హిమంత బిశ్వ శర్మ
గువాహటి: రాష్ట్రంలో జనాభా పెరుగుదలకు కళ్లెం వేయడమే లక్ష్యంగా హిమంత బిశ్వ శర్మ సారథ్యంలోని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇద్దరు సంతానం ఉన్న కుటుంబాలకే రాష్ట్రంలో అమలయ్యే పలు పథకాల నుంచి లబ్ధిపొందే అవకాశం కల్పిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత శనివారం స్పష్టంచేశారు. ప్రస్తుతం అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కొన్ని పథకాలకు మాత్రమే ‘ఇద్దరు సంతానం’ నియమాన్ని అమలుచేస్తామని, ఆ తర్వాత క్రమక్రమంగా అన్ని ప్రభుత్వ పథకాలకూ ఈ నియమాన్ని తప్పనిసరి చేస్తామని ఆయన ప్రకటించారు. అస్సాంలో కేంద్ర పథకాలకు ప్రస్తుతం ఈ నియమం వర్తించదు. పాఠశాల, కళాశాలల్లో ఉచిత ప్రవేశం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలకు ఈ నియమాన్ని విధించబోమని ఆయన వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment