీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీని అమేథీ నుంచి పోటీకి దింపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఆమె రాహుల్ గాంధీపై విజయం సాధించారు .
2004 రాయ్‌బరేలీ నుంచి రాయ్‌బరేలీ ఎంపీగా పోటీ చేసింది. ఆ తరువాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించారు. ఈ ప్రకటన తరువాత ఈ స్థానంలో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆ నియోజక వర్గంలో ఆమె పోస్టర్లు కూడా దర్శనమిచ్చాయి.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. అమేథీ, రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనేది పార్టీ నాయకులు, కార్యకర్తల కోరిక అని అజయ్ రాయ్ అన్నారు. ఈ విషయం మీద పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీపై రాయ్‌కి వారణాసి నుంచి టికెట్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment