లోక్‌సభ ఎన్నికలు జరగటానికి ముందే అస్సాంలో బీజేపీ మైనారిటీ అగ్రనేత రాజీనామా చేసి బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. అస్సాం కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జితేంద్ర సింగ్ అల్వార్ సమక్షంలో 'అమీనుల్ హక్ లస్కర్' పార్టీలో చేరారు.
'అమీనుల్ హక్ లస్కర్' 2016లో అస్సాం బీజేపీకి తొలి మైనారిటీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన లస్కర్.. అస్సాం స్టేట్ కమిషన్ ఫర్ మైనారిటీకి చైర్‌పర్సన్‌గా కూడా విధులు నిర్వహించారు. 2021లో అతను ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) కరీం ఉద్దీన్ బర్భూయా చేతిలో ఓడిపోయాడు.
అస్సాంలో బీజేపీ తన రాజకీయ భావజాలాన్ని కోల్పోయినందున అమీనుల్ హక్ లస్కర్ పేర్కొన్నారు. ఈ కారణంగానే తానూ పార్టీకి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. 13 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో ఉన్నాను. అప్పటి బీజేపీకి.. ఇప్పటి బీజేపీకి చాలా తేడా ఉందని లస్కర్ అన్నారు.
తాను పార్టీకి రాజీనామా చేయడం.. మైనారిటీ కమ్యూనిటీలో అధికార పార్టీకున్న విశ్వసనీయతను ప్రభావితం చేస్తుందని అమీనుల్ హక్ లస్కర్ అన్నార్తు. బీజేపీ సిద్ధాంతం బద్రుద్దీన్ అజ్మల్ ఏఐయూడీఎఫ్ మాదిరిగా మారిందని అన్నారు. 2016లో బీజేపీ ఎమ్మెల్యే అయినప్పుడు ఆ ప్రాంతం ముస్లిం సమాజానికి చెందినవాడిని నేనిక్కడే అని పేర్కొన్నారు. నేను పార్టీని విడిచిపెట్టడం వల్ల ముస్లిం జనాభాలో బీజేపీ మీద ఉన్న విశ్వాసం తగ్గుతుందని అన్నారు. బీజేపీ ఇప్పుడు అస్సాంలో ఎఐయుడిఎఫ్‌తో చేతులు కలిపిందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment