ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన మహా ర్యాలీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'అధికారం శాశ్వతం కాదు, అహం ఒక్కరోజు నశించిపోతుంది' అన్న శ్రీరాముడి సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకోవాలని అన్నారు.
''అధికారంలో ఉన్నవారు తమను తాము రామభక్తులుగా అనుకుంటున్నారు. వారు ఒక భ్రమలో ఉన్నారని నేను నమ్ముతున్నాను'' అని వ్యాఖ్యానించారు.
పురాతన ఇతిహాసం 'రామాయణం'లోని సందేశాన్ని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. రాముడు సత్యం కోసం పోరాడుతున్నప్పుడు, అతనికి వనరులు లేవు, రథం కూడా లేదు. రావణునికి రథం, వనరులు, సైన్యం అన్నీ ఉన్నాయి. కానీ రాముడు రావణుని ఓడించాడు అని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ కనుమరుగవుతుంది, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాదిస్తుందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
#WATCH | Delhi: At the Maha Rally at the Ramlila Maidan, Congress General Secretary Priyanka Gandhi Vadra says, "I think that they (BJP) are trapped in illusion. I want to remind them of a thousand-year-old tale and its message. When Lord Ram was fighting for the truth, He did… pic.twitter.com/43vpN9Y107
— ANI (@ANI) March 31, 2024
Comments
Please login to add a commentAdd a comment