ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరు విడతల్లో పోలింగ్ పూర్తి అయింది. అయితే.. విపక్షాల ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుదీరితే.. ప్రధానమంత్రి ఎవరూ అని అడిగిన మీడియా ప్రశ్నకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున చమత్కారంగా స్పందించారు. ఈ ప్రశ్న ‘కౌన్ బనేగా క్రోర్‌పతి?’లా ఉందని అన్నారు. ఆయన శనివారం సిమ్లాలో మీడియాతో మాట్లాడారు.
‘‘ ఇండియా కూటమి గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మా ప్రధాని మంత్రి ఎవరూ అనేవిషయంపై నాయకులమంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం. 2004 నుంచి 2014 వరకు యూపీఏ కూటమి పదేళ్లు పాలన చేసింది. ప్రధాని అభ్యర్థి ప్రకటన లేకుండా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే 2004లో కాంగ్రెస్‌లో కొంతమంది నాయకులకు సోనియా గాంధీ ప్రధాని కావాలని ఉండేది. కానీ ఆమె తిరస్కంచారు.
అప్పుడు మాకు మేజార్టీ(140 సీట్లు) లేదు. 2009లో మేము 209 సీట్లను గెలిచాం. అలా యూపీఏ కూటమిగా పదేళ్లు పాలన అందించాం. కొన్నిసార్లు తెలివైనవాళ్లు కూడా చరిత్ర మర్చిపోతారు( బీజేపీ నేతలను ఉద్దేశించి). 2014లో బీజేపీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం తగ్గింపు ఏమి జరగలేదు.
ప్రధాని మోదీ, 2014, 2019లో ఇచ్చిన పెద్దపెద్ద హామీలను పక్కన పడేశారు. ప్రకృతి విపత్తులతో తల్లిడిల్లిన హిమాచల్ ప్రదేశ్ ప్రధాని మోదీ చిన్న సాయం కూడా చేయలేదు. దేశంలో బీజేపీ ప్రభుత్వాలను కూలగొట్టింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు పన్నింది’’ అని ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు.
ఫిబ్రవరి 27 జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటు వేశారు. అనంతరం వారు బీజేపీలో చేరారు. ఇక.. హిమాచల్ ప్రదేశ్‌లో ఏడో విడతలో జూన్ 1 నాలుగు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న విడదల కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment