musilms
-
‘అస్సాం సీఎం మాకు తీవ్ర అన్యాయం చేశారు’
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మపై విమర్శలు గుప్పించారు. శనివారం బొంగైగావ్ ప్రాంతంలో ఓ సమావేశంలో పాల్గొన్న బద్రుద్దీన్.. సీఎం హిమంత బిస్వాను టార్గెట్ చేశారు. గతంలో హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో ముస్లింలు వేసిన ఓట్ల వల్లనే ఆయన గెలిచారని అన్నారు. హిమంత కాంగ్రెస్ ఉన్న సమయంలో ముస్లింల మద్దతు అధికంగా ఉండేదని తెలిపారు. కానీ.. ప్రస్తుత సమయంలో తమ వర్గానికి సీఎం హిమంత తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. తన గెలుపులో కీలకమైన తమకు హిమంత.. బీజేపీలో చేరిన తర్వాత తమకు చేయవల్సిన సంక్షేమాన్ని పూర్తిగా పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీ కాకుండా కేంద్రంలోని హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదీ చెబితే.. రాష్ట్రంలో అది చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఇక.. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్, అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ ఇద్దరూ.. దేశానికి ప్రధానమంత్రి అవుతామని పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. కానీ.. వాళ్లు తమ రాష్ట్రాల్లో చేస్తున్న పరిపాలన రోజురోజుకు వారి ప్రభ కోల్పోయేలా చేస్తోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు సీఎం హిమంత.. తన గెలుపులో కీలకమైన ముస్లీం వర్గం ఓట్లును కోల్పోవద్దని హితవు పలికారు. చదవండి: భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం -
‘నిరూపిస్తే.. రాష్ట్రం విడిచి వెళ్లిపోతాను’
లక్నో: బీజేపీ మాజీ మేయర్ ఒకరు ముస్లిం యువతుల మతం మార్చి.. వారికి హిందూ యువకులతో వివాహం జరిపిస్తున్నారని ఒక ముస్లిం యువతి ఆరోపించింది. ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన యువతి అలీగఢ్ బీజేపీ మాజీ మేయర్ శకుంతల భారతిపై సంచలన ఆరోపణలు చేసింది. మాజీ మేయర్ తన సోదరిపై ఒత్తిడి తెచ్చి.. మతం మార్చి హిందూ యువకుడితో వివాహం చేశారని ఆరోపించింది. వివరాలు.. అలీగఢ్‌కు చెందిన ఓ ముస్లిం యువతి ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ఓ హిందూ యువకుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సోదరి ఇంట్లో నుంచి బంగారు నగలు, డబ్బు తీసుకుని ఓ హిందూ యువకుడితో పరారయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి కోసం గాలించడం ప్రారంభించారు. (వాజ్‌పేయితో ఉన్న వీడియోను షేర్ చేసిన మోదీ) ఈ లోపు యువతి కుటుంబ సభ్యులు బీజేపీ మాజీ మేయర్ శకుంతల భారతి ముస్లిం యువతుల మతం మార్చి.. వారిని హిందూ యువకులకు ఇచ్చి వివాహం చేస్తున్నారని ఆరోపించారు. దానిలో భాగంగానే తన సోదరికి హిందూ యువకుడితో వివాహం చేసిందని తెలిపారు. పోలీసులు ఇంటి నుంచి వెళ్లి పోయిన యువతిని గుర్తించి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సదరు యువతి తన ఇష్ట ప్రకారమే ఇంటి నుంచి వెళ్లి పోయి.. హిందూ యువకుడిని వివాహం చేసుకున్నట్లు పోలీసులకు తెలిపింది. తాను మేజర్‌నని.. వివాహం విషయంలో ఎవరి బలవంతం లేదని పేర్కొంది. ఆర్యసమాజంలో వివాహం చేసుకున్నట్లు తెలిపింది. తన సోదరి అసత్య ఆరోపణలు చేస్తుందని వెల్లడించింది. ఇందులో మాజీ మేయర్‌కు ఎలాంటి సంబంధం లేదంది. తాను హిందూ యువకుడిని వివాహం చేసుకోవడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదన్నది. అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని సదరు యువతి పోలీసులకు తెలిపింది. ఈ ఆరోపణలపై శకుంతల భారతి స్పందించారు. ‘సదరు యువతి వివాహం గురించి నాకు ఏం తెలియదు. అనవసరంగా నా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు దీని గురించి పూర్తిగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలి. వారు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే.. నేను రాష్ట్రం విడిచి వెళ్లి పోతాను’ అన్నారు. -
సరిహద్దుల్లో పందుల తలకాయలు వేలాడదీస్తారా?
బుడాపెస్ట్: సిరియా దేశం నుంచి వస్తున్న ముస్లిం వలసలను నిరోధించేందుకు ఇంతవరకు భౌతిక దాడులకు దిగిన హంగేరి ప్రభుత్వం ఇప్పుడు అనైతిక చర్యకు ఆలోచన చేయడంపై ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెర్బియా సరిహద్దు గుండా దేశంలోకి ముస్లింల వలసలను నిరోధించేందుకు సరిహద్దు కంచె వద్ద తెగ నరికిన పందుల తలలను వేలాడదీయాలంటూ యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు, హంగేరి పాలకపక్ష పార్లమెంట్ సభ్యుడు గ్యోర్జి స్కాఫిన్ సూచన చేశారు. దీనికి కొంత మంది పాలకపక్ష సభ్యులు మద్దతు పలగ్గా ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పిస్తారు. ఈ సూచనపై మానవ హక్కుల సంఘాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే సరిహద్దు కంచె వద్ద వలస ప్రజలను భయపెట్టేందుకు క్యారెట్లతో తయారు చేసి, వేలాడదీసిన ‘దిష్టి బొమ్మ’లను తీసివేయాలని డిమాండ్ చేస్తున్న అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఇప్పుడు అంతకంటే భయంకరమైన ఆలోచన చేయడం పట్ల మండి పడుతున్నాయి. సిరియా దేశాల నుంచి వస్తున్న ముస్లిం ప్రజల వలసలను అరికట్టేందుకు సెర్బియా వద్ద హంగేరి గతేడాదే సరిహద్దును మూసివేసింది. ముట్టుకుంటే కోసుకుపోయే పదునైన రేసర్ లాంటి కంచెను ఏర్పాటు చేసింది. అయినా వలస ప్రజలు దూసుకువస్తుండడంతో హంగేరి సైన్యం వారిపై భౌతిక దాడులకు దిగింది. మహిళలు, పిల్లలు అనే విచక్షణ చూడకుండా ముస్లిం ప్రజలను పిడిగుద్దులు కురిపిస్తున్నారు. లాటీలు, తుపాకీ మడమలతో చితక బాదుతున్నారు. ఈ సంఘటనలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం కూడా స్పందించి ఈ సంఘటనలపై దర్యాప్తు జరిపించాల్సిందిగా హంగేరి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికీ సరిహద్దుల గుండా దాదాపు పది లక్షల మంది ప్రజలు తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని, వారికి ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా వలసలు ఆగడం లేదని హంగేరి ప్రభుత్వం వాదిస్తోంది.